SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Sunday, January 31, 2021

మార్గం నానీలు-250

*మార్గం నానీలు*

🌻🌻🌻🌻

నానీల పుట్టుక

తెలుగు సాహిత్యంలో  నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని నానీలు అంటారు. నానీలు  మెరుపు తీగలు .ఈ కవితా ప్రక్రియను ఆచార్య ఎన్ .గోపి  ప్రవేశపెట్టారు.

నానీల సృష్టికర్త డాక్టర్‌ ఎన్ .గోపి తన నానీలు కవితా సంపుటిలో అన్నట్లుగానే నాలుగు పాదాల నానీ కవితారూపం కాల కఠిన పరీక్షకు నిలిచి పదమూడు సంవత్సరాలుగా దూసుకుపోతోంది ప్రవాహంలా. 'నానీ' రెండక్షరాలే పాఠకలోకమంతా పరవశిస్తోంది ప్రతిభకలిగిన కవుల కలాల్లోంచి పువ్వుల్లా కవితా సుగంథాన్ని పంచుతున్నాయ్‌. వేలాది నానీలు ఈ రోజు అక్షరాలై చిగురిస్తున్నాయి.

తెలుగు కవిత్వంలో లఘురూపాల్లో కొత్త చరిత్రతో  ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఒఠ్ఠి మౌనంగా సహజ సుందరంగా ఎదిగి ఒక ఉన్నత స్థాయిలో వ్యాప్తి చెందాయి. సరదాకోసం రాయడం కాకుండా సమాజ చైతన్య దిశగా కొత్త లక్ష్యం దిశగా నానీ రూపు దిద్దుకుంది. సామజిక , సాంస్కృతిక  చైతన్య భానుడుగా నానీలు పరిణామం చెందింది. 


For more  related Videos , please watch my youtube channel :


https://www.youtube.com/@margamsahitya

లక్షణాలు

నానీలకు కొన్ని లక్షణాలు ఎన్ .గోపి చెప్పారు. 20 -25 అక్షరాల సంఖ్యగా నాలుగు పాదాలు తప్పక ఉండాలి. రెండు యూనిట్ల పరస్పర సంబంధం. సాగదీయకుండా మరీ తగ్గించకుండా ఒక క్రమశిక్షణ. 5 అక్షరాల వెసులుబాటు కూడా కల్పించారు. లక్షణాలు తప్పకుండా నానీలో పాటిస్తే ఆ కవిత తప్పకుండా కాలపరీక్షకు నిలబడతాయి. భావావేశం ఉంటేగాని నానీ సాంద్రీకరణ చెందదు. అలాగే మంచి నానీ రాయటం కూడా చాలా కష్టం. కొత్తగా కలంపట్టిన యువకవులకు నానీ ఒక శక్తిగా అక్షరాల దేవతగా  కనిపిస్తోంది. కవితా రూపంగా నానీలను అక్షరాలు అటూ ఇటూలో రాస్తున్నారు. భావం పండుగా ముగ్గినప్పుడే రుచి వస్తుంది. అలాగే మంచినానీగా జనం గుండెల్లో నిలుస్తుంది. గోపి కవిత పరిశీలించండి-

రైలు పట్టాలు/ తాము కలవ్వు గాని/ దూరాలనుకలుపుతాయి. ఇలాంటి మంచి నానీ హృదయాలను కలుపుతాయి. నానీలలోని సంక్షిప్తరూపం ఈనాటిది కాదు. వేమన ,సుమతి  వంటి శతకాల్లో ఎన్నో ఉన్నాయి. ఆరుద్ర  కూనలమ్మపదాలు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గజళ్లు, వంటివి ఎన్నో తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి. గణబంధాలు, మాత్రల బంధాలు, దేశఛందో గణనియమాలు లేక ఇది వచన కవిత్వమే. వచన కవిత్వం రూపంలోని విస్తృత రూపానికి సంక్షిప్త స్వరూపం. చిన్నభావం, అత్యల్ప సంవిధానం, ముక్తకం, కంఠస్థ యోగ్యం, కవితా సౌందర్యం నానీకి మరికొన్ని లక్షణాలు. నానీ కవితారూపం ఆత్మీయమైంది. అందుకే నానీల కవితా సంపుటాలు అనేకం ప్రతిఏటా ముద్రింప బడుతున్నాయి. వెల్లువలా రావడం గమనించతగ్గ విషయం.

నామకరణం

నానీలని ముద్దుగా పేరుపెట్టింది గోపి . నావీ నీవీ వెరసి మనవి అని, నానీలంటే చిన్నపిల్లలు. చిట్టి పద్యాలని వివరించారు. కవిలో ఎక్కువగా చెప్పాలనే భావ సందేశం, ఆవేశం, గుండె స్పందించాలనే తపన కవి, పాఠకుల హృదయాల్లో నిలవటానికి అవకాశం కల్గింది. నేతల ప్రతాప్‌కుమార్‌ నానీ పరిశీలిస్తే - 'ఓపూట గడిచింది/ అన్నదానంతో/ జీవితమే వెలిగింది/ రక్తదానంతో' 'అన్నదానం -రక్తదానం'లలో ఏది గొప్పదో కవి చక్కగా కవితలో ఆవిష్కరించారు. తెలుగు సాహిత్య రంగంలో అత్యాధునిక దేశీప్రక్రియ 'నానీ' 1997 లో ఆచార్య ఎన్‌.గోపి కలం నుండి కవితా రూపంగా పురుడుపోసుకున్నది. కాలంతో ప్రవహిస్తూ 13 సంవత్సరాలు తనదైన భావశైలితో, వస్తు నిర్మాణంతో, ధారాశక్తితో, గాఢత, సాంద్రతతో ఒక కెరటంలా ఎగిసిపడే ఉదాత్త గుణంతో 'నానీ' సూటిగా పాఠకుని హృదయాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో వస్తువైవిధ్యంతో ఇప్పటి వరకూ వేలాది నానీల సంపుటాలు ప్రచురించబడ్డాయి. వీటిలో సమకాలీనత కనిపిస్తుంది. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సొమెపెళ్ళి వెంకట సుబ్బయ్య  ఒకరు. ఆయన నానీ పరిశీలించండి- చిన్నప్పటి/ ఉత్తుత్తి బువ్వలాటలు/ పెద్దయ్యాక/నిజమై పోయాయేమిటి- అంటూ బాల్య జ్ఞాపకానికి ప్రపంచం ఆకలిబాధను ముడివేసి చెప్పిన సామాజిక చైతన్యం కనిపిస్తుంది కవితలో కవి ప్రతిభకు గీటురాయి. నానీలు  మెరుపు తీగలు .

2001వ సంవత్సరం నుండి నేటివరకూ కోన సీమలో  నానీలకు గుడికట్టిన కవి నల్ల నర్సింహా మూర్తి . ప్రకృతి అందాలను, సామాజిక అంశాలను తన నానీలలో ఆవిష్కరిస్తూ నానీల చైతన్యానికి తనవంతు కృషి చేస్తూ గోపి అభినందనలు పొందారు. 2009లో అమలాపురంలో 'నానీల శిక్షణా నిలయం' ఏర్పాటు చేసి ఎందరో యువకవులను నానీల కవులుగా తీర్చిదిద్దిన ఘనత నల్లా నరసింహమూర్తికి దక్కుతుంది. కోనసీమలో పది నానీల సదస్సులు నిర్వహించి నానీల వ్యాప్తికి ఎంతగానో కృషి చేస్తున్న కవి. నడక ఉద్యమంలో నానీల ద్వారా ఆరోగ్య సందేశాన్ని అందిస్తూ 'నడక నానీలు' సంపుటి ప్రచురించి పేరుపొందారు. ఇంకా 'నడక నడిస్తే..' 'నడక నడిచే వేళ..' నడక ఆరోగ్యం 'నడక నాతల్లి' వంటి అనేక నానీల నడక సంపుటాలు ప్రచురించారు.

