సీస పద్యాలు - లిరిక్స్ - ఛందస్సు
సీ.ప :
గణతంత్ర పర్వము గాడితప్పెనయేమి
విజ్ఞులు యెందరో విస్తుపోయె
దేశముందైక్యత దేశములోభక్తి
పెంచేటి పండుగ బెట్టు చేసె
స్వాతంత్రమునొకటి చక్కని గణతంత్ర
పండుగలునిలన రెండెరెండు
వంకలు పెట్టుచు బింకము పోయిరా ?
భారత నాదేశ భక్త్తులార
ఆ.వె :
కట్టెమోపునైన గట్టిగున్నను చూడు
దేశభక్తిపెంచ ధీమగుండు
జనులత్యాగగుణమె జాతికి రక్షణ
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
రాజ్యాంగ బద్ధుల రచ్చకీడ్చతగదు
కక్షలు సాధించ లక్షమొద్దు
భాషమనుషులకు భూషణమవ్వాలి
నేతసభ్యపుమాట నిలిచిపోవు
జడ్జీలనెప్పుడు జనులుయెన్నుకునరు
ధర్మమే కోర్టుల మర్మమెరుగు
యెన్నుకుననివారు మిన్నకుండునెటుల
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
బలమునున్నదనియు గళముపెంచుటమాని
విద్యనేర్చినటుల వినయముండు
ధనమునెంతయున్న గుణము పెంచుటమేలు
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
మోసపోతూనుంటె మోసగించెడివారు
పుడుతునే నుందురు పుడమి లోన
లక్షకోట్లను ముంచి లక్షణముగనుండె
వ్యాపార ముసుగులో వలలు వేసి
చితగగొట్టె దేశంలొ షేరుహోల్డర్లను
గొప్పచే మార్కెట్లు కుప్పగూలె
ఆస్తులన్నియునమ్మ నప్పులుతీరవు
నేతల ధీమతో ఖ్యాతి పోయె
ఆ.వె :
మోస పుచ్చియుంటె దాగలేరెవ్వరు
ఉచ్చులోన చిక్కు నురిని యెక్కు
పుచ్చకాయ యంత పుత్తడున్ననునేమి
కచ్చకాయయంత మచ్చ యున్న
సీ.ప:
సత్యాగ్రహము చేసి సాధించె బాపూజి
స్వాతంత్రఫలములు సాగకుండె
గాంధీజీ కలలన్ని కల్లలుగ మిగిలె
పేదలకు ధరణి పేరుకేను
జరిపేరు వర్ధంతి మరువకుండనునేడు
అశయాలమలుకు యావలేదు
కలిసిభోంచేస్తుండె కడుపునింపుతునుండె
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె:
పేద సాద మేధ భేదము లేకుండ
పోరుసలుప తప్ప తేరుకోరు
గడులపగులగొట్ట కరములు కలుపాలి
కృష్ణమాటవినుము తృష్ణదీరు
సీ.ప :
ఎంతటి చిత్రము యేమివిచిత్రము
విస్తుపోతుండిరి వినుచు జనులు
కమిలిపోతుండిరి కనులార చూసియు
ఎంతటరాచకం యేమి తృష్ణ
అధికారమండతో నందనంతకుచేర
నేడుప్రజాస్వామ్య నడ్డివిరిచె
చట్టాలు పాలక చుట్టములుగమారె
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
రాజ్యమందువింత రాజులేలుతునుండె
జనులు ప్రశ్నలేయ జంకుతుండె
తెగెవరకునులాగ తేల్చేరు వోటర్లు
కృష్ణ మాటవినుము తృష్ణ దీరు
సీ.మా :
రామానుజులవారి రమ్యమార్గమునెంచి
చాత్తాదకులమును సంస్కరించ
అవతరించినగొప్పనాత్మీయబంధువు
పేదల పోషించే ప్రేమ తోటి
యెన్నొడుదొడుకులు యిబ్బంది పెట్టినా
పట్టును వీడని గట్టివారు
సంఘభవనమును సాధించె ఘనముగా
బంధుజనులుయెంతొ సంతసించె
ఆకాంక్ష నెలకొల్పి అన్నదానముచేస్తు
వేణు మాధవుడిగా వెలుగు నొందె
ఆ.వె :
పేదగానెపుట్టి ప్రేమను పంచిరి
ఆలియండదండ కలిసివచ్చె
పేరు కీర్తి డబ్బు పెరుగుతున్ననునేమి
గర్వమెపుడు లేదు కరుణతప్ప
సీ.ప :
నేటి కాలముకంటె నాటికాలమెమిన్న
నేతలలో నాటి నేత యేడి
ఏడు పదులు దాటె యేముంది చెప్పను
ధనికులు గొప్పగా ధనికులాయె
పేదలు మరియింత పేదలగుచు నుండె
నేతలంత నేడు నేకమైరి
పేదతనము కాదు పేదలననిచేసె
రాజీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
రాజకియ లీల రాజ్యమేలుతునుంటె
ఓటరును దొరనుట వొట్టి మాట
నోటు నిచ్చి జనుల వోటును కొనడము
నేత కిపుడు వింత నేమి కాదు
సీ.ప :
యోగవిద్య జనుల యోగ్యులన్ జేయును
మునులుఋషులనెల్ల మోదమొందె
నిత్యముయోగను నియమంగ జేసిన
ఆరోగ్యముండును మర్మమెరుగు
శ్వాసమీదధ్యాస సాగించు సక్రమం
ఆయుఃప్రమాణము మధిక మగును
ఆసనములతోటి యలసట నుండదు
భారతీయులకెల్ల భవిత యోగ
ఆ.వె :
పద్మయాసనమును పద్దతిగేసిన
మనసు తేలికవును మదిని నిండు
బుద్దిపెరుగు మేనునొద్దికనుండును
సర్వరోగములును సన్నగిల్లు
సీ.ప :
ఏమిటీ వింతలు యేమిటీ పంతాలు
ఒకరిని మించియు నొకరు దాడి
ప్రజల విషయములు ప్రక్కకు నెట్టిరి
అభివృద్ధి నంతయు నటకనెక్కె
విద్యయు వైద్యంబు నందని ద్రాక్షాయె
మద్యము కబ్జాలు సాధ్యమాయె
ఎవరివ్యవస్థలు యెవరివీ భోగాలు
జనుల సొమ్ములు తింటు జలగలయిరి
ఆ.వె :
పదవి యున్నవరకె నధికార మనుటను
తెలుసుకొనడు నేత తీరు మార్చ
దోచినంతసొమ్ము చూచిమురుస్తుండు
కాటి వరకు రాదు కంచ మైన
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు
సీ.ప:
దేషభాషలనందు తెలుగులెస్సయనిరి
దేవరాయలు నాడె దివ్యముగను
నన్నయ తిక్కన పిన్నలు యెర్రన
కావ్యముల్ రచియించె కనుల కింపు
తెలుగు తీయదనము తెలియని వారేరి
దేశదేశాలందు తెలుగు వారు
మాతృభాషనుయెంచి మనుగడ సాగించే
అమ్మ నోటన వచ్చు కమ్మనైన
తెలుగు భాష జనుల్లొ వెలుగులు నింపగా
దేశ ప్రతిభ నేడు తెలిసె జగతి
ఆ.వె :
పాలవెల్లి వలెను పరుగులెత్తి తెలుగు
విశ్వ మంత భాష విస్త రించె
తల్లి జన్మ నిచ్చి తాపించి నట్టిది
మాతృభాష యుంటె మనుగడుండు
సీ.ప:
అర్థము లేకుంటే వ్యర్ధమనితలచి
సాధించె కార్యము చనువు తోటి
ఇంతింతగుచు వటుడింతయినటులను
మనుగడకునతడు మచ్చ తెచ్చె
లక్షల నుండియు లక్షలకోట్లకు
యెదిగి బిలియనీరై వొదిగి ముంచె
ఆర్ధిక వ్యవస్థ నతలాకుతలమాయె
షేరుహోల్డరులంత బోరు మనిరి
ఆ.వె:
ఎంత తెలివి యున్న యెంతబలముయున్న
కాల మెవరి చెలిమి కాదు నెపుడు
పాప మేదొ రోజు పండక మానదు
కట్టు కథల కికను కట్టుబడరు
సీ.మాళిక:
దేషభాషలనందు తెలుగులెస్సయనిరి
దేవరాయలు నాడె దివ్యముగను
నన్నయ తిక్కన పిన్నలు యెర్రన
కావ్యముల్ రచియించె కనుల కింపు
తెలుగు తీయదనము తెలియని వారేరి
దేశదేశాలందు తెలుగు వారు
మాతృభాషనుయెంచి మనుగడ సాగించె
అమ్మ నోటన వచ్చు కమ్మనైన
తెలుగు భాష జనుల్లొ వెలుగులు నింపగా
దేశ ప్రతిభ నేడు తెలిసె జగతి
ఆ.వె :
పాలవెల్లి వలెను పరుగులెత్తి తెలుగు
విశ్వ మంత భాష విస్త రించె
తల్లి జన్మ నిచ్చి తాగించి నట్టిది
మాతృభాష యుంటె మనుగడుండు
సీ.మా:
నీటి బుడగయేను నెవరిజీవముయైన
ఏది తోడుగరాదు యెవరుకూడ
జననము నుండియు ఖననము వరకును
ఈర్ష్యలు ద్వేషాలు స్వార్ధ మహము
కోపాలు తాపాలు కోట్లకు పడగలు
కక్షసాధింపులు కడవరకును
పాపాల మోసాల పరుగులతో జనుల్
ఆస్తుల కొరకును కుస్తి పట్టె
పసుపురాయనువచ్చి పళ్ళెరములముందె
బావమరిదియేమో ప్రాణమిడిచె
ఆ.వె:
జన్మలందు మనిషి జన్మగొప్పది యెంతొ
పుణ్యజీవికొచ్చు జన్మ నిలన
కోపతాపమిడిచి కొంతమేలును చేయి
