SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Thursday, July 22, 2021

బుల్లెట్ పాయింట్స్ -122

 


బుల్లెట్ పాయింట్స్

        బుల్లెట్ పాయింట్స్
         (నూతన ప్రక్రియ)

రూపకర్త: తాడూరి కపిల (కపిల శ్రీనివాస్)
వరంగల్ అర్బన్
*****************************
నియమాలు:
""""""""""""""""""
⭐ఇది రెండు వాక్యాల తో కూడిన         
      ప్రక్రియ.

 ⭐ ప్రతి వాక్యములో  రెండు            
        పదాలు లేదా పదబంధాలు       
        ఉండవలెను.

  ⭐ రెండు వాక్యాల చివర
         ప్రాస కుదరాలి.

   ⭐ చదువరులకు ఒక  *బుల్లెట్
          పాయింట్ వలె అనిపించాలి
       

👇ఉదాహరణలు:
     """"""""""""""""""""""


👉 అక్షరమే ఆయుధము!
       సంస్కరించు సాధనము!!

 👉వంచకుల మాటలు!
       నీటిపై రాతలు!!

👉మతమన్నది మార్గము!
       ఒకటేగా గమ్యము!!

👉 రగులుతున్న సూర్యుడు!
       విప్లవానికి ఆద్యుడు!!

 👉అడ్డదారి ప్రయాణం!
       కాకూడదు ప్రమాణం!!

👉పసిపిల్లల మనస్సు!
     చక్కని ఇంద్రధనుస్సు!!

 👉తడబడనీయకు అడుగు !
       పడుతున్నా పిడుగు!!

👉 కోరికల గుర్రాలను..
       కళ్లెమేసి ఆపవలెను!

👉 తీరుతుంది ఆయువు!
       తరిగితే ప్రాణవాయువు!!

✍✍✍✍✍✍✍✍✍

బుల్లెట్ పాయింట్స్


01. చంకలో  పిల్లోడు!
ఊరంతా వెతుకులాడు!!

02. దయగల  వారు!
కీర్తి  పొందేరు!!

03. మాటకు  మాట!
పెరుగు  కొట్లాట!!

04. మంచిని  పెంచు!
చెడును  తగ్గించు!!

05. తప్పులు చేయకు!
అప్పులు పెంచకు!!

06. నల్లని మేఘం!
కురిపించు వర్షం!!

07. తల్లి దండ్రులు!
దైవ స్వరూపులు!!

08. పానకంలో పుడక!
మార్చుకో  నడక!!

09. అవ్వ మాట!
వేయివరహాల మూట!!

10. ధనదాన్యము  కన్న!
కన్నతల్లి మిన్న!!

11. ధనము సుఖమునిచ్చు!
దానం  తృప్తినిచ్చు!!

12. దేనినైనా  కొనగలము!
అమ్మను కొనలేము!!

13. అమ్మ  కార్చిన కన్నీరు!
తరతరాలు  యేడ్చేరు!!

14. చూపాలి మానవత్వం!
వీడాలి దానవత్వం!!

15. నీ ఎదుగుదలకు!
తల్లిదండ్రుల  మరువకు!!

16. నీతులు  ఆపు!
చేతల్లో  చూపు!!

17. అమ్మ  అమృతమూర్తి!
నాన్న  త్యాగమూర్తి!!

18. తల్లిదండ్రుల సాదండి!
తలెత్తుకు  తిరగండి!!

19. నయనాల  అందం!
మరుపురాని  అనుబంధం!!

20. కియాకారు వచ్చింది!
అమ్మ  ఆశీర్వదించింది!!

21. దియానే  యిష్టం!
లేకుంటే  కష్టం!!

22. గయాక్షేత్రం వెళ్ళాలి!
జీవితం ధన్యమవ్వాలి!!

23. మామగారి ఇల్లు!
అల్లుడికి విడిదిల్లు!!

24. కలశపు కుంభం!
పూజలకు శుభారంభం!!

25. పారాణి రంగులు!
తలపించు  హంగులు!!

26. పూర్ణ  కలశం!
తొలగించు కల్మషం!!

27. మామిడి  ఆకులు!
శుభాలకు సూచకాలు!!