పల్లె జీవన వాస్తవికతపై కలం స్పందన, ప్రపంచీకరణపై  ప్రతిస్పందనలు, పేదరికంపై కనికరం, అవినీతిపై ఆగ్రహం, కంప్యూటర్‌ సంస్కృతిపై స్పందన, విద్యా, వైద్యరంగంలో కార్పొరేట్‌ సంస్కృతిపట్ల నిరసన, ప్రకృతి సౌందర్యం పట్ల  ఆరాధన ,ప్రకృతి విపత్తులు, రైతుల  ఆత్మహత్యలపై సానుభూతి, దళితుల సమస్యలపై నానీలు, పంట విరామంపై ఆవేదన, ఉగ్రవాదం  నిరుద్యోగం, నడక, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలపై, సమస్యలపై కవులు ప్రతిభావంతంగా చిత్రిస్తున్నారు. మహాకవి శ్రీ శ్రీ  అన్నట్లు 'కాదేదీ కవిత కనర్హం' అంటూ 'కాదేదీ నానీల కనర్హం' అని నిరూపించారు.'అబ్బే!/ ఏదో ఓటమి కాదు/ అది విజయానికి మరోమెట్టు'

*మార్గం నానీలు*


01. స్వార్ధం మనిషిని 
పీడించే జబ్బు!

మానవత్వం పెంచుకుంటే
నయం చేయవచ్చు! 

02. కాకి కోకిల రంగు 
నొక్కటైనను!

కాకి కోకిలవలె 
కూయగలదా! 


03. నీటిలో ముద్దొస్తే
పాకమొచ్చినట్లు

మనిషిలో మంచి యుంటే
మనసున్నట్లు 

04. ఉదయాన్నే కాకులరుస్తే
చిరాకేయు

పిచుకలరుస్తే 
ఆనందమేయు

05. మాట నిలబెట్టు   
గౌరవం పెరుగు 

వ్రాత నిలబెట్టు  
మనుగడ పెరుగు

06. సుఖాలొస్తే
నాకెదురెవ్వరనేరు!

కష్టాలొస్తే
నా ఒక్కరికే బాధలను!

07. ఈర్ష్య అసూయతో 
నేమి సాధించలేం!

ప్రేమాభిమానంతో
నేమైనాసాధించొచ్చు!

08. గొప్ప వ్యక్తిని గుర్తు 
పెట్టు కుంటాం!

గొప్ప వ్యక్తి సంపదను
గుర్తు పెట్టుకోం!

09. ఒక్కోసారి మనపై 
రాళ్లు పడుతుంటాయి!

ఒక్కోసారి పూలు
పడుతుంటాయి!

10. ఎదుటివారు 
ఎదగడానికి చూడు! 

కానీ అనచడానికి 
చూడకు! 

11. సూర్యుడు 
ఉదయాన్నే ఉదయించు!

జనులకు 
ఉత్తేజాన్ని కలిగించు!

12. కుటుంబంలో
కుల్లుతో  నుంటారు!

సంఘంలో 
సొల్లు కక్కుతారు!

13. ఇంటి యిల్లాలు 
వేసే ముగ్గులు చేసే పూజలు!

ఇంటికి లక్ష్మిని
ఆహ్వానించు!

14. అన్యకులంతో
పెండ్లికి  తండ్రిగా నుండే!

సంఘంలో కులమని 
మొండిగా నుండే!

15. గగనంలో పక్షులు
 ఎగిరే!

అవనిలో జనులకు 
క్రమశిక్షణ నేర్పే!

16. బంధువులపైన 
చిటపట! 

ఇంటికి పోవాలంటే 
గుటగుట! 

17. ద్వంద నీతులు
రాజ్యమేలదలిచే!

ప్రజలు 
గందరగోళంలో పడే!

18. గోష్టి లో చుక్క
నోటిలో  ముక్క!

రాతలు వాతల్పెట్టే!
మాటలు కోటల్దాటే! 

19. అహంతో 
గెలువదలుస్తే!

పాతాల్లోకంలో 
పడిపోతావు!

20. సుఖాలను 
నలుగురికి పంచు!

కష్టాలలో 
నీకు తోడుంటారు! 

21. ఉనికి కోసం
ఉడుము పట్టాయే!

మాట కోసం 
మంకు పట్టాయే!

22. సర్టిఫికెట్లు 
సద్దు మనిగవలె!

శ్రీ వైష్ణవులు
కలసిపోవలె!

23. ముసుగులో
ముద్దు లాటలు!

ఇంకెంత కాలం
ఈ గుద్దులాటలు!

24. ఒక్క మేధకు 
లేదా మానవత్వం!

అనిచి వేయ 
ఈ అరాచకత్వం!

25. కలసి ఉంటే
కలదు సుఖం!

సంఘం నడుచు
అభివృద్ధి పథం!

26. తిరకాసు
పెడితేనే ఉనికా!

ప్రజలకు 
త్రాగ బోయిస్తేనే పనికా!

27. దేశంలో 
కులాలన్నీ నొకదారి!

సంఘంలో  
నేతలందరిదీ మరోదారి!

28. చాత్తాదులందరిని
కలుపుకుందాం!

ప్రభుత్వ భూమిని 
తెచ్చుకుందాం!

29. కుల పత్రం
పేదలకు బరోసా!

సంఘానికి
ఎందుకీ జెలసీ!

30. నాయకులు 
కూర్చుని చర్చిస్తే!

సమసి పోవు  
చిన్న విషయాలు!  

36. కుల పత్రాలు
మారి పోతుండును!

కుల బంధుత్వాలు
బలముగా నుండును!

37. రామానుజుల
మొక్కెదరెందరో!

వారి సిద్ధాంతాలు
పాటించు వారుకొందరే!

38. కోర్టులోడిన వారు
కోర్టులేడుస్తే!

గెలిచిన వారు 
ఇంటికొచ్చేడుస్తారు!

39. డబ్బు పోతే 
సంపాదించవచ్చు!

పరువు పోతే
సంపాదించ లేము!

40. పది మంది
ఒప్పుకుంటేనే గెలుపు!

ఇద్దరు ఒప్పుకుంటే
అది ఓటమి! 

41. నిందిస్తున్న వారంతా
చెడ్డవారు కాదు!

పొగడే వారంతా
మంచివారు కాదు!

42. డబ్బున్న ధనికుడు
గొప్పవాడు కాదు!

మనసున్న పేదవాడు
గొప్పవాడు!

43. ఇంట్లోనేమో
అన్యకులస్థుల జోరు!

బయటనేమో
మాన్యకులస్థుల హోరు!

44. త్రాగ బోయించిన 
నాడే తందాన!

త్రాగ బోయించని 
నాడు మంచాన!

45. పదవు లాశించి 
పలికే జేజేలు!

నిరాశతో 
రగిలే మాజీలు!

46. ఇంటి గోల
ఇరుకుగ నుండు!

బయటి గోల
పసందు గుండు!

47. కన్న బిడ్డలపై 
సానుభూతి లేదు!

బయటి బిడ్డలపై 
మహానుభూతి!

48. ఒక్క వ్రేలుతో 
ఒరులను నిందింప!

వెక్కిరించు 
నన్ను మూడు వ్రేల్లు!

49. ఏక నీతి గలవారు
స్వర్గం పోవు!

ద్వంద నీతి గలవారు
నరకం పోవు!

