SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Friday, December 11, 2020

SEESA PADYALU - సీస పద్యాలు - 32

                                సీస పద్యాలు



   *వ్యవసాయ చట్టాలపై రాజకీయాలు-01*

సీ.ప :
నేతల పాలన నెరుగక నుంటిమి
పాలించునప్పుడు పాడు నొకటి
ప్రతిపక్షములొనున్న పాలక పంచనే
రాల్చిరి కన్నీరు రాసె లేఖ
వ్యవసాయచట్టాలు వర్ధిల్లవలెనని
నేడుచాటుననుండి నీరు గార్చె
జనుల వోట్ల కొరకు జాలిని చూపిరి
స్వార్ధనేతలవల్ల సాగిలబడెవృద్ధి

తే.గీ:
నేత దుర్భుద్ధిని జనులు నిగ్గు తేల్చి 
కుటిల నైజపు వారల కుత్సితములు
కట్టడినిజేయ నైదేండ్ల కాలమంత
మేధనెన్నుకొనవలెను మేలుజేయ

*రాజ్యాంగ రచన-2*


సీ.ప : 
భారత రాజ్యాంగ భాద్యత గుర్తించి
ఘనబాబ సాహెబు  గర్వముగను
దేశదేశములందు దేశాధి నేతల
సంప్రదించెనుతాను సాధరముగ
రాజ్యాంగ డ్రాఫ్టుల రాజ్యాధి నేతలు
యివ్వగా కమిటీని యెర్పరిచియు
అధ్యక్షుడాయెను నంబేద్కరుడొకడే
రచియించె రాజ్యాంగ రచన నంత

ఆ.వె : 
నాటి చట్టములకు నాయకులెల్లరు
సవరణలుజరిపిరి చట్టసభలొ
ప్రజల సంపదలను పంచుకు తినుచుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు

*ధరణి పోర్టలు-3*

సీ. ధరణి పోర్టలనొచ్చె  దద్దరిల్లె జనులు
ఆగమవుతునుండ్రి యాడ చేరి
స్లాటులు దొరకక  సహనమ్ము కోల్పోయె
సరిచేసినను నవి    సాగ కుండె
ఎవరికర్ధమగునో  ఎప్పుడు తేలునో
నిపుణులు కూడను  నిమ్మకుండె
అన్నిరిజిస్ట్రేష  లవకతవకలాయె
మేధలెల్లరుకోర్టు  మెట్ల నెక్కె  

ఆ .వె. అడుగొద్దనియును  హైకోర్టు చెప్పిన
అదర కుండ కులము నడగ బట్టె
యెల్లరెసుల వలన  యెల్లరు భీతిల్లె
రాజకీయులిపుడు  రాటు దేలె!

*వ్యవసాయ చట్టాలు-4*

సీ. వ్యవసాయ చట్టము  వ్యర్ధము కాకుండ
ఐదారు నెలలును ఆర దీసె
రైతుల నేతల  రాతల చర్చించి
కర్షక సొమ్ములు కర్షకులకు
దక్కవ లెననియు తలచి దళార్లను 
కట్టడి చేయగ  కనికరముతొ  
చట్టము చేసిరి  చట్ఠసభలలోన
బిల్లులు నయ్యాక  గొల్లు మనిరి

ఆ.వె. చట్టములను కుదుప  చర్చకు వచ్చిరి
అన్య నేత లెల్ల అభయ మిచ్చె
నాడు నెక్క డుండె నాయక రైతులు
రాజకీయు లెల్ల రాటు దేలె! 

*ప్లాస్టిక్  కవర్ల , గ్లాసుల నిషేధం-05*

సీ.  ప్లాస్టికు కవరులు ప్లాస్టికు గ్లాసులు  
ఆరోగ్యమునకును  హాని చే
సె 
విషపుకవరులను   వీడవలెననియు
పలుమార్లు చెప్పిన  వాడు తుండె
ననుచు ప్రభుత్వము నాన్చుచు నుండెను 
షాపుల వారాలకు  శిక్ష వేసె
పుండొక చోటుంటె పూతొక చోటన్న
చందము ప్రభుత్వ చర్చలు సాగబట్టె

ఆ .వె. ముడిసరుకుదిగుమతి  ముట్టడి జేసియు
కంపనీలమూసి   కాపలుంచ  
ప్లాస్టికుకవరులను  వాడుట మాగునే
రాజకీయు లెల్ల  రాటు  దేలె! 

      *కరోనా వలన ఉపయోగాలు -06*

సీ.  చైనాలొనకరొన చెడుగుడు లాడుతూ  
విస్తరించెనునంత   విస్తు నొందె       
ఖండ ఖండాలలో  కభళించె జనులను   
అమెరికా నంతయు  నట్టుడికెను 
లాకుడౌను డిస్టెన్సు  లాఠిశానీటైజు  
జాగ్రత్త వల్లనే  చాల తగ్గె  
యి కరోన జనులకు  యిబ్బంది కలిగించె
అయినను యెన్నెన్నొ  అర్ధ మయ్యె

తే .గీ . బంధు మిత్రువులుఎవరో  బాగ తెలిసె
పొదుపు పెరిగెను  కాలుష్యం  పోయె నెటులొ
కలహములుతగ్గె  ఇంటిలో  ఖర్చు తగ్గె 
కూడి యుండె కుటుంబాలు కూర్మితోడ  
కనుము అన్వేషణా! యిది కలియుగంబు 

        *ప్రయివేటు టీచర్ల వెతలు-07*

సీ.  హామీలు మాటలు  అటకలు ఎక్కించె
అంధకారమయెనే  ఆశ లన్ని
ప్రయివేటు  టీచర్లు  ప్రయివేటు ఉద్యోగి
కాంట్రాక్టు ఉద్యోగి  కలత చెందె
పనులేమి లేకను  పస్తులు యుండిరి
కోవిడు వలనను  కొంత నయిన
జీతాలు అందక  జీవులు విడిచిరి  
అధ్యాపకులెల్లరు అలక యుండె  

ఆ .వె . హామి అమలు చేసి  ఆదుకుంటె బాగుండె
బాల బాలికలకు   బాట వేసె
టీచరుల గురించి యోచన చేయాలి
రాజకీయు లెల్ల రాటు   దేలె!
                      ****
 *శ్రీ మధు సూదన్ గారు అభినంద నీయులు-08*

సీ. ఇంటికి పెద్దవై  ఇంటిల్లి పాదివై
పెద్దతనముతోడ  పెరిగి నావు  
చిన్న నాడేకన్న  నాన దూరమవగా
సకల కష్టాలతో  చదివి నావు
యెమ్మేను చదివియు ఎన్నియో సాధించి
తొలినుండియేనీవు  తోడబుట్ల
కన్న బిడ్డలలాగ  కాపాడి నావయ్య  
అమ్మనలరిస్తివి  ఆలితోడ