పాపమోసములకై పరుగు మాను
సీ.మా :
ఓడలు బండ్లగు బండ్లుఓడలగును
నన్నట్లు నాదాని నష్టపోయె
బిలియన్ల సంపద మిలియన్ల కొచ్చెను
మోసపుచ్చినసొమ్ము మునిగిపోయె
పేకమేడవలెను తోకచుక్క వలెను
నెలల వ్యవధిలోనె నేలకొరిగె
అధికార బలముతో నందల మెక్కియు
విస్తరించిరి సంస్థ వేగముగను
దేశవిదేశాల్లొ విశ్వమునంతయు
ఓడల రేవులు రోడ్డు పోర్టు
గ్రీను యెనర్జీలు గ్రేటు ట్రాన్సుమిషన్లు
ఎన్నియో మరియెన్నొ యెన్ని యెన్నొ
ఆ.వె :
పరుగు లెత్తు కుంటు పాలను త్రాగుట
కంటె నిలిచి యుండి గంజి తాగ
మేలు కలుగు జనుల మెప్పును పొందేరు
పరువు పోయినంక మురువనెటుల
సీ.ప:
ఎవరిని చూసినా ఏముంది గర్వము
ఒకరిని మించియు నొకరు నుండె
రాజ్యసంపదలను భోజ్యము జేసిరి
ఒకరియండతొనిమ రొకరు యెదిగె
జనుల మభ్యపెడుతూ జగతిని యేలుతూ
పేదప్రజలనుచు ప్రేమ చూపి
ప్రజలసొమ్ములనన్ని పక్కగా దోచిరి
అధికారముకొరకు నడుగు వేయ
ఆ.వె:
ఎంత దోచ నేమి యెంత దాచిననేమి
కన్ను మూయు రోజు కన్న కొడుకు
తల్లిదండ్రిభార్య తాకను భయపడున్
ఇల్లు వెల్ల గొట్టు నిల్వ కుండ
సీ.ప :
సత్యము సత్యము సత్యము సత్యము
నిజమిది నిజమిది నిజముయిదియె
ధనముకు యెందరో దాసులుయయ్యేరు
డబ్బుతో లోకాన్ని గబ్బు జేసె
విలువైన కాలము వెక్కిరించుతునుండె
చట్టాలు ధనికుల చుట్టమాయె
లాయర్ల పెట్టియు మాయలు జేసిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
గడబిడలునుయన్ని దడిలోకి చేరగా
ప్రజలు మునిగిపోయె పనుల లోన
ధనము యుంటె నన్ని దరిచేరు నీకైన
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప :
అతనొక కెరటము యవనికే మకుటము
చిరుధర హాసుడు సిరుల మోము
సాహితీ సృష్టిలో సహనసీలకుడును
ఎన్నియో కావ్యాలు యెన్ని కళలు
గద్యాలు పద్యాలు ఖండాలు దాటగా
విశ్వ జనులనోట వీడ కుండె
బిరుదులు నెన్నియో పిలిచియునువరించె
హనుమాజి పేటకే హారమాయె
తే.గీ:
తల్లి బుచ్చమ్మ లాలన తరుగకుండె
తండ్రి మల్లరెడ్డి తపన తనివి తీర్చె
ఘనత విశ్వంభర రచన గగనమంటె
జ్ఞానపీఠలభ్యుడతడే జ్ఞాని వలన
జయజయసినారె! కవిరేణ్య జయము నీకు
సీ.ప :
యేదున్న నీదైతె యెప్పటికి కాదు
యెంతున్న నీవెంట యేమి రాదు
ఆరడుగుల నేల యదియేను నీయాస్తి
ఆ కట్టెల పరుపే యికను దోస్తి
నీవొంటి బట్టలు నీడబ్బు కట్టలు
వచ్చెనా మానవా సచ్చినంక
ఒంటర్గ వస్తవు నొంటర్గ పోతవు
ఒట్టిచేతులతోటె మట్టి లోకి
ఆ.వె :
బ్రతికియున్ననాళ్ళు బాధలో నుంటవు
ఎగిరెగిరిపడతవు యెందుకయ్య
బ్రతుకునిత్యమంత భాద్యత భారము
చాలునికను జూపు జాలి కొంత
సీ.ప :
నేతల పాలన నెరుగక నుంటిమి
పాలించునప్పుడు పాడు నొకటి
ప్రతిపక్షములొనున్న పాలక పంచనే
రాల్చిరి కన్నీరు రాసె లేఖ
వ్యవసాయచట్టాలు వర్ధిల్లవలెనని
నేడుచాటుననుండి నీరు గార్చె
జనుల వోట్ల కొరకు జాలిని చూపిరి
స్వార్ధనేతలవల్ల సాగిలబడెవృద్ధి
తే.గీ:
నేత దుర్భుద్ధిని జనులు నిగ్గు తేల్చి
కుటిల నైజపు వారల కుత్సితములు
కట్టడినిజేయ నైదేండ్ల కాలమంత
మేధనెన్నుకొనవలెను మేలుజేయ
సీ.ప :
గ్యాసుధరలు పెరి/గాయని గగ్గోలు
పెట్టిరి నేతలు గట్టిగాను
డబలు పెర్గిందని డప్పుచాటిస్తుండె
రెండునెలలు వచ్చు బండనొకటి