50. బిడ్డకు కన్నోళ్ళు
పెట్టే పేరే ముద్దు!

నేతకు ప్రజలిచ్చే
 పదవే గౌరవం!

51. చెప్పేటివేమో
గొప్ప సుద్ధులు!

మనసులో నేమో
కుళ్ళు బుద్దులు!

52. పారే మూసీని
శుద్ధి చేయలేము!

వాగే నీచుడిని
కట్టడి  చేయలేము!

53. మనుష్యులకు 
ఆయుషు తగ్గి పోతుండు!

నీచులకు అహం 
పెరిగి పోతుండు!

54. రామానుజుల 
మొక్కెదరు!

రామానుజుల 
భక్తుల తొక్కెదరు!

55. ఉదయం పూట
ఉండ్రం పెట్టెదరు!

సాయంత్రం పూట
మధ్యం దింపెదరు!

56. బంధువొక్కరు మారినా
సంఘం వృద్ది!

ప్రజలలొక్కరు మారినా
దేశం వృద్ధి!

57. గురివింద 
తన  నలుపు నెరగదు!

నీచుడు 
తన హీనత్వం మరవడు!

58. ఆవులు ఆవులు 
పోట్లాడు తుండే!

దూడల కాళ్ళు
విరిగి పోతుండే!

59. చెప్పుడు మాట
వింటే చెడి పోతావు!

చెప్పిన మాట 
వింటే బాగు పడుతావు!

60. స్వచ్ఛ కులమని
సంఘంలో ఎగిరేరు!

కానీ మధ్యం సిగరెట్టు
మాన లేరు!

61. బరితెగించిన
నేతలు!

భావి తరాలకు
అడ్డు గోడలు!

62. ఒకరిపై 
ఆధారపడే జీవులు!

ఒంటరిగా
జీవించ లేవు!

63. గొళ్ళాలు
పెడుతేనే కదా!

గొంతుక
నిండుతుంది!

64. ఇంట్లో
అన్యకులస్థుల రోత!

బయట 
సవ్యకులస్థుల మోత!

65. కుటుంభం వేరు
సంఘం వేరా ?

మనిషి వేరు
మనసు వేరా ?

66. మూడు శిఖలు
కలుస్తే వాదులాటే!

ముగ్గురు కుట్రులు
కలుస్తే పీకులాటే!

67. మనసులో స్పష్టత
గుండెలో స్వచ్ఛత! 

అది జీవితానికి 
గొప్ప భద్రత!

68. ఓట్లవసరం
మున్నపుడు కాదు!

ఆపదొచ్చిపుడు
ఆదుకునువారే నేత!

69. అజ్ఞానులతో
కలవలేము!

చాదస్థులతో
నెగలలేము!

70. తల్లి తండ్రుల 
హింసించిన వారు!

కన్నవారి నుండి
ఆశించడం హేయం!

71. మొక్కలు పెరిగినా
దగ్గరవు!

మనుష్యులు యెదిగినా
దూరమవు!

72. పెరిగినదేదైనా
 క్రింద పడు!

భూమి నిశ్చలమై
కదలక నుండు!

73. వ్యక్తిత్వమనేది
లేని మనుష్యులు!

జీవించియుండిన
ఫలము యేమి!

74. రోడ్ల మీది మురికి
గుంటలకన్నా!

మనిషి లోని
మాలిన్యం ప్రమాదకరం!

75. కరెంట్ తీగని 
దూరం పెట్టగలం!

అహం మనిషిని
దూరం పెట్టలేం!

76. బాగున్నప్పటి
బంధాలు నిలువవు!

బాగలేనప్పటి
బంధాలు నిలుస్తాయి!

77. అమ్మ ప్రేమ
దాహంతీర్చే మంచినీరు!

నాన్న ప్రేమ 
ప్రాణమిచ్చే ఆక్సీజన్!

78. మనిషి 
తప్పించుక జీవించవచ్చు!

మనసు
తప్పించుక జీవించలేదు!

79. తాటిని 
తన్నే వాడు ఉంటే!

తలను
తన్నే వాడు కూడా ఉంటాడు!

80. ప్రతి పట్టణానికి
దారులు యెన్నో!

ప్రతి సమస్యకు
పరిష్కారాలుయెన్నో!

81. దైవం, మంత్రం, 
గరువు ఫలం దక్కాలంటే!

శ్రద్ధ అనేది బలంగా
ఉండాలి!

82. మనిషి చేసే
ప్రతి మంచి పని!

దేవునికి ప్రార్ధనగా
వెలుతుంది!

83. ఉదయం 
సూర్య కిరణాలు పడుతే!

శరీరంలో పది రెట్లు
శక్తి వస్తుంది!

84. మనోమందిరమే
దేవాలయం!

మలినం లేకుండా చూడు
మోక్షము పొందేవు!

85. దేవుడిపై
భారమేసి సోమరికాకు!

మంచి చేసే ప్రతి
మనీషీ దేవుడే!

86. యుద్దం చేసే
ధైర్యమున్నా!

వెన్నుపోటుల తట్టుకునే
తెలివితేటలుండాలి!

87. కార్యసాధకుడికి
ముందుచూపుండాలి!

కానీ , వెనుక చూపు
ఉండకూడదు!

88. ప్రశాంత మనసు 
పెట్టాలి గానీ!

ప్రకృతి నుండి
ఎంతో నేర్చుకోవచ్చు!

89. మనసు ఏకాగ్రతకు 
యేళ్ళు కావాలి!

మనసు చెదురుటకు
క్షణం చాలు!

90. చెప్పడ మెవరికైనా
చాలా సులువు!

పాఠించడమే
చాలా కష్టం!

91. ఎంత కష్టమైన 
పనైనా యిష్టంగా చేస్తే

కష్టం ,అలసట
అనిపించదు!

92. మనష్యుల మనసు
పసిగట్ట లేము!

కోనేరు లోతు 
కనిపెట్టనూ లేము!

93. వెలుతురు వెనుక
చీకటి ఉండు!

గొప్పవారి  వెనుక
నలుపూ ఉండు!

94. దేశానికి 
ప్రధానమంత్రయినా!

తల్లి దండ్రులకు
కొడుకునే!

95. పిల్లలకు
తలిదండ్రి సేవచేస్తే!

వృద్ధులకు
కొడుకులు సేవచేయాలి!

96. ఆరడుగుల
మనిషి కంటే!

నాలుగించుల
నాలుకకు అత్యంత శక్తుంది!

97. మతి మరుపు
జబ్బు కాదు!

మానవుల ,పషు పక్షాదుల
సహజ గుణం!

98. దయా గుణం
లేని వారు!

యెంతటి ధనవంతులైన
దరిద్రులే!

99. నూరంతస్థుల 
అపార్ట్ మెంటు కైనా!

మొదటి ఆదారం
పునాదే!

100. ప్రతి మనిషికి,
జీవకోటి కయినను!

ప్రకృతే మొదటి 
గురువు!

101. పాలలో 
నీరెక్కువైనా పల్చనౌ!

నేతలలో
వివాదాలెక్కువైనా చుల్కనౌ!

102. చేత కాని వారికి
మాటలెక్కువ!

ఎడమ చెయ్యి వాటాన్కి
గొప్ప లెక్కువ!

103. బండ పాకురు 
తిని బ్రతికే వారికి!

మంచి మాటలు
నోట నేల వచ్చు!

104. నాయకులకు
పెరుగును జీతాలు!

ఉద్యోగులకు
పడును వాయిదాలు!

105. నిజాలను 
నిగ్గు తేలుస్తుంటే!

ద్వంద నీతులకు
కడుపు రగులు తుండే!

106. పుస్తకాలను
చదవడమే కాదు!

