SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Monday, November 2, 2020

కృష్ణ జీవిత సత్యాలు-30

 *కృష్ణ జీవిత సత్యాలు*

🌻🌻🌻🌻🌻

01. మాట 
నిలబెట్టుకున్న వారికి
గౌరవమెక్కువ!

వ్రాత 
నిలబెట్టు కున్న వారికి
మనుగడెక్కువ!
     *****

02. మందుల  ఆహారంతో 
శరీరం 
రోగాలపాలయే!

మత్తడి పడుతే 
నీరు వాగులో 
కలిసి పోయే!
     *****

03. చేనుల సక్రమంగా
సాగు చేయక పోతే
బీడులుగా మారు!

పిల్లల సక్రమంగా
పెంచక పోతే
హీనులుగా మారు!
         *****

04. సుఖాలున్నపుడు
నాకెదురులేరెవరనేరు!

కష్టాలు వచ్చినపుడు
నా ఒక్కరికే బాధలనేరు!
           ******   

05. నీతులు 
చెప్పే వారు 
సమాజంలో
99 శాతం!

నీతులు
పాటించే వారు 
సమాజంలో
ఒక్క శాతమే!
     *****

06. మనిషికి 
నీడ 
ఎంత దూరమో!

నీడ
మనిషికి
అంతే దూరం!
   ******

07. వ్యవస్థలు 
ఎందుకు మారడం లేదు అంటే!

బడుగు వారికి
ధైర్యం లేక!

మధ్యతరగతికి
సమయం లేక!

కుబేరులకు  
అవసరం లేక!
      *****

08. విష్ణువుకు 
సాటియయిన 
దేవుడు లేడు!

ద్వాదశికి 
సాటియైన 
తిథి లేదు !
    *****

09. దీపావళి 
జగతిన 
వెలుగునిచ్చు !

చిరునవ్వులు 
మొఖమున 
సంతోషాలనిచ్చు!
      *****
10. కుటుంబం  
కూలడానికి 
ఒక్క క్షణం  చాలు!

కుటుంబం 
నిలవడానికి 
జీవిత కాలం కావాలి!
      *****

11. నీపై నీకు నమ్మకం ఉంటే 
నీవు ఎదుటివారిని 
మార్చ గలవు!

నీపై నీకు నమ్మకం లేకపోతే 
నిన్ను ఎదుటి వారు 
మార్చగలరు!
    *****

12. ఇంటి పేర్లు 
ఒకటే 
అయినంత మాత్రాన 
బంధువులు కారు!

మనుషులందరు 
ఒకటే 
అయినంత మాత్రాన
ప్రయోజకులు కారు!
       ****

13. అతి ఆవేషం
మనిషిని
అనారోగ్యంపాలు
చేస్తుంది!

అత్యుత్సాహం
మనిషిని
అబాసుపాలు
చేస్తుంది!
   *****

14. భూమి 
ఎప్పుడూ తన చుట్టు తాను తిరుగుతూనే
సూర్యుని చుట్టూ
తిరుగుతుంది!

మనిషి
ఎప్పుడూ తన చుట్టు
తాను తిరుగుతూనే
సంపద చుట్టూ
తిరుగుతాడు!
     ****

15. జరిగే పెళ్ళిళ్ళన్నీ
అందం , చందం , డబ్బు ,
పూజలు , జాతకాలు చూసే!

అయినా ,కోట్లాది కుటుంబాలకు
కోర్టులలోనూ లేదా
బయటా గోసే!

మనసులు కలిసిన జంటలకు 
వివాహాలు చేస్తే
వారి జీవితాలు సెలయేరె!
         ******
16. ఇల్లు
ఉన్న వారికి
ఒకటే ఇల్లు!

ఇల్లు
లేని వారికి
అనేక ఇండ్లు!
       **** 

17. ప్రశంసించడం
అలవర్చుకుంటే 
మిత్రులు పెరుగుతారు!

విమర్శించడం
అలవర్చు కుంటే
శత్రువులు పెరుగుతారు!


