మంచి కాల మొస్తుందనీ, మంచి పాలనొస్తుందనీ
****************************************************
పల్లవి :
మంచి కాల మొస్తుందనీ, మంచి పాలనొస్తుందనీ “2″
అందరూ అనుకున్నారు కృష్ణ , కృష్ణా ….
అంత మంచిదేమి కానే కాదు , బాబయ్యా ….
అంత మంచిదేమి రానే లేదు , బాబయ్యా …. “మంచి కాల”
చరణం :1.
నల్ల ధనం రప్పిస్తామని, నరులకు ఇప్పిస్తామనీ “2″
వంద రోజులే గడువనీ , ఒట్టేసుకున్నారు, బాబయ్యా …..
అంతా ఒట్టిదాయి పాయే , అన్నయ్యా ….. “మంచి కాల”
చరణం :2.
ఉద్యోగాలోస్తాయనీ , కొలువులే పెట్టిస్తామనీ “2″
చెత్త ఊడిపిస్తున్నారు , బాబయ్యా …..
అంతా ఊడ్చేస్తున్నారు , అన్నయ్యా ….. “మంచి కాల”
చరణం:3.
ధాన్యము పండిస్తామనీ , ధరలూ తగ్గిస్తామని “2″
భూములన్నీ లాగు తుండ్రీ , బాబయ్యా …..
ధరలన్నీ పెంచుతుండ్రీ , అన్నయ్యా ….. “మంచి కాల”
చరణం :4.
నిలువ నీడ లేక , జనులు అల్లాడి పోతుంటే “2″
భూమి సేకరణకు సభలో , బిల్లు పెట్టిరీ , బాబయ్యా …..
నల్లధనం తెల్లజేయ, పోటీ పడుతున్నారు, అన్నయ్యా ….. “మంచి కాల”
చరణం :5.
పెట్టు బడులనీ , గిట్టు బాటు ఆవు తుందనీ “2″
ఎర్ర తివాచీలేసిరి , బాబయ్యా …..
వారు దేశాన్ని, ఒక్క రోజులోనే ఊడ్చిరి, అన్నయ్యా ……. “మంచి కాల”
( తేది .06.05.2015,న 2.89 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో ఉష్ కాకి )
చరణం :6
జన ధన్ స్కీం అనీ , ఉచిత భీమా అనీ “2″
ఐదు వేల అప్పిస్తామనిరీ , బాబయ్యా …….
నేడు భీమాలకు కాసులు కట్టమనిరీ , అన్నయ్యా …….. “మంచి కాల”
For more Videos , Please watch my YOUTUBE Channel :