మనుష్యులను చదివి
సాధించుకో!

107. ప్రతి మనిషికీ
వస్తాయి టర్నింగ్ పాయింట్స్!

జీవితంలో
నాలుగు సార్లు!

108. నీలో ప్రతిభను
నీవు గుర్తించు!

ఇతరులతో పోల్చుకుని
వంచించుకోకు!

109. ప్రపంచం 
చాలా విశాలం!

స్వేచ్ఛగా జీవించడం
చాలా సులభం!

110. కార్లు పోయి
స్కూటర్లు రావచ్చు!

స్కూటర్లు పోయి
కార్లు రావచ్చు! 

111. ప్రపంచంలో
అత్యంత విలువైనది!

వ్యక్తిత్వం ,మంచితనం,
నిజాయితీ!

112. కొందరికి కొన్ని 
రోజుల్లో , వేశధారణల్లో!

చంద్రముఖి
ఆవహిస్తుంది!

113. కుక్కలు 
యేడుస్తున్నాయంటే!

యేదో అరిష్టం
జరుగబోతుందనిగుర్తించు!

114. కొందరిలో
అష్టమి , అమావాస్య!

పౌర్ణమి రోజుల్లో విచిత్ర
మార్పులుంటాయి!

115. జీన్స్ , జీవన విధాన
లక్షణాలు!

కడ వరకు
శాశ్వతంగా ఉంటాయి!

116. పులి చారికలు
ఉన్నంత  మాత్రాన!

పిల్లి ఎన్నడూ
పులి కాబోదు!

117. ఏ చట్టాల ప్రకారం
పోతున్నామనేది కాదు!

ప్రజలకెంత మేలనేది
ముఖ్యం!

118. యిల్లాలు వేసే 
ముగ్గులు, చేసే పూజలు!

ఇంటికి ఆహ్వానించు 
మహా లక్మిని!

119. వేప చెట్టు నుండి
వీచే గాలి!

చూపును
సర్వరోగాలపై జాలి!

120. కాలం  
గడచిన కొలదీ!

వయసులు మారును
కానీ మనసులు మారవు!

121. ఆపదలో నున్న
పక్క వారికి సహాయపడు!

మిమ్ములనే
దేవుడంటారు!

122. ప్రొద్దున్నే కాకులరుస్తే
చిరాకేయు!

పిచుకలరుస్తే
సంతోషముండు!

123. మధ్యం మాంసం
మానిద్దాం!

మంచి నిర్ణయాలు
తీసుకుందాం!

124. ఒకరి
బలహీనతలే!

మరొకరికి
అవకాశాలవుతాయి!

125. ఒకరి నమ్మకం
 మరొకరికి!

అవకాశం లేదా అయుదం
కావచ్చు!

126. నిండా 
మునిగిన వారికి!

చలి అనేది 
అసలే ఉండదు!

127. ఆవలిస్తేనే
కడుపులో పేగులను!

లెక్కపెట్టేవారూ
ఉన్నారు!

128. ఎవరి జీవితం
పూలపాన్పుకాదు!

ఎవరి జీవితం ముండ్ల
బాటా కాదు!

129. రైళ్ళను
కలుపవచ్చు!

కానీ రైలు పట్టాలను
కలుప లేము!

130. ఉప్పు , చారు
తగ్గించి చూడు!

మోకాళ్ళ నొప్పులు
నుండవు చూడు!

131. కులానికో చట్టం
మతానికో చట్టం!

ఇంకెంతకాలం
ఈ చెలగాటం!

132. న్యాయవాదులకే
లేదు రక్షణ!

యిక నరులకెక్కడ
నుండు రక్షణ!

133. స్త్రీలు నుదుట
బొట్టు పెట్టుకుంటే!

ఎదుటి వారి
దిష్టి పడదు!

134. ఎవరి నిండు
డ్రెస్సులు!

వారికి మాత్రమే రక్షణ
కలిగించు!

135. బ్రతికున్నపుడే
యివ్వాలి భారత రత్న!

తృప్తి కలుగు
చేసిన సేవకు!

136. పెరటి మొక్కలు
ఆరోగ్యానికి!

పైసా ఖర్చు లేనట్టి
వైద్యం!

137. నానీలు
మెరుపు తీగలు!

మదిలో మెరుస్తాయి
క్షణంలో మాయమవుతాయి!

138. మనిషి
బ్రతక డానికి తినాలి!

కానీ తినడానికి
బ్రతక కూడదు!

139. మంచి బంధు
మిత్రులు తోడుంటే!

ప్రయాణమెంత దూరమైనా 
దగ్గరనిపించు!

140. విలువలు 
కోల్పోయిన వారి కోట్లు!

రూపాయికీ కూడా
కొరగావొకసారి!

141. ఆడ మగ నెవరికెన్ని
మంచి గుణాలున్నా!

ఒక్క చెడుతో
కుప్ప గూలు!

142. విశ్వంలో
నేమి జరుగబోతున్నా!

ముందుగా తెలిసేది
పక్షులు ,జంతువులకే!

143. కుక్కలు 
యేడుస్తున్నాయంటే!

ఆ ప్రాంతంలో యమభటులు
తిరుగుతున్నట్లే!

144. గబ్బిలం రాత్రి
చురుకుగా నుండు!

గ్రద్ద పగలు 
చురుకుగా నుండు!

145. రాగి, ఇత్తడి
కంచములలో తిన్న!

కఠిన రోగములు
మటుమాయమగు!

146. నిజమైన ,బంధాలు
బంధుత్వాలు!

తప్పులనెప్పుడూ
వెతకవు!

147. పగళ్ళు ,రాత్రులు!
చీకటి ,వెలుతురు!

అందరికి 
సమానంగానే ఉంటాయి!

148. తాటిని 
తన్నే వాడుంటే!

వాని తలను
తన్నే వాడూ ఉంటాడు!

149. నేనే తెలివి
గల వాని ననుకుంటే!

పతనం
మొదలైనట్లే!

150. తినాలని ఆశ
ఎంత ఉన్నను!

పండ్లు సహకరించనిదేమీ
తినలేవు!

151. నమ్మకమనేది
ఎదుటి వారి చేష్టలు!

మాట తీరును బట్టి
ఏర్పడుతుంది!

152. రెండు కాళ్ళను
రెండు పడవలపై పెట్టి

ప్రయాణం
చేయరాదు!

153. ప్రభుత్వాలు
ఎలానడుచుకుంటే

ప్రజలు అలానే నడుచుకుంటారు!

154. మనసెరుగని మనిషి
కసువెరుగని పశువు!

రెండునూ
సమానమే!

155. పి.వి. మన ఠీ.వి.
దేశానికి చూపె దిశ!

ప్రజలకు 
కల్పించే ఆశ!

156.కారణజన్ముడు
ఎన్టీఆర్!

కరుణామయుడు
అభాగ్యులకు!

157. అందమైన మొఖం
కొద్ది కాలం గుర్తుంటే!

మంచి ప్రవర్తన
జీవితాంతముండు!

158. చేనులో
కలుపు తీయకుంటే!

మొక్కలు ఏవైనా
ఎదగవు!

159. సిద్ధాంతాలకు
కట్టుబడిన వారే!

చరిత్రలో
నిలిచి పోతారు!

160. మంచిని
తలపెట్టు!

కానీ , అది చేస్తేనే పుణ్య
మనడం వ్యాపారం!

161. పిల్లలు 
మేనత్త పోలికంటే!

మరేదో కాదు
కేవలం *జీన్స్*!

162. నీవు గెలిచావంటే
దానిక్కారణం!

నీవొక్కరే కాదు
నీ చుట్టున్నవారునూ!

163. ప్రతి ఒక్కరూ
డాక్టర్, లాయర్!