పెట్రోలు పన్నులు పెరిగె వేలకువేలు
ఇంటి పన్నులుయేమొ మింటినంటె
విద్యుత్తు బిల్లులు విస్తుగొలుపుతుండె
అడుగలేకుండిరి బడుగు జనులు
ఆ.వె :
పేద నరుల చేత పెగ్గులు పట్టించె
ఉచితపథకములని నుచ్చువేసి
కాళ్ళు చెయ్యి నోరు కదలకుండనుజేసె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
పిట్టేమొ కొంచెము మాటలేమొ ఘనం
మాయజేయను మచ్ఛ మరుగు పడదు
కళ్ళు మూసుకొనియు పిల్లిపాలనుతాగె
నన్నట్లు నాయకుల్ నడుచు కునిరి
చెప్పినవే చెప్పి చెవుల తూట్లు పొడిచె
తప్పులెన్ను ఘనులు తమదెరుగరు
సత్యమెప్పటికిని సత్యమే నుండును
ధర్మమెప్పటికిని ధర్మమేను
ఆ.వె :
పనులు ఏమి లేక పశువుల పండ్లను
తోమినట్లు మూర్ఖ దుష్టు లిపుడు
తల్లి భార్యకేమొ పోల్చి నటనజేసె
నిత్య భాద మరిచి నిక్కుతుండె
సీ. ప :
ఆవు గోమాతగా నందుకునునుపూజ
హిందువులెల్లర బంధువావు
ఆవులిచ్చెడి పాలు నమృతముగానుండు
ఆరోగ్యమునుపెంచు నౌషదముగ
గోవుమూత్రంబును గోమాత పేడను
గృహశుభ్రత కొరకు కోరు జనులు
కల్లాపు జల్లను కలిపి పిడకజేయ
శుభకార్యములనందు శుద్ధిజేయ
ఆ.వె:
గడ్డి మేయు గోవు ఘనసేవలందించు
భూమి దోచి నేత పొట్టకొట్టు
మాట మార్చి జనుల మచ్చికజేసేరు
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీస.మాళిక :
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ. ప :
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప :
నేతల కొనుగోళ్ళు నిలన కొత్తనయేమి
కాంగ్రేసు కమ్యునిష్ట్ కాలమందు
నుండియునున్నదే నొచ్చుకునతగునా
నేడున్న మంత్రులు నేతలంత
వలసలు వచ్చిన వారేను జనులార
కోర్టుల్లొ కేసులు కొట్టుకునుడు
న్యాయవ్యవస్థల నాడుకోవడమేమి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద నరుల ముంచి పెంచిరి సంపద
పైసలుచితమిచ్చి పైవిదాచి
కొనిరి విదేశాల్లొ కొత్తగా భూముల
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
భారత రాజ్యాంగ భాద్యత గుర్తించి
ఘనబాబ సాహెబు గర్వముగను
దేశదేశములందు దేశాధి నేతల
సంప్రదించెనుతాను సాధరముగ
రాజ్యాంగ డ్రాఫ్టుల రాజ్యాధి నేతలు
యివ్వగా కమిటీని యెర్పరిచియు
అధ్యక్షుడాయెను నంబేద్కరుడొకడే
రచియించె రాజ్యాంగ రచన నంత
ఆ.వె :
నాటి చట్టములకు నాయకులెల్లరు
సవరణలుజరిపిరి చట్టసభలొ
ప్రజల సంపదలను పంచుకు తినుచుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
ఆ.వె :
డబ్బు/యాస/ పెరిగె/ డాబుస/రితనంబు
జనుల /లోన నదియె /జాస్తి /యాయె
ప్రేమ/లుడిగెనిపుడు/ పెంచడం/ సాధ్యమా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
తీరు/ బాటు/ లేక /భారమే /నిత్యంబు
మనిషి/మనిషి/కిపుడు/మాట/కరవు
మూట/ కొరకె/ జనులు /ముచ్చట /పడుతుండె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
శీర్షిక: సంతోషమే సగము బలం
ప్రక్రియ: పద్యాలు: (ఆ.వె)
ఆట /లాడు/ తుండు/ పాట పా/డుతునుండు
మంచి /మాట/ వింటు/ మరువు/ము చెడు
మనసు/ బాగు/గున్న మనిషి యా/రోగ్యమే
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
కాయ/ కూర /పండ్లు/ కాంక్షతో/ తినినను
కడుపు/ నిండు/ నికను/ కలత/ తీరు