18. సంపద 
సంపాదించుకుంటూ 
పోయేవారిని
బిలియనీయర్ అంటారు!

సంపద
పంచుకుంటూ 
పోయేవారిని
భగవంతుడు అంటారు!


19. అతి ఆవేషం
మనిషిని
అనారోగ్యంపాలు
చేస్తుంది!

అత్యుత్సాహం
మనిషిని
అబాసుపాలు
చేస్తుంది!


20. ఇంటి పేర్లు 
ఒకటే 
అయినంత మాత్రాన 
బంధువులు కారు!

మనుషులందరు 
ఒకటే 
అయినంత మాత్రాన
ప్రయోజకులు కారు!


21. జరిగే పెళ్ళిళ్ళన్నీ
అంద చందాలు,
జాతకాలు చూసే!

కోట్లాది కుటుంబాలకు
కోర్టులలోనూ లేదా
బయటా గోసే!


22. ఒక అబద్దాన్ని
నిజం చేయాలని 
గద్దించి చెబుతే
నీవు వారికి అభిమానివి
అవుతావు కావచ్చు!

కానీ , వారు 
నీ వలన చులకనై ,
అవమానాల
పాలవుతారు.!


23. డబ్బు పోతే
డబ్బు 
సంపాదించ వచ్చు!

పరువు పోతే
పరువు
సంపాదించ లేము!


24. నా జీవితం 
నా యిష్టం 
అన్నవారు
రోడ్డున పడుతారు!

నా జీవితం
జనుల సంతుష్టం
అన్నవారు
దారిన పడుతారు!


25. ఏదో సాధించు కోవాలనో ,
పొందాలనో స్వార్ధంతో లేదా 
కీడు తలపెట్టాలనే దురుద్దేశంతో 
అకారణంగా పొగడుతూనే 
ఉంటారు.  అలాంటి వారిని 
దూరం పెట్టు!

ఏదో సాధించు కోవాలనో ,  
పొందాలనో ఆశ లేకుండా , మేలు 
చేయాలనే సదుద్దేశ్యంతో  
అడుగడుగునా హచ్చరిస్తూనే 
ఉంటారు. ఇలాంటి వారిని దగ్గరికి 
చేర్చుకో! 


26. దోచిన  వాడి వద్ద 
డబ్బు గుట్టలు  గుట్టలు 
పడి ఉంటుంది!

దెబ్బ తిన్న వాడి వద్ద 
కోపం , ఆవేశం బుసలు 
కొడుతుంది!


27. కొన్ని పదాలను , 
వాక్యాలను 
బట్టి దాని బావం
అర్ధమవుతుంది!

కొందరి పోస్టింగులు ,
ఫార్వర్డ్స్  ను 
బట్టి వారి వ్యక్తిత్వం 
అర్ధమవుతుంది!


28. ఒకటి పొందాలంటే
మరొకటి
దూరమయ్యేను!

నేను కమర్షియల్ గా 
ఉంటానంటే 
కన్న వారు 
దూర మయ్యేరు


29. నిండు  
కుండలో  నీరు 
చిల్లదు!

నిండు 
మనసు గల మనిషి 
గిల్లడు!


30. నీటిలో 
ముద్ద వచ్చు వరకే 
పాకం పట్ట వలె !

మనిషిలో 
సహనమున్నంత  వరకే 
మాట చెప్పా వలె !
 






జనరల్ రచనలు

జనరల్ రచనలు:


త్రేతాయుగంలో , దశరద మహారాజు , కౌశల్య, కైకేయి, సుమిత్ర, రాముడి , లక్ష్మణ, భరత మరియు  సతృజ్ఞుల మనసుల్లో, ఎలాంటి కల్మషం , దురాశ, అహం, అధికార వాంఛలు ఉండవు.  కానీ ,  కేవలం ఒకే ఒక *మందర* కారణంగా రాముడిని, తండ్రి దశరథ మహా రాజు 14 సం.రాలు అరణ్యవాసం పంపిస్తాడు. రాముని కారణంగా సీతామాత, లక్ష్మణుడు అడవికి వెళ్ళాల్సి రావడం, బంగారు మాయ లేడి  పర్ణశాలకు రావడం, దానిని సీతా మాత కోరడం, రాముడు దానికోసం వెళ్ళడం, రావణుడు దేహీ అని వచ్చి సీతను అపహరించడం, రావణ వధ, చాకలి ఏదో చెప్పడం వలన , సీత అగ్నిలో దూకి, పవిత్రతను నిరూపించడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కేవలం *మందర* వలన. 