కానవసరం లేదు
దేనికైనా డబ్బే!

164. తెలివైన
వారు ఈర్ష్యపడరు!

తనూ గెలవడానికి
ప్రయత్నం చేస్తారు!

165. ఏదీ 
అపశకునం కాదు!

మన బలహీనతే
మనకు అపశకునం!

166. ఆవ గింజ
నమల లేనమ్మ!

గుమ్మడి కాయ
కొరకు పరుగెత్తిందట!

167. అన్నయ్య రక్త
సంబంధమట!

ప్రజలు చెమట
సంబంధమట!

168. ఆస్తులు
కాపాడు కోడానికి!

అవనిలో రాజకీయాలు
నెలవయ్యాయి!

169. సంఘంలో చేర
సర్టిఫికెట్లు కావాలి!

రాజకీయాలకు
అవసరం లేదు!

170. నిత్యం సందడిగా
ఉండే దుకాణంలో!

సరుకులు
తాజాగా నుండును!

171. మంచి విత్తనం
ఎక్కడైనా మొలుచు!

మంచి ఆలోచన
ఎక్కడైనా గెలుచు!

172. ప్రపంచమే
ఒక రంగ స్థలం!

మనుషులందులో
మహానటులు!

173. ఒకటి నీవు
పొందాలనుకుంటే!

మరొకటి
వదులు కోవాల్సిందే!

174. చిన్న కాలువను
ఆపగలవు!

గోదావరి వరదను
ఆపలేము!

175. కుడి చేయితో
చేసిన దానం!

ఎడమ చేయికి
తెలియ కూడదు!

176. చేతిలో ఉన్న
వాటిని వదులు కోకు!

లేని దాని కొరకు
ఆశ పడకు!

177. ఎదుటి వారికి
గౌరవం యిస్తేనే!

మనకు గౌరవం
లభిస్తుంది!

178. తప్పొప్పులను
 నిర్ణయించేది!

మనిషి కాదు 
కాలం , పరిస్థితులు!

179. ప్రతి మనిషికి 
దైవత్వం, మానవత్వం!

రెండూ ఉంటేనే
విజయం!

180. విజయం కోసం
సాధన చేస్తూపోతే!

శ్రమలో  నీకు
అలసటనిపించదు! 

181. మన మనసు 
మంచిదైతే!

మనకు మంచి 
ఆలోచనలే వస్తాయి!

182. మొఖం నల్ల బోర్డుపై 
చూస్తే కనపడదు

అద్దంలో చూస్తే
కనబడుతుంది!

183. కొటేషన్ల
వల్ల ఏమీ తెలియదు!

నడవడి వల్ల వ్యక్తిత్వం
తెలుస్తుంది!

184. తృప్తుంటే ఏమియ్య
కున్నా తృప్తే!

తృప్తి లేకుంటే పాయస
మైనా తృప్తుండదు!

185. కళ్ళను కాకుండా
మనసును!

పెద్దగా చేసుకుంటే
బంధాలు కన్పడుతాయి!

186. ప్రతి మనిషి
తన చేతిని!

పైనుండేట్లు 
చూసుకోవాలి, క్రింద కాదు!

187. గీత పట్టుకుని
కోర్టులో  అసత్యాలు!

గ్లాసు పట్టుకుని
బార్లలో నిజాలు!

188. దేవుడు 
ఎక్కడో లేడు!

ప్రతి మానవతా వాదిలో 
దేవుడున్నాడు!

189. వృద్ధులు గట్టిగా
వొళ్ళీర్చిన!

కండరాలు పట్టివేయు
నొప్పి పుట్టు!

190. కలబంద రసాన్ని
అరికాళ్ళకు పెట్టు!

కాళ్ళ పగుళ్ళను
తుడిచి పెట్టు! 

191. ధరనిపై  స్త్రీ 
జీవిత కాలమెక్కువ!

పురుష
జీవిత కాలం తక్కువ!

192. మనసుకు తోచిన
సహాయం చేయి!

మానవత్వం మహిలో
నిలుపుకో!

194. పుట్టుకతో 
నెవరును!

పుత్తడి చెంచాను
పుచ్చుకుని రారు!

195. మనుషులలో
మాధవులుంటారు!

మనుషులలో
ధానవులుంటారు!

196. వృత్తిని
ప్రేమించాల్సిందే!

కుటుంబాన్ని ప్రేమించు
అంతకురెట్టింపు!

197. రాజకీయ నేతలవి
రాతి గుండెలు

పేద ప్రజలవి
పాకురు గుండెలు!

198. రైతన్నకు
మాత్రమే తెలుసు!

ఆరుద్ర కార్తె
ముఖ్య  కాలమని !

199. ఒక సారి 
క్రింద పడితేనే!

మనిషి గెలువ
సాహసించు!

200. ఉష్మానియాలో
చదివిన వారికే!

పేదల బతుకులు 
బాగా తెలుసు! 

201. పల్లెకు 
పోయి చూస్తెనే! 

తెలుస్తుంది మనకు
చెల్లె బతుకు!

202. ఐదేండ్ల సేవకు
నేతకు పెన్సన్!

ముప్పదయిదేండ్లకు
పెన్సనేది రేపు!

203. పెన్సన్ పెంచుకు
నేధికారం నేతలకు!

ఉద్యోగులకేది
పెంచేధికారం!

204. గెలిచే సత్తా
నీకున్నపుడు!

రెండు చోట్లా పోటీ
చేయడమెందుకు?!

205. నాయకులు
మనుషులేగా!

కలిసి పోదాం
అందరం అన్నీ మరిచి!

206. నిలువు బొట్టు అంటే
ఉన్న స్థానం నుండి!
 
ఉన్నత 
స్థానానికి చేరడం!

207. నేలమట్టి గట్టిగ
నుంటేనే!

బిల్డింగ్ చాలా కాలం
మన్నుతుంది!

208. మూర్ఖులగూర్చి
ఎక్కువ మాట్లాడుతే!

వారికి అధిక
విలువనిచ్చినట్లే!

209. సహనంగా
ఉన్నారంటే!

సన్యాసం తీసు
కున్నారని అనుకోవద్దు!

210. ఒక సారి
మాట పడితేనే!

మనిషిలో సాధించ
కసి పెరుగు!

211. ఒకటి కావాలంటే
మరొకటొదులు కోవాలి!

లేదంటే
గర్షణ తప్పదు!

212. గెలుపు ఓటమి
అనేవి రెండే!

ఓడి నంతనే
అపజయం కాదు!

213. సింహం వెనక్కిపోతే
ఓడటం కాదు!

పంజా వేయుటకు
ఉద్యుక్తమైనట్లు!

214. మనిషి బ్రతకడానికి
తినాలి!

కానీ తినడానికి 
బ్రతక కూడదు!

215. విసుగుతో పూజలు
చేయడం కంటే!

విశ్రాంతి
తీసుకోవడం మేలు!

216. డిల్లీకి రాజైనా
తల్లికి కొడుకే!

పెళ్ళానికి
మొగుడే అవుతాడు!

217. పెందటే లేచి
చేతనైన పని చేసిన!

జీవిత కాలం
పెరుగు తుండు!

218. ఏం మాట్లాడుతామో
మన మనస్సులోని!

ఆలోచనలు అలానే
ఉండాలి!

219. నరం లేని నాలుక
ఏమైనా మాట్లాడు!

తనది కాని కలం
ఏమైనా రాయు!

220. ద్వంద 
నీతుల వారి వలన!

పాము చావదు
కర్ర విరుగదు!

221. పైకి నీతులు చెబితే
మనిషి!

వాటిని పాటించినపుడే
మనీషి!