సంత/సమున/యున్న /సంపద/లుకలుగు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
శీర్షిక: ధర్మములనెవరు మానరాదు
ప్రక్రియ: పద్యాలు: (ఆ.వె)
జగతి/ యందు/ నధిక/ జనులుజీవించేరు
కులము/ మతము /భాష/ పలువి/ధములు
సాంప్ర/దాయ/ములతొ సంతోషముందురు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
మర్మ /మేమి/ యున్న /ధర్మము/లనెవరు
మాన/ రాదు/ జగతి/ మంచి/యెంచి
భావి/ పౌరు/లకును/ బాటలు/వేయాలి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
ఆ.వె :
జీవమునిక పోసి జీవితంబును నిచ్చు
పేరు పెట్టు నమ్మ పెద్ద చేయు
కష్ట పడుచు తెచ్చి కడుపును నింపును
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
మానవీయతగల మాతయే మాయమ్మ
సృష్టి యందు జనని సృజన గలది
సకల జనులు పొగడ సంతసించునుతల్లి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
సీ.ప :
అబ్బబ్బ పాలన నబ్బురముగనుండె
బగబగ ధరలన్ని బగ్గుమనెను
గబగబ నాయకుల్ గడబిడ రాజేస్తూ
బుస్సుబుస్సుమనుచు బుసలుకొట్టె
దడదడ గూండాలు బడితపూజలుజేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బు లాగె
ఆ.వె :
విస్కివిస్కీయంటు బిస్కీలు తీయించి
గుట్టుచప్పుడుగను గూడుకూల్చి
ఒట్టుపెట్టితట్టి వోట్లను లాగిరి
బిక్కుబిక్కుమనుచు బిగిసె జనులు
సీ. ప :
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
- మార్గం కృష్ణ మూర్తి
సీ.ప :
పండిన ఫలములు పడినట్లు నేలన
ఎండిన ఆకులు వీడు నటుల
పాపాలు మోసాలు పండిన రోజున
దోచినదంతయు పంచు వరకు
తీపిమాటలుచెప్పి తప్పించుకోలేరు
ధనముయున్ననునేమి దానవులకు
విద్యయున్ననువృధా విజ్ఞత లేకుండ
బ్రతికున్న జనులకు భారమేను
ఆ.వె :
పుట్టువారునెపుడొ గిట్టక మానరు
దోచిదాయుధనము దొంగపాలె
హంసలాగ బతుకునయిదేండ్లయినగాని
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
అధికార పార్టితో యవినీత్కి పాల్పడ్డ
ప్రతిపక్ష పార్టిలో పలుకు లేవి
ప్రజలముందర వీరు పబ్బము గడిపేరు
కాలయాపనచేస్తు కసురు కునిరి
పాలకులనెపుడు, ప్రశ్నించకుండను
చేరిపోయిరివారు చెప్పకుండ
దోచుతూ నాయకుల్ దోబూచు లాడిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
గడిచెనైదుయేండ్లు కనబడలె జనులు
మరల నరుల మొక్క మాట మార్చ
ఓటునడుగ వచ్చె నోటుపట్టుకొనొచ్చె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప:
నివసించ గూడేది నిరుపేద బిడ్డకు
విల్లాలు నేతకు విస్తు గొలుపె
జిల్లజిల్లాకబ్జ జిగజిగేల్ మనుచుండె
చట్టాలెన్నున్ననూ చుట్టమాయె
మతము చిచ్చునులేపె మరుగునపడకుండె
నిత్యమూ గొడవలు నిగ్గు తేల్చ
మేధజనులెవరు మెదలక నుండిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
రాజకీయముంటె రాజభోగమునుండు
పోటితత్వమేది పోరునుండ
రాజ్యమెల్లరైతు రగులుతు నుండిరి
ధరణిపోయెననియు తల్లడిల్లె
సీ.ప :
విధిరాత నెవరును నధిగమించనులేరు
చేయుమోసములను దాయలేరు
నన్నిరోజులెపుడు పున్నములుండవు
అమవాస్యలు కూడ యందు నుండు
చదువులనెన్నియో చదివామనుకున్న
ఫలితము యేమిటి కలతతప్ప
దోచుకుననువచ్చి దొరలులాబ్రతకను