28. కలశం  దేవతాస్వరూపం!
పూజలకు  అపురూపం!!

29. కొబ్బరి  కాయ!
భగవంతుని  చాయ!!

30 పసుపుకుంకుమలతో  ఆరాదించు!
సకల సుఖాలనుభవించు!!

31. ఇంటింటా  పూజలు!
తొలగించు బాధలు!!

32. దాశరథి  సాహిత్యం!
ఎవరెస్టు  శిఖరం!!

33. మనిషి ఆహార్యం!
ఇచ్చును  ధైర్యం!!

34. పెంచు మనసు!
తగ్గించు కవుసు!!

35. నదీ తీరము!
పుష్కలం నీరము!!

36. పుస్తక పఠనం!
పెంచును జ్ఞానం!!

37. తులసి వనం!
పెంచును ధనం!

38. బామ్మ  అనుభవాలు!
యిచ్చును  కోటిసలహాలు !!

39. నాన్న సన్నిధి!
పెంచును పెన్నిధి!!

40. అమ్మాయని దిగులుపడకు!
దిక్కామెనే కడకు!!

41. ఏకదశి ఉపవాసం!
చేర్చును కైలాసం!!

42. కష్టపడు క్రమానుసారం!
ఉండదిక భారం!!

43. వర్షాకాలం వర్షాలు!
పబ్బుల్లో జల్సాలు!!

44. దేవుడికుండాలి పూజ!
పూలుండాలి తాజ!!

45. పడిలేసే వ్యవహారం!
షేర్ల వ్యాపారం!!

46. కలశంలో ఉదకము!
గణపయ్యకు మోదకము!!

47. ఆషాడ మాసం!
వండేరు పాయసం!

48. రేయి పగలు!
వలదు సెగలు!!

49. పసుపుపచ్చని పుష్పములు!
విష్ణువుకు ప్రియములు!!

50. తేనెలోని తీయదనం!
అమ్మపాలకు  కమ్మదనం!!

51. శునకాల అరుపులు!
దొంగలకు చెరుపులు!!

52. ఎత్తైన కొండలు!
ఉండవు ఎండలు!!

53. మంచిని పెంచు!
చెడును తుంచు!!

54. వయసుతో పనేమి!
పెళ్ళి ఆలస్యమైతేమి!!

55. కాదోయ్ అబల!
ఆమెనే సబల!!

56. కలసి తిరుగాలి!
బిడియం వదలాలి!!

57. పట్టుదల ఉండాలి!
విజయం సాధించాలి!

58. శివ శక్తులు!
అమ్మవారి భక్తులు!!

59. గుర్రానికి కళ్ళెం!
దరువాజకు గొళ్ళెం!!

60. పాపాయి అందం!
చందమామ చందం!!

61. పసుపు పారాణి!
వనిత మహారాణి!!

62. చిలిపి చేష్టలు!
తెచ్చు కష్టాలు!!

63. కొందరి చేరికలు!
పుట్టించు అలకలు!!

64. గాయం చిన్నది!
భయం పెద్దది!!

65. లిప్తకాలం చాలు!
చేయడానికి మేలు!!

66. పదుగురి మేలుకోరు!
పుణ్యము చేకూరు!!

67. టంకశాలలో  డబ్బులు!
ఎవరికి ప్రయోజనాలు?!!

68. నిలుపు శాంతి!
విడువు అశాంతి!!

69.కోరికలను త్యజించు!
ప్రేమను అందించు!!

70. పెద్దవారికి వందనం!
భారతీయుల సంస్కారం!!

71.చూపాలి మానవత్వం!
త్యజించాలి దానవత్వం!!

72. తప్పులు చేయకు!
చెడును వినకు!!

73. మంచిని పెంచు!
చెడును తగ్గించు!!

74. నల్లని  మేఘం!
కురియు  వర్షం!!

75. పేదోళ్ళకు దానం!
పెరుగును పుణ్యం!!

76. తలపులు మార్చుకోవోయ్!
తల రాతలు మారునోయ్!!

77. చెడు తలపులు!
మనకు శత్రువులు!!

78. ప్రయత్నిస్తే తెలుస్తుంది!
విజయం వరిస్తుంది!!