తే. గీ. కలిసి ఆదర్శ వంతమై  నిలిచి నావు
అన్న దమ్ములు నిత్యము  అనుస రించె
చెల్లి పెళ్ళియు జేసియు  చేర దీయ
నింగి నీకీర్తి  కెరటాలు  నెగిసి  పోయే
నీవె మధుసూదనా!నీకు  నీవె సాటి 

*వివాహాల ఎంపిక-10*

సీ. మనవివాహములన్ని  మనజీవితములోన
అరుదైన ఘట్టాలు ననుట నిజము 
మరెపుడూ దొరకని  మధురాను భూతిది
ఆలస్యమయినను అలక వద్దు
అదిరించ బెదిరించ  ఆలకించ వలదోయి
నీకాళ్ళ  మీదను  నీవు నిలువు  
వివరాలు  తెలుసుకో  వినయము తోడన
తల్లిదండ్రులె మీకు దారి చూపు  

తే. గీ. అంద ముందని నస్సలు ఆశ వద్దు
కలిగినకుటుంబమనునట్టి    కాంక్ష విడువు  
డబ్బు కాశపడినమిమ్ము  గబ్బు చేయు  
జాతకములును కలిసిన జగడ ముండు
నడత కలవక  జీవితం   నరక మవ్వు
*మనసు* కలసిన పెళ్లిళ్లు  మంచిగుండు 
కనుము అన్వేషణా! యిది కలియుగంబు 


     *నేతల ప్రమాణాలు గుడిలోన-11*

సీ. ఎన్నియో  మార్పులు  యేమివిచిత్రాలు  
యిదికలా  నిజమేన  మదిన నమ్మ
గతములో చూడలే  కలియుగ మాయలు  
నేత లందరు కూడియు  నేడు చేయు
నిర్ణయమునుచూసి  నిలిచెను జనులెల్ల
బారులు గనుచేరె  బాట నిండ 
నిందలు తొలగించు నిర్ణయములతోడ  
సాయిబాబగుడికి   సాగి వచ్చె

తే. గీ. యెంత చిత్రము నిదియు  యేమి  వింత 
నమ్మ  లేకను జనులు నలిగి పోయె 
దేశ మంతయు నిటులైన  తేలి కవ్వు
జనుల గొడవలు యన్నియు  చల్ల బడునె    
కనుము అన్వేషణా! యిది కలియుగంబు  
                          *****

*అన్నా చెల్లెOడ్లు కొంటే దొరకరు-12*

సీ. యెన్నోమతస్థులు  యెన్నోకులస్థులు    
నివసించె జగతిన  నిశ్చలముగ 
బంధుమిత్రువులెల్ల  బారీగ నెట్లన 
వధువొక దేశము  వరుడు నొక్క   
మతమైననువివాహ  మాడిన చెల్లియు   
మరదలు, తండ్రియు మామ, వారి    
తల్లి అత్తయ్యేను  తనయుడు బంధువే    
కాని, అమ్మన్నాన   అక్క చెల్లె 

తే. గీ.  అన్న చెల్లెలెక్కడెతుక  అరిచి పిలువ 
జాడ వెదికినా  దొరుకరు  జగతి లోన 
అన్న దమ్ముల తోపాటు  అక్క  చెల్లె 
ప్రేమలనురాగములనిల పెంచ వలెను  
కనుము అన్వేషణా! యిది కలియుగంబు 
                             *****

*విగ్రహాల కూల్చడం మూర్ఖత్వం -13*

సీ. పిచ్చి తలకుయెక్క  పిచ్చివారయిపోయె
అహంబు మూర్ఖుల   ఆవ హించె
మనిషిగా పుట్టినా  మరిచెమానవతను  
యెవరిఅండతొ నేమొ యెమతెగబడె
గుడులను కూల్చుతూ  గుట్టుగా నుండిరి
రథమును  కాల్చుతూ  రంకె లేస్తు
పాపపు సొమ్ముల   పంచుకునదలిచె
దుష్టమూకరులను దుమ్ము దులుప

తే. గీ. హిందువులుకల్సి  కఠినంగ  హెచ్చరించ
కూటమైపోవలెనికను  కూల్చ కుండ    
గుట్టు తేల్చాలి దుష్టుల, గురువు జాడ  
కనుము అన్వేషణా! యిది కలియుగంబు 
                     *****

*మారు నెపునుడో నేతలు-14*

సీ.  లక్షల పద్యాలు  లక్ష్యము తోడను
మార్చను రాసినా  మార కుండె
నిలిచుండి చదివియు మలిచియు పారవేసె
పాలించు శాశించు  పాలకుOడ్లు
ఆశకోరికలన్ని  ఆవరించె నిండుగా  
ప్రజలకు తాగించి  పాడు చేసె
నేతలు మార్తెనే  నేమైన జరుగును  
హామీలు యివ్వగా  ఆశ పుట్టె
 
తే. గీ. మారు నెపుడునో నేతలు మంచి జేయ
జనులె  మారవలె మనసులో జంక కుండ
ననిచి  వేయాలి అవినీతి  నాయకులను 
నిజము చెబుతున్న  నిక్కముగను
కనుము అన్వేషణా!యిది కలియుగంబు 


*సంక్రాంతి సంబురాలు-15*

సీ . సంక్రాంతి పండుగ  సంబురంగజరుగు
రంగురంగులముగ్గు రాత్రి నంత
వాడవాడలవేసె  వాకిళ్ళ నిండను  
గాలిపతంగులు  గగన మంత
పక్షుల వోలెను  పరుగులు తీస్తుండ
గంగిరెద్దులవారు గాన మూదు
హరిదాసులవారు హరికీర్తనలపాడ   
పిట్టలదొరవచ్చి  పిలిచి చెప్పు

తే. గీ. భోగి పండుగ రోజున  భోగి మంట
కనుల పండుగ సంక్రాంతి  గడుచు చుండు
మూడు రోజుల పండుగ  ముచ్చటంగ
జరుపుకొనెదరంత  జగతి లోన    
కనుము అన్వేషణా! యిది కలియుగంబు 


*ఎవరిది అన్యకులమో -16*

సీ.ప.
కులము మతములని  కుటిలమైనజనులు 
అట్టుడుకుతుండిరి అహము తోడ 
వారికులములు వారికే తెలియవు 
యితరుల గురించి యీడ్చ వచ్చె
కులం కులములంటు  కుంటి సాకులుచెప్పి
భార్యదోకులమని గర్వ పడుతు 
కోడలు నెవరినో  కొడుక్కు చేసిరి
మీసాలు మెలివేసి  మీట నొక్కె

