"కవిత్వం ప్రాముఖ్యత ఏమిటి?"
" 'రవి' కాంచనిది 'కవి' కాంచు నంటారు" . ఇది అక్షరాలా సత్యం .
'రవి' కిరణాలు అన్ని మూలలకు ప్రసరించవు . కానీ 'కవి' అన్ని
సమస్యలను పసిగట్టగలడు . ఎత్తి చూపగలడు . పరిష్కరించ గలడు .
అందుకే , 'కాళోజి' అంటారు , " ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ల
కదలించు". అని . ఒక్క సిరా చుక్క నుండి వచ్చే అక్షరాలు , చుర
కత్తుల్లా , పక్కల బళ్లాల్లా పరుగులు పెట్టిస్తాయి . అక్షరాలను ,
నిర్భయముగా , ఆలోచింప చేసే విధంగా వ్రాసేది 'కవి' నే .
కవిత్వం కదిలిస్తుంది . చైతన్యాన్నిస్తుంది . మనిషి సంవేదనలను
పలికిస్తుంది . ప్రతి మానవ అనుభవం ఉద్వేగమైన అనుభూతి
పారవశ్యం నుండి పుట్టిందే కవిత్వం .
విప్లవాలు , యుద్దాలు , సంక్షోభాలు , సమాజ సమస్యలు , వ్యక్తి
మానసిక ప్రవర్తనలు , అన్నీ కవిత్వంలో కనబడుతాయి . అలాంటి
కవిత్వం ప్రపంచాన్ని జాగృతం చేస్తుంది .
For more videos , Please watch my youtube channel :
https://www.youtube.com/c/MargamSahityaYoutubeChannel2021
-:కవితలు:-
తెలుగు బిడ్డ కదలరా
(Date:05.04.2014)
తెలుగు బిడ్డ కదలరా .... మొద్దు నిదుర వదలరా .....
తెలంగాణ స్వేఛ్చ కోసం , పంతాలు మానరా.......
పది జిల్లాల హైదరాబాదు , నాదే నని చాటారా.....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
తెలంగాణ భూములురా.... , తెలంగాణ సంపదరా.....
ఎటు చూసిన ఆకలి చావులు, ఎటు చూసిన చీకటి బతుకులు
ఎవరి వలన ఈ పరిస్థితి , ఎంత కాలమీ దుస్థితి
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఆరు పదుల బానిసత్వం , ఇక మనకు వద్దురా ......
జయశంకర్ తెలంగాణే , ఇక మనకు ముద్దురా.....
అక్ర మార్గ ఆర్జనులకు , అడ్డు కట్ట వేయరా .....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఈనాటిది ఆనాటిది కాదు మన, తెలంగాణా వీర పోరు
అసెంబ్లీలో అరిచినా, పార్లమెంట్ల దూసినా
తెలంగాణ నాదే నని , ఎలుగెత్తి చాటరా ....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఫలాల కోసం పలు జనులు, పెట్టుబడులు పెట్టిరాయె
భూములన్ని చేత బట్టి , సంపదలన్ని కూడ గడితే
ప్రపంచ బ్యాంక్ అప్పులతో , అభివృద్ధి జరుగుచుండే
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
కే సీ ఆర్ ఆమరణ దీక్ష, కోదండరాం నోటి పటిమ
చిదంబరం తొలి పలుకు, దిగ్విజయ్ మలి వాక్కు
సోనియా తుది తీర్పు, తెలంగాణకు నాంది యాయె
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
తెలుగు బిడ్డ కదలరా .... మొద్దు నిదుర వదలరా .....
తెలంగాణ స్వేఛ్చ కోసం , పంతాలు మానరా.......
పది జిల్లాల హైదరాబాదు , నాదే నని చాటారా.....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
తెలంగాణ భూములురా.... , తెలంగాణ సంపదరా.....
ఎటు చూసిన ఆకలి చావులు, ఎటు చూసిన చీకటి బతుకులు
ఎవరి వలన ఈ పరిస్థితి , ఎంత కాలమీ దుస్థితి
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఆరు పదుల బానిసత్వం , ఇక మనకు వద్దురా ......
జయశంకర్ తెలంగాణే , ఇక మనకు ముద్దురా.....
అక్ర మార్గ ఆర్జనులకు , అడ్డు కట్ట వేయరా .....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఈనాటిది ఆనాటిది కాదు మన, తెలంగాణా వీర పోరు
అసెంబ్లీలో అరిచినా, పార్లమెంట్ల దూసినా
తెలంగాణ నాదే నని , ఎలుగెత్తి చాటరా ....
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
ఫలాల కోసం పలు జనులు, పెట్టుబడులు పెట్టిరాయె
భూములన్ని చేత బట్టి , సంపదలన్ని కూడ గడితే
ప్రపంచ బ్యాంక్ అప్పులతో , అభివృద్ధి జరుగుచుండే
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
కే సీ ఆర్ ఆమరణ దీక్ష, కోదండరాం నోటి పటిమ
చిదంబరం తొలి పలుకు, దిగ్విజయ్ మలి వాక్కు
సోనియా తుది తీర్పు, తెలంగాణకు నాంది యాయె
తుది సమరం ఈ సమయం , చే జార నీయకురా..... "తెలుగు బిడ్డ"
నరుడా ! ఓ నరుడా-01!
********************
నరుడా ! ఓ నరుడా! ఓ బావి భారత పౌరుడా !
నర నారాయణుడికైనా , మాత యేరా మూలం
నరులందరికీ , నొక్కడేరా దేవుడు
బొడ్డు కోసిన నాడు , నూలు పోగు రాదు
జీవి వెళ్లిన నాడు , అంగ వస్త్రం పోదు
తల్లి ఒడిలోనే నెవరైనా , చనుబాలే త్రాగేరు
దృష్టి పడని నాటికి , కపటమంటూ యెరుగరు
నరుల నరాల్లోన, నడిచేది నెత్తురే
నాది నీదనే స్వార్ధం , దరి చేయ నీయకు
విద్య బుద్దులు నేర్చి , వినయంబు పెంచు
మాటకారి తనంతో , మోసాలు చేయకు
అమాయక ప్రజలకు , టోపీలు వేయకు
సమానత్వ లోపాలే , ఈ జగతిలోన యుద్దాలు
ఆశ తగ్గిస్తే , సుఖ శాంతులు విరిసేను
అహం కాల రాస్తే , గౌరవాలు పొందేరు
నీవు నేర్చిన విద్యను , నలుగురికి పంచు
నిత్యం వృత్తులతోటి , ఉత్పత్తులు పెంచు
నీవు పాటించని నీతులు , వల్లించ బోకు
నీకు తెలియని వాటిని , పట్టించు కోకు
నిను కన్న తలి దండ్రుల , మరువ బోకు
ఆలు బిడ్డల నెల్ల , చల్లంగా చూడు
శాశ్వతమంటూ ఏదీ లేదు . ఈ ధరని లోన
నిండు మనసుతో నొక్క , మేలైన తలపెట్టు
నీ జన్మ భూమిని , నిర్భయముగా పొగడు
నీ భరత మాతకు , రక్షణగా నిలువు
నిత్య పురస్కారాలతో , ప్రజలు నిను కొలిచెదరు
జగతిలో నీ కీర్తి , వర్ధిల్లు చుండు
*కలియుగం-02*
పరుగెడుతూ ఉంటుంది *కాలం*
ఆపలేరెవ్వరు దానిని *క్షణ కాలం* "పరుగెడుతూ"
విద్యార్థులకు లేకుండా చేశారు *గళం*
విద్యార్థి సంఘాలకు వేశారు *తాళం* "విద్యార్థులకు"
కార్మికులకు లేకుండా చేశారు *దళం*
కార్మిక సంఘాలకు లేదిక *బలం* "కార్మికులకు"
కవి చేతిలో ఉంది *కలం*
నిజాలు రాయాలంటే లేదు *స్థలం* "కవి"
రైతు చేతిలో ఉంది *హలం*
దున్నాలంటే లేదు *పొలం* "రైతు"
శ్రుష్టించారు మనుష్యులకో *కులం*
ఎవరికీ దక్కేనో పధకాల *ఫలం* "శ్రుష్టించారు"
పేద ఆడపడుచుల మేడలో లేదు *తులం*
నక్లెస్ రోడ్ లో జరుగుతుంది రోజూ *మేళం* "పేద"
ఎవరూ జీవించారు యెల్లా *కాలం*
ఎవరికీ పుష్టినిచ్చునో పుష్కర *జలం* "ఎవరూ"
విదేశీయులందిస్తున్నారు *శీతలం*
దేశీయులవుతున్నారు *అతలా కుతలం* "విదేశీయు"
ఓటర్లకు వేస్తారు నేతలు *గాలం*
అందుకే కావాలి నిరుపేదలందరికీ *జన బలం* "ఓటర్లకు"
కరోనా అయ్యింది ప్రజలకు *భారం*
కరోనా అవుతూంది కొందరికి *వరం* ''కరోనా"
*కాదేది కవితకనర్హం-03*!
****************
*కుక్క పిల్ల*
*అగ్గిపుల్ల*
*సబ్బు బిళ్ళ*
కాదేది కవితకనర్హం ,
అంటారు *శ్రీ ,శ్రీ* .
మద్యం త్రాగే వారికి
పద్యం ఎదో ,గద్యం ఎదో ,
కవిత ఎదో , వచనం ఎదో
అర్ధం కాదు . మనవారెవరో
పరవారెవరో అర్ధం కాదు.
కాదు కాదు ,అవుతుంది
మద్యం దిగాక లేదా
సాటి వారిని అర్ధం
చేసుకున్నాక .
జీవితం పై విరక్తి
చెందాక ముసలి తనం
లోనే వ్రాశాడు
*వేమన* , పద్యాలు.
ఏమి చదివెనో , ఎలా వ్రాసేనో
సంకలనం చేసిన ,
*సి .పి. బ్రౌన్* కే ఎరుక .
కటిక జీవితాన్ని
అనుభవిస్తూ ,
ఒక్క సిరా చుక్క
వేయి మెదళ్ళు
కదిలించు నన్న
*కాళోజీకి* తెలంగాణా
వచ్చాకనే ,కాటికి కాలు
సాచాకనే వచ్చింది
గుర్తింపు .
ఒక ఇంర్వ్యూ లో
పది పాసయ్యావా ,
ఫెయిలయ్యవా,
అని అన్నాకనే ,
వచ్చింది పట్టుదల
*సుద్దాల అశోక్ తేజ* కు
(అప్పటికే వారు ఎం. ఏ.
గోల్డ్ మెడలిస్ట్ .)
గద్దరన్న , ఒక్క మీటింగ్
అటెండవుతే చాలు,
పుట్టుకొస్తాయి
విప్లవ గీతాలు .
*గోరెటి వెంకన్న*
జానపద గీతాలు ,
గగన కుసుమాలు .
ఎవరి *గళం* వారిదే ,
ఎవరి *కలం* వారిదే .
ఎవరి *గుర్తింపు* వారిదే.
*ఉత్తర కొరియా-04*
****************
పొగరెత్తిన ఆంబోతులా
ఉలికి పడుతున్నది!
బాంబులున్నాయని
కాబోలు!
లేదా
డబ్బు లున్నాయని
కాబోలు!
లేదా
చైనా తన జిగురు దోస్తని
కాబోలు!
లేదా
టెక్నాలజీ తనకే తెలుసని
కాబోలు!
లేదా
ఈ ప్రపంచం పై
పెత్తనం తనదే ఉండాలని
కాబోలు!
ప్రపంచ పెద్దన్న
మీదికే
కాలు దువ్వుతుండే!
తెలియక దోస్తాను
చేసే ఇండియా
తెలిసింది ముందుగానే
మన మంచికే !
