SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Wednesday, January 27, 2021

పావని శతకం. తే .గీ -17

 *పావని శతకం*

🌹🌹🌹🌹🌹

01. వేల కోట్లాది భూముల వెనుక వేసి
చేత నైనట్టి సాయంబు చేయ కుండె
దాన ధర్మము చేయక  దాచి పెట్టె 
ధరణి శాపముతొ నింగి తల్ల డిల్లె 
అవని యందున పావని! ఆలకించు 

02. మనిషి నొసటన రాతను మార్చలేము
భ్రహ్మ పుట్టిన నాడేను బాస చేసె
యేడ్వు నవ్విన కరుగడు కాడు పేర్చ 
అవని యందున పావని! ఆలకించు

03. మంచి చెడులన్ని మనుషులు మార్చలేరు
కాలమేమార్చు కనికరం తలచ కుండ
వేచి చూడవలె జనులు  వేగ పడక 
అవని యందున పావని! ఆలకించు

04. కులము పత్రాల మార్చియు ఫలము పొందె
ననుచు ఈర్ష్యను పడునట్టి నక్క జాతి
ఇతర కులముల్లొ పెళ్ళాడి యింట బెట్టి
ఎన్ని ఫలములు పొందిరో నెరుగ కుండె
అవని యందున పావని!  ఆలకించు

05. ముడిసరకుదిగుమతులకు ముడులు వేసి
జనప నార,నూలుకవర్ల జనులకివ్వ
ప్లాస్టికు కవరు కప్పుల వాడ కుండు
అవని యందున పావని! ఆలకించు 

06. యెవరు చేయు పనులవారె యెంచుకొవలె
ఒకరిదొకరు చేయుననుట ఒట్టి మాట
గునపమునుపట్టి బెజ్జము కుట్ట లేము
అవని యందున పావని! ఆలకించు 

07. ప్రేమగా పర స్త్రీ తోను  పెళ్లి యెంచి
పొరుగు దేశపు కోడళ్ళ మరుగు నుంచి
అన్య కులపు కోడలునేమొ  ఆదరించి
సంఘమందుకులములెంచ సబబు కాదు
అవని యందున పావని!  ఆలకించు  

08. కాలమునకున్న విలువను తెలుసుకొనుము
మనకు పెరుగును గౌరవం మంచి గాను 
ధనమునకును విలువనివ్వ దారి చూపు 
మనిషికి విలువ నిచ్చిన మాధవుడగు 
అవని యందున పావని!  ఆలకించు  

09. గడప గడపకు నంతట కలియ తిరిగి
ప్రజల గోసల నెన్నియో  బాప్త మనిరి
పదవులీన గానేనిక  ప్రజల మరిచె
*అవని యందున పావని! ఆలకించు*

10. బాధ నున్నను మనసులో భయము నున్న
నష్ట మైనను బాధైన కష్ట మైన
యిష్ట మైనవారలతోటి మనసు విప్పి
మాట లాడిన గుండెలో తేట గుండు
అవని యందున పావని! ఆలకించు

11.కలహముల్లేని కాపురం నిలనలేదు
సలిపెడికలహాలుధరన సహజ ముండు
కలసి వచ్చును అనుభవం కలహముంటె
కలహ కాపురములలోనె కలదు ప్రేమ
అవని యందున పావని! ఆలకించు

12. బంధువులమేలు, ఆర్ధిక బాధ తగ్గ
పెద్ద మనసుతో వేణువు పెరికె చంద
సంఘములనందరూచేర సవరణలను
చేసె ఇ.సి. నికవేగము చేర వలెనె
అవని యందున పావని! ఆలకించు

13. మనిషి కనబడ కున్నను మాసి పోదు
సెల్లునే బందు చేసిన సెగలు పోవు
మనిషి చేసిన అప్పులు మాయకుండు
అవని యందున పావని! ఆలకించు 

14. చాటు కుండేమితిన్నను చాల కుండు
పట్టు పరుపున పరుండ పాకు తేళ్ళు
అప్పు లేకబ్రతికితెనే  అచ్చి కచ్చు
అవని యందున పావని! ఆలకించు

15. ఎవరు చూస్తుండు ననియును ఏమొ చేసి
పదుగురు జనుల ముందర  భజన చేయ
అంతరాత్మ అడుగడుగు అడ్డు తగులు
అవని యందున పావని! ఆలకించు

16. పరుల సొమ్మును దోచియు పూజ చేయ
పుణ్య మేలగ వచ్చును పురజనులకు
మొక్క ఉసిరితో సరిపెట్టు మోక్ష మొచ్చు
అవని యందున పావని! ఆలకించు

17. మేలు నెవరును తలచిన  తాలు కాదు
పడిన కష్టము నెన్నడు పాడు కాదు
గ్రద్ద ఆలోచనె కలిచె గద్ద మెడను
అవని యందున పావని! ఆలకించు
 

No comments:

Post a Comment