తే.గీ. 
భార్య తలిదండ్రి  కులమేమొ భార్య కెరుక 
కోడలు కులమో ముద్దుగా  కొడుకు నెఱుగు 
అల్లుడి కులమేమోబిడ్డ  అత్త నడుగు 
అప్పుడడుగునెవరొతేలు  అన్య కులము
కనుము అన్వేషణా!యిది కలియుగంబు


*చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం-17*

సీ.ప.
బంధువులకు సేవ పంచను మాన్యులు 
దాతల నుండియు  ధనము కూర్చి 
చాత్తాద  వైష్ణవ  సంఘము  స్థాపించె    
నిర్మిచె  భవనం నర్మ దక్క  
బైలాను రాయించి కులాస  నిచ్చిరి
పత్రిక మొదలెట్టి  పరవ శించె 
రామానుజట్రస్టు  రానించె  సేవలో 
సంఘము నడిచెను చక్క గాను 

తే .గీ.
మధ్య  వచ్చిన  నేతలు  మాట గెలుపు 
ఉనికి  నిలుపుకొనుటకును ఉడుము పట్టు 
పట్టి ధనమును వెచ్చించ పట్టు బట్టె
సంఘమునుచీల్చె బంధువు  సడ్డ మాలె
అవని యందున పావని! ఆలకించు 


*దేశంలో ధరలు బగ బగ-18*

సీ. ప.
ధరణిలోనధరలు  దడనుపుట్టిస్తుండె 
పెట్రోలు  ధరలు పెరిగె  మట్రoగ 
గ్యాసు మొద్దుల ధరలు గగనకుసుమమాయె  
రైతులు రణముతో  సేద్య మిడిచె 
పంతుళ్లు పనిలేక  పస్తులే నుంటుండె
జీతాలు రాకను  జీవు లిడిచె
యిండ్లవి అద్దెలు ఇరుకున బెట్టగా 
భార్య కంటనీరునుకార్చె బాధ తోటి  

తే. గీ.
యేడ్చి యేడ్చి జనులగొంతు  యెండిపోయె 
ఆదుకునునాధుడే లేక   అలమటించె
నాయకులె దోచిరి నరుల నాడి పట్టి 
కనుము అన్వేషణా!యిది కలియుగంబు

*శ్రీ వైష్ణవ బంధువు లారా-19*
********************

సీ. ప .
బంధువు జనులార భవబంధువులార 
ఆలకించుడుసంఘ నల్లరినిల  
పచ్చని సంఘాన్ని  బంజరు చేసియు    
స్వచ్చమైనకులాన్ని  సాగ దీసి  
పబ్బము గడుపుట  పాడియగునెమీకు 
మనబలమునుచూప  మంచి మరిచి 
ప్రభుతముందరరెండు వక్కలై వెళ్లిన
మేలుయేలకలుగు  మేధ కనుము 

తే .గీ.
రుసుము తగ్గించి నిధినినే  రుజువు చూప 
మెంబరులపెంచ  నష్టము  మెవరి కొచ్చె
సంఘము నిధులు వృద్ధియై  సాగు చుండు  
బంధువుల పరువు పెరుగుతూ  పచ్చ గుండు 
అవని యందున పావని! ఆలకించు   


*మహా మనీషి డా. మక్కపాటి మంగళ గారు-20*

సీ.ప.
మనసున్న మహిళగ మహరాణి మంగళ
మక్కపాటి యనుట మరువ రాదు
ప్రజలకు సేవలు పంచను స్థాపించె
హృదయ భారతి అవని యందు
సేవల నందిస్తు సీమను దాటిరి
మధరుతెరిస్సాల మాన వీయ
సత్కారములనందె సాహిత్య మందున
ప్రోత్సాహముతొమది పొంగి పోయె

తే.గీ.
జరుపు కార్యములన్నియు జనులతెలుప
స్వర్ణ పుష్పము పత్రిక సరని యెంచి
మాస పత్రిక మొదలెట్టె మంచి రోజు
రాణి కమలతోడునిలువ రాటు దేలె
దేశమునమార్పులవసరం తెలుసుకునియు
కవుల ఉత్సాహ పరిచిరి కలము తీయ
చుక్క రామయ్య సలహాలు చక్కగుండె
అవని యందున పావని! ఆలకించు


*కరోనా కరాళ నృత్యం-21*

సీ.
ఏమిటీ  జగమున  ఏమివైపరీత్యం
మరణించు నాడన్న మారు చూపు
చూడనోచుకొనక  సురుకుపెట్టెకరోన
బయటకు పోకుండ భయము పెంచె
ఒకరినొకరులను  ఓదార్చకుండను
అయినవారయినను ఆప్తులయిన
బంధువు మిత్రుల బాధల పెంచియు  
ఒంటరులనుచేసి  మంటగలిపె

తే.గీ.
ఆప్తులుకనుల ముందురే  ఆహుతైన
కదల కుండను చేసెను  కఠిన పురుగు
అంతయునువిధి రాతనే అవని లోన
కనుము అన్వేషణా!యిది కలియుగంబు   


*తిరునగరి,ఎవరెస్టు శిఖరగిరి-22*

సీ.
తిరునగరిగారు మెరుగురచనలతో
సాహిత్య  జగతిలో  సాగి పోయె
నవసమాజమునకు నడతను నేర్పగ
ఫలములు విశ్వాన ఫరిడవిల్లె  
బహుబాష కౌముది  భావరచనలను  
విద్యార్థులుచదివి  విజయ మొందె
దాశరథి బిరుదు ధారణ చేసియు
అవని వీడియునేగి అమరుడయ్యె

తే. గీ.
ప్రముఖులెల్లరు కీర్తించ పరవశించె
తీరొకకవుల కవితల తీర్చి దిద్దె
రచనలెన్నొరాయడములో రాటుదేలె
అవని యందున పావని!ఆలకించు

సీ.ప : 23
అబ్బబ్బ పాలన  నబ్బురముగనుండె
బగబగ ధరలన్ని బగ్గుమనెను
గబగబ నాయకుల్ గడబిడ రాజేస్తూ
బుస్సుబుస్సుమనుచు బుసలుకొట్టె
దడదడ గూండాలు బడితపూజలుజేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బు లాగె
ఆ.వె :
విస్కివిస్కీయంటు బిస్కీలు తీయించి
గుట్టుచప్పుడుగను గూడుకూల్చి
ఒట్టుపెట్టితట్టి వోట్లను లాగిరి
బిక్కుబిక్కుమనుచు బిగిసె జనులు