222. నిన్ను ధ్వేషించే వారిని
పట్టించుకోకు!

ప్రేమించే వారిని
విడిచి పెట్టకు!

223. నమ్మని వార్కి
కోటిచ్చినా వృధా!

నమ్మిన వారికి
నూరిచ్చినా తృప్తిపడు!

224. జీవితంలో
ఒక్కచెట్టునైనా పెంచు!

ఒక్క మనిషి నైనా
గొప్ప వాన్ని చేయి!

225. మోసం చేసినొక్కరికే
శిక్ష వద్దు!

అనుభవించిన వారినీ
శిక్షించాలి!

226. చాదస్థం తోటి
మనుషులెప్పుడూ!

ఏదో ఒకటి వాదిస్తూనే
ఉంటారు!

227. మనసులు కలవని
భార్యాభర్తలు!

నదీ తీరాలు
రెండూ ఒకటే!

228. అప్పులున్న
వానితో తిరుగరాదు!

చెప్పులున్న
వానితో నడువరాదు!

229. నిద్ర అనేది
శరీరానికే గానీ!

మనసుకు కాదు
వయసుకు కాదు!

230. రాబోవు కాలంలో
పెట్రోల్ బంకులేడ!

ఎలక్ట్రిక్ రీచార్జ్
స్టేషన్లే!

231. నమ్మకం అనేది
రెండు వైపులా!

అత్యంత పదునైన
ఆయుదం!

232. ధైర్యం అనేది
నీకు ఉంటే!

భయం అనేది
అసలే ఉండదు!

233. సంకల్ప బలం
మనకు ఉంటేను!

సాగరమునైనా
ఈదవచ్చు!

234. ధనవంతులు
కుబేరులవుతున్నారు!

పేదలు
నిరుపేదలవుతున్నారు!

235. చెట్టుకు విత్తు
ఎంత ముఖ్యమో!

మనిషికి కణం
అంతే ముఖ్యం!
*మార్గం నానీలు*

236. ప్రతి ఒక్కరికీ
తన తప్పేమిటో! 

తెలుసుకునే అవకాశం
వస్తుంది!

237. పసుపు/ఉప్పు
నిండుకుందని!

దీపం కొండెక్కిందని
అంటాము!

238. మంచి ఎక్కడున్నా
హంసలా స్వీకరించు!

చెడును
విడనాడు!

239. నక్క అరుపులు
కుక్క ఏడుపులు!

రెండూ ఒకే తీరుగా
ఉంటాయి!

240. పులి చారికలు
ఉన్నంతనే!

పిల్లి ఎప్పటికీ
పులి కాలేదు!

241. మంచి తనం
నిజజీవితంలో రుజువు చేసుకో!

సోషల్ మీడియాలో 
కాదు!

242. మనిషి నటించి
నంత విదముగా!

ఈ విశ్వంలో ఏ జీవి
నటించదు!

243. కుడి చెయ్యి
భహుళార్ధ సాధనం!

ఎడమ చెయ్యి
ఏకైక సాధనం!

244. ఆత్మస్థుతికి
మించిన చెడు!

జగత్తులో
మరొకటి లేదు!

245. అద్దంలో 
చూసుకుంటే!

మొఖం కనబడుతుంది
వెన్ను కనబడదు!

246. అందరూ
నీతులు వల్లించే వారైతే!

ఇక పాటించే వారు
ఎవరు!

247. భగవంతుడా
ఎంత పని చేసావు!

నన్ను సృష్టికర్తను 
చేసావు!

248. ధనవంతుడిని
ఎవరేమి చేయలేక పోవచ్చు!

కానీ అతని
అహం..!

249. మట్టితో కుండను
చేయగలం!

కుండతో మట్టిని
చేయలేం!

250. మనిషి విలువ
ధనంతో విద్యతో కాదు!

నడవడితో
విస్తరించు!


Wednesday, January 27, 2021

పావని శతకం. తే .గీ -17

 *పావని శతకం*

🌹🌹🌹🌹🌹

01. వేల కోట్లాది భూముల వెనుక వేసి
చేత నైనట్టి సాయంబు చేయ కుండె
దాన ధర్మము చేయక  దాచి పెట్టె 
ధరణి శాపముతొ నింగి తల్ల డిల్లె 
అవని యందున పావని! ఆలకించు 

02. మనిషి నొసటన రాతను మార్చలేము
భ్రహ్మ పుట్టిన నాడేను బాస చేసె
యేడ్వు నవ్విన కరుగడు కాడు పేర్చ 
అవని యందున పావని! ఆలకించు

03. మంచి చెడులన్ని మనుషులు మార్చలేరు
కాలమేమార్చు కనికరం తలచ కుండ
వేచి చూడవలె జనులు  వేగ పడక 
అవని యందున పావని! ఆలకించు

04. కులము పత్రాల మార్చియు ఫలము పొందె
ననుచు ఈర్ష్యను పడునట్టి నక్క జాతి
ఇతర కులముల్లొ పెళ్ళాడి యింట బెట్టి
ఎన్ని ఫలములు పొందిరో నెరుగ కుండె
అవని యందున పావని!  ఆలకించు

05. ముడిసరకుదిగుమతులకు ముడులు వేసి
జనప నార,నూలుకవర్ల జనులకివ్వ
ప్లాస్టికు కవరు కప్పుల వాడ కుండు
అవని యందున పావని! ఆలకించు 

06. యెవరు చేయు పనులవారె యెంచుకొవలె
ఒకరిదొకరు చేయుననుట ఒట్టి మాట
గునపమునుపట్టి బెజ్జము కుట్ట లేము
అవని యందున పావని! ఆలకించు 

07. ప్రేమగా పర స్త్రీ తోను  పెళ్లి యెంచి
పొరుగు దేశపు కోడళ్ళ మరుగు నుంచి
అన్య కులపు కోడలునేమొ  ఆదరించి
సంఘమందుకులములెంచ సబబు కాదు
అవని యందున పావని!  ఆలకించు  

08. కాలమునకున్న విలువను తెలుసుకొనుము
మనకు పెరుగును గౌరవం మంచి గాను 
ధనమునకును విలువనివ్వ దారి చూపు 
మనిషికి విలువ నిచ్చిన మాధవుడగు 
అవని యందున పావని!  ఆలకించు  

09. గడప గడపకు నంతట కలియ తిరిగి
ప్రజల గోసల నెన్నియో  బాప్త మనిరి
పదవులీన గానేనిక  ప్రజల మరిచె
*అవని యందున పావని! ఆలకించు*

10. బాధ నున్నను మనసులో భయము నున్న
నష్ట మైనను బాధైన కష్ట మైన
యిష్ట మైనవారలతోటి మనసు విప్పి
మాట లాడిన గుండెలో తేట గుండు
అవని యందున పావని! ఆలకించు

11.కలహముల్లేని కాపురం నిలనలేదు
సలిపెడికలహాలుధరన సహజ ముండు
కలసి వచ్చును అనుభవం కలహముంటె
కలహ కాపురములలోనె కలదు ప్రేమ
అవని యందున పావని! ఆలకించు

12. బంధువులమేలు, ఆర్ధిక బాధ తగ్గ
పెద్ద మనసుతో వేణువు పెరికె చంద
సంఘములనందరూచేర సవరణలను
చేసె ఇ.సి. నికవేగము చేర వలెనె
అవని యందున పావని! ఆలకించు

13. మనిషి కనబడ కున్నను మాసి పోదు
సెల్లునే బందు చేసిన సెగలు పోవు
మనిషి చేసిన అప్పులు మాయకుండు
అవని యందున పావని! ఆలకించు 

14. చాటు కుండేమితిన్నను చాల కుండు
పట్టు పరుపున పరుండ పాకు తేళ్ళు
అప్పు లేకబ్రతికితెనే  అచ్చి కచ్చు
అవని యందున పావని! ఆలకించు

15. ఎవరు చూస్తుండు ననియును ఏమొ చేసి
పదుగురు జనుల ముందర  భజన చేయ
అంతరాత్మ అడుగడుగు అడ్డు తగులు
అవని యందున పావని! ఆలకించు

16. పరుల సొమ్మును దోచియు పూజ చేయ
పుణ్య మేలగ వచ్చును పురజనులకు
మొక్క ఉసిరితో సరిపెట్టు మోక్ష మొచ్చు
అవని యందున పావని! ఆలకించు

17. మేలు నెవరును తలచిన  తాలు కాదు
పడిన కష్టము నెన్నడు పాడు కాదు
గ్రద్ద ఆలోచనె కలిచె గద్ద మెడను
అవని యందున పావని! ఆలకించు
 

Saturday, January 9, 2021

కంద పద్యాలు - 50

                        కంద పద్యాలు 



 *కంద పద్యం-01*

🪴🪴🔥🪴🪴


పుడమిన తెలివిప రులుగను
మేడలొ యన్నను యెపుడునుమేలును కల్గున్.

జడులను జేయగ కొందరు
వడివడి గాయడు గిడుచును వదురుదురింకన్!.

 *కంద పద్యం-02*

🪴🪴🔥🪴🪴

మాలలు వేసుకునినరో 
జుల్లొకనబడిన సాముల సుగుణము లన్నిన్! 

ఫలము నుండును సాములు
మాలలు విడిచిన తదుపరి మారితెనటులన్!


*కంద పద్యం-03*

🪴🪴🔥🪴🪴


దానపు నడవడి తోడను 
మనుగడ యెంతో మనిషికి మంచిగ యుండున్ 

దానము  మనసున  నిండిన 
మనుషులు మనకూ జాతికి మంచిగ యుండున్ 


*కందం -04*

మనుషులు మోసము తోడనె  
జనులను మార్చి  మణులతొ జయమును పొందెన్

మనుషులు పిరికి తనముతొ  
పనులును  లేకను భయముగ బతుకుచు  నుండెన్     

*కంద పద్యం-05*
🪴🪴🔥🪴🪴

కులమును  కాని వనితతో  
కలిసుండియు బతుకవచ్చు  కలహము లేకన్ 

కులమని సంఘము యెదుటనె    
కలహించెటి వారినింట ఖలులని తోయన్ 


*కంద పద్యం-06*
🪴🪴🔥🪴🪴

మధమున  ఖలులు కొందరు 
పదునైనది నాలుకనిన బాధను కుందుర్ 

పదునుగలదైన నాలుక 
నదుపు లోపెట్టకున్న నాడులు చిట్లున్ 


*కంద పద్యం-07*
🪴🪴🔥🪴🪴

ధనములు నీయెడ యున్నను
జనులకు సాయము తలచుట జాలిగ నుండున్ 

ధనములు  లేకున్నయెడల
మనమున  తలచియు గడపుట మంచిగ నుండున్


*కంద పద్యం-08*
🪴🪴🔥🪴🪴

ప్రతి మనిషికైన నుండును
మిత్రులు శత్రువులు నిలన మితముగ నైనన్ 

శత్రువులు లేని మనుషులు 
మిత్రులు గలవారు జగతి మిక్కిలి లేరున్


*కంద పద్యం-09*
🪴🪴🔥🪴🪴

స్నేహితుడు కుబేరుడయిన
సహించునని చెడు తలచక సహనము నుండున్

స్నేహితుడు కుచేలుడయిన
మహామహుడనియు తలంచి మర్యాద చేయున్


*కంద పద్యం-10*
🪴🪴🔥🪴🪴

నిప్పుల పొయ్యితొ వంటలు 
మెప్పును కలిగించు చుండు మేలును చేయున్ 

నిప్పుల వలనే జనులకు
ముప్పులు కూడనిల యుండు మురువ కుండున్


*కంద పద్యం -11*
🪴🪴🔥🪴🪴

అందము చందము విద్యయు ,
బంధములో వెతక  నేది బాసట నుండున్

అందము చందము విద్యయు ,
బంధమునను బంధమేను బాసట నుండున్


*కంద పద్యం -12*
🪴🪴🔥🪴🪴

గలగల సెలయేరుండగ
మలమల వస్తువుల ధరలు మండుతు నుండెన్

జలజల వర్షము కురువగ  
బల బల నీరును గుడిసెల పారుతు నుండెన్


*కంద పద్యం- 13*
🪴🪴🔥🪴🪴

రాజులు పేదల మేలును
నిజముగ కోరుతు తపించ నిలకడ గుందుర్

రాజుల యెడలన జనులును
భజనపరులసలవకుండ భాసట నుందుర్


*కంద పద్యం-14*
🪴🪴🔥🪴🪴

గొప్పలకెళ్లియు  మనుషులు 
అప్పుల బారిన  పడినచొ  అలుసగు చుందుర్  

అప్పులె  యేదొక రోజున
ముప్పులు  తెచ్చును  నిజముగ  మునుగుచు  నుందుర్ 


*కంద పద్యం-15*
🪴🪴🔥🪴🪴


కన్న కొడుకులకు వృద్ధుల్
మన్నన  తలిదండ్రియెడల  కనికర మున్నన్

కన్న తలిదండ్రి  దీవెన   
కన్న కొడుకులను నెపుడును  కనిపెడుతుండున్


*కంద పద్యం-16*
🪴🪴🔥🪴🪴

మనవారనిచెబు  కుంటునె
ధన బలముతొనిల  జనులను  దగలను  చేసెన్

ఘన కీర్తిని పొందాలని
ధనమును నచ్చిన విధముగ తడుపుతునుండెన్


*కంద పద్యం-17*
🪴🪴🔥🪴🪴

కులములు గోత్రములనియును
బలములు చూపుతు ఘనులునె  బంధము  వేసేన్ 

కులములొ  బంధువు గతిస్తె
గళములు మూసుకునెకనులు కానక  నుండెన్ 

*కంద పద్యం-18*
🪴🪴🔥🪴🪴

మిద్దెల కొరకును బంధువు
పెద్దల మాటల వినుటను పెడచెవి పెట్టెన్

ముద్దను చూసియు మింగను
వృద్దులయిననూ మనసులొ వుడుకుచు నుండెన్


*కంద పద్యం-19*
🪴🪴🔥🪴🪴

మనసును గాయము చేయుట
మనకునొక గడియను చాలు మదిలొమెదిలినన్

మనసును గెలువను వచ్చును
గుణమును ఫణముగను పెట్టి కుదురుగ నుంటెన్

*కంద పద్యం-20*
🪴🪴🔥🪴🪴

మనసులొ యిష్టపడిపనిని
మనమే చేసిన కఠినము
మనిపివ్వదుగా

మనసున  పట్టుదలుంటెను
మనమే గెలువాలనుకసి మసులుతు నుండూ

*కంద పద్యం-21*
🪴🪴🔥🪴🪴

రైతులు లేనటులైనను 
మెతుకులు నుండవు జనులకు మెదిలియు చూడున్

మెతుకులు లేనటులైనను
బతుకులు నుండవు నెవరును బతుకను లేరున్  

*కంద పద్యం-22*
🪴🪴🔥🪴🪴

దొంగగ పూజలు చేయుచు
లంగగ నుండియు తిరుగుట లాభము లేదోయ్!

కొంగ జపముతో కార్యము
భంగము చేయక జగమున బలుపులు మానోయ్!

*కంద పద్యం-23*
🪴🪴🔥🪴🪴

పంతము గెలువను మూర్ఖుడి
పొంతన చేరిన అహమును , పొగరును వీడున్!

నంతట నేనే  నేతని
సంతస ముగనిల జనులతొ సమరము వీడున్


*కంద పద్యం-24*
🪴🪴🔥🪴🪴

బంధము కొరకని చెప్పిన
అందము నుండుననినెవరు అనినను కుదురున్

నందమునఖలులకుఒల్లు
మందము నయినను మరలను మాడలు పగులున్

*కంద పద్యం-25*
🪴🪴🔥🪴🪴

బతుకులు నావని ననియును
మెతుకులు నావని తలచియు మెరిసిన చూడున్

అతుకుల బతుకులు తప్పవు
గతుకుల రోడ్డున నడుచుతు గడుపుతు నీవున్


*కంద పద్యం-26*
🪴🪴🔥🪴🪴

వచ్చును ఎన్నికలు మరల
గుచ్చును పన్నులు జనులకు గునపము లాగున్

నచ్చిన నాయకులు జనులు
మెచ్చిన రీతిన గెలిచిన మెరుగుగ నుండున్

 
*కంద పద్యం-27*
🪴🪴🔥🪴🪴

ప్రేమలు పంచిన పెరుగును
ప్రేమలు తుంచిన విరుగును పెలపెల నిలనన్

ప్రేమలె నన్నిట మూలము
ప్రేమలు వీడిన మనసులు పెంచును పగలున్

*కంద పద్యం - 28*
🪴🪴🔥🪴🪴

కట్నము ఎక్కువ వచ్చని
పట్నము కొడుకుల చదువను పంపెను గదరన్

రత్నము లాంటీ కొడుకులు
పట్నము వచ్చియు  తిరుగుతు భారము నయ్యెన్

*కంద పద్యం-29*
🪴🪴🔥🪴🪴

ఎంతగ యెత్తుకు ఎదిగిన
అంతగ వొదిగి జగమున అనుకువ నున్నన్

చింతలు లేకను నిలలో
అంతము వరకును మనుజులు హాయిగ నుందుర్

*కంద పద్యం-30*

తల్లియె గదనొక తరువౌ
మల్లియు పుట్టదు జగమున మనసున తలచిన్

చల్లని  మనసుతొ  నిండిన
తల్లియె పెంచును మనలను తడబడ కుండన్

*కంద పద్యం-31*

చస్తె వెలుతవు స్వర్గము
మస్తను వద్దకు పదండి మరిచియు పోకున్

యిస్తడు పత్రము, లక్షలు
యిస్తెను నేరుగ గబగబ యిస్తడు చూడున్

*కంద పద్యం-32*

గొప్పగ  విద్యను నేర్చియు
తప్పుడు నడకలు నడిచిన తక్కువ నవుదుర్

చెప్పుడు మాటల వినియును
చప్పుడు చేసిన విలువలు సాకిల పడెరన్


*కంద పద్యం-33*

మహిళలు కారెపుడు అబల
మహిలోనగనుము నిజముగ  మరువక నుండున్

మహిళలెపుడునూ సబలలె
సహిష్ణువు నీవే మరింత సహనము నుంటెన్


*కంద పద్యం-34*

దుప్పటి నుండును వరకే
కప్పుకునుమనుజులునిలన కలిమిగ నుందుర్

తిప్పలు జనులకు పెడితే
చిప్పలు పట్టుక తిరుగుతు చితికిల పడుదుర్

*కంద పద్యం-35*

పుట్టునపుడెవరు నేమియు
పట్టుకునియురారు యిదియును పచ్చినిజంబున్

గిట్టునపుడిలననేమియు
పట్టుకునిపోరు ధనములు పదిలముగ  నుండున్

*కంద పద్యం-36*

భర్తకు తోడుగ భార్యయె
కర్తగ ఇంటిలొ పనులను కలిసియు చేయున్

ధూర్తుల మాటలు బయటకు
వార్తలుగవినపడకుండ భర్తతొ మెదులున్

*కంద పద్యం-37*

ఎవరికి వారలె ధీరులు
ఎవరును నొకరికి గులాము ఎన్నడు కారున్

ఎవరును ఏమియు చెప్పిన
ఎవరును కాదనినకూడ ఇదియే నిజమున్

*కంద పద్యం-38*

పొలములొ గిట్టని మొక్కల
కలుపును తీయుము వడిగను ఖఠినమునైనన్

కలతలు ఎన్నియు నున్నను
తలుపులు మూయకు నెపుడును తలిదండ్రులకున్

*కంద పద్యం-39*

కరొనా  విషమును జిమ్ముతు
పరుగులు తీయగ  జనులును పాణము లొదిలెన్

మరలను తాకక మునుపే
కరొనాకతిదూరముండి గడుపుట మేలున్

*కంద పద్యం-40*

కరోన పోయెనని జనులు
మురిసియు పోయిరి నిజముగ ముదముతొ నిలనన్

మరలను  వచ్చెను మాయది
కరోన మనలను కలిసియు కబలించగనన్


*కంద పద్యం-41*

కోపము వలనే నష్టము
కోపము వలన ఇతరులకు కోపము పెరుగున్

కోపము మర్మము నెరుగుము
కోపము విడిచిన సుఖములు కొల్లలు నుండున్

*కంద పద్యం-42*

నమ్మకము కత్తి లాంటిది
నమ్మకమనుచాకు ఫలము నరమును కోయున్

నమ్మకముతోడ నడువుము
నమ్మకముపోయె జగతిన నరుడు నెగలడున్

*కంద పద్యం-43*

అన్నియు నుండెను లింకులు
ఎన్నియు నున్నను అవినీతి ఎవరును నాపెన్

చిన్నగ నేతలు దోయుచు
అన్నము మెతుకుల జనులకు ఆకుల విడిచెన్

*కంద పద్యం-44*

కూతలు ఎన్నియొ కూసిరి
నేతలు ఎన్నిక సమయము నెనరుల చూపెన్

వాతలు పెడుతూ పన్నుల
మోతలు మోపియు జనులను మోసము చేసెన్


*కంద పద్యం-45*

ఆధార్ పానుల జతలకు
కదిలిరి ప్రజలు పరుగుతొ కలిపిరి వాటిన్

అదరరు బెదరరు నేతలు 
ఆధార్ పానులు కలిపిన ఆపరు తినుటన్


*కంద పద్యం-46*

నేతలు దోచిరి సంపద 
పీతల వోలెన్ జనులను పీల్చుకు తినెరన్

దాతల నిధులని నరులకు
కథలను చెప్పిరి , బినామి దాయగ ధనముల్

*కంద పద్యం-47*

వలపుతొ నున్నపుడేకథ
చిలుక వినుటకు మురిపముతొ చెవులను విచ్చున్

కలతలు రేగిన రోజున
మెలికలు పెట్టియు నిలువుగ మేనును వంచున్

*కంద పద్యం-48*

గతములొ ఉగాది శార్వరి
చిత్తుగ చేసెను జనులను చివరివరకునన్

నూతన ఉగాది వచ్చెను
ఉత్తముగప్లవ జయించ ఊపిరి పీల్చన్


*కంద పద్యం-49*

మనసున్నవాడు తెలివిగ
మనుషుల సులువుగ నెరిగియు మనసులొ కొలుచున్  

మనసే తెలియని మనుజులు
మనసున మంచిని  నిలుపక  మహిలో  మండున్  


*కంద పద్యం-50*

గలగల కురిసే వర్షము
జలజల జారు చెరువులకు జలములు నిలనన్

సలసల కాగిన నీటితొ
మలమల మాడియు కరోన మాయమగునిలన్