జాతికి ద్రోహం చేసే
ఎవరైనా ,
అహంకారమున్న
ఎవరైనా ,
పొగరున్న
ఎవరైనా ,
తేనె పూసిన కత్తిలా
ఉండే ఎవరైనా ,
అందరికంటే నేనే
గొప్ప అనుకునే
ఎవరైనా ,
నాకే అన్నీ తెలుసు
అనుకునే ఎవరైనా,
కాల గర్భంలో
కలువక తప్పదు .
*కంపు కొడుతుంది-05!*
********************
కంపు కొడుతుంది!
గోళం! భూగోళం!
కరోనా వైరస్ తో
గుట్టల్లా పేరిన
శవాలతో
కందకాలలో
నిండిన కళేబరాలతో
కంపు కొడుతుంది!
గోళం! భూగోళం!
వైరస్ తో నిండిన
జలాలను వడకట్టి ,
కాచుకుని త్రాగినా
కరోనా రాదనే
వారంటీ లేదు
గ్యారేంటీ లేదు
కంపు కొడుతుంది!
గోళం! భూగోళం!
సందెట్లో సడేమియా లా
దోచు కుంటున్నాయి
దవాఖానాలు.
కరోనా వైరస్ తో
సమాజాన్ని
కలుషితం
చేస్తున్నారు మరి కొందరు.
వెళ్లిరా కరోనా!
ఇక వెళ్లి రావమ్మా!
*పేరడి-06*
********
సరిలేరు నీకెవ్వరూ ... ఓ నరేంద్రా ...
సరి రారు నీకెవ్వరూ ....... "సరి"
రాజ నీతిలోనా , రాజుల మించి నావు
రణ భూమి యందు , వాజపేయిని మించి నావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
బ్రహ్మ చారివై నీవు , భవ బంధాలు వీడి
ఆర్ ఎస్ ఎస్ లో చేరో , అర్జునుడవైనావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
తాతను మించి నావు , తండ్రిని మించి నావు
ప్లానులు వేసి నావు, పార్టీని నిలిపి నావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
చెదలు పట్టిన చట్టాల , చెత్తలో కలిపావు
తలాక్ చట్టాలను , తుడిచి పెట్టావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
ఆధార్ లింకులతో , అవి నీతి నడ్డుకుని
నోట్ల రద్దు చేసి , నల్ల ధనం బయట పెట్టావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
కరోనా మహమ్మారితో , కుస్తీలు పట్టావు
లాక్ డౌన్ తో , కరోనా నరికట్టి నావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
దేశ భద్రత యందు , నీకు సాటిలేరెవ్వరు
చైనాను ఉరికించి , తరిమి కొట్టావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
పటేల్ ను ప్రతిష్టించి , ప్రజలలో ధైర్యాన్ని నింపావు
రామాయలయ నిర్మాణంతో, దేశ ప్రతిష్టను పెంచావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి.... "సరి"
విద్యావిధానాన్ని , వినూతన విధానాలతో
రాబోయే తరాలకు , మార్గ దర్శక మయ్యావు.
ఈ దేశప్రజలందరూ , నరేంద్రా .....
జోహారు లను చుండిరీ......
*వ్యక్తిత్వాన్ని కోల్పోకండి-07*
ప్రశ్నించే తత్వం
పోరాడే మనస్థత్వం
లేకపోతే
బ్రతికినంత కాలం
భయపడుతూనే
జీవించాలి.
నీ అంతరాత్మ ప్రకారం
నీవైపు తప్పు
లేనంత కాలం ,
నమ్మిన సిద్ధాంతాల కొరకు
పోరాడుతూనే
ఉండాలి.
ఎదిరించే వాడు
లేకపోతే
బెదిరించే వాడిదే
రాజ్యం.
బానిసలుగా ,
పరాన్న జీవులుగా
జీవించకండి
వ్యక్తిత్వాన్ని
కోల్పోకండి.
*జానపద గేయం-08*
*************
(తేదీ. 22 .02 .1978 లో వ్రాసినది)
(శ్రీ లక్ష్మీ నీమహిమలో చిత్రమై తోచెనేమి, స్టైల్)
ఓరోరి నవాబూ - నీ మహిమ చిత్రమై తోచేనేమి
ఇంద్ర దేశం లోన - ఇగ్నూ శిష్యుడవై
అహోబిలంలో ఘరానా దొంగవై - మా నోళ్లు మూసితివిరా "ఓరోరి"
అధికార దాహంతో - అమదాగ్ని రాష్ట్రంలో
ఎమర్జెన్సీ విధించి - ప్రజలను బాధించి
తల్లీ పిల్లనక - కల్లోల పరిచి
మానోళ్లు కట్టితివిరా - మా నోళ్లు మూసితివిరా "ఓరోరి"
నాజీరు గాడిని - సంక లిరికించుకుని
సంతలా మార్చావు - సొంత ఊరును
అందులో చేర్చావు - అందాల తారల
పెండ్లిళ్ళ పేరయ్య - పెద్దన్నలా నీవు
తగదు నంటూనేనురా - తార్పుడిగా మారావురా "ఓరోరి"
శంకు స్థాపనాలంటూ - శఠగోపం పెట్టి
గౌరుమెంటు సొమ్మును - గల్లంతు చేసి
వందలాది మందిని - బొందల్లో నింపి
పాపాలు చేశావురా - గంగలో మునిగావురా "ఓరోరి"
నీ మాట కడ్డొస్తే - నిందితుడిలా మార్చావు
విద్యార్ధులందరిని - ఊరి బయట నిలబెట్టి
చెట్టు గుట్టలనక - కట్టేసి కొట్టుచూ
గాయాలు చేశావురా - రాక్షసుడి వయ్యావురా "ఓరోరి"
ఊబి దిప్ప పేరుతో - ఊరూరా తిరిగి
పై పై సొమ్మును - పై రోగులకిచ్చి
అసలైన సొమ్మును - గాజల్లో నింపి
మా నోళ్లు కట్టితివిరా - మానోళ్లు మూసితివిరా "ఓరోరి"
ఎన్నికలు రాగానే - ఏమర పాటుతో
పల్లె పల్లెలనక - పగలు రేయిళ్ళనక
ప్రసంగాలు చేయుచూ - పైర తిరుగుతున్నావు
నీ ఓటమి తప్పదురా - నిన్నొదలడు కాళోజిరా "ఓరోరి"
ఏ వ్య వ స్థ ను చూసినా-09
*****************
ఏ వ్య వ స్థ ను చూసినా
ఏ ముంది గర్వ కారణం,
వ్యవస్థలు సమస్తం
అవినీతి మయం .
ప్రక్షాళన జరగాలి
ప్రక్షాళన జరగాలి
ఎదో ఒక నాడు ,
లేదంటే మానవ
జీవితాలు అయోమయం.
********
********
-:హోలీ పాట-10:-
*తేదీ . 17 .08 .1978 రోజున, ఆ కాలం నాటి
ఆర్ధిక పరిస్థితులపై వ్రాసిన హోలీ పాట*
తెల్లందాక పొద్దుందాకా - రెక్కలిరిచిరి కూలివారు
వచ్చిన కొత్తలు మూట గట్టి - కోమటిoట పోసిరయ్య
ధరలన్నీ పెరిగాయని - ధరల పట్టి చూపిరయ్యా
పావు శేరు బియ్యమొచ్చె - పప్పు మాత్రం ఉద్ద్దేరాయే
బిడ్డలకైతే పెట్టి రయ్య - భార్యా భర్త లెండిరయ్య
యేడ బుట్టె యేడ పెరిగే - కూలి చెమట త్రాగే టోళ్లు
కుటుంబ నియంత్రణ అని - పిల్లయితే భారమని
గొప్ప గొప్ప ఆశ లెన్నో - విప్పి విప్పి చెప్పిరయ్య
పిల్ల వాండ్ల ముసలి వాండ్ల - గుంజు కొచ్చి కుట్లు వేసి
వచ్చిన డబ్బు మూట గట్టి - గాజాల్లో నింపిరయ్య
దగా కోరు మోస గాండ్లు - పుట్టిరయ్య పుడమిలోన
బీద జాతి బాధ నెరిగి - వడ్డీ వ్యాపారుల ననుగత్రొక్క
జిల్లా జిల్లా బ్యాంకులాయే - పల్లె పల్లె బ్యాంకు లాయే
అప్పులని అడుగబోతే - ఆదాయాన్ని చూపమనిరి
అధికారికి ఐదనిరీ - ఆఫీసులకు ఐదనిరీ
అడిగిందల్లా కట్టిన గాని - అవసరాలకందక పాయే
పంట చేనులెండి పోయే - కాళ్ళన్నీ అరిగిపోయే
ఖర్చులన్నీ లెక్క గడితే - నాలుగు పైసల మిత్తి ఆయే
అప్పులేమో పెరిగి పోయే - ఆశలన్నీ కరిగి పోయే
ఒంటెద్దు సన్నకారు - పాలుకుదిరె దొరా కాడ
పాలు కుదిరినంక - ఇక బాధలుండవనుకుని
పోరగాని ఆశదీర - ఉన్నూరు బడికి పంపే
ఒక్క కారు పాలు చేస్తే - లెక్కలల్ల దొర ముంచే
అప్పులేమో పెరిగి పోయే - ఆశలన్నీ కరిగి పోయే
బడికెళ్లే పోరగాన్ని - బర్ల కాడ జీతముంచె
మోస గాండ్ల ననుగ దొక్క - దగా కోరుల ననుగ దొక్క
కష్ట బోతు కండరాలు - కల్సి మెలిసి ఉండవలె
కలిగి ఉన్న కలతలన్ని - కలిగి ఉన్న బాధలన్ని
ఒక్క సారి ప్రక్కన బెట్టి - ఉగ్ర నరసింహులయ్యి
తాడో పేడో చేత బట్టి - తరిమి తరిమి వేయవలె
*************************************************
బీద వారి కష్టాలన్నీ , హోలీ , చమ్మకే ళీల హొలీ
హొలీ హోలీల రంగ హొలీ చమ్మకే ళీల హొలీ
హోలీ , హోలీల రంగ హొలీ చమ్మకే ళీల హొలీ
ఆకాశాన్ని అంటుచుండే " హొలీ "
(అన్ని వాక్యాలకు ఇలానే పాడాలి)
కూలి వారి చెమటంత - వరదలై పారు చుండే
దుందామంటే భూమి లేక - తిందామంటే తిండి లేక
జీత ముండే కన్న బిడ్డలు - బానీసలుగ బ్రతుకుతుండే
కరువులొచ్చే , కష్టాలొచ్చే - బిడ్డ పెండ్లికి అప్పులు దెచ్చే
పగలు రేయనకుండా - కాయా కష్టం చేసిన గాని
పెళ్ళాం పుస్తే అమ్మిన గానీ - బిడ్డా గొలుసులు అమ్మిన గానీ
వడ్డీలు తీరక పాయే - వయసంతా ఉడిగి పాయే
ఎన్నడు తీరు మా బాధలు - ఎలా తీరు మా వ్యధలు
బీద వారి కష్టాలన్నీ , హోలీ , చమ్మకే ళీల హొలీ
హొలీ హోలీల రంగ హొలీ చమ్మకే ళీల హొలీ
హోలీ , హోలీల రంగ హొలీ చమ్మకే ళీల హొలీ
ఆకాశాన్ని అంటుచుండే " హొలీ "
(అన్ని వాక్యాలకు ఇలానే పాడాలి)
కూలి వారి చెమటంత - వరదలై పారు చుండే
దుందామంటే భూమి లేక - తిందామంటే తిండి లేక
జీత ముండే కన్న బిడ్డలు - బానీసలుగ బ్రతుకుతుండే