 
సీ. ప : 24
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు 
                       

సీ.ప : 25
పండిన ఫలములు పడినట్లు నేలన
ఎండిన ఆకులు  వీడు నటుల
పాపాలు మోసాలు పండిన రోజున
దోచినదంతయు పంచు వరకు
తీపిమాటలుచెప్పి తప్పించుకోలేరు
ధనముయున్ననునేమి  దానవులకు
విద్యయున్ననువృధా విజ్ఞత లేకుండ
బ్రతికున్న జనులకు భారమేను

ఆ.వె : 26
పుట్టువారునెపుడొ గిట్టక మానరు
దోచిదాయుధనము దొంగపాలె
హంసలాగ బతుకునయిదేండ్లయినగాని
కృష్ణమాట వినుము తృష్ణదీరు

             

సీ.ప : 27
అధికార పార్టితో యవినీత్కి పాల్పడ్డ
ప్రతిపక్ష పార్టిలో పలుకు లేవి
ప్రజలముందర వీరు పబ్బము గడిపేరు
కాలయాపనచేస్తు కసురు కునిరి
పాలకులనెపుడు, ప్రశ్నించకుండను
చేరిపోయిరివారు చెప్పకుండ
దోచుతూ నాయకుల్ దోబూచు లాడిరి
రాజకీయులిపుడు రాటుదేలె

ఆ.వె : 
గడిచెనైదుయేండ్లు కనబడలె జనులు
మరల నరుల మొక్క మాట మార్చ
ఓటునడుగ వచ్చె నోటుపట్టుకొనొచ్చె
కృష్ణమాట వినుము తృష్ణదీరు

 సీ.ప: 28
నివసించ నీడేది నిరుపేద బిడ్డకు
విల్లాలు  నేతకు విస్తు గొలుపె
జిల్లజిల్లాకబ్జ జిగజిగేల్ మనుచుండె
చట్టాలెన్నున్ననూ చుట్టమాయె
మతము చిచ్చునులేపె మరుగునపడకుండె
నిత్యమూ గొడవలు నిగ్గు తేల్చ
మేధజనులెవరు మెదలక నుండిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె : 
రాజకీయముంటె రాజభోగమునుండు
పోటితత్వమేది పోరునుండ
రాజ్యమెల్లరైతు రగులుతు నుండిరి
ధరణిపోయెననియు తల్లడిల్లె

సీ.ప : 29
విధిరాత నెవరును నధిగమించనులేరు
చేయుమోసములను దాయలేరు
నన్నిరోజులెపుడు పున్నములుండవు
అమవాస్యలు కూడ యందు నుండు
చదువులనెన్నియో చదివామనుకున్న
ఫలితము యేమిటి కలతతప్ప
దోచుకుననువచ్చి  దొరలులాబ్రతకను
నేర్చిరి నాయకుల్ నేర్పుగాను

ఆ.వె :
మంచి చేయ నెంచు మహిలోన జనులకు
చేతలల్ల చూపు కొంతనైన
పనులు జరుగ కుండె పరువేమొ పోతుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
                
సీస.మాళిక : 30
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు  పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు

సీ. ప : 31
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు 


   సీ.ప : 32
నేతల కొనుగోళ్ళు నిలన కొత్తనయేమి
కాంగ్రేసు కమ్యునిష్ట్ కాలమందు
నుండియునున్నదే నొచ్చుకునతగునా
నేడున్న మంత్రులు నేతలంత
వలసలు వచ్చిన వారేను జనులార
కోర్టుల్లొ కేసులు కొట్టుకునుడు
న్యాయవ్యవస్థల నాడుకోవడమేమి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద నరుల ముంచి పెంచిరి సంపద
పైసలుచితమిచ్చి పైవిదాచి
కొనిరి విదేశాల్లొ కొత్తగా భూముల
కృష్ణమాట వినుము తృష్ణదీరు
                                  
                
                                      




  
 




 


Tuesday, December 8, 2020

రాజకీయ శతకం (ఆట వెలది) - 54

                        రాజకీయ శతకం

                        🌻🌻🌻🌻🌻🌻

01. పున్నమికొకమాట పుష్కరానికొమాట
ఇవ్వయిష్ట ముంటె  యిచ్చు నాడె
ఓటు గెలుపు కొరకు ఒడుపుగా మాట్లాడె  
రాజకీయ మంత బూజు పట్టె!

02. మాయ జేసి మాట మార్చియు గెలిచిన
ప్రతిఫలమును కోరి పరుగు పెట్టు 
జనుల ఆగ్రమనుచు  జలములేదునిలన
రాజకీయ మంత బూజు పట్టె!

03. అవని లోన మగువ నందల మెక్కించి 
వెనుక ఉండి నేత వేట సాగు
దోచి దాచు నికను దోచినదంతను
రాజకీయ మంత బూజు పట్టె!

04. రాజకీయమందు రానించ వచ్చని
పాలిటిక్సు లోన పాగ వేసె  
అక్రమాల నన్ని అనుచవచ్చెరజనీ
రాజకీయ మంత బూజు పట్టె!

05. రైతు చట్టములను రైతులొద్దనే 
దేశ రైతు లంత చేసె లొల్లి
కనుటలేదు నేత కనికరమునువీడి
రాజకీయ మంత బూజు పట్టె!

06. ఎన్నికలయిపోయె ఏలికలుగెలిచె
హామి లిచ్చె నేత హాయి గొల్పె 
ఏమి వచ్చె జనుల కేమియు మిగెలెను
రాజకీయ మంత బూజు పట్టె!

07. బేరసారములతొ బేరీజు వేయుచు
మచ్చికలను చేసి మాయ జేసి
నేత కొనును జనుల  నెంతకైననుగాని
రాజకీయ మంత బూజు పట్టె!

08. సాగు చట్టములను సాధించ వలెనని
నేత లేఖ రాసి నెపము పన్నె 
బంధు పథక మెల్ల  భారంబె జనులకు   
రాజకీయ మంత బూజు పట్టె!

09. మాట తప్పె పార్టి మర్లి చూడొద్దోయి
మంచి నెంచి మీరు  మారి పోండి
జాగు చేస్తె నేత జనుల పీక్కుతినును
రాజకీయ మంత బూజు పట్టె!

10. వరద సాయ మైన వస్తదేమోనని
ఆశ తోడ నుండె అలసి పోయె 
హామి లిప్పు డైన ఆమలుపరిచెదరా
రాజకీయ మంత బూజు పట్టె!

11. వరద సాయ మడగ వనితలు వెళితేను
యికను వరద వస్తె యిస్త మనిరి
వాదనేమిలేక వచ్చినోళ్ళనుపంపె
రాజకీయ మంత బూజు పట్టె!

12. ప్రజలు మోస పోవు ప్రతిపక్షము లేక
అడుగు వారు వుంటె హడలి పోవు
పావులన్ని కదుపు పాలన పెంచను
రాజకీయ మంత బూజు పట్టె!

13. జయ్య చంద్ర గట్ల జాగీరు జేస్తుంటె
ఊరికెందు కొరకు ఊర్కొనవలె
గట్ల ఓట్లు వేసె కాడ  నోడియ్యాలి
రాజ
కీయ మంత బూజు పట్టె!

14. పిట్టలదొర మాట గట్టుల మీదనే 
నమ్ముకున్న జనుల  నడ్డి విరుచు
అడుగడుగున నుండు నవతార నేతలు  
రాజకీయ మంత బూజు పట్టె!

15. ఆవు చేన్ల  మేస్తె  ఆవుల దూడలు
గట్టు మేయు ననుట కల్ల యగును
తనయ జీన్సు నెపుడు తలిదండ్రి వేకదా
రాజకీయ మంత బూజు పట్టె!

 16. అక్రమాలనన్ని అనుచొచ్చనిరజనీ
పాలిటిక్సు లోన పాగ వేసె  
వయసు మీద పడగ వద్దనుకునె 
రాజకీయ మంత బూజు పట్టె!

17. సేవ చేసె మనసు సేవకులకునుంటె
ఓటు వేయు జనులు ధీటు గాను
మాట తప్పి నోళ్ళ మరల రానివ్వరు
రాజకీయ మంత బూజు పట్టె!

18. ఫలము పొంద కాంక్ష బలముగనునుంటె
విజయమొందు జనులు నిజము గానె
పాడి నేత కొరకు  పద ఓటువేయ
రాజకీయ మంత బూజు పట్టె!

19. నేతలకుతెలిసెను నేటి బీదలగతి
డబ్బులిచ్చి పిలిచె గబ్బుపనికి
ఏల మారు జనులు ఏకను నేతల
రాజకీయ మంత బూజు పట్టె!

20. పార్టి మారు తుండు పాలకులునుమారు
నీతి ధర్మములను నిలుప కుండ  
చట్ట మెవరి కైన చుట్టంకావద్దు 
రాజకీయ మంత బూజు పట్టె!

21. తూతు మంత్రమనియు తుమ్మకాయేయని
ఎంత మాయ నేటి ఎన్నికల్లొ
ఎన్నికలను జరిపె ఏమిలాభమునిల
రాజకీయ మంత బూజు పట్టె!

22. ఎన్నికలయి పోయె ఏదోవిధముగాను
కలవరముతొ నేత కాపు కాచె
ఎవరు ఎన్నికవునొ ఎవ్వరో మేయరు
రాజకీయ మంత బూజు పట్టె!

23. ఇతడి  కబ్జ లేమొ ఈటలకు తెలుసు
పావు కదుపు తుండె పాప మనుచ
తేలు నేమొ రేపు తేటతెల్లముగను
రాజ కీయ మంత బూజు పట్టె!

24. కబ్జ భూము లన్ని కాజేసి పంచేసి
అడ్డ మున్న వార ననుగ దొక్క
ఎత్తు వేసి నిలన చిత్తయి పోయెనే
రాజ కీయ మంత బూజు పట్టె!

25. ఒకటి తలచు కుంటే ఒట్టిదే ఆయనే
తలకు తగిలిన బొప్పె తగ్గు టేల
యంత్ర తంత్ర యాగ మంత్రము లుండునే
రాజ కీయ మంత బూజు పట్టె!

26. జనుల ఆశ పెంచి జాతర జేయుచు
మందు పానకముతొ మత్తు ముంచి 
నోట్లను కురుపించి ఓట్లను వేయించు 
రాజ కీయ మంత బూజు పట్టె!

27. గూండ బోండ నిలిచి గుట్టుగా ఎన్నికై 
కలహములను మరిచి  కలిసి మెలిసి
జనుల రక్తములను జలగలా పీల్చిరి
రాజ కీయ మంత బూజు పట్టె!

28. ఎన్నికలు కనబడె యెరవేయదలిచె
కులభవనమనియును కూర్మి తోడ
ప్రేమలొలకబోసి పెద్దతనముగుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

29. దేశ సేవ మాట దేవుడెరుగునోయ్
ఉడుత వలెనె  కాదునూసరవెల్లిలా
పార్టి మారు తుండె  పలుకుబడికి
రాజ కీయ మంత బూజు పట్టె!
30. పాలకులను మార్చు  ప్రతిఐదేండ్లకు
అవకతవకలున్న నగుపడేను
కనికరమును చూపి  కన్నీరుకార్చేరు   
రాజ కీయ మంత బూజు పట్టె!

31. ఎవరుగెలిచివచ్చి నేమియు చేసేరు  
ప్రజలకునుగలుగు  ప్రాప్తి ఏమి 
పంచినధనమునకు  పదిరెట్లు దోచేరు 
రాజ కీయ మంత బూజు పట్టె!

32. నాయకుండుపోతె నాయక సభ్యులే  
జాలి ఓట్ల కొరకు జపంజేసి
గద్దె నెక్కి జనుల  కష్టంబు  దోచిరి
రాజ కీయ మంత బూజు పట్టె!

33. దేశ సంపదంత దేవుళ్ళపాలాయె 
పేద జనులు నిల పెరిగి పోయె
దేశము అభివృద్ధి దేవుడే ఎరుగును
రాజ కీయ మంత బూజు పట్టె!

34. ఓటు వేయునపుడె  ఓటరుఎరుగాలి
ఉచితములనుహామి నూడ్చు జనుల 
నీతియున్ననేతె నీకుసాయముజేయు
రాజ కీయ మంత బూజు పట్టె!

35. ఎవరునచ్చకుంటె యెందుకు భయము
నొక్కిపెట్టు నతని "నోట"తోటి
జనులు తలుచు కుంటె జయముఘనముకదా 
రాజ కీయ మంత బూజు పట్టె!

36. నేతలెల్ల కలిసి నేమిపొందిరినిల
ఎన్నికల్లొనిలిచి యెన్నికయిన
అన్నికులములకునునన్నియు దక్కేను
రాజ కీయ మంత బూజు పట్టె!

37. మార్పు కొరకు కదిలె మతియున్న ఓటర్లు
ప్రశ్న వేయనేత పరుగు దీసె
ఓడిపోతెతెలియు నో డినోళ్ళలొసుగు
రాజ కీయ మంత బూజు పట్టె!

38. ఆడ ఓడి చేరె యీడను ఓట్లకు   
ఈడ ఓడి చేరె  యాడ మరల 
స్వార్ధముకొరకెకద సాహాస కృత్యాలు
రాజ కీయ మంత బూజు పట్టె!

39. జనుల ఓట్ల తోని జయము సాధించి
పార్టి మారి జనుల  పరువు తీసె
పార్టి మారి నోళ్ళు పదవినొదలకుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

 40. ఎన్నికలపుడేను  యేలికలుతిరుగు
జనుల బాధ తీర్చ జాడ పట్టు
ఎన్నికలయినాక  నెవరికెవరుకారు
రాజ కీయ మంత బూజు పట్టె!
              
41. నేతలప్పు చేస్తె నేతలే తీర్చేటి
చట్టమొకటి వస్తె  సక్కగుండు
అప్పుభారమికను  నల్పమౌ జనులకు
రాజ కీయ మంత బూజు పట్టె!

42. కదులు తుండె మేధ కాషాయములలోకి
భరత గుండె కాయ భవిత దేల్చ
నిశ్చయించిరికను నిరసనలు తెలుప
రాజ కీయ మంత బూజు పట్టె!

43. సెలబరిటరిలెల్ల సేవచేయురనియు
మెంబరులుగయెంచి మేలుకొలిపె
అందలముననెక్కె నభిమాన ఓట్లతో
రాజ కీయ మంత బూజు పట్టె!

44. వేయి పెట్టి ఖరము వెలకట్టనీనేత
వేయి పెట్టి మనిషి వెలను కట్టి
అందలంబు చేర నడుగులు వేస్తుండె
రాజ కీయ మంత బూజు పట్టె!

45. కాని ఐన వార కార్యకర్తలజేసి
కులమతములమధ్య  కుంపటేసి
ఓటు గెలుపు కొరకు నోటర్ల చీల్చేరు
రాజ కీయ మంత బూజు పట్టె!

46. పచ్చనోటు యిచ్చె పడితిమి వలలోన
సార గుటక వేసి సావబోయి
భారతాభివృద్ధి బాధ్యత మరిచిరి 
రాజ కీయ మంత బూజు పట్టె!

47. భూము లిచ్చు మాట భూదేవికెరుకోయి
ఇండ్ల మీద ఆశ  నికను మరువు 
ఎన్నికలలొ నిలిచి  యేలికవైపోరు
రాజ కీయ మంత బూజు పట్టె!

48. ఆశలేనిసేవ నల్పమైననుచాలు
కొండయంతమేలు కొరివిపెట్టు
ఓటు కొరకు ఫలము నోటర్ల వణికించు
రాజ కీయ మంత బూజు పట్టె!

49. జనులురణముసలిపి జాతరగావించె
నేత కదల కుండ నేలనిలిపి 
రాజు చేయు హామి  రాయించెపేపర్లొ
రాజ కీయ మంత బూజు పట్టె!

50. విద్య నేర్చిమేధ  విడిచెను రాజ్యము 
విద్య లేని నేత విర్రవీగి
రాజ కీయ మందు రానించు చుండెను
రాజ కీయ మంత బూజు పట్టె!

51. మాటతప్పినోళ్ళు మరలగెలువకుండ
పార్టి లన్ని కలిసి పాగవేస్తె 
జయము నిక్క మనియు జనమంత చూస్తుండ్రు 
రాజ కీయ మంత బూజు పట్టె!

52. కల్ల బొల్లి  మాట  కథలుగా చెప్పియు 
భూమి ఇల్లు  నీయ  బుజ్జగించి 
కార్య కర్తనొంచె కర్కోటక ఖలులు  
రాజకీయ మంత బూజు పట్టె!

53. దీపముండ గానె  దిద్దుకోవలెనని 
దోచి దాస్తు  యుండె దొరక కుండ 
మళ్ళి ఎన్నికపుడు  మళ్లిస్తూ నుండిరి 
రాజకీయ మంత బూజు పట్టె!

54. ఓటు బ్యాంకు  కొరకు  ఓటర్ల కూర్చియు 
హామి యిచ్చె   ప్రజ లడిగి నంత 
ప్రతి ఫలము కోరి   పథకాలు వేసిరి  
రాజకీయ మంత బూజు పట్టె!






Thursday, December 3, 2020

అన్వేషణ శతకం (తేటగీతి) - 46

                               *అన్వేషణ శతకం*

                                        🌼🌻🌼🌻🌼🌻🌼


01. కొత్త కొత్త పధకములు కొత్త పాట 
జనులకువలలు వేయను జాడ పట్టె 
పధకములసొమ్ము లొచ్చెను ప్రజల నుండె 
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* కొత్త కొత్త పేర్లు పెట్టి ఎన్నో నూతన పధకాలను 
తెచ్చి ప్రజలకు వలలు వేస్తారు.ఆ పధకాల డబ్బుపన్నుల 
ద్వారా ప్రజల నుండి సేకరించినదే.  ఈ యదార్ధాన్ని  
జగతిలోని ప్రజలకు తెలియజేయు , అన్వేషణా!. 

02. ఓటు  వేయండి ఓటర్లు  ఓటు వేయి
అయిదు యేండ్ల కొకపరినే అడుగ మరల
మళ్ళి కనబడుతె అడుగు మరిచి పోకు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* ఓట్లు వేయండి ఓటరులారా!  ఐదేండ్ల కొకసారి
ఎన్నికలు వస్తాయి . మరోసారి అడుగను. మళ్ళీ కనబడితే
అడగండి , ఓటు వేయడం మరిచి పోకండి .

03. రాజ్యమునుపొందుటకొరకు రణము చేసె
ఏడు పదులును దాటిన  ఏదొ ఆశ   
నేత దోచిన సొమ్ముకు నెపమె లేదు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* స్వాతంత్య్రం  సాధించడానికి , ఎంతో రణంచేశారు.
 ఎంతో మంది వీరమరణం పొందారు . స్వాతంత్య్రం  వచ్చి 
ఇప్పటికి  డెబ్బది ఏడు యేండ్లు దాటినా ఏదో ఆశ  . నేతలు 
దోచి, దాచిన  సొమ్ముకు  తప్పు లేదు. (అవినీతి సంపదను  వెను 
వెంటనే కనిపెట్టి  ప్రజలకు తెలిపే టెక్నాలజీ గాని, యంత్రాంగం 
గాని , మన దేశంలో  ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు . చెందినా 
కనిపెట్టరు.)
 
04. నేత కూడబెట్టాడని నెపము వలదు
మాట నిలుపని నేతను మరల పిలువు
జనులు నైఖ్యముగానుంటె జయము కద్దు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* నాయకులు అవినీతితో దోచి దాచారని అపోహలు వద్దు. 
ఖచ్చితమైన ఆధారాలు గుర్తించ లేనపుడు నెపం వేయవద్దు. 
ఎజెండాలో పెట్టిన అన్ని హామీలను నిలబెట్టుకోనప్పుడు, ఎంతటి 
నేతలైనా సరే,  ప్రజలు వారిపై వత్తిడి తెచ్చి వారు రాజీనామా చేసే 
వరకు పోరాడాలి. ప్రజలు ఐక్యంగా ఉంటే విజయం తప్పకుండా 
ప్రజలచే అవుతుంది.(అప్పుడే వారు తరువాతి కాలంలో గాలి 
హామీలను ఎజెండాలో పెట్టరు. అబద్ధాలు చెప్పరు.)
 
05. పన్ను కట్టేది నొకరైతె పండుగలను
చేసుకునుమరొకరనుట చేదు నిజం
ఎవరు నుచితమునిచ్చిన  అవరు వృద్ధి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* పన్నులు కట్టేది ఒకరైతే , ఫలాలను అనుభవించేది 
మరొకరనేది పచ్చి నిజం. ఏది ఏమైనా ఉచితాలు అనేవి ప్రజలను 
కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఉపయోగించుకుని ,వారిని 
సోమరులుగా  మార్చడానికే ఉపయోగపడుతాయి తప్పా, ప్రజలు 
అభివృద్ధి చెందరు, దేశం అభివృద్ధి చెందదు.
 
06. గ్రేటరుఎన్నికలెల్లను గెలువ యెంచి
డబ్బు దండిగా పంచిరి డాబు సరిగ
చట్ట మెపుడు కొందరి చుట్ట మేను
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

*భావం:* జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలలో గెలవడానికి , విచ్చల విడిగా 
డబ్బు పంచిరి. ఎదుటి పార్టి,  డబ్బుపంచు తుండగా  దొరకబట్టినా 
కేసులు బుక్ చేయలేరు, ఆ నేత నామినేషన్ రద్దు చేయలేరు.

07. ఓటు వేయండి  దండము ఓటు వేయి 
ఓటు కావాలి బాబులు కాటు వేయ 
అయిదు యేండ్లకొకపరినే  అడుగ మరల 
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

08. అనువు గానిచోటనెవరు అడుగిడొద్దు
దుష్టులన్నవారలకును దూర ముండు
మర్రి చెట్టుకింద మొక్కలు  మాడి  పోవు .
కాంచు మన్వేషణా!యిది  కలియుగంబు

*భావం*: మనకు అనుకూలంగా లేని చోటికి వెళ్ళకూడదు. 
అలానే మనకు నచ్చని వారికి దూరంగా ఉండాలి. మర్రి చెట్టు 
కింద ఎలాంటి మొక్కలైనా యెదగవు. చూడు అన్వేషణా! 
యిది కలియుగము 

09. ఎన్నికలుఎన్ని జరిగినా ఏమి ఫలము
మంత్రులెందరు మారినా మార్పులేదు
జమిలి ఎన్నికలైనను మార్చునేమొ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

10. కులభవనములనంగానె కూడి పోయె
మరల ఎన్నికలవరకు మరిచి పోవు
కులము పెద్దలకు తెలిసె కూర్మి యెంతొ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

11. బంధువులునందరొకటైన బలము పెరుగు
చాత్తద శ్రీ వైష్ణవులంత కలిసి పోయి
అహము వీడిన నభివృద్ది అదిరి పోవు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

12. అడుగడుగునవైష్ణవులేను అర్చకుండ్రు
బంధు వర్గాల్లొ ఈర్ష్యలు పాయకుండె
అహము వీడిన నగుపడు యసలు శక్తి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

13. వృద్ధ తలిదండ్రినిమరిచె  బుద్ది లేక      
ఆస్తి  పంపకం నాడొచ్చి ఆరవ బట్టె  
కాకులకునేమి పెట్టినా కర్మ పోదు  
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు

 *భావం*:  తల్లి దండ్రులు  వృద్ధాప్య  దశలో  కష్టంగా  
జీవిస్తున్నపుడు  మరిచిన కొడుకులు , వారు చని   పోయాక , 
కాకులకు  పరమాన్న భోజనం పెట్టినా,  ఆర్భాటంగా బంధు 
మిత్రులకు విందు భోజనాలు పెట్టినా చేసిన  
పాప పుణ్య కర్మలు  మారవు కదా .

14.  మనిషి బతికున్ననాడేమొ  మాట రాదు 
అర్ధ రాత్రియు వరకును  అరుచు కొనిరి 
మనిషి మరణించి నంతనే  మరచి పొగడె
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు

15. యెల్లరెసులను తొలగించ  యెల్లవేల 
నడ్డు పడిరి జనులు  నాన్చ  కుండ
సర్కరుదిగొచ్చి పన్నుల  చక్క బెట్టె  
జనులు నందరు  కూడియు  జయహొ ననిరి
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు 
      
16.  యేడ  పుట్టాననియుగాని  యేడ పెరిగె 
ననియు గర్వించ, నరులును  నష్ట పోవు   
బురుద లోపుట్టి  తామర   బురుద  లోన 
పెరిగి చేరును విష్ణువు   వేకు జాము 
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు 


17. అవసరమునకును   ఆప్తులు అప్పుఇచ్చె
వడ్డి ఎంతైన యేమని  వాడు కునిరి 
వాయిదాలు కట్టమనియు  వాత పెట్టె 
అప్పు కట్టలేక జనులు  అసువు బాసె 
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు  


18. కీచక కరోన  బయటుండ కిటికి పెట్టె
మరల కాటేయు ననుకుని  మార కుండె 
వాగ్జినొచ్చిన వార్తలే   పాక కుండె 
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు  


19. అప్పు యెగకొట్టవచ్చని ఆట ఆడె
ఊరికనెఅప్పు ననుకుంటె  వుచ్చు బడెనె
డబ్బు నంతకుటుంబాల మబ్బు చేసె 
అప్పులన్నిపురికొలిపె ఆత్మ హత్య 
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు

20. రాక్షసుడికైన నేర్పొచ్చు  రాగములను
 పెద్ద పులినైన  యింటిలో  పెంచ వచ్చు
అహము నున్నవారినెవరు  అలుము కోరు  
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు 

21. ముసలి ముసలని హేళన  మూర్ఖు కేల 
ముసలి కానివారెవరయ్య   ముందు చెప్పు  
జనని జనకులే ముసలయ్యె  జన్మ నిచ్చి   
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు 