79. సజ్జనుల ఆహ్వానించాలి!
దుర్జనుల వదిలించుకోవాలి!!

80. వేర్లతో చెట్టు!
భూమిలో పెట్టు!!

81. వర్షపు నీరు!
ఏరులై పారు!!

82. పొలానికి హలం!
కాగితానికి కలం!!

83. ఆలు మొగళ్ళకు నుండు!
ప్రేమానురాగాలు మెండు!!

84. దూరముంటే మనుషులు!
దగ్గరవు మనసులు!!

85. పేనుకు పెత్తనం!
తలగు బోడితనం!!

86. గురువుకు గురువు!
వ్యాసుడు వేదగురువు!!

87. పేనుకు పెత్తననం!
తలగు బోడితనం!!

88. చెరువులు నిండును!
మత్తడులు పడును!!

89. మెరుపులు కనపడును!
ఉరుములు వినపడును!!

90. సవ్యసాచి అర్జనుడు!
దశకంఠుడు రావణుడు!!

91. వింతైనది గబ్బిలం!
వ్రేలాడును ఉపరితలం!!

92. తిధి వార  నక్షత్రాలు!
తెలుపును జాతకాలు!!

93. సర్కారు భూములు!
అవుతుండే కబ్జాలు!!

94. చేతికి పచ్చబొట్టు!
ప్రేమకు తొలిమెట్టు!!

95. శునకాల  అరుపులు
దొంగల పరుగులు!!

96. చెడు కోరికలు!
పతనానికి మూలాలు!!

97. తాడిత పీడిత వర్గాలు!
పొందేరా విజయాలు!!

98. నమ్మిన సిద్ధాంతం!
జయశంకర్ పంతం!!

99. తెలాంగాణే  ఆశ!
తెలాంగాణే శ్వాస!!

100. విశాలాంధ్ర వ్యతిరేకుడు!
తెలంగాణ ఆకాంక్షకుడు!!

101. రాష్ట్రవిభజన  రూపకర్త!
తెలంగాణా సిద్ధాంతకర్త!!

102. జయశంకర్ విద్యావేత్త!
తెలంగాణ  జాతిపిత!!

103. కెసిఆర్ తో కలిశాడు!
తండ్రి కొడుకుల్లా మెదిలాడు!!

104. నీళ్ళునిధులు  నియామకాలు!
జయశంకర్ ఆశయాలు!!

105. అందరినీ ఏకంజేసే!
రాష్ట్రమంతా  జాగృతంచేసే!!

106. మీటింగులెన్నో పెట్టాడు!
యువతరం  వెన్నుతట్టాడు!

107. ప్రణాళికలు వేశాడు!
ప్రాంతాలన్నీ తిరిగాడు!!

108. ఆంధ్రులను కలిశాడు!
సభలలో మెప్పించాడు!!

109. మేధావులకు వివరించాడు!
జేఏసిని  ఏర్పాటుచేశాడు!!

110. మీటింగులెన్నో  పెట్టాడు!
యువతరం వెన్నుతట్టాడు!!

111. గల్లీ సభలకు వెళ్ళాడు!
డిల్లీ సభలకు  వెళ్ళాడు!!

112. అవమానించినా సహించాడు!
అదిరించినా బెదరకున్నాడు!!

113. తెలంగాణ సాధించాడు!
దిగ్విజయం గావించాడు!!

114. చూడకున్నా తెలంగాణా!
నిలిచాడు ప్రతిహృదయానా!!

115. నిధుల జాడలేకుండే!
ధరలు పెరిగిపోతుండే!!

116. నియామకాలు లేవు!
ఉద్యోగాలు లేవు!!

117. కుటుంభ పాలనాయే!
అవినీతి పెరిగి పోయే!!

118. అప్పులు పెరిగిపోయే!
అభివృద్ధి తగ్గిపోయే!!

119. ఆశయాలు తగ్గిపోయే!
అలసత్వం పెరిగిపోయే!!

120. రాష్ట్రం విడిపోయినా!
బానిస బ్రతుకులాయనా!!

121. తేవాలి చైతన్యం!
ప్రజలలో ప్రతినిత్యం!!

122. కదలాలి నేటి తరం!
వదిలించాలి జాడ్యం!!