నేర్చిరి నాయకుల్ నేర్పుగాను
ఆ.వె :
మంచి చేయ నెంచు మహిలోన జనులకు
చేతలల్ల చూపు కొంతనైన
పనులు జరుగ కుండె పరువేమొ పోతుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీస.మాళిక :
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
రాజ్యాంగ బద్ధుల రచ్చకీడ్చతగదు
కక్షలు సాధించ లక్షమొద్దు
భాషమనుషులకు భూషణమవ్వాలి
నేతసభ్యపుమాట నిలిచిపోవు
జడ్జీలనెప్పుడు జనులుయెన్నుకునరు
ధర్మమే కోర్టుల మర్మమెరుగు
యెన్నుకుననివారు మిన్నకుండునెటుల
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
బలమునున్నదనియు గళముపెంచుటమాని
విద్యనేర్చినటుల వినయముండు
ధనమునెంతయున్న గుణము పెంచుటమేలు
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
గణతంత్ర పర్వము గాడితప్పెనయేమి
విజ్ఞులు యెందరో విస్తుపోయె
దేశముందైక్యత దేశములోభక్తి
పెంచేటి పండుగ బెట్టు చేసె
స్వాతంత్ర్యమునొకటి చక్కని గణతంత్ర
పండుగలునిలన రెండెరెండు
వంకలు పెట్టుచు బింకము పోయిరా ?
భారత నాదేశ భక్త్తులార
ఆ.వె :
కట్టెమోపునైన గట్టిగున్నను చూడు
దేశభక్తిపెంచ ధీమగుండు
జనులత్యాగగుణమె జాతికి రక్షణ
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
అతనొక కెరటము యవనికే మకుటము
చిరుధర హాసుడు సిరుల మోము
సాహితీ సృష్టిలో సహనసీలకుడును
ఎన్నియో కావ్యాలు యెన్ని కళలు
గద్యాలు పద్యాలు ఖండాలు దాటగా
విశ్వ జనులనోట వీడ కుండె
బిరుదులు నెన్నియో పిలిచియునువరించె
హనుమాజి పేటకే హారమాయె
తే.గీ:
తల్లి బుచ్చమ్మ లాలన తరుగకుండె
తండ్రి మల్లరెడ్డి తపన తనివి తీర్చె
ఘనత విశ్వంభర రచన గగనమంటె
జ్ఞానపీఠలభ్యుడతడే జ్ఞాని వలన
జయజయసినారె! కవిరేణ్య జయము నీకు
సీ.ప :
యేదున్న నీదైతె యెప్పటికి కాదు
యెంతున్న నీవెంట యేమి రాదు
ఆరడుగుల నేల యదియేను నీయాస్తి
ఆ కట్టెల పరుపే యికను దోస్తి
నీవొంటి బట్టలు నీడబ్బు కట్టలు
వచ్చెనా మానవా సచ్చినంక
ఒంటర్గ వస్తవు నొంటర్గ పోతవు
ఒట్టిచేతులతోటె మట్టి లోకి
ఆ.వె :
బ్రతికియున్ననాళ్ళు బాధలో నుంటవు
ఎగిరెగిరిపడతవు యెందుకయ్య
బ్రతుకునిత్యమంత భాద్యత భారము
చాలునికను జూపు జాలి కొంత
సీ.ప :
నేతల పాలన నెరుగక నుంటిమి
పాలించునప్పుడు పాడు నొకటి
ప్రతిపక్షములొనున్న పాలక పంచనే
రాల్చిరి కన్నీరు రాసె లేఖ
వ్యవసాయచట్టాలు వర్ధిల్లవలెనని
నేడుచాటుననుండి నీరు గార్చె
జనుల వోట్ల కొరకు జాలిని చూపిరి
స్వార్ధనేతలవల్ల సాగిలబడెవృద్ధి
తే.గీ:
నేత దుర్భుద్ధిని జనులు నిగ్గు తేల్చి
కుటిల నైజపు వారల కుత్సితములు
కట్టడినిజేయ నైదేండ్ల కాలమంత
మేధనెన్నుకొనవలెను మేలుజేయ
సీ.ప :
గ్యాసుధరలు పెరి/గాయని గగ్గోలు
పెట్టిరి నేతలు గట్టిగాను
డబలు పెర్గిందని డప్పుచాటిస్తుండె
రెండునెలలు వచ్చు బండనొకటి
పెట్రోలు పన్నులు పెరిగె వేలకువేలు
ఇంటి పన్నులుయేమొ మింటినంటె
విద్యుత్తు బిల్లులు విస్తుగొలుపుతుండె
అడుగలేకుండిరి బడుగు జనులు
ఆ.వె :
పేద నరుల చేత పెగ్గులు పట్టించె
ఉచితపథకములని నుచ్చువేసి
కాళ్ళు చెయ్యి నోరు కదలకుండనుజేసె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