22. పర మతస్థుల విగ్రాలు  పగుల గొట్ట
నీచ పనియేనెవరికైనా నిజము యిదియు
కోటికొకరుండవచ్చునె  కోతి పనికి
వెతికి శిక్షించ నినదించు వేరు పడక      
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
  
23. పెళ్లి బోజనాలకనియు  పెద్ద పిలిచె
సబ్బు  శానిటైజరులేమొ చాల కుండె
కడుగ  వీలును గాకనే   కడుపు నింప
రోగపుకరోన  తగిలియు  రొప్పు చుంటి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు

24. పండితులనిపామరులని ,  పలుచ బడక  
పాప పుణ్యమెంచకరోన,  పడగ విప్పె
దాన గుణులను నెరుగక  దాడి చేసె 
కాంచు మన్వేషణా! యిది కలియుగము 


25. మంత్రు లెందరుమారినా  మనిషి నతఁడె 
యికను  మారేదెటులనయ్య  యిట్టి తీరు  
కార్మికుల నేత వృత్తుల  కాల గతియు  
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు 


26. నాదె గొప్పకులమునని నాదె గొప్ప
ననియు తగవులాడిరినిల నాన్న కులం
యేది నయితేను నదియేను యెల్లరకని  
అమ్మ నవమాన చేయుటేల అవని లోన
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


27. రాక్షసుడికైన రాగాలు  నేర్పవచ్చు
పెద్ద పులికైన పాఠాలు  చెప్పవచ్చు
అహము  నున్నవారినెవరు  అలుము కోరు  
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
 

28. ఆవు లావులు పోట్లాడి అలసి పోయె 
దూడ కాళ్ళువిరుగుతేను పేడ బెట్టె 
జ్ఞాని జ్ఞానులు పోట్లాడి బాణి మార్చె 
నరులు ఏమిచేయనులేక నలుగు తుండె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


29. అన్న దమ్ములనుగలుప అక్క తలచి 
పనులు విడిచియు తిరుగుతూ పాగ వేసె
కడుపు నొకటేను అయినను నడిచె వేరు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు  



30. పసిడి దిమ్మెలతోటియు భవనముండె
ధన ధాన్యము లెన్నియో  దండి గొచ్చె
పాప మోసాలు పెరిగియు  పక్వ మయ్యి  
పాలు పోలేక ముక్కులో  పయిపు లేసె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


31. ప్రాణ మెల్లునపుడుయేమి పట్టు కెల్ల
వీలు కాదునెవరికిని  వినుడు నరుడ
వున్న దానిలో కొంతైన దాన మివ్వ
మేలు జరుగును జగతిన యెల్ల వేళ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు 


32. అమెరికాకుజోబైడను నయ్యె పెద్ద
బాగుపడగలమనిఆశ  పడిరి జనులు
మంచి నిర్ణయములతోడ మనుగడుండ
ప్రజలు మెచ్చుబరోసాలు పలికె మొదట
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


33. పురుషు లందున పుణ్యాత్మ  పురుషులుండు
పడతు లందున సుగుణాల పడతులుండు
తప్పు లుండునందరిలోన తప్పకుండ
కలుపుకునిపోవలె యిలన కలసి యుండ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


34. మనుషులప్రేమలన్నొక మట్టి ముద్ద
నీటిలో వేసినకరగు నిక్కముగను
అవసరాలకు వాడేటి ఆయుధములు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


35. వ్యాక్జి నొచ్చెను ననగానె వారియర్సు
ముందు యుండితీసుకునిరి మురిపెముగను
జనులలోగొడవలుయెన్నొ  జాస్తి యాయె
మరొక యేడాది కరొనున్న మంచిగుండు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


36. కష్టములనుండె యెదిగేరు యిష్టముంటె
దారి చూపును బాధలు ధరణి చేర
నిగ్రహముతోడ బైడను నిలిచి గెలిచె 
అమెరిక మెజారిటి జనుల  అండ తోటి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


37. కులము కులమని నేతలు కుట్ర చేసి
సొంత లాభము కొరకును పంతమెంచి
బంధు జనులను భయపెట్టి బాసటించె
అన్య కులస్థుల పెళ్ళాడి ఆడు కుంటు
సంఘమొకటియు సంసార సార మొకట?
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


38. ఇంట్లొ ఇతర కులస్థులు  కంట్లొ నలుసు    
బయట సూటు బూటులతోను  వాదు లాడు
ద్వంద నీతిగల జనులు  ధరణి చేరె
కులపు బంధువు నెడబాపు కుటిలు రొచ్చె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


39. మనిషి నెప్పుడో  నొకనాఁడు మట్టి  కలియు 
మహిలొ నున్నంత  కాలము మంచి గుండు  
మోస పనులను  చేయక  మోక్ష మొందు
నిత్య మెల్లను  నీకీర్తి  నిలిచి పోవు 
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు 


40. మోసముంజేయు గుణమునీ   వ్యసన మైన
తప్పు చేస్తూనె  నుందువు  తప్ప కుండ
దొరికెదవు నీవు నెప్పుడో   తోలు తీయు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు 


41. యేండ్ల  కొద్ది యున్నామని  యెన్నొ చెప్పి
మొన్న వచ్చిన వారని   మోకు వేసె
ఎన్నియొ కలహాలేతప్ప  ఏమి చేసె  
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు 


42. విద్య అందము నుందని విర్ర వీగు
ధనము నధికారముందని  దాడి చేయు
కులము గొప్పల చెప్పుచు కుట్ర పన్ను 
కాటి కడనందరుజనులు  కలిసి పోవు
కాంచు మన్వేషణా!యిది  కలియుగంబు


43. కన్న బిడ్డల బాధ్యత  కాన కుండ 
కన్య దానము విషయము కడకు పెట్టి
దేశ ముద్ధరించ బయలు  దేరె నేత
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


44. పూట పూటకు బొచ్చెతో  లోట తెచ్చి
బొచ్చెలోనొక చోటను బొజ్జ నింపె
లోటతోమరో చోటున మాటు వేసె
కలుశితముచేసెసంఘాన్ని కలువ కుండ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


45. కంప్యుటరుయుగమందున కల్లునమ్మ
ఆర్డరులులాపుటాపులో ఆగకుండ
తాటి చెట్టుపైనే చూడ  దలిచె తాత 
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు


46. నీతులెందరో చెప్పేరు నిత్యమెల్ల
వినయమువిధేయతలనెన్నొ విశద పరుచు
తాను పాటించ నవియే తరము కాదు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు