SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Tuesday, December 8, 2020

రాజకీయ శతకం (ఆట వెలది) - 54

                        రాజకీయ శతకం

                        🌻🌻🌻🌻🌻🌻

01. పున్నమికొకమాట పుష్కరానికొమాట
ఇవ్వయిష్ట ముంటె  యిచ్చు నాడె
ఓటు గెలుపు కొరకు ఒడుపుగా మాట్లాడె  
రాజకీయ మంత బూజు పట్టె!

02. మాయ జేసి మాట మార్చియు గెలిచిన
ప్రతిఫలమును కోరి పరుగు పెట్టు 
జనుల ఆగ్రమనుచు  జలములేదునిలన
రాజకీయ మంత బూజు పట్టె!

03. అవని లోన మగువ నందల మెక్కించి 
వెనుక ఉండి నేత వేట సాగు
దోచి దాచు నికను దోచినదంతను
రాజకీయ మంత బూజు పట్టె!

04. రాజకీయమందు రానించ వచ్చని
పాలిటిక్సు లోన పాగ వేసె  
అక్రమాల నన్ని అనుచవచ్చెరజనీ
రాజకీయ మంత బూజు పట్టె!

05. రైతు చట్టములను రైతులొద్దనే 
దేశ రైతు లంత చేసె లొల్లి
కనుటలేదు నేత కనికరమునువీడి
రాజకీయ మంత బూజు పట్టె!

06. ఎన్నికలయిపోయె ఏలికలుగెలిచె
హామి లిచ్చె నేత హాయి గొల్పె 
ఏమి వచ్చె జనుల కేమియు మిగెలెను
రాజకీయ మంత బూజు పట్టె!

07. బేరసారములతొ బేరీజు వేయుచు
మచ్చికలను చేసి మాయ జేసి
నేత కొనును జనుల  నెంతకైననుగాని
రాజకీయ మంత బూజు పట్టె!

08. సాగు చట్టములను సాధించ వలెనని
నేత లేఖ రాసి నెపము పన్నె 
బంధు పథక మెల్ల  భారంబె జనులకు   
రాజకీయ మంత బూజు పట్టె!

09. మాట తప్పె పార్టి మర్లి చూడొద్దోయి
మంచి నెంచి మీరు  మారి పోండి
జాగు చేస్తె నేత జనుల పీక్కుతినును
రాజకీయ మంత బూజు పట్టె!

10. వరద సాయ మైన వస్తదేమోనని
ఆశ తోడ నుండె అలసి పోయె 
హామి లిప్పు డైన ఆమలుపరిచెదరా
రాజకీయ మంత బూజు పట్టె!

11. వరద సాయ మడగ వనితలు వెళితేను
యికను వరద వస్తె యిస్త మనిరి
వాదనేమిలేక వచ్చినోళ్ళనుపంపె
రాజకీయ మంత బూజు పట్టె!

12. ప్రజలు మోస పోవు ప్రతిపక్షము లేక
అడుగు వారు వుంటె హడలి పోవు
పావులన్ని కదుపు పాలన పెంచను
రాజకీయ మంత బూజు పట్టె!

13. జయ్య చంద్ర గట్ల జాగీరు జేస్తుంటె
ఊరికెందు కొరకు ఊర్కొనవలె
గట్ల ఓట్లు వేసె కాడ  నోడియ్యాలి
రాజ
కీయ మంత బూజు పట్టె!

14. పిట్టలదొర మాట గట్టుల మీదనే 
నమ్ముకున్న జనుల  నడ్డి విరుచు
అడుగడుగున నుండు నవతార నేతలు  
రాజకీయ మంత బూజు పట్టె!

15. ఆవు చేన్ల  మేస్తె  ఆవుల దూడలు
గట్టు మేయు ననుట కల్ల యగును
తనయ జీన్సు నెపుడు తలిదండ్రి వేకదా
రాజకీయ మంత బూజు పట్టె!

 16. అక్రమాలనన్ని అనుచొచ్చనిరజనీ
పాలిటిక్సు లోన పాగ వేసె  
వయసు మీద పడగ వద్దనుకునె 
రాజకీయ మంత బూజు పట్టె!

17. సేవ చేసె మనసు సేవకులకునుంటె
ఓటు వేయు జనులు ధీటు గాను
మాట తప్పి నోళ్ళ మరల రానివ్వరు
రాజకీయ మంత బూజు పట్టె!

18. ఫలము పొంద కాంక్ష బలముగనునుంటె
విజయమొందు జనులు నిజము గానె
పాడి నేత కొరకు  పద ఓటువేయ
రాజకీయ మంత బూజు పట్టె!

19. నేతలకుతెలిసెను నేటి బీదలగతి
డబ్బులిచ్చి పిలిచె గబ్బుపనికి
ఏల మారు జనులు ఏకను నేతల
రాజకీయ మంత బూజు పట్టె!

20. పార్టి మారు తుండు పాలకులునుమారు
నీతి ధర్మములను నిలుప కుండ  
చట్ట మెవరి కైన చుట్టంకావద్దు 
రాజకీయ మంత బూజు పట్టె!

21. తూతు మంత్రమనియు తుమ్మకాయేయని
ఎంత మాయ నేటి ఎన్నికల్లొ
ఎన్నికలను జరిపె ఏమిలాభమునిల
రాజకీయ మంత బూజు పట్టె!

22. ఎన్నికలయి పోయె ఏదోవిధముగాను
కలవరముతొ నేత కాపు కాచె
ఎవరు ఎన్నికవునొ ఎవ్వరో మేయరు
రాజకీయ మంత బూజు పట్టె!

23. ఇతడి  కబ్జ లేమొ ఈటలకు తెలుసు
పావు కదుపు తుండె పాప మనుచ
తేలు నేమొ రేపు తేటతెల్లముగను
రాజ కీయ మంత బూజు పట్టె!

24. కబ్జ భూము లన్ని కాజేసి పంచేసి
అడ్డ మున్న వార ననుగ దొక్క
ఎత్తు వేసి నిలన చిత్తయి పోయెనే
రాజ కీయ మంత బూజు పట్టె!

25. ఒకటి తలచు కుంటే ఒట్టిదే ఆయనే
తలకు తగిలిన బొప్పె తగ్గు టేల
యంత్ర తంత్ర యాగ మంత్రము లుండునే
రాజ కీయ మంత బూజు పట్టె!

26. జనుల ఆశ పెంచి జాతర జేయుచు
మందు పానకముతొ మత్తు ముంచి 
నోట్లను కురుపించి ఓట్లను వేయించు 
రాజ కీయ మంత బూజు పట్టె!

27. గూండ బోండ నిలిచి గుట్టుగా ఎన్నికై 
కలహములను మరిచి  కలిసి మెలిసి
జనుల రక్తములను జలగలా పీల్చిరి
రాజ కీయ మంత బూజు పట్టె!

28. ఎన్నికలు కనబడె యెరవేయదలిచె
కులభవనమనియును కూర్మి తోడ
ప్రేమలొలకబోసి పెద్దతనముగుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

29. దేశ సేవ మాట దేవుడెరుగునోయ్
ఉడుత వలెనె  కాదునూసరవెల్లిలా
పార్టి మారు తుండె  పలుకుబడికి
రాజ కీయ మంత బూజు పట్టె!
30. పాలకులను మార్చు  ప్రతిఐదేండ్లకు
అవకతవకలున్న నగుపడేను
కనికరమును చూపి  కన్నీరుకార్చేరు   
రాజ కీయ మంత బూజు పట్టె!

31. ఎవరుగెలిచివచ్చి నేమియు చేసేరు  
ప్రజలకునుగలుగు  ప్రాప్తి ఏమి 
పంచినధనమునకు  పదిరెట్లు దోచేరు 
రాజ కీయ మంత బూజు పట్టె!

32. నాయకుండుపోతె నాయక సభ్యులే  
జాలి ఓట్ల కొరకు జపంజేసి
గద్దె నెక్కి జనుల  కష్టంబు  దోచిరి
రాజ కీయ మంత బూజు పట్టె!

33. దేశ సంపదంత దేవుళ్ళపాలాయె 
పేద జనులు నిల పెరిగి పోయె
దేశము అభివృద్ధి దేవుడే ఎరుగును
రాజ కీయ మంత బూజు పట్టె!

34. ఓటు వేయునపుడె  ఓటరుఎరుగాలి
ఉచితములనుహామి నూడ్చు జనుల 
నీతియున్ననేతె నీకుసాయముజేయు
రాజ కీయ మంత బూజు పట్టె!

35. ఎవరునచ్చకుంటె యెందుకు భయము
నొక్కిపెట్టు నతని "నోట"తోటి
జనులు తలుచు కుంటె జయముఘనముకదా 
రాజ కీయ మంత బూజు పట్టె!

36. నేతలెల్ల కలిసి నేమిపొందిరినిల
ఎన్నికల్లొనిలిచి యెన్నికయిన
అన్నికులములకునునన్నియు దక్కేను
రాజ కీయ మంత బూజు పట్టె!

37. మార్పు కొరకు కదిలె మతియున్న ఓటర్లు
ప్రశ్న వేయనేత పరుగు దీసె
ఓడిపోతెతెలియు నో డినోళ్ళలొసుగు
రాజ కీయ మంత బూజు పట్టె!

38. ఆడ ఓడి చేరె యీడను ఓట్లకు   
ఈడ ఓడి చేరె  యాడ మరల 
స్వార్ధముకొరకెకద సాహాస కృత్యాలు
రాజ కీయ మంత బూజు పట్టె!

39. జనుల ఓట్ల తోని జయము సాధించి
పార్టి మారి జనుల  పరువు తీసె
పార్టి మారి నోళ్ళు పదవినొదలకుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

 40. ఎన్నికలపుడేను  యేలికలుతిరుగు
జనుల బాధ తీర్చ జాడ పట్టు
ఎన్నికలయినాక  నెవరికెవరుకారు
రాజ కీయ మంత బూజు పట్టె!
              
41. నేతలప్పు చేస్తె నేతలే తీర్చేటి
చట్టమొకటి వస్తె  సక్కగుండు
అప్పుభారమికను  నల్పమౌ జనులకు
రాజ కీయ మంత బూజు పట్టె!

42. కదులు తుండె మేధ కాషాయములలోకి
భరత గుండె కాయ భవిత దేల్చ
నిశ్చయించిరికను నిరసనలు తెలుప
రాజ కీయ మంత బూజు పట్టె!

43. సెలబరిటరిలెల్ల సేవచేయురనియు
మెంబరులుగయెంచి మేలుకొలిపె
అందలముననెక్కె నభిమాన ఓట్లతో
రాజ కీయ మంత బూజు పట్టె!

44. వేయి పెట్టి ఖరము వెలకట్టనీనేత
వేయి పెట్టి మనిషి వెలను కట్టి
అందలంబు చేర నడుగులు వేస్తుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

45. కాని ఐన వార కార్యకర్తలజేసి
కులమతములమధ్య  కుంపటేసి
ఓటు గెలుపు కొరకు నోటర్ల చీల్చేరు
రాజ కీయ మంత బూజు పట్టె!

46. పచ్చనోటు యిచ్చె పడితిమి వలలోన
సార గుటక వేసి సావబోయి
భారతాభివృద్ధి బాధ్యత మరిచిరి 
రాజ కీయ మంత బూజు పట్టె!

47. భూము లిచ్చు మాట భూదేవికెరుకోయి
ఇండ్ల మీద ఆశ  నికను మరువు 
ఎన్నికలలొ నిలిచి  యేలికవైపోరు
రాజ కీయ మంత బూజు పట్టె!

48. ఆశలేనిసేవ నల్పమైననుచాలు
కొండయంతమేలు కొరివిపెట్టు
ఓటు కొరకు ఫలము నోటర్ల వణికించు
రాజ కీయ మంత బూజు పట్టె!

49. జనులురణముసలిపి జాతరగావించె
నేత కదల కుండ నేలనిలిపి 
రాజు చేయు హామి  రాయించెపేపర్లొ
రాజ కీయ మంత బూజు పట్టె!

50. విద్య నేర్చిమేధ  విడిచెను రాజ్యము 
విద్య లేని నేత విర్రవీగి
రాజ కీయ మందు రానించు చుండెను
రాజ కీయ మంత బూజు పట్టె!

51. మాటతప్పినోళ్ళు మరలగెలువకుండ
పార్టి లన్ని కలిసి పాగవేస్తె 
జయము నిక్క మనియు జనమంత చూస్తుండ్రు 
రాజ కీయ మంత బూజు పట్టె!

52. కల్ల బొల్లి  మాట  కథలుగా చెప్పియు 
భూమి ఇల్లు  నీయ  బుజ్జగించి 
కార్య కర్తనొంచె కర్కోటక ఖలులు  
రాజకీయ మంత బూజు పట్టె!

53. దీపముండ గానె  దిద్దుకోవలెనని 
దోచి దాస్తు  యుండె దొరక కుండ 
మళ్ళి ఎన్నికపుడు  మళ్లిస్తూ నుండిరి 
రాజకీయ మంత బూజు పట్టె!

54. ఓటు బ్యాంకు  కొరకు  ఓటర్ల కూర్చియు 
హామి యిచ్చె   ప్రజ లడిగి నంత 
ప్రతి ఫలము కోరి   పథకాలు వేసిరి  
రాజకీయ మంత బూజు పట్టె!






No comments:

Post a Comment