పిట్టేమొ కొంచెము మాటలేమొ ఘనం
మాయజేయను మచ్ఛ మరుగు పడదు
కళ్ళు మూసుకొనియు పిల్లిపాలనుతాగె
నన్నట్లు నాయకుల్ నడుచు కునిరి
చెప్పినవే చెప్పి చెవుల తూట్లు పొడిచె
తప్పులెన్ను ఘనులు తమదెరుగరు
సత్యమెప్పటికిని సత్యమే నుండును
ధర్మమెప్పటికిని ధర్మమేను
ఆ.వె :
పనులు ఏమి లేక పశువుల పండ్లను
తోమినట్లు మూర్ఖ దుష్టు లిపుడు
తల్లి భార్యకేమొ పోల్చి నటనజేసె
నిత్య భాద మరిచి నిక్కుతుండె
సీ. ప :
ఆవు గోమాతగా నందుకునునుపూజ
హిందువులెల్లర బంధువావు
ఆవులిచ్చెడి పాలు నమృతముగానుండు
ఆరోగ్యమునుపెంచు నౌషదముగ
గోవుమూత్రంబును గోమాత పేడను
గృహశుభ్రత కొరకు కోరు జనులు
కల్లాపు జల్లను కలిపి పిడకజేయ
శుభకార్యములనందు శుద్ధిజేయ
ఆ.వె:
గడ్డి మేయు గోవు ఘనసేవలందించు
భూమి దోచి నేత పొట్టకొట్టు
మాట మార్చి జనుల మచ్చికజేసేరు
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీస.మాళిక :
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ. ప :
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప :
నేతల కొనుగోళ్ళు నిలన కొత్తనయేమి
కాంగ్రేసు కమ్యునిష్ట్ కాలమందు
నుండియునున్నదే నొచ్చుకునతగునా
నేడున్న మంత్రులు నేతలంత
వలసలు వచ్చిన వారేను జనులార
కోర్టుల్లొ కేసులు కొట్టుకునుడు
న్యాయవ్యవస్థల నాడుకోవడమేమి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద నరుల ముంచి పెంచిరి సంపద
పైసలుచితమిచ్చి పైవిదాచి
కొనిరి విదేశాల్లొ కొత్తగా భూముల
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
భారత రాజ్యాంగ భాద్యత గుర్తించి
ఘనబాబ సాహెబు గర్వముగను
దేశదేశములందు దేశాధి నేతల
సంప్రదించెనుతాను సాధరముగ
రాజ్యాంగ డ్రాఫ్టుల రాజ్యాధి నేతలు
యివ్వగా కమిటీని యెర్పరిచియు
అధ్యక్షుడాయెను నంబేద్కరుడొకడే
రచియించె రాజ్యాంగ రచన నంత
ఆ.వె :
నాటి చట్టములకు నాయకులెల్లరు
సవరణలుజరిపిరి చట్టసభలొ
ప్రజల సంపదలను పంచుకు తినుచుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
ఆ.వె :
డబ్బు/యాస/ పెరిగె/ డాబుస/రితనంబు
జనుల /లోన నదియె /జాస్తి /యాయె
ప్రేమ/లుడిగెనిపుడు/ పెంచడం/ సాధ్యమా
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
తీరు/ బాటు/ లేక /భారమే /నిత్యంబు
మనిషి/మనిషి/కిపుడు/మాట/కరవు
మూట/ కొరకె/ జనులు /ముచ్చట /పడుతుండె
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
శీర్షిక: సంతోషమే సగము బలం
ప్రక్రియ: పద్యాలు: (ఆ.వె)
ఆట /లాడు/ తుండు/ పాట పా/డుతునుండు
మంచి /మాట/ వింటు/ మరువు/ము చెడు
మనసు/ బాగు/గున్న మనిషి యా/రోగ్యమే
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
కాయ/ కూర /పండ్లు/ కాంక్షతో/ తినినను
కడుపు/ నిండు/ నికను/ కలత/ తీరు
సంత/సమున/యున్న /సంపద/లుకలుగు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
శీర్షిక: ధర్మములనెవరు మానరాదు
ప్రక్రియ: పద్యాలు: (ఆ.వె)
జగతి/ యందు/ నధిక/ జనులుజీవించేరు
కులము/ మతము /భాష/ పలువి/ధములు
సాంప్ర/దాయ/ములతొ సంతోషముందురు