అలానే, ద్వాపర యుగంలో , కేవలం *శకుని* మాయ పాచికల వలన , నిండు సభలో  ద్రౌపది వస్త్రాభరణ జరగడం, శ్రీ కృష్ణుడు చీర అందించి కాపాడటం, చివరికి మాట ప్రకారం పాండవులు 12 సం.రాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం, కురుక్షేత్ర సంగ్రామం జరుగడం, కౌరవుల సంహరించడం మొ.న వన్నీ కేవలం *శకుని* వలన జరిగాయి. 

కళియుగంలో  కూడా ఇలాంటి వారు ఉన్నారు అని చెప్పడానికే ఈ రెండు ఉదాంతాలను ఇక్కడ ఇచ్చాను. 

కొందరికి చరిత్రలో  వారి లాగా స్థిరస్థాయిగా నిలిచి పోవాలని, సజావుగా ఉన్న సమాజంలో, ఎవరినో ఒకరిని రెచ్చగొట్టకపోతే, పుల్లలు పెట్టకపోతే, మంటలు లేపక పోతే వీరికి మనసు ఒప్పదు. నిద్ర పట్టదు. 

వాస్తవానికి ఎవరి మనసులో ఏమీ ఉండదు. కానీ ఏదో ఒకటి చెప్పి లేదా వ్రాసి  ఉసిగొలుపుతుంటారు. రెచ్చ గొడుతుంటారు . 

అప్పటివి దేవతల కాలాలు. నేడు ఇది *కళియుగం*, మనుషుల కాలం అని, మందర , శకుని లాంటి  వారు  గుర్తుపెట్టు కోవాలి.  చరిత్రలో స్థిర స్థాయిగా  ఉండాలనుకుంటే , ఉడుతలా కూడా , కొద్దో గొప్పో సహాయం చేసి  ఉండవచ్చు . 
                                                   *********


*శ్రీ సితారాముల అద్భుత సంభాషణ* అందరికి  తెలిసినదే  అయినా మరల గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏమంటే,

ప్రతి మనిషికి  కష్టాలు  - సుఖాలు, సంతోషాలు - దుఃఖాలు, లాభాలు - నష్టాలు సహజం. ఒక దాని నుండి మరొక దానిని అనుభూతి పొందుతాం. కష్టాలు, నష్టాలు మరియు దుఃఖాలు కలిగినపుడు ధైర్యంగా ఉండాలని ,వాటి తరువాత మరల సుఖాలు, లాభాలు మరియు సంతోషాలు వస్తాయని తెలిసింది. అంతే కాదు, ఎవరి పనులు వారు చేయాలని, అందరికీ ఉచితంగా సుఖాన్ని అందిస్తే, వారు రేపు ఏ పని చేయడానికి ముందుకు రారు అనేది సుస్పష్టమయింది. అపుడు పోషించే వారే ప్రమాదంలో పడుతారని కూడా అర్ధమవుతుంది.  
                                                          *******

మన సంకుచిత ఆలోచనల ద్వారా ,ఎవరికి వారే వారికి తోచిన విధంగా ఆపాదించు కుంటున్నారు. శాస్త్రవేత్తలకు, సామాజిక వేత్తలకు, కవులకు విశాలహృదయముంటే బాగుంటుందని అనుకుంటున్నాను.

యుగాలనుబట్టి, కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి మంచి చెడుల అర్ధాలు మారుతూ వస్తున్నాయి. ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించేది నారాయణుడే గాని నరుడు కాదు. 

కరోనా వలన , మతంతో నిమిత్తం లేకుండా, కులంతో నిమిత్తం లేకుండా, భాషతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా , హోదాతో నిమిత్తం లేకుండా, పేద ధనికంతో ,తప్పొప్పులతో,  మంచివారు చెడ్డవారితో సంబంధం లేకుండా చనిపోతున్నారు. కవులు ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని  వ్రాయాలి. సంకుచిత భావాలను విడనాడాలి. ప్రతి యుగంలోని సంఘటనలు ప్రతి సంఘటనలను మననం చేసుకోవాలి.

                                                       *********

                            *జ్ఞానోదయం*

                                                🌻🌻🌻🌻

ఒక రోజు ఉదయాన్నే ,  శాక్యుడు తన శిష్యుడితో  కలిసి బిక్షాటనకు బయలు దేరుతాడు. ఇంటి ఇంటికి తిరుగుతూ , వారు ఇచ్చే బిక్షను స్వీకరిస్తూ ముందుకు కదులుతున్నారు. 

అలా వెళుతూ వెళుతూ , ఒక ఇంటి ముందుకు చేరారు.

ఆ ఇంటి నుండి ఒకామె బయటకు వచ్చి,  *ఏమి నీకు కాళ్ళు రెక్కలు ఉన్నాయి కదా,  ఏదైనా పని చేసుకుని, సంపాదించుకుని బ్రతక వచ్చుకదా* అని అంటుంది.

శాక్యుడి వెనుకాలే ఉన్న తన శిష్యున్ని గమనిస్తుంది. 
*ఏమయ్యా! నీకైనా సిగ్గుగా లేదా, అడుక్కు తినడానికి? అతనంటే  సరే ఏదో వృద్ధుడు, నీకు కాళ్ళు చేతులు గట్టిగానే ఉన్నాయి కదా! చూపు బాగానే ఉంది, ఏదైనా పని చేసుకుని బ్రతకవచ్చు కదా! అడుక్కు తినడం అందరికీ అలవాటై పోయింది,  పోండి పోండీ*, 
అని గట్టిగానే నాలుగు చీవాట్లు పెట్టింది.

ఆ మాటలు విన్న శాక్యుడు ,బయలు దేరపోతూ , ఒక్క నిమిషం ఆగి ,
*అమ్మా! ఒక్క విషయం చెప్పు. ఒక వేల నీవు బిక్షపెడుతే , దానిని మేము స్వీకరిస్తే అది ఎవరికి చెందుతుంది?* 
అని ప్రశ్నిస్తాడు.

*మీకే చెందుతుంది* అని అంటుంది.

రెండవసారి , *అమ్మా! ఒక వేళ మేము మీ భిక్షను స్వీకరించకపోతే ,అది ఎవరికి చెందుతుంది?* 
అని ప్రశ్నిస్తాడు.  

*నాకే చెందుతుంది* అని అంటుంది, ఆ తల్లి.

ఇప్పుడు శాక్యుడు,
*తల్లీ! ఇప్పుడు మీరు మీ ఆవేశంతో దూషించిన మాటలను, హేళనలను మరియు చీవాట్లను మేము స్వీకరించక పోతే, అవి ఎవరికి చెందుతాయి?* 
అని ప్రశ్నిస్తాడు.

ఏ మాత్రం ఆలోచించకుండా , *నాకే చెందుతాయి* 
అని ఠక్కున సమాధానం చెబుతుంది. 

*సరే తల్లీ!  ఇక మేము బయలు దేరుతున్నాం* 
అని ముందుకు కదులుతారు.

కొద్దిసేపు తరువాత , ఆ ఇంటి తల్లి నాలుక  కరుచుకుని, 

*వీరు సామాన్యులు కారు, నా అహం తోటి అనవసరంగా వారిని చీవాట్లు పెట్టాను,  బాధ పెట్టాను. అవన్నీ  నాకే తగిలి నట్లయింది* 
అయ్యో ఎంత తప్పు చేసొను అని , వారి గురించి తెలుసుకుని,  వారి బస గృహమునకు వెల్లి కాళ్ళమీద పడి  తన తప్పు మన్నించమని   వేడుకుంటుంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది.