SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Tuesday, July 21, 2015

పేరడీలు

మంచి కాల మొస్తుందనీ, మంచి పాలనొస్తుందనీ

****************************************************

పల్లవి :

మంచి కాల మొస్తుందనీ, మంచి పాలనొస్తుందనీ “2″

అందరూ అనుకున్నారు కృష్ణ  , కృష్ణా  ….

అంత మంచిదేమి కానే కాదు , బాబయ్యా ….

అంత మంచిదేమి రానే లేదు , బాబయ్యా …. “మంచి కాల”

చరణం :1.

నల్ల ధనం రప్పిస్తామని, నరులకు ఇప్పిస్తామనీ “2″

వంద రోజులే గడువనీ , ఒట్టేసుకున్నారు, బాబయ్యా …..

అంతా ఒట్టిదాయి పాయే , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :2.

ఉద్యోగాలోస్తాయనీ , కొలువులే పెట్టిస్తామనీ “2″

చెత్త ఊడిపిస్తున్నారు , బాబయ్యా …..

అంతా ఊడ్చేస్తున్నారు , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం:3.

ధాన్యము  పండిస్తామనీ , ధరలూ తగ్గిస్తామని “2″

భూములన్నీ లాగు తుండ్రీ , బాబయ్యా …..

ధరలన్నీ పెంచుతుండ్రీ , అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :4.

నిలువ నీడ లేక , జనులు అల్లాడి పోతుంటే “2″

భూమి సేకరణకు సభలో , బిల్లు పెట్టిరీ , బాబయ్యా …..

నల్లధనం తెల్లజేయ, పోటీ పడుతున్నారు, అన్నయ్యా ….. “మంచి కాల”

చరణం :5.

పెట్టు బడులనీ , గిట్టు బాటు ఆవు తుందనీ “2″

ఎర్ర తివాచీలేసిరి , బాబయ్యా …..

వారు దేశాన్ని, ఒక్క రోజులోనే ఊడ్చిరి, అన్నయ్యా ……. “మంచి కాల”

( తేది .06.05.2015,న 2.89 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో ఉష్ కాకి )

చరణం :6

జన ధన్ స్కీం అనీ , ఉచిత భీమా అనీ “2″

ఐదు వేల అప్పిస్తామనిరీ , బాబయ్యా …….

నేడు భీమాలకు కాసులు కట్టమనిరీ , అన్నయ్యా …….. “మంచి కాల”


For more Videos , Please watch my YOUTUBE Channel :

1 comment:

  1. A pharmacy your family can trust
    Buy All Ayurvedic Products and Medicine Online at Online Pharmacy Store
    Buy online drug store india

    ReplyDelete