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
మర్మ /మేమి/ యున్న /ధర్మము/లనెవరు
మాన/ రాదు/ జగతి/ మంచి/యెంచి
భావి/ పౌరు/లకును/ బాటలు/వేయాలి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
ఆ.వె :
జీవమునిక పోసి జీవితంబును నిచ్చు
పేరు పెట్టు నమ్మ పెద్ద చేయు
కష్ట పడుచు తెచ్చి కడుపును నింపును
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
మానవీయతగల మాతయే మాయమ్మ
సృష్టి యందు జనని సృజన గలది
సకల జనులు పొగడ సంతసించునుతల్లి
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
సీ.ప :
అబ్బబ్బ పాలన నబ్బురముగనుండె
బగబగ ధరలన్ని బగ్గుమనెను
గబగబ నాయకుల్ గడబిడ రాజేస్తూ
బుస్సుబుస్సుమనుచు బుసలుకొట్టె
దడదడ గూండాలు బడితపూజలుజేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బు లాగె
ఆ.వె :
విస్కివిస్కీయంటు బిస్కీలు తీయించి
గుట్టుచప్పుడుగను గూడుకూల్చి
ఒట్టుపెట్టితట్టి వోట్లను లాగిరి
బిక్కుబిక్కుమనుచు బిగిసె జనులు
సీ. ప :
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప :
పండిన ఫలములు పడినట్లు నేలన
ఎండిన ఆకులు వీడు నటుల
పాపాలు మోసాలు పండిన రోజున
దోచినదంతయు పంచు వరకు
తీపిమాటలుచెప్పి తప్పించుకోలేరు
ధనముయున్ననునేమి దానవులకు
విద్యయున్ననువృధా విజ్ఞత లేకుండ
బ్రతికున్న జనులకు భారమేను
ఆ.వె :
పుట్టువారునెపుడొ గిట్టక మానరు
దోచిదాయుధనము దొంగపాలె
హంసలాగ బతుకునయిదేండ్లయినగాని
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప :
అధికార పార్టితో యవినీత్కి పాల్పడ్డ
ప్రతిపక్ష పార్టిలో పలుకు లేవి
ప్రజలముందర వీరు పబ్బము గడిపేరు
కాలయాపనచేస్తు కసురు కునిరి
పాలకులనెపుడు, ప్రశ్నించకుండను
చేరిపోయిరివారు చెప్పకుండ
దోచుతూ నాయకుల్ దోబూచు లాడిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
గడిచెనైదుయేండ్లు కనబడలె జనులు
మరల నరుల మొక్క మాట మార్చ
ఓటునడుగ వచ్చె నోటుపట్టుకొనొచ్చె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప:
నివసించ గూడేది నిరుపేద బిడ్డకు
విల్లాలు నేతకు విస్తు గొలుపె
జిల్లజిల్లాకబ్జ జిగజిగేల్ మనుచుండె
చట్టాలెన్నున్ననూ చుట్టమాయె
మతము చిచ్చునులేపె మరుగునపడకుండె
నిత్యమూ గొడవలు నిగ్గు తేల్చ
మేధజనులెవరు మెదలక నుండిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
రాజకీయముంటె రాజభోగమునుండు
పోటితత్వమేది పోరునుండ
రాజ్యమెల్లరైతు రగులుతు నుండిరి
ధరణిపోయెననియు తల్లడిల్లె
సీ.ప :
విధిరాత నెవరును నధిగమించనులేరు
చేయుమోసములను దాయలేరు
నన్నిరోజులెపుడు పున్నములుండవు
అమవాస్యలు కూడ యందు నుండు
చదువులనెన్నియో చదివామనుకున్న
ఫలితము యేమిటి కలతతప్ప
దోచుకుననువచ్చి దొరలులాబ్రతకను
నేర్చిరి నాయకుల్ నేర్పుగాను
ఆ.వె :
మంచి చేయ నెంచు మహిలోన జనులకు
చేతలల్ల చూపు కొంతనైన
పనులు జరుగ కుండె పరువేమొ పోతుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీస.మాళిక :
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు
No comments:
Post a Comment