కరువులొచ్చే , కష్టాలొచ్చే - బిడ్డ పెండ్లికి అప్పులు దెచ్చే
పగలు రేయనకుండా - కాయా కష్టం చేసిన గాని
పెళ్ళాం పుస్తే అమ్మిన గానీ - బిడ్డా గొలుసులు అమ్మిన గానీ
వడ్డీలు తీరక పాయే - వయసంతా ఉడిగి పాయే
ఎన్నడు తీరు మా బాధలు - ఎలా తీరు మా వ్యధలు
తెల్లందాక పొద్దుందాకా - రెక్కలిరిచిరి కూలివారు
వచ్చిన కొత్తలు మూట గట్టి - కోమటిoట పోసిరయ్య
ధరలన్నీ పెరిగాయని - ధరల పట్టి చూపిరయ్యా
పావు శేరు బియ్యమొచ్చె - పప్పు మాత్రం ఉద్ద్దేరాయే
బిడ్డలకైతే పెట్టి రయ్య - భార్యా భర్త లెండిరయ్య
యేడ బుట్టె యేడ పెరిగే - కూలి చెమట త్రాగే టోళ్లు
కుటుంబ నియంత్రణ అని - పిల్లయితే భారమని
గొప్ప గొప్ప ఆశ లెన్నో - విప్పి విప్పి చెప్పిరయ్య
పిల్ల వాండ్ల ముసలి వాండ్ల - గుంజు కొచ్చి కుట్లు వేసి
వచ్చిన డబ్బు మూట గట్టి - గాజాల్లో నింపిరయ్య
దగా కోరు మోస గాండ్లు - పుట్టిరయ్య పుడమిలోన
బీద జాతి బాధ నెరిగి - వడ్డీ వ్యాపారుల ననుగత్రొక్క
జిల్లా జిల్లా బ్యాంకులాయే - పల్లె పల్లె బ్యాంకు లాయే
అప్పులని అడుగబోతే - ఆదాయాన్ని చూపమనిరి
అధికారికి ఐదనిరీ - ఆఫీసులకు ఐదనిరీ
అడిగిందల్లా కట్టిన గాని - అవసరాలకందక పాయే
పంట చేనులెండి పోయే - కాళ్ళన్నీ అరిగిపోయే
ఖర్చులన్నీ లెక్క గడితే - నాలుగు పైసల మిత్తి ఆయే
అప్పులేమో పెరిగి పోయే - ఆశలన్నీ కరిగి పోయే
ఒంటెద్దు సన్నకారు - పాలుకుదిరె దొరా కాడ
పాలు కుదిరినంక - ఇక బాధలుండవనుకుని
పోరగాని ఆశదీర - ఉన్నూరు బడికి పంపే
ఒక్క కారు పాలు చేస్తే - లెక్కలల్ల దొర ముంచే
అప్పులేమో పెరిగి పోయే - ఆశలన్నీ కరిగి పోయే
బడికెళ్లే పోరగాన్ని - బర్ల కాడ జీతముంచె
మోస గాండ్ల ననుగ దొక్క - దగా కోరుల ననుగ దొక్క
కష్ట బోతు కండరాలు - కల్సి మెలిసి ఉండవలె
కలిగి ఉన్న కలతలన్ని - కలిగి ఉన్న బాధలన్ని
ఒక్క సారి ప్రక్కన బెట్టి - ఉగ్ర నరసింహులయ్యి
తాడో పేడో చేత బట్టి - తరిమి తరిమి వేయవలె
********
*తోడు-04*
******
పుట్టిన *నాడు*
నీ *తోడు* ఎవడు *లేడు*
*వాడు* *తోడు*
*ఉన్నాడు* అని *పాడు* గాకు
*వాడు* *తోడు* లేని *నాడు* *బీడు* గాకు
*వాడు* *ఎన్నడు* నీ *తోడు* *రాడు*
*ఎవడు* నిన్ను ఆదరించని *నాడు* నీ జీవితమే *వల్లకాడు*
@@@@@
*జుట్టు పిట్టలు-11*
**************
మా ఇంటి ఆవరణలో
రెండు జుట్టు పిట్టలు!
వాటికి మూడుంటేనే
కూడుకుంటాయి!
అవి కూడుకుంటేనే
గూడు కడుతాయి!
అవి గూడు కడితేనే
గ్రుడ్లు పెడుతాయి!
అవి గ్రుడ్లు పెడితేనే
పిల్లలను చేస్తాయి!
పిల్లలకు రెక్కలొచ్చేదాకనే
ప్రేమతో తిన బెడుతాయి!
రెక్క లొచ్చాయంటే
పిల్లలెగిరి పోతాయి!
@@@@@@@
*వదిలేయాలి-12*
***************
గాలి అవసరమే , కానీ
సుడి గాలిని వదిలేయాలి.
ఎండ అవసరమే , కానీ
మండుటెండను వదిలేయాలి .
వర్షం అవసరమే , కానీ
కుండ పోత వర్షాన్ని వదిలేయాలి .
మసిగుడ్డ అవసరమే , కానీ
మాసిన గుడ్డను వదిలేయాలి .
చీకటి అవసరమే , కానీ
చిమ్మ చీకటిని వదిలేయాలి .
వాసన అవసరమే , కానీ
దుర్వాసనను వదిలేయాలి .
అన్నం అవసరమే , కానీ
పాచన్నం వదిలేయాలి .
దేశాల సహకారం అవసరమే , కానీ
పాకిస్థాన్ , చైనాలను వదిలేయాలి .
నాయకులు అవసరమే , కానీ
అవినీతి నాయకుల వదిలేయాలి .
చట్టాలు అవసరమే , కానీ
కాలం చెల్లిన చట్టాలను వదిలేయాలి .
మనిషికి గుణాలు అవసరమే , కానీ
అరిషడ్వార్గాలను వదిలేయాలి .
*********
కాళన్నా!-13
అయినా ,
కలం , కాగితం చేత పట్టకుండానే , భారత ప్రభుత్వ
*పద్మ విభూషణ్* బిరుదాంకితుడివైనావు కాళన్నా!
తెలంగాణా ప్రభుత్వమూ ప్రకటించే నీ జయంతిని
*తెలుగు భాషా దినోత్సవం* గా కాళన్నా!
***********
అన్యాయాలను అక్రమాలను ఏకి పారేసిన కాళన్నా!
ఫిరంగి లాంటి మాటలు ,నిప్పుకణికల్లాంటి కవితలతో కాళన్నా!
కవిత్వాన్ని కాలాతీతం చేసిన అక్షర నిధి కాళన్నా!
అన్యాయాలను అక్రమాలను ఏకి పారేసిన కాళన్నా!
ఫిరంగి లాంటి మాటలు ,నిప్పుకణికల్లాంటి కవితలతో కాళన్నా!
కవిత్వాన్ని కాలాతీతం చేసిన అక్షర నిధి కాళన్నా!
"పుట్టుక నీది , చావు నీది బ్రతుకంతా దేశానిది"
అని ఆవేశాన్ని వెళ్ళగక్కావు కాళన్నా!
"అన్యాయాన్ని ఎదిరిస్తే *నా గొడవ* కు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే *నా గొడవ* కు ముక్తి ,
అన్యాయాన్ని ఎదిరించువాడే నాకారాధ్యుడు"
అని ఆవేశాన్ని వెళ్ళగక్కావు కాళన్నా!
"అన్యాయాన్ని ఎదిరిస్తే *నా గొడవ* కు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే *నా గొడవ* కు ముక్తి ,
అన్యాయాన్ని ఎదిరించువాడే నాకారాధ్యుడు"
అని బండలు బద్దలు కొట్టావు కాళన్నా!
నాడూ తప్ప లేదు నీకు కవుల అంతరాలన్నా!
శ్రీవిశ్వనాధ , దేవులపల్లి , రాయప్రోలులకు
దక్కిన గౌరవాలు నీకెక్కడివన్నా!
శ్రీవిశ్వనాధ , దేవులపల్లి , రాయప్రోలులకు
దక్కిన గౌరవాలు నీకెక్కడివన్నా!
అయినా ,
కలం , కాగితం చేత పట్టకుండానే , భారత ప్రభుత్వ
*పద్మ విభూషణ్* బిరుదాంకితుడివైనావు కాళన్నా!
తెలంగాణా ప్రభుత్వమూ ప్రకటించే నీ జయంతిని
*తెలుగు భాషా దినోత్సవం* గా కాళన్నా!
నీ జీవితాన్నే త్యాగం చేస్తివి కాళన్నా!
నీ పార్ధీవ శరీరాన్ని దానం చేస్తివి కాళన్నా!
నీ జీవితం ధన్యమాయే కాళన్నా !
*************
*అదో చీడ పురుగు-14*
******
అదో చీడ పురుగు
చూడడానికి ఎంతో పొడుగు
గూటిలోనే దాని మరుగు
******
అదో చీడ పురుగు
చూడడానికి ఎంతో పొడుగు
గూటిలోనే దాని మరుగు
దానికి తెలియదు వెలుగు
రాత్రయితే స్థావరం మడుగు
ఆరగిస్తుంది పులుగు
మెల్ల మెల్లగా వేస్తుంది అడుగు
అది ఎప్పుడూ మొరుగు
అనువైన వారినే ఎరుగు
అనిగిమెనిగి ఉంటె కరుగు
ఇష్టముండది పొరుగు
సహించదు ఇతరుల పిడుగు
ఏలెత్తి చూపితే గులుగు
ఇక కక్కుతుంది నురుగు
పంచ ప్రాణం దానికి గొడుగు
సహాయులకొరకు తిరుగు
చేర్చు అందులోకి మురుగు
గెలుకుతుంది అందులో బురుగు
అయినా పెడుతుంది చెడుగు
కావాలి దానికి పలుగు
అనుకుంటుంది తానే మెరుగు
ఆదో చీడ పురుగు
దులుపుతే పరుగో పరుగు .
రాత్రయితే స్థావరం మడుగు
ఆరగిస్తుంది పులుగు
మెల్ల మెల్లగా వేస్తుంది అడుగు
అది ఎప్పుడూ మొరుగు
అనువైన వారినే ఎరుగు
అనిగిమెనిగి ఉంటె కరుగు
ఇష్టముండది పొరుగు
సహించదు ఇతరుల పిడుగు
ఏలెత్తి చూపితే గులుగు
ఇక కక్కుతుంది నురుగు
పంచ ప్రాణం దానికి గొడుగు
సహాయులకొరకు తిరుగు
చేర్చు అందులోకి మురుగు
గెలుకుతుంది అందులో బురుగు
అయినా పెడుతుంది చెడుగు
కావాలి దానికి పలుగు
అనుకుంటుంది తానే మెరుగు
ఆదో చీడ పురుగు
దులుపుతే పరుగో పరుగు .
********
*సామెతల - కవిత-15*
***************
"తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు" ,
మీరు యుద్ధ కళలలో ఆరి తేరినా ,
'సును' , 'చాణక్య' యుద్ధ తంత్రాలు ప్రయోగించినా!
మా అంగుళం భూమి పొందలేరు ,
ఆకాశంలో కలిసి పోయేరు!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూభాగం నుండి వెడలిపో !
"పుట్టుకతో పుట్టిన బుద్ది పుడుకలతోనే పోతుందన్నట్లు"
ఎన్ని సార్లు హెచ్చరించినా పెడ చెవిన పెడుతారు!
"ఎడమ చేయి ఎటు పోతుందంటే, ఆటే పోతదన్నట్లు"
ఒక దిక్కు చర్చలంటావు , మరోదిక్కున 'లడాఖ్' లో పాగా వేస్తావ్!
***************
"తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు" ,
మీరు యుద్ధ కళలలో ఆరి తేరినా ,
'సును' , 'చాణక్య' యుద్ధ తంత్రాలు ప్రయోగించినా!
మా అంగుళం భూమి పొందలేరు ,
ఆకాశంలో కలిసి పోయేరు!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూభాగం నుండి వెడలిపో !
"పుట్టుకతో పుట్టిన బుద్ది పుడుకలతోనే పోతుందన్నట్లు"
ఎన్ని సార్లు హెచ్చరించినా పెడ చెవిన పెడుతారు!
"ఎడమ చేయి ఎటు పోతుందంటే, ఆటే పోతదన్నట్లు"
ఒక దిక్కు చర్చలంటావు , మరోదిక్కున 'లడాఖ్' లో పాగా వేస్తావ్!
ఒక్క దేశమే బ్రతకాలని అనుకోకు,ప్రక్క దేశాలన్నీ బ్రతకాలని కోరుకో
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"తాబట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు"
ప్రపంచ దేశాలన్నీ హెచ్చరించినా , నా మాటే చెల్లాలంటావ్!
నన్నెదురించు వాడే ఈ జగతిలో లేడంటావ్!
నా మాటకు తిరుగులేదంటావ్ ,
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"తాబట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు"
ప్రపంచ దేశాలన్నీ హెచ్చరించినా , నా మాటే చెల్లాలంటావ్!
నన్నెదురించు వాడే ఈ జగతిలో లేడంటావ్!
నా మాటకు తిరుగులేదంటావ్ ,
అహంతో లోలోన సల సలా మసిలి పోతుంటావ్ ! .
మొండి వైఖరి మానుకో , మూతి ముడుచుకుని వెళ్ళిపో!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"మా తాతలు నేతులు తిన్నారు, నా మూతులు వాసన చూడు అన్నట్లు"
1962 లో గెలిచినంత మాత్రాన ,ఇప్పుడు గెలవడం అసంభవమోయ్!
అప్పటి సైన్యం వేరు , ఇప్పటి సైన్యం వేరు
అప్పటి వ్యూహాలు వేరు , ఇప్పటి వ్యూహాలు వేరు
అప్పటి యుద్ధ రైఫిళ్లు వేరు , ఇప్పటి మిగ్ విమానాలు వేరు
కాచుకుని కూర్చుంటావా , తోక ముడుచుకుని పోతావా!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"ఉన్నది ఉన్నట్లంటే ఉలిక్కి పడ్డట్లు"
ముందు మీరే గాలిలో కాల్పులు జరిపి రెచ్చగొట్టారంటే ,
లేదు మీరే ముందుగా మాపై కాల్పులు జరిపారంటారా !
"గెలవలేక మద్దెల ఓడే నన్నట్లు".
మళ్ళీ చర్చలకు అవకాశముందని , కుట్రలు పన్నుతారా!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
మొండి వైఖరి మానుకో , మూతి ముడుచుకుని వెళ్ళిపో!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"మా తాతలు నేతులు తిన్నారు, నా మూతులు వాసన చూడు అన్నట్లు"
1962 లో గెలిచినంత మాత్రాన ,ఇప్పుడు గెలవడం అసంభవమోయ్!
అప్పటి సైన్యం వేరు , ఇప్పటి సైన్యం వేరు
అప్పటి వ్యూహాలు వేరు , ఇప్పటి వ్యూహాలు వేరు
అప్పటి యుద్ధ రైఫిళ్లు వేరు , ఇప్పటి మిగ్ విమానాలు వేరు
కాచుకుని కూర్చుంటావా , తోక ముడుచుకుని పోతావా!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
"ఉన్నది ఉన్నట్లంటే ఉలిక్కి పడ్డట్లు"
ముందు మీరే గాలిలో కాల్పులు జరిపి రెచ్చగొట్టారంటే ,
లేదు మీరే ముందుగా మాపై కాల్పులు జరిపారంటారా !
"గెలవలేక మద్దెల ఓడే నన్నట్లు".
మళ్ళీ చర్చలకు అవకాశముందని , కుట్రలు పన్నుతారా!
చైనా! మీ కుతంత్రాలను కట్టిపెట్టు, మా భూ భాగం నుండి వెడలిపో !
********
*క్తుష్ణా! నీకు వందనం-16*
**************
కురుక్షేత్ర యుద్ధంలో
కౌరవ సోదర సైన్యాన్ని చూసి
కలత చెందిన అర్జనుడు
కదులుతున్న రథము నుండి
క్రిందికి దిగి పారిపోతున్నపార్థుడిని
కురులు పట్టి గుంజుకొచ్చి
కుదురుగా కూర్చుండబెట్టి
**************
కురుక్షేత్ర యుద్ధంలో
కౌరవ సోదర సైన్యాన్ని చూసి
కలత చెందిన అర్జనుడు
కదులుతున్న రథము నుండి
క్రిందికి దిగి పారిపోతున్నపార్థుడిని
కురులు పట్టి గుంజుకొచ్చి
కుదురుగా కూర్చుండబెట్టి
కురుక్షేత్ర రథ సారధివై
కౌరవులు దుర్మార్గులని
కౌరవులు అహంకారులని
కౌరవులు మోసకారులని
కలిసే పోరాడాలని ఉపదేశించి
కీచకులను వధించాలని ధైర్యం చెప్పి
కౌరవులు దుర్మార్గులని
కౌరవులు అహంకారులని
కౌరవులు మోసకారులని
కలిసే పోరాడాలని ఉపదేశించి
కీచకులను వధించాలని ధైర్యం చెప్పి
కసి కసిగా కడతేర్చాలని ఉసిగొల్పి
కండలు తిరిగిన దుర్యోధనాదుల
కండ కండను యుక్తులతో చీల్చి , చెండాడి
కౌరవ మాతలకు కనువిప్పు కలిగించి
కౌరవేతరులకు ముక్తిని ప్రసాదించిన
కృష్ణా! నీకు వందనం !
కృష్ణా ! నీకు శత కోటి వందనం!
కండలు తిరిగిన దుర్యోధనాదుల
కండ కండను యుక్తులతో చీల్చి , చెండాడి
కౌరవ మాతలకు కనువిప్పు కలిగించి
కౌరవేతరులకు ముక్తిని ప్రసాదించిన
కృష్ణా! నీకు వందనం !
కృష్ణా ! నీకు శత కోటి వందనం!
***********
*ఎక్కాల - కవిత-17*
**************
ఒక్కెక్కం ఒకటి:
ఒంటరిగా నిలబెట్టాలి *చైనాను*
రెండెక్కం రెండు:
రెండు రెక్కలు వెనుకకు కట్టెయ్యాలి
మూడెక్కం మూడు:
మోకాళ్ళమీద కూర్చోబెట్టాలి
నాలుగెక్కం నాలుగు:
నాలుకను బయటికి లాగాలి
ఐదెక్కం ఐదు:
ఐదారు ఒంటికి అంటించాలి
ఆరెక్కం ఆరు :
అరవకుండా నోరు మూయాలి
ఏడెక్కం ఏడు:
ఏడవకుండా గుడ్డలు నోట్లో నొక్కాలి
ఎనిమిదెక్కం ఎనిమిది:
ఎండలోనే ఉంచాలి
తొమ్మిదెక్కం తొమ్మిది:
తొలుత సమాచారం సేకరించాలి
పదెక్కం పది:
పండ బెట్టి మన తెరువు రాకుండా వాత బెట్టాలి.
**************
ఒక్కెక్కం ఒకటి:
ఒంటరిగా నిలబెట్టాలి *చైనాను*
రెండెక్కం రెండు:
రెండు రెక్కలు వెనుకకు కట్టెయ్యాలి
మూడెక్కం మూడు:
మోకాళ్ళమీద కూర్చోబెట్టాలి
నాలుగెక్కం నాలుగు:
నాలుకను బయటికి లాగాలి
ఐదెక్కం ఐదు:
ఐదారు ఒంటికి అంటించాలి
ఆరెక్కం ఆరు :
అరవకుండా నోరు మూయాలి
ఏడెక్కం ఏడు:
ఏడవకుండా గుడ్డలు నోట్లో నొక్కాలి
ఎనిమిదెక్కం ఎనిమిది:
ఎండలోనే ఉంచాలి
తొమ్మిదెక్కం తొమ్మిది:
తొలుత సమాచారం సేకరించాలి
పదెక్కం పది:
పండ బెట్టి మన తెరువు రాకుండా వాత బెట్టాలి.
*************
*వాట్సాప్-18*
**********
లేవగానే వాట్సాప్ చూడాలంటే;
గుండెలో పుడుతుంది *దడ దడ*
మంచి నీరు త్రాగుతాడు *గడ గడ*
ఇక నోటి నుండి మాటలు రావు *బడ బడ*
నరాలు కొట్టుకుంటాయి *తడ తడ*
వాట్సాప్ చూడగానే;
కడుపులో కాలుతుంది *సుర సుర*
ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తుంది *బిర బిర*
కాగితాలను చింపాలనిపిస్తుంది *పర పర*
ఎదో గీకాలనిపిస్తుంది పెన్నుతో *బర బర*
వాట్సాప్ పోస్ట్ చేసిన వారిని ;
పండ్లతో కొరకాలనిపిస్తుంది *కర కర*
ఒళ్ళు కాలిపోతుంటుంది *మల మల*
స్నానం చేయాలనిపిస్తుంది *గల గల*
నీళ్లు కాగి ఉన్నాయి *సల సల*
బయటేమో చల్లని మేఘాలు;
ఆకాశంలో మెరుస్తున్నాయి మెరుపులు *మిల మిల*
మేఘాల రాపిడికి వినబడుతున్నాయి శబ్దాలు *ఢమ ఢమ*
వర్షం ప్రారంభమయ్యింది *జర జర*
గాలికి చెట్లు విరిగి పడుతున్నాయి *పెళ పెళ*
ఇంట్లోకి పిలుస్తుంది ఏమండీ అని , అర్ధాంగి;
ఇంట్లో మోగించింది గంటెతో *గణ గణ*
లాభంలేదు , బయటకొచ్చింది మండే చూపులతో *కణ కణ*
లోనికి వెళ్ళాడు తిరుక్కుంటూ *గిర గిర*
కూర్చో బెట్టి వడ్డించింది *బిర బిర*
**********
లేవగానే వాట్సాప్ చూడాలంటే;
గుండెలో పుడుతుంది *దడ దడ*
మంచి నీరు త్రాగుతాడు *గడ గడ*
ఇక నోటి నుండి మాటలు రావు *బడ బడ*
నరాలు కొట్టుకుంటాయి *తడ తడ*
వాట్సాప్ చూడగానే;
కడుపులో కాలుతుంది *సుర సుర*
ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తుంది *బిర బిర*
కాగితాలను చింపాలనిపిస్తుంది *పర పర*
ఎదో గీకాలనిపిస్తుంది పెన్నుతో *బర బర*
వాట్సాప్ పోస్ట్ చేసిన వారిని ;
పండ్లతో కొరకాలనిపిస్తుంది *కర కర*
ఒళ్ళు కాలిపోతుంటుంది *మల మల*
స్నానం చేయాలనిపిస్తుంది *గల గల*
నీళ్లు కాగి ఉన్నాయి *సల సల*
బయటేమో చల్లని మేఘాలు;
ఆకాశంలో మెరుస్తున్నాయి మెరుపులు *మిల మిల*
మేఘాల రాపిడికి వినబడుతున్నాయి శబ్దాలు *ఢమ ఢమ*
వర్షం ప్రారంభమయ్యింది *జర జర*
గాలికి చెట్లు విరిగి పడుతున్నాయి *పెళ పెళ*
ఇంట్లోకి పిలుస్తుంది ఏమండీ అని , అర్ధాంగి;
ఇంట్లో మోగించింది గంటెతో *గణ గణ*
లాభంలేదు , బయటకొచ్చింది మండే చూపులతో *కణ కణ*
లోనికి వెళ్ళాడు తిరుక్కుంటూ *గిర గిర*
కూర్చో బెట్టి వడ్డించింది *బిర బిర*
**********
*గేయం-19*
*******
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
సంపాదించడమే గొప్ప తెలివంటావ్
జీతమొచ్చినా లంచమంటావ్
పరుల బాధలు పట్టయంటావ్
ఎవరేమనుకున్నా నాకేమంటావ్
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
వాన్ని వీన్నీ ముంచి కుప్పచేశావ్
భూములు జాగాలు కొనేశావ్
భార్యను బంగారంతో ముంచేశావ్
పిల్లలను జల్సాలకు మార్చేశావ్
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
బార్లకు బీర్లకు బానీసయిపోతావ్
దాసి దానికి దాసోహమంటావ్
ఊబిలో కూరుకు ఊగిపోతావ్
భార్యా పిల్లల చీవాట్లకు మిన్నకుంటావ్
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
చేతికి తెచ్చిస్తే తీసుకోనంటావ్
బుక్ టైపులో ప్యాక్ చెయ్యమంటావ్
నడుచుకుంటూనే ఇయ్యమంటావ్
చేతికందగానే తుర్రుమంటావ్
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
కంప్లైంట్ చేస్తే కస్సుబుస్సంటావ్
ఎ.సి.బి వస్తే తెల్ల మొఖమేస్తావ్
జైల్లో కూర్చుని ఊసల్లెక్కెడుతావ్
చీకటి గదిలో కునుకు తీస్తావ్
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
నీ మేడలెక్కడబాయరా గొప్పోడా
నీ మిద్దె లెక్కడబాయరా గొప్పోడా
నీ ఆస్తులెక్కడబాయరా గొప్పోడా
నీ ఆప్తులెక్కడబాయరా గొప్ఫోడా
గొప్ప గొప్పంటావు గొప్పోడో!
నీ గొప్పేందో చెప్పరా! గొప్పోడా!
*******
*'౦' (సున్న)-20*
************
*౦* *గుండుసున్నా*
అని చులకనగా చూడకోయ్!
అది *గుండు* సూదిలా గ్రుచ్చు కొను నోయ్ !
*౦* సున్నా అంటే *సూన్యం*
*౦* సున్న ప్రక్కన సున్న పెడితే *సున్నం*!
*౦* లేకుండా *తండ్రి* లేడు!
*౦* లేకుండా *భగవంతుడు* లేడు!
*౦* లేకపోతే అర్ధాలే మారు నోయ్ !
*బండి* కాస్త *బడి* అగు
*గుండి* కాస్త *గుడి* అగు
*దండ* కాస్త *దడ* అగు
*కలం* కాస్త *కల* అగు
*పంగ* కాస్త *పగ* అగు
*౦* ఉంటుంది కోప *౦* లో , తాప *౦* లో
*౦* ఉంటుంది దాహ *౦* లో , దాన *౦* లో
*౦* ఉంటుంది ద్రోహ *౦* లో , మోస *౦* లో
*౦* ఉంటుంది శాఖ *౦* లో , శోఖ *౦* లో
*౦* నే కదా అని ఇతరులతో *మొండిగా* వాదించకు.
*౦* నే కదా అని ఇతరులపై *మండి* పడకు.
*౦* నే కదా అని ఇతరులలోకి *తొంగి* చూడకు.
*౦* నే కదా అని ఇతరులను *విమర్శిOచ* కు
*O* నే ఏదో ఒక రోజు
నీ *గుOడు* గీయు.
*O* పదాల మధ్య చేరిన అర్ధాలు మారు
*౦* *చెడు* మధ్య చేరి *చెండు* గా మారు.
*౦* *పది* మధ్య చేరి *పంది* గా మారు.
*౦* *నది* మధ్య కెళ్లి *నంది* గా మారు.
*౦* *గుడి* లోపలికెళ్ళి *గుండి* గా మారు.
*౦* *బడి* లోపలికెళ్ళి *బండి* గా మారు.
*౦* *ఇందు* గల *డందు* లేదని
*సందేహం* వలదు . *ఎందెందు* వెతికినా
*అందందు* కలదు.
*కలం* లోన *౦* , *కాగితం* లోన *౦*,
*వంట* లోన ,
*పంట* లోన,
*అన్నం* లోన
*బిందె* లోన , *గంప* లోన
*కొండ* లోన , *నింగి* లోన
*తగరం* లోన , *వెండి* లోన
*ఆభరణం* లోన , *మురిపెం* లోన
*వ్యవసాయం* లోన ,
*న్యాయ శాస్త్రం* లోన
*వ్యాకరణం* లోన , *పుస్తకం* లోన
*వంకాయ* లోన , *టెంకాయ* లోన
*జాతీయం* లోన , *రాజకీయం* లోన
*కులం* లోన , *జననం* లోన
*మరణం* లోన , *సహా జీవనం* లోన
అలానే *౦* కొన్ని పదాలలో
*రెండు* కూడా *ఉండు*:
స *౦* ఘ *౦* లోన ,
ర *౦* గ *౦* లోన
*భంగం* లోన , *అందం* లోన
*భాండం* లోన , *బంధం* లోన
*రంద్రం* లోన , *చంద్రం* లోన
*బంగారం* లోన , *గంధం* లోన
*కంచం* లోన , *మంచం* లోన
*౦* అంకెలలో చేరి జిమ్మిక్కులు చేస్తుండు.
*౦* అంకెకు ఎడమవైపు చేరితే శూన్యమే.
*౦* అంకెకు కుడి వైపు వెళుతున్న కొలది
దాని విలువ పెరుగు :
*౦* 1 . *౦* విలువ శూన్యమే కదా!
1 *౦* = పది అగు కదా!
1 *౦౦*= వంద అగు కదా!
1 *౦౦౦* = వేయి అగు కదా!
1 *౦౦౦౦* = పది వేలు అగు కదా!
అలానే ,
*౦* సున్నా నైనా , వస్తువుల నైనా ,
చిన్నల నైనా , పెద్దల నైనా నిర్లక్ష్యం చేయకు
పసి గుడ్డును , మసిగుడ్డను ,
ముసలి అవ్వను లేదా అయ్యను
మూలనున్న చీపురు కట్టను ఎగతాళి చేయకు.
అవసరాలను బట్టి ఉంటాయి, వాటికీ విలువలు
మరిచిపోతే కాలవచ్చు చేతులు ,
పోవచ్చు పరువులు అందనంత దూరానికి .
**********
*కరోనా కాటుకు - ప్రయివేటు పంతుల్ల వెతలు-21*
**************
పంతులూ , ఓ పంతులూ
ప్రయివేటు పంతులూ
ఆగ మాగ మాయే మనబ్రతుకులు
అంధకార మాయే మన జీవితాలు " 2 "
యాజమాన్యాలు జీతాలివ్వక
పథకాలు మనకేమీ లేక
సర్కారు మనల ఆదుకొనక
పరేశాను మనమయితిమి
ఇక భగవంతుడే మనకు దిక్కయ్యా " 2 "
కరోనా కారణంగా
బడులన్నీ మూతబడే
చేసిన జీతం రాక పాయె
చేద్దామంటే బడులు లేక పాయె
కరోనా కారణమాయె " 2 "
మన జీతాలకు గ్యారెంటీ లేదు
మన బతుకులకు భరోసా లేదు
తిందామంటే తిండి లేదు
పందా మంటే నిదుర పట్టదు
పస్తులుండక తప్పదాయె " 2 "
డిగ్రీలు చదివి మనము
పీజీలు చేసి మనము
పండ్లు అమ్ముతుంటిమీ
చెప్పులు అమ్ముతుంటిమీ
మేస్త్రి పని చేస్తుంటిమీ " 2 "
ఇండ్ల కిరాయిలు కట్ట లేక
అప్పుల కిస్తీలు కట్ట లేక
భార్యా పిల్లల పోషించ లేక
పిల్లల బాధలు చూడలేక
ఇక పస్తులే దిక్కాయే నయ్యా " 2 "
విద్యార్థులకు బోధించి
నాయకులను చేస్తిమి
డాక్టర్లను చేస్తిమి
యాక్టర్లను చేస్తిమి
ఇంజినీర్లను చేస్తిమి " 2 "
బతుక లేక బడి పంతులన్నట్లు
ఎక్కడేసిన గొంగళి అక్కడే వుండే
మన బతుకులు చీకటి పడుతుండే
ఇంకా గడ్డుకాలమే ముందుండే
మమ్మాదుకునే వారు లేక పాయె " 2 "
లాక్డౌన్ ఎత్తి వేసినా
బడులు మాత్రం తెరువకుండే
మా బతుకులు గంగలో కలుస్తుండే
ఇక నైనా ఆదుకుని
మా ఇక్కట్లను బాపరయ్య " 2 "
పంతులూ , ఓ పంతులూ
ప్రయివేటు పంతులూ
ఆగ మాగ మాయే మనబ్రతుకులు
అంధకార మాయే మన జీవితాలు " 2 "
యాజమాన్యాలు జీతాలివ్వక
పథకాలు మనకేమీ లేక
సర్కారు మనల ఆదుకొనక
పరేశాను మనమయితిమి
ఇక భగవంతుడే మనకు దిక్కయ్యా " 2 "
కరోనా కారణంగా
బడులన్నీ మూతబడే
చేసిన జీతం రాక పాయె
చేద్దామంటే బడులు లేక పాయె
కరోనా కారణమాయె " 2 "
మన జీతాలకు గ్యారెంటీ లేదు
మన బతుకులకు భరోసా లేదు
తిందామంటే తిండి లేదు
పందా మంటే నిదుర పట్టదు
పస్తులుండక తప్పదాయె " 2 "
డిగ్రీలు చదివి మనము
పీజీలు చేసి మనము
పండ్లు అమ్ముతుంటిమీ
చెప్పులు అమ్ముతుంటిమీ
మేస్త్రి పని చేస్తుంటిమీ " 2 "
ఇండ్ల కిరాయిలు కట్ట లేక
అప్పుల కిస్తీలు కట్ట లేక
భార్యా పిల్లల పోషించ లేక
పిల్లల బాధలు చూడలేక
ఇక పస్తులే దిక్కాయే నయ్యా " 2 "
విద్యార్థులకు బోధించి
నాయకులను చేస్తిమి
డాక్టర్లను చేస్తిమి
యాక్టర్లను చేస్తిమి
ఇంజినీర్లను చేస్తిమి " 2 "
బతుక లేక బడి పంతులన్నట్లు
ఎక్కడేసిన గొంగళి అక్కడే వుండే
మన బతుకులు చీకటి పడుతుండే
ఇంకా గడ్డుకాలమే ముందుండే
మమ్మాదుకునే వారు లేక పాయె " 2 "
లాక్డౌన్ ఎత్తి వేసినా
బడులు మాత్రం తెరువకుండే
మా బతుకులు గంగలో కలుస్తుండే
ఇక నైనా ఆదుకుని
మా ఇక్కట్లను బాపరయ్య " 2 "
*******
*మనిషి!-22*
మనిషి! ఓ మనిషీ!
మనిషి! ఓ మనిషీ!
మనిషి! ఓ మనిషీ!
ఏమిటి నీ ఆశయం ! ఎందాకా నీ పయణం!
ఏమి తెచ్చావు ఈ లోకానికి !
ఏమి ఇచ్చావు ఈ జగతికి!
ఏమి తీసుకెళ్తేవు రేపు నీ లోకానికి! "మనిషి!"
ఎదో చేయాలని ఆరాటం
ఎదో సాధించాలని సమరం
ఎదో వ్రాయాలని ఉబలాటం
ఎదో సన్మానం పొందాలని సంబరం
ఎదో ఘన కీర్తి పొందాలని మహా పోరాటం
ఎదో బంధువులని మహా కనికరం "మనిషి!"
అందరిని కలుపు కోవాలని ఎదో ఆరాటం
కొందరితోనే చెలిమి చేయాలని ఉబలాటం
వారితోనే తమకు పేరువస్తుందనే సంబరం
ఆర్ధికంగా ఆదుకుంటారని ఇరకాటం
అనిమెనిగి ఉండే వారిపై కనికరం
విమర్శించే వారిపై గరం గరం
సంస్కరించే వారిపై పోరాటం. "మనిషి!"
ధనం సంపాదించినా నీ తోడు రాదు
విద్య సంపాదించినా నీ తోడు రాదు
సంతానాన్ని సంపాదించినా నీ తోడు రారు
అందాన్ని సంపాదించినా నీ తోడు రాదు
సుఖంగా జీవించింది నీ తోడు రాదు
మంచి మాట , మంచి మనసు నిను నింగిలో నిలుపు "మనిషి!"
మన కాళ్ళు చేతులే సహకరించవు కల కాలం
మన సంతానమే తోడు ఉండరు మనతో నిరంతరం
మన భాగస్వామియే దగ్గరకు రాలేరు శ్వాశ విడిచాక
మన బంధువులనే దరిదాపుల్లోకి రానివ్వదు *కరోనా*
మన ఆస్తులు , అంతస్తులు మనతోటి రావు , కైలాసానికి . "మనిషి!"
అసహనంతో ఒక కాగితాన్ని చించగలవు .
కానీ దానిని తిరిగి అతికించలేవు.
అఙ్గానంతో ఒక విమర్శను పోస్ట్ చేయ గలవు ,
కానీ కొంత సమయం తరువాత దానిని డిలీట్ చేయలేవు .
కోపంతో ఒక మాట అనగలవు . కానీ తిరిగి దానిని తీసుకోలేవు .
మూర్ఖంగా ఒక దెబ్బ కొట్ట గలవు , కానీ తిరిగి దానిని మాన్ప లేవు
అహంకారంతో ఎవరినైనా ఒక మాట అన గలవు . కానీ మరల ఆ మాటను
తిరిగి తీసుకోలేవు . "మనిషి!"
మంచి చేయాలనే తపన లేక పోతే ,
ఏ దేశాలు సంపద సృష్టించ లేవు
ఏ ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి చేయ లేవు.
ఏ పార్టీలు కార్యకర్తల అభివృద్ధి చేయ లేవు .
ఏ కుల సంఘాలు బంధువులను అభివృద్ధి చేయలేవు
ఏ వాట్సాప్ గ్రూపులు , ఎవరికీ సహాయం అందించ లేవు "మనిషి!"
దానాలలో కెల్ల నేత్ర దానం గొప్పది
దానాలలో కెల్ల గోదానం ఇంకా గొప్పది
దానాలలో కెల్ల భూదానం చాలా గొప్పది
దానాలలో కెల్ల అన్న దానం చాలా చాలా గొప్పది
దానాలలో కెల్ల విద్యా దానం మహా గొప్పది "మనిషి!"
జీవితమంటే తినడమే కాదు . జీవితమంటే గెలవడమే కాదు .
జీవితమంటే చదువే కాదు . జీవితమంటే సంపాదించడమే కాదు
జీవితమంటే వివాహమే కాదు . జీవితమంటే వ్యాపారమే కాదు
జీవితమంటే కనడమే కాదు . జీవితమంటే కవిత్వమే కాదు
జీవితమంటే ఎవరికీ హాని తలపెట్టకుండా ,
మంచి వ్యక్తిత్వంతో మంచి మనసుతో సమాజంలో జీవించ గల్గడం . "మనిషి!"
ఒకరి అహంకారం, వారి మరియు వారి కుటుంబ సభ్యుల మెడల
చుట్టూ త్రాచు పాములా ఇదే కాలంలో మెలికలు తిరుగుతుంది .
ఒకరి సహకారం , వారి మరియు వారి కుటుంబ సభ్యుల హృదయాల
చుట్టూ ఇదే కాలంలో పరిమళాలు కురిపిస్తుంది .
ఒకరి మోసం , వారిని మరియు వారి కుటుంబ సభ్యులను
ఇదే కాలంలో నష్ట పరుస్తుంది.
ఒకరి స్వార్ధం , వారిని మరియు వారి కుటుంబ సభ్యులను
ఇదే కాలంలో చతికిల పడేస్తుంది .
ఒకరి కుట్ర , వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు
ఇదేకాలంలో హాని చేస్తుంది
ఒకరి ప్రేమ ఆప్యాయతలు , వారికి లేదా వారి కుటంబ
సభ్యులకు ఇదే కాలంలో అమృతాలు కురిపిస్తుంది . "మనిషి!"
ఆ తరువాత ఏమి తెలుసుకున్నా వుపయోగముండదు .
ఆ తరువాత ఏమి చెబుదామన్నా ఎవరూ వినేవారు ఉండరు .
ఆ తరువాత ఏమి కొందామన్నా ఎక్కడా ఏమీ దొరకదు.
ఆ తరువాత ఏమి తిందామన్న ఏమి దొరకదు
ఆ తరువాత ఏమి చూద్దామన్నా ప్రకృతే కనబడదు.. "మనిషి!"
***********
శీర్షిక: *కలియుగం-23*
*******
ఏ పార్టినీ చూసినా
ఏముంది గర్వకారణం!
సమస్తం స్వార్ధానికి దాసోహం!
ప్రతి పార్టీకి ఉంది ఒక ఎజెండా!
ఎజెండాలన్నీ కలిపి
జనుల ఓట్లకు గాలం వేసి
కులం మతమని కుంపటి రగిలించి
మాయ మాటలు చెప్పి
ఓటర్ల మచ్చిక చేసుకుని
మందు బాటిళ్ళతో
మత్తు జేసి
డబ్బు సంచులతో
దాగుడు మూతలాడి
పోలీసుల విలేకరులతో తైతక్కలాడించి
ప్రేక్షకులకు వినోదాన్ని పంచి
ఓట్లు వేయించుకుని
ఎవరి దారిన వారు వెళ్ళి పోయిరి.
గెలిచిన వారెవరో గద్దె మీద కూర్చుని
ఎడమ చేతితో జనుల నోట్లో జావ పోసి
కుడి చేతితో దోచుకుని
భవిష్యత్ తరాల కని దాచి పెట్ట సాగిరి.
********
*ఓటు బ్యాంక్ రాజకీయాలు-24*
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులను చీకటిలో ఉంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను బానిసలుగా జేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
నరులను పేద తనంలో ఉంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను త్రాగుడుకు బానిసల చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులపై సాను బూతి చూపిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలకు నూతన పథకాలు సృష్టించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
నరులను సోమరులను చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను కులాలు,మతాలుగా వేరుచేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులపై ప్రేమను వలక బోసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
కొందరికి రిజర్వేషన్లను కొనసాగించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
కొందరిని వారి వృత్తులలో నిష్ణాతులను చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
పండితుల, పామరుల వేరు చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
మనుష్యులను మాయ చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
అడిగే వారికి అడ్డంకులు పెట్టిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
ప్రశ్నించే వారికి చుక్కలు చూపిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
రాజ్యాంగ వ్యవస్థలను దిఖ్ఖరించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
కోర్టులతో దోబూచు లాడిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
చట్టాలలోని లొసుగులను వాడుకొనిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశ , రాష్ట్రాల అప్పులను పెంచు చుండిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలలో ముఠాలు కట్టించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశంలో అవినీతిని పెంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
పర్యావరణాన్ని పాడు చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశ సంపదను, వనరులను కొల్ల గొట్టిరి!
తర తరాలుగా అధికార పీఠాలపై తిష్ట వేసి
దేశ సంపదను దోచుకొనుచుండిరి!
భవిష్యతరాలకు దాచి పెడుతుండిరి!
***********
*జి.చ్.ఎం.సి ఎన్నికల జాతర-2020-25*
మొదలైంది నగరంలో జెండాల జాతర
ఐదేండ్ల కొక మారు జరిగే జెండాల పండుగ.
పార్టీలన్నీ కూడె నొక చోట.
వాడ వాడా , గడప గడపా తిరుగుతూ , హోరా ,
హోరీగా నినాదాలు చేస్తూ , హామీలు గుప్పిస్తూ
మచ్చిక చేస్తుండే ఓటరు అన్నల , ఓటరు తమ్ముళ్ల
ఓటరు అక్కల , ఓటరు చెల్లెన్డ్ల , ఓటరు అవ్వల,
ఓటరు అయ్యల .
ఎన్నికల ఖర్చు తగ్గించ , ఎలక్షన్ కమీషనర్ , విధించే అభ్యర్ధి ఖర్చులు
5 లక్షలని.
కారుకు 1700 , టెంట్ కు 1000 , బిర్యానీకి 150 , ఇడ్లి 10 , టీ కి 5 రూపాయలు .
చూడాలి నాయకులు ఎలా చూపెడుతారో వారి
వారి మాయల గారడీ లెక్కలు .
మేము ఇది అభివృద్ధి చేస్తిమి , మేము అది అభివృద్ధి చేస్తిమి
అని పాలక పక్షమంటే , అంతా ఒట్టిదే , అది మా పార్టీయే గతంలో
చేసిందని ప్రతిపక్షం అంటుంది .
మేము అది చేస్తాం , మేము ఇది చేస్తామని పాలక
పక్షమంటే , మేము వస్తే అంతకంటే ఎక్కువ చేస్తామని
ప్రతిపక్ష మంటది . మేము గెలుస్తే ఇంత ఇస్తామంటే , మేము గెలిస్తే
డబుల్ ఇస్తామని మరో పార్టీ అంటుంది మాకు ఇది అందలేదు , అది
అంద లేదు అని ప్రజలు అంటే , అదిగో వారే , ఇవ్వకుండా
ఆపేశారంటారు . ఏమి అర్ధం కాక, ఎవరినీ ఏమి అనలేక మేధావి
ఓటరు కళ్ళు చెవులు మూసుకుని కూర్చుండే.
ధైర్యం చేసిన కొందరు ఓటర్లు లేచి నిలబడి , ఏడు దశాబ్దాల
నుండి ఎవరు ఏమి చేయలేదు .దోచుక తినడం తప్ప ,
దాచి పెట్టడం తప్పా చేసింది ఏమీ లేదనే.
ఏమీ వినిపించుకోక నాయకులు, సాగిరి ముందుకు .
చెరువు ,మత్తడి పడుతుంటే , ఎదురొచ్చి చేపలు ఎగిరి పడ్డట్టు ,
వెలివేయబడ్డ నాయకులు , నారాజుపడిన నాయకులు ,
అలిగిన నాయకులు , బలహీన నాయకులు , ఏదో ఆశించే నాయకులు,
అభిమానం నాయకులు, ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి , ఆ పార్టీ నుండి
ఈ పార్టీలోకి వెళ్లి కండువాలు కప్పుకొనిరి . పోయే వారు , వచ్చే వారు ,
అన్ని పార్టీలు తిరుగుతారని తెలిసి కూడా , మా నాయకుడిని
తీసుకెళ్లారని ఒక పార్టీ అంటే , లేదు మా పార్టీ నాయకుల ఇంటి కెళ్ళి
బుజ్జగిస్తున్నారని మరో పార్టీ అంటుంది . మా నాయకులను
కొన్నారని ఒక పార్టీ అంటే , లేదు మా నాయకులనే కొన్నారని
అవతలి పార్టీ అంటుంది .
మధ్యలో మరో పార్టీ వచ్చి, మాకు ఈ సారి పరిస్థితులు అనుకూలంగా
లేవని, మరో పార్టీకి మద్దతు పలుకుతే, చుర్రున లేచి మరో పార్టీ,
దానికున్నది ఒకటే సీటు, అదికూడా మద్దతేనని ఎద్దేవా చేస్తుంది.
మేమే గెలుస్తామంటే లేదు మేమే
గెలుస్తామని బీరాలు పలుకుతారు .
ఇక ఓట్లు దగ్గర పడగానే , కార్లల్ల , బైకులల్ల డబ్బులు , బ్రాండీలు
పంపిణీ మొదలెట్టే . పట్టుబడితే , అవి మావి కావనే , బ్యాంకుల్లో
డిపాజిట్ చేయడానికి పోతున్నామనో , గోడౌన్ కు వెళుతున్నామనో ,
నమ్మ బలికే, తీరా డబ్బు పట్టు బడితే , ఎన్నికలయి పోయాక , దానికి
పైరవీలు మొదలయ్యే .
ఓటర్లకు డబ్బులు పంచారని ఒక పార్టీ అంటే , సారా పొట్లాలు
పంచారని మరో పార్టీ , లేదు వారు కుంకుమ భరణీలు పంచారని మరో
పార్టీ వాదిస్తుంది . ఇంకో పార్టీ వచ్చి , పలానా పార్టీ , ఓటర్లకు డబ్బు
వారి అకౌంట్లకు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారని అంటుంది . కార్యకర్తలను
మినహాయిస్తే , అర్ధం కానీ ఓటర్లు , తలలు పట్టుకొనిరి .
ఎన్నికల రిజల్టు వచ్చాక , వారు రిగ్గింగ్ చేశారని వీరు , వీరు రిగ్గింగ్
చేశారని వారు , ఇక వాదులాట మొదలవుతుంది . ఒడిన వారు గెలిచిన
వారిమీద దుమ్మెత్తి పోస్తే , గెలిచిన వారు , ఇంకా మాకు ఎక్కువ సీట్లు
వచ్చేవి అని అంటారు . అలా ఎన్నికల పండుగ జాతర అయిపోతుంది .
ఇక మొదలయ్యేను ఓటర్ల ధర్నాల జాతర .
మొదట పెంచేది పెట్రోల్ డీజిల్ ధరలు . ఆ తరువాత ట్రాన్సపోర్ట్ రేట్లు .
ఆ తరువాత పెంచెదరు అన్ని రకాల పన్నులు , ధాన్యాలు , మందులు ,
అన్ని వస్తువుల ధరలు . నాయకులు పెట్టిన ఖర్చుకు వంద రెట్లు , గుంజేరు
ప్రజల నుండి , ఐదేండ్ల కాలంలో .
కోట్లు వెచ్చించే కరోనాకు. మరల వచ్చే కరోనా సెకండ్ వేవ్ .
కానీ , ఇప్పడు ప్రజలకు , నాయకులకు మాస్కులు లేవు ,
సోషల్ డిస్టాన్స్ లేదు.శానిటైజర్ అసలే లేదు.
కరోనా కట్టడి గాలికి వదిలే. ప్రజల ప్రాణాలు దేవునికి ఒదిలే.
*****
*మనుషులు - మూగ జీవాలు-26*
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక మతం
- అదే మానవత్వం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక కులం
- అదే మానవ చేతి వాటం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక గతం
- అదే మానవ అనుభవం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక గోత్రం
- అదే ఒక ఋషి నామం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక వంశం
- అదే ఒక ఇంటి నామం
ప్రతి మనిషికి ఉంటారు ఏదో ఒక గురువు;
- వాల్మీకి మహర్షి కావచ్చు
- శుక్ర చార్యుడు కావచ్చు
- ద్రోణా చార్యుడు కావచ్చు
- మరో ఒకరు కావచ్చు
విద్య , విజ్ఞ్యానం , విందులు , వినోదాలు ,
కార్లు , బంగ్లాలు, పసందైన భోజనాలు
అన్నీ ఉంటాయి.
కానీ ఏ మనిషీ , ఏ రోజూ సంతృప్తిగా ,
ఆనందంగా ఉండరు .
ప్రతి రోజూ ఏదో రకమైన వివాదాలే, అలజడులే.
గతాన్ని గుర్తు పెట్టుకుని కుంగి పోతారు ,
రేపటి గురించి అలోచించి బంగ పడుతారు.
అదే పశు పక్షాదులకు , జంతు జాలానికి,
క్రిమి కీటకాలకు ఏ మతాలు లేవు , ఏ కులాలు లేవు,
ఏ గతాలు లేవు , ఏ గోత్రాలు లేవు , ఏ వంశాలు లేవు,
ఏ గురువులు లేరు .
అయినా ఎంతో ప్రశాంతంగా , ఆనందంగా ఉంటాయి ,
హాయిగా జీవిస్తాయి. ఉన్న వాటితో సంతృప్తి చెందుతాయి.
గతం గురించి ఆలోచించవు . రేపటి గురించి పట్టించు కోవు.
**********
శీర్షిక: *మేలుకో ఓటరా! మేలుకో!-27*
***********
మేలుకో ఓటరా! మేలుకో!
నీ దేశాన్ని నీవు కాపాడుకో!
ఓటు నీ జన్మ హక్కు
రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు
నీ ఓటు పై ఎవరికి లేదు హక్కు
ఓటును అమ్ము కున్నావో , లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నాయకులు ప్రతి ఇంటికి వచ్చి మొక్కు
నీ ముక్కులో ఉన్నా తీయు పక్కు
ఎంతో అమాయకుల్లా మన ముందు నక్కు
పచ్చ నోట్లకు ఆశ పడ్డావో, లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నేతలు వచ్చినప్పుడు మృదువుగా ఉండాలి నీ వాక్కు
ఎదురుగా ఘర్షణ పడ్డావో వచ్చు రేపు నీకు చిక్కు
నిన్నే కొనాలని బెదిరించారో , వదలకుండా రక్కు
మద్యానికి ఆశ పడ్డావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
నేతలు హామీలు యిస్తారు పెక్కు
గెలిచాక ప్రజలననుగ దొక్కు
వేల కోట్ల డబ్బు , భూముల మెక్కు
కుంకుమ భరణికి ఆశ పడ్డావో, లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
స్త్రీ తన బిడ్డలను పెంచి పోషిస్తుంది
***********
మేలుకో ఓటరా! మేలుకో!
నీ దేశాన్ని నీవు కాపాడుకో!
ఓటు నీ జన్మ హక్కు
రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు
నీ ఓటు పై ఎవరికి లేదు హక్కు
ఓటును అమ్ము కున్నావో , లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నాయకులు ప్రతి ఇంటికి వచ్చి మొక్కు
నీ ముక్కులో ఉన్నా తీయు పక్కు
ఎంతో అమాయకుల్లా మన ముందు నక్కు
పచ్చ నోట్లకు ఆశ పడ్డావో, లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నేతలు వచ్చినప్పుడు మృదువుగా ఉండాలి నీ వాక్కు
ఎదురుగా ఘర్షణ పడ్డావో వచ్చు రేపు నీకు చిక్కు
నిన్నే కొనాలని బెదిరించారో , వదలకుండా రక్కు
మద్యానికి ఆశ పడ్డావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
నేతలు హామీలు యిస్తారు పెక్కు
గెలిచాక ప్రజలననుగ దొక్కు
వేల కోట్ల డబ్బు , భూముల మెక్కు
కుంకుమ భరణికి ఆశ పడ్డావో, లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
అనిగి మెనిగి ఉన్నవో నీపై ఎక్కు
ఏదో ఒక పన్ను రూపంలో నీ నుండి నొక్కు
ఆపై నీ మీద పడుతుంది పొక్కు
భయ పెడితే బెదిరావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
ఏదో ఒక పన్ను రూపంలో నీ నుండి నొక్కు
ఆపై నీ మీద పడుతుంది పొక్కు
భయ పెడితే బెదిరావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
*స్త్రీ-28*
స్త్రీ ఒక అమ్మ
స్త్రీ ఒక అక్క
స్త్రీ ఒక చెల్లి
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక భార్య
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక మరదలు
స్త్రీ ఒక అత్త
స్త్రీ ఒక అమ్మమ్మ
స్త్రీ ఒక నానమ్మ
స్త్రీ ఒక పెద్దమ్మ
స్త్రీ ఒక చిన్నమ్మ
స్త్రీ ఒక మనుమరాలు
స్త్రీ ఒక స్నేహితురాలు
స్త్రీ ఒక ప్రేమికురాలు
స్త్రీ ఒక సలహాదారు
స్త్రీ ఒక డాక్టర్
స్త్రీ ఒక కలెక్టర్
స్త్రీ ఒక కండక్టర్
స్త్రీ ఒక లాయర్
స్త్రీ ఒక ఇంజినీర్
స్త్రీ ఒక నాట్య కర్త
స్త్రీ ఒక అక్క
స్త్రీ ఒక చెల్లి
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక భార్య
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక మరదలు
స్త్రీ ఒక అత్త
స్త్రీ ఒక అమ్మమ్మ
స్త్రీ ఒక నానమ్మ
స్త్రీ ఒక పెద్దమ్మ
స్త్రీ ఒక చిన్నమ్మ
స్త్రీ ఒక మనుమరాలు
స్త్రీ ఒక స్నేహితురాలు
స్త్రీ ఒక ప్రేమికురాలు
స్త్రీ ఒక సలహాదారు
స్త్రీ ఒక డాక్టర్
స్త్రీ ఒక కలెక్టర్
స్త్రీ ఒక కండక్టర్
స్త్రీ ఒక లాయర్
స్త్రీ ఒక ఇంజినీర్
స్త్రీ ఒక నాట్య కర్త
స్త్రీ ఒక సృష్టి కర్త
స్త్రీ ఒక రైతు
స్త్రీ ఒక ఆర్మీ
స్త్రీ ఒక నావికురాలు
స్త్రీ ఒక రైతు
స్త్రీ ఒక ఆర్మీ
స్త్రీ ఒక నావికురాలు
స్త్రి ఒక కార్మికురాలు
స్త్రీ ఒక పాయిలేట్
స్త్రీ ఒక రాజకీయ వేత్త
స్త్రీ ఒక శాస్త్రవేత్త
స్త్రీ ఒక టీచర్
స్త్రీ ఒక పాయిలేట్
స్త్రీ ఒక రాజకీయ వేత్త
స్త్రీ ఒక శాస్త్రవేత్త
స్త్రీ ఒక టీచర్
స్త్రీ ఒక సహన శీలి
స్త్రీ ప్రవహించే కృష్ణా నది
స్త్రీ ప్రవహించే కావేరి నది
స్త్రీ ప్రవహించే పెన్నా నది
స్త్రీ ప్రవహించే గంగా నది
స్త్రీ ప్రవహించే తుంగ భద్రా నది
స్త్రీ ప్రవహించే గోదావరి నది
స్త్రీ ప్రవహించే కావేరి నది
స్త్రీ ప్రవహించే పెన్నా నది
స్త్రీ ప్రవహించే గంగా నది
స్త్రీ ప్రవహించే తుంగ భద్రా నది
స్త్రీ ప్రవహించే గోదావరి నది
స్త్రీ సమస్త జీవ కోటిని మోసే భూదేవి
స్త్రీ సర్వ నక్షత్రాల నామధేయురాలు
స్త్రీ సర్వ నక్షత్రాల నామధేయురాలు
స్త్రీ అల్ప సంతోషి
స్త్రీ అంటే ఒక దేవత
స్త్రీ అంటే ఒక ధన లక్ష్మి
స్త్రీ అంటే ఒక ధాన్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక గజ లక్ష్మి
స్త్రీ అంటే ఒక భాగ్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక సంతాన లక్ష్మి
స్త్రీ అంటే ఒక విద్యా లక్ష్మి
స్త్రీ అంటే ఒక మహా లక్ష్మి
స్త్రీ అంటే ఒక సరస్వతి
స్త్రీ అంటే ఒక కాళికా మాత
స్త్రీ అంటే ఒక కనకదుర్గ
స్త్రీ అంటే ఒక భద్రకాళీ
స్త్రీ అంటే ఒక స్వచ్ఛత
స్త్రీ అంటే ఒక ఆత్మీయత
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ అంటే ఒక అపురూపం
స్త్రీ పలకరిస్తే యెంతో ఆనందం
స్త్రీ మాట్లాడితే యెంతో సంతోషం
స్త్రీ ఇంట ఉంటే అది ఒక సంపద
స్త్రీ తోడు ఉంటే అది ఒక బలం
స్త్రీ సలహా యిస్తే అది ఒక వేదం
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ అంటే ఒక ధన లక్ష్మి
స్త్రీ అంటే ఒక ధాన్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక గజ లక్ష్మి
స్త్రీ అంటే ఒక భాగ్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక సంతాన లక్ష్మి
స్త్రీ అంటే ఒక విద్యా లక్ష్మి
స్త్రీ అంటే ఒక మహా లక్ష్మి
స్త్రీ అంటే ఒక సరస్వతి
స్త్రీ అంటే ఒక కాళికా మాత
స్త్రీ అంటే ఒక కనకదుర్గ
స్త్రీ అంటే ఒక భద్రకాళీ
స్త్రీ అంటే ఒక స్వచ్ఛత
స్త్రీ అంటే ఒక ఆత్మీయత
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ అంటే ఒక అపురూపం
స్త్రీ పలకరిస్తే యెంతో ఆనందం
స్త్రీ మాట్లాడితే యెంతో సంతోషం
స్త్రీ ఇంట ఉంటే అది ఒక సంపద
స్త్రీ తోడు ఉంటే అది ఒక బలం
స్త్రీ సలహా యిస్తే అది ఒక వేదం
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ ప్రక్కన ఉంటే ధైర్యం
స్త్రీ ముందర ఉంటే వెలుగు
స్త్రీ వెనుక ఉంటే చీకటి
స్త్రీ తోడుగా ఉంటే జయం
స్త్రీ ఇంట్లో ఉంటే సంతోషం
స్త్రీ కోపంగా ఉంటే భద్రకాళి
స్త్రీ సంతోషంగా ఉంటే భూదేవి
స్త్రీ ముగ్గులు వేస్తే ఇంటికి శోభ
స్త్రీ పూజలు చేస్తే ఇంట్లోకి లక్ష్మి
స్త్రీ కి అనుకూలంగా ఉంటే దాసోహం
స్త్రీ కి వ్యతిరేకంగా ఉంటే చంద్రముఖి
స్త్రీ ఇంట్లో ఉంటే ఇల్లంతా వెలుతురే
స్త్రీ ఇంట్లో లేకుంటే ఇల్లంతా చీకటే
స్త్రీ గౌరవిస్తేనే సమాజంలో విలువ
స్త్రీ విలువనిస్తేనే సమాజంలో గౌరవం
స్త్రీ తన భర్త పేరు మోస్తుంది
స్త్రీ తన భర్త వంశం మోస్తుంది
స్త్రీ తాళి మెట్టెలకు ప్రాణమిస్తుంది
స్త్రీ ముందర ఉంటే వెలుగు
స్త్రీ వెనుక ఉంటే చీకటి
స్త్రీ తోడుగా ఉంటే జయం
స్త్రీ ఇంట్లో ఉంటే సంతోషం
స్త్రీ కోపంగా ఉంటే భద్రకాళి
స్త్రీ సంతోషంగా ఉంటే భూదేవి
స్త్రీ ముగ్గులు వేస్తే ఇంటికి శోభ
స్త్రీ పూజలు చేస్తే ఇంట్లోకి లక్ష్మి
స్త్రీ కి అనుకూలంగా ఉంటే దాసోహం
స్త్రీ కి వ్యతిరేకంగా ఉంటే చంద్రముఖి
స్త్రీ ఇంట్లో ఉంటే ఇల్లంతా వెలుతురే
స్త్రీ ఇంట్లో లేకుంటే ఇల్లంతా చీకటే
స్త్రీ గౌరవిస్తేనే సమాజంలో విలువ
స్త్రీ విలువనిస్తేనే సమాజంలో గౌరవం
స్త్రీ తన భర్త పేరు మోస్తుంది
స్త్రీ తన భర్త వంశం మోస్తుంది
స్త్రీ తాళి మెట్టెలకు ప్రాణమిస్తుంది
స్త్రీ తన ముత్తైదువ తనం నిలుపు కుంటుంది
స్త్రీ తన భర్తకు సుఖాన్నిస్తుంది
స్త్రీ తన బిడ్డలకు జన్మ నిస్తుంది స్త్రీ తన బిడ్డలను పెంచి పోషిస్తుంది
స్త్రీ తన భర్త
వంశీకుల
చుట్టు పడుతుంది
స్త్రీ తన భర్త వంశీకుల కర్మలు చేస్తుంది
స్త్రీ యీ జగత్ సృష్టికి మూలం
స్త్రీ కి అందుకే గౌరవం జాస్తి
స్త్రీ కి అందుకే ఆయుస్సు అధికం
స్త్రీ కి అందుకే ఆయుస్సు అధికం
*కవితా శ్రీ గారి ప్రస్థానం-29*
అతనొక రచయత, ప్రజా కవి , స్వేచ్ఛా కవి
అభ్యుదయ కవిత్వ రచనలో సిద్ధ హస్తుడు
ఎన్నో సన్మానాలు , కాళోజి పురస్కార గ్రహీత
కవితా శ్రీ , కవితా వైభవ బిరుదాంకితుడు
నిత్య శోధకుడు, అతి నిరాడంబరుడు "అతనొక "
అది ఒక చిన్న పల్లె టూరు
పురాతన కోటలకు ఆనవాలు
అదే నందగిరి నర్సింహులపల్లె
"గంగాధర" మండలం ,కరీం నగర్ జిల్లా "అతనొక"
చిన్న నాడే అమ్మా నాన్న
విడి పోయే
బాపమ్మ తాతయ్య,మేనత్త పెంచే అల్లారు ముద్దుగా
ఒకే అక్క , అక్కకు నొక్కడే తమ్ముడు అన్నట్లుగా
ఆనందముగా కాలము గడుప సాగె "అతనొక"
కొంత కాలానికే జీవితములో మరో పిడుగు
దేవుడికి కళ్ళు కుట్టి నట్లయ్యిందో యేమో
ప్రాణమంటి అక్కయ్య దూరమాయె
మనసు వారి నెంతో కలిచి వేసే "అతనొక"
నాన్నహనుమాండ్లు బ్రతక లేక బడి పంతులు
కొద్ది జీతం, ఇక ఆర్ధిక పరిస్థితి అంతంతే
ఒక చోట స్థిరమైన ఉద్యోగమూ కాదు
కాలం మారి నట్లే తరుచూ ట్రాన్స్ఫర్లు "అతనొక "
ఒక్కో ఊరిలో ఒక్కో తరగతి నాన్నతో
ఎవరితో ఎక్కువ కాలం గడపలేక లేక పాయే
కొన్నాళ్ళకు నాన్న మరో అమ్మను వివాహమాడె
ప్రేమలు మెల్ల మెల్లగా సన్నగిల్లే నాన్నకు " అతనొక "
తాత వెంకట నర్సయ్యకు పెరిగె వాత్సల్యం
అలా అలా కష్టాల కడలిలో ఈదుకుంటూ
పై చదువులు ,బి ఓ ఎల్ . తెలుగు పండిట్
వారాలబ్బాయిగా ఎలాగో వరంగల్ లో పూర్తి చేసే "అతనొక "
ఇక ఉద్యోగ వేటలో నుండగానే
దొర వారి (రెడ్లు) ఇంటి నుండి పిలుపు వచ్చే
పిల్లలకు క్రమ శిక్షణ నేర్పవలెనని వారు తలచె
అది ఎంతో మహా భాగ్యముగా భావించి
పిల్లలకు క్రమ శిక్షణ నేర్ప నారంభించే " అతనొక "
తెలుగు టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగమూ వచ్చే
కొంత కాలానికి తన గుణ గణాలను
నచ్చిన వారి అమ్మాయిలో ప్రేమ చిగురించ
మనసులు కలిసే , కొంత కాలానికి పెద్దల అండతో
యిష్టంతో పరిణయమాడి ఆదర్శంగా నిలిచె " అతనొక "
నాడు కులాంతర వివాహం జఠిలమాయే
జీవితం అత్యంత దుర్భరంగా మారే
మలయశ్రీ , భాష్యం విజయ సారధి , వెంకటేశ్వర్లు
గార్ల అండదండలతో , భార్య రాజమణితో జీవితం సాగె " అతనొక "
చిన్న నాటి నుండే కవిత్వమంటే మహా ప్రీతి
అభ్యుదయ కవిత్వ రచనలో సిద్ధ హస్తుడు
ప్రజా భారతం , తెలంగాణా ఆత్మ ఘోష వంటి
పద్యాల , శతక గ్రంధాల ముద్రించిన ప్రజా కవి
అతడే స్వేచ్ఛా కవి శ్రీ సుదర్శనం వేణుశ్రీ గారు. " అతనొక "
*వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా!*
(1977-78 కాలంలో (42 సం.రాల క్రితం) మా గ్రామ
పరిస్థితులపై నేను వ్రాసిన కవిత యదా తధంగా )
వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా!
ఆంగ్లేయుల పాలనలో ఆహుతైన మన దేశం
దుష్టగాండ్ల మోసగాండ్ల కొందరిని నింపుకుని
వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా! "వచ్చిందయ్యా!"
అగు పడిన పిల్ల వాడికి , అగు పడిన ముసలి వాడికి
గొప్ప గప్ప నీతులెన్నో , కుచ్చి కుచ్చి చెప్పుతారు
చీకటి వేళ కాగానే , బింకెడంత చేత బట్టి
అందులోకి గుడ్డు మార్చి, బేవ్ మంటూ తాగుతారు "వచ్చిందయ్యా!"
అర్ధ రాత్రి దాక నైనా , వాడ వాడ తిరుగుతారు
సి .ఐ .డి ల మంటూ , షికారులు కొడుతారు
అందమైన పడుచు ఇంట్లో , ఆ రాత్రి తిష్ట వేసి
తెల్ల వారి పోగానే , దొరల మంటూ తిరుగుతారు "వచ్చిందయ్యా!"
ఎవరైనా అడ్డువస్తే పూసలిరుగ తన్నుతారు
కాకి బట్టల బలగాన్ని కమాయించు కుంటారు
అంతింతో అందించి ఆసరగా ఉంచుతారు
ఊసరవెల్లి నల్ల దొరలు ఊరూరున ఉన్నారు "వచ్చిందయ్యా!"
ఉండీలను చేతబట్టి ఊరునంతా మూటగట్టి
అయ్యా అయ్యా అనేసరికి అరుగు క్రింద నిలబెట్టి
పో పొమ్మని అనకుండా వీధులూడ్వా బెడుతారు
తంగేడు బరిగెలతో దయ్యాన్ని వెళ్లగొట్టేరు "వచ్చిందయ్యా!"
అమితమైన ప్రేమతో తదేకంగా చూస్తారు
దగ్గరికి పిలుస్తారు కాళ్ళు పిసక బెడుతారు
సన్న కారు రైతులకు చక్ర వడ్డీతో అప్పులిచ్చి
కౌలు దారులకు భూములిచ్చి కట్టడి చేసిరి "వచ్చిందయ్యా!"
దక్షిణం లేనిదే ఉద్యోగాలిచ్చే ధర్మ దాతలు
ఉత్తరం లేనిదే ఉదోగాలిచ్చే ఉత్తములు
దండ లేనిదే దయ చూడని కరుణా మయులు
కాన రారు , కాన రారు కలియుగాన "వచ్చిందయ్యా!"