*ఓటు బ్యాంక్ రాజకీయాలు-24*
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులను చీకటిలో ఉంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను బానిసలుగా జేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
నరులను పేద తనంలో ఉంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను త్రాగుడుకు బానిసల చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులపై సాను బూతి చూపిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలకు నూతన పథకాలు సృష్టించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
నరులను సోమరులను చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలను కులాలు,మతాలుగా వేరుచేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
జనులపై ప్రేమను వలక బోసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
కొందరికి రిజర్వేషన్లను కొనసాగించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
కొందరిని వారి వృత్తులలో నిష్ణాతులను చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
పండితుల, పామరుల వేరు చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
మనుష్యులను మాయ చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
అడిగే వారికి అడ్డంకులు పెట్టిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
ప్రశ్నించే వారికి చుక్కలు చూపిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
రాజ్యాంగ వ్యవస్థలను దిఖ్ఖరించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
కోర్టులతో దోబూచు లాడిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
చట్టాలలోని లొసుగులను వాడుకొనిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశ , రాష్ట్రాల అప్పులను పెంచు చుండిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
ప్రజలలో ముఠాలు కట్టించిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశంలో అవినీతిని పెంచిరి!
ఓటు బ్యాంక్ కొరకు నేతలు
పర్యావరణాన్ని పాడు చేసిరి!
ఓటు బ్యాంక్ కొరకు నాయకులు
దేశ సంపదను, వనరులను కొల్ల గొట్టిరి!
తర తరాలుగా అధికార పీఠాలపై తిష్ట వేసి
దేశ సంపదను దోచుకొనుచుండిరి!
భవిష్యతరాలకు దాచి పెడుతుండిరి!
***********
*జి.చ్.ఎం.సి ఎన్నికల జాతర-2020-25*
మొదలైంది నగరంలో జెండాల జాతర
ఐదేండ్ల కొక మారు జరిగే జెండాల పండుగ.
పార్టీలన్నీ కూడె నొక చోట.
వాడ వాడా , గడప గడపా తిరుగుతూ , హోరా ,
హోరీగా నినాదాలు చేస్తూ , హామీలు గుప్పిస్తూ
మచ్చిక చేస్తుండే ఓటరు అన్నల , ఓటరు తమ్ముళ్ల
ఓటరు అక్కల , ఓటరు చెల్లెన్డ్ల , ఓటరు అవ్వల,
ఓటరు అయ్యల .
ఎన్నికల ఖర్చు తగ్గించ , ఎలక్షన్ కమీషనర్ , విధించే అభ్యర్ధి ఖర్చులు
5 లక్షలని.
కారుకు 1700 , టెంట్ కు 1000 , బిర్యానీకి 150 , ఇడ్లి 10 , టీ కి 5 రూపాయలు .
చూడాలి నాయకులు ఎలా చూపెడుతారో వారి
వారి మాయల గారడీ లెక్కలు .
మేము ఇది అభివృద్ధి చేస్తిమి , మేము అది అభివృద్ధి చేస్తిమి
అని పాలక పక్షమంటే , అంతా ఒట్టిదే , అది మా పార్టీయే గతంలో
చేసిందని ప్రతిపక్షం అంటుంది .
మేము అది చేస్తాం , మేము ఇది చేస్తామని పాలక
పక్షమంటే , మేము వస్తే అంతకంటే ఎక్కువ చేస్తామని
ప్రతిపక్ష మంటది . మేము గెలుస్తే ఇంత ఇస్తామంటే , మేము గెలిస్తే
డబుల్ ఇస్తామని మరో పార్టీ అంటుంది మాకు ఇది అందలేదు , అది
అంద లేదు అని ప్రజలు అంటే , అదిగో వారే , ఇవ్వకుండా
ఆపేశారంటారు . ఏమి అర్ధం కాక, ఎవరినీ ఏమి అనలేక మేధావి
ఓటరు కళ్ళు చెవులు మూసుకుని కూర్చుండే.
ధైర్యం చేసిన కొందరు ఓటర్లు లేచి నిలబడి , ఏడు దశాబ్దాల
నుండి ఎవరు ఏమి చేయలేదు .దోచుక తినడం తప్ప ,
దాచి పెట్టడం తప్పా చేసింది ఏమీ లేదనే.
ఏమీ వినిపించుకోక నాయకులు, సాగిరి ముందుకు .
చెరువు ,మత్తడి పడుతుంటే , ఎదురొచ్చి చేపలు ఎగిరి పడ్డట్టు ,
వెలివేయబడ్డ నాయకులు , నారాజుపడిన నాయకులు ,
అలిగిన నాయకులు , బలహీన నాయకులు , ఏదో ఆశించే నాయకులు,
అభిమానం నాయకులు, ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి , ఆ పార్టీ నుండి
ఈ పార్టీలోకి వెళ్లి కండువాలు కప్పుకొనిరి . పోయే వారు , వచ్చే వారు ,
అన్ని పార్టీలు తిరుగుతారని తెలిసి కూడా , మా నాయకుడిని
తీసుకెళ్లారని ఒక పార్టీ అంటే , లేదు మా పార్టీ నాయకుల ఇంటి కెళ్ళి
బుజ్జగిస్తున్నారని మరో పార్టీ అంటుంది . మా నాయకులను
కొన్నారని ఒక పార్టీ అంటే , లేదు మా నాయకులనే కొన్నారని
అవతలి పార్టీ అంటుంది .
మధ్యలో మరో పార్టీ వచ్చి, మాకు ఈ సారి పరిస్థితులు అనుకూలంగా
లేవని, మరో పార్టీకి మద్దతు పలుకుతే, చుర్రున లేచి మరో పార్టీ,
దానికున్నది ఒకటే సీటు, అదికూడా మద్దతేనని ఎద్దేవా చేస్తుంది.
మేమే గెలుస్తామంటే లేదు మేమే
గెలుస్తామని బీరాలు పలుకుతారు .
ఇక ఓట్లు దగ్గర పడగానే , కార్లల్ల , బైకులల్ల డబ్బులు , బ్రాండీలు
పంపిణీ మొదలెట్టే . పట్టుబడితే , అవి మావి కావనే , బ్యాంకుల్లో
డిపాజిట్ చేయడానికి పోతున్నామనో , గోడౌన్ కు వెళుతున్నామనో ,
నమ్మ బలికే, తీరా డబ్బు పట్టు బడితే , ఎన్నికలయి పోయాక , దానికి
పైరవీలు మొదలయ్యే .
ఓటర్లకు డబ్బులు పంచారని ఒక పార్టీ అంటే , సారా పొట్లాలు
పంచారని మరో పార్టీ , లేదు వారు కుంకుమ భరణీలు పంచారని మరో
పార్టీ వాదిస్తుంది . ఇంకో పార్టీ వచ్చి , పలానా పార్టీ , ఓటర్లకు డబ్బు
వారి అకౌంట్లకు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారని అంటుంది . కార్యకర్తలను
మినహాయిస్తే , అర్ధం కానీ ఓటర్లు , తలలు పట్టుకొనిరి .
ఎన్నికల రిజల్టు వచ్చాక , వారు రిగ్గింగ్ చేశారని వీరు , వీరు రిగ్గింగ్
చేశారని వారు , ఇక వాదులాట మొదలవుతుంది . ఒడిన వారు గెలిచిన
వారిమీద దుమ్మెత్తి పోస్తే , గెలిచిన వారు , ఇంకా మాకు ఎక్కువ సీట్లు
వచ్చేవి అని అంటారు . అలా ఎన్నికల పండుగ జాతర అయిపోతుంది .
ఇక మొదలయ్యేను ఓటర్ల ధర్నాల జాతర .
మొదట పెంచేది పెట్రోల్ డీజిల్ ధరలు . ఆ తరువాత ట్రాన్సపోర్ట్ రేట్లు .
ఆ తరువాత పెంచెదరు అన్ని రకాల పన్నులు , ధాన్యాలు , మందులు ,
అన్ని వస్తువుల ధరలు . నాయకులు పెట్టిన ఖర్చుకు వంద రెట్లు , గుంజేరు
ప్రజల నుండి , ఐదేండ్ల కాలంలో .
కోట్లు వెచ్చించే కరోనాకు. మరల వచ్చే కరోనా సెకండ్ వేవ్ .
కానీ , ఇప్పడు ప్రజలకు , నాయకులకు మాస్కులు లేవు ,
సోషల్ డిస్టాన్స్ లేదు.శానిటైజర్ అసలే లేదు.
కరోనా కట్టడి గాలికి వదిలే. ప్రజల ప్రాణాలు దేవునికి ఒదిలే.
*****
*మనుషులు - మూగ జీవాలు-26*
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక మతం
- అదే మానవత్వం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక కులం
- అదే మానవ చేతి వాటం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక గతం
- అదే మానవ అనుభవం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక గోత్రం
- అదే ఒక ఋషి నామం
ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక వంశం
- అదే ఒక ఇంటి నామం
ప్రతి మనిషికి ఉంటారు ఏదో ఒక గురువు;
- వాల్మీకి మహర్షి కావచ్చు
- శుక్ర చార్యుడు కావచ్చు
- ద్రోణా చార్యుడు కావచ్చు
- మరో ఒకరు కావచ్చు
విద్య , విజ్ఞ్యానం , విందులు , వినోదాలు ,
కార్లు , బంగ్లాలు, పసందైన భోజనాలు
అన్నీ ఉంటాయి.
కానీ ఏ మనిషీ , ఏ రోజూ సంతృప్తిగా ,
ఆనందంగా ఉండరు .
ప్రతి రోజూ ఏదో రకమైన వివాదాలే, అలజడులే.
గతాన్ని గుర్తు పెట్టుకుని కుంగి పోతారు ,
రేపటి గురించి అలోచించి బంగ పడుతారు.
అదే పశు పక్షాదులకు , జంతు జాలానికి,
క్రిమి కీటకాలకు ఏ మతాలు లేవు , ఏ కులాలు లేవు,
ఏ గతాలు లేవు , ఏ గోత్రాలు లేవు , ఏ వంశాలు లేవు,
ఏ గురువులు లేరు .
అయినా ఎంతో ప్రశాంతంగా , ఆనందంగా ఉంటాయి ,
హాయిగా జీవిస్తాయి. ఉన్న వాటితో సంతృప్తి చెందుతాయి.
గతం గురించి ఆలోచించవు . రేపటి గురించి పట్టించు కోవు.
**********
శీర్షిక: *మేలుకో ఓటరా! మేలుకో!-27*
***********
మేలుకో ఓటరా! మేలుకో!
నీ దేశాన్ని నీవు కాపాడుకో!
ఓటు నీ జన్మ హక్కు
రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు
నీ ఓటు పై ఎవరికి లేదు హక్కు
ఓటును అమ్ము కున్నావో , లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నాయకులు ప్రతి ఇంటికి వచ్చి మొక్కు
నీ ముక్కులో ఉన్నా తీయు పక్కు
ఎంతో అమాయకుల్లా మన ముందు నక్కు
పచ్చ నోట్లకు ఆశ పడ్డావో, లేదు ఇక నీకు దిక్కు "మేలుకో"
నేతలు వచ్చినప్పుడు మృదువుగా ఉండాలి నీ వాక్కు
ఎదురుగా ఘర్షణ పడ్డావో వచ్చు రేపు నీకు చిక్కు
నిన్నే కొనాలని బెదిరించారో , వదలకుండా రక్కు
మద్యానికి ఆశ పడ్డావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
నేతలు హామీలు యిస్తారు పెక్కు
గెలిచాక ప్రజలననుగ దొక్కు
వేల కోట్ల డబ్బు , భూముల మెక్కు
కుంకుమ భరణికి ఆశ పడ్డావో, లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
అనిగి మెనిగి ఉన్నవో నీపై ఎక్కు
ఏదో ఒక పన్ను రూపంలో నీ నుండి నొక్కు
ఆపై నీ మీద పడుతుంది పొక్కు
భయ పెడితే బెదిరావో , లేదు నీకు ఇక దిక్కు "మేలుకో"
*స్త్రీ-28*
స్త్రీ ఒక అమ్మ
స్త్రీ ఒక అక్క
స్త్రీ ఒక చెల్లి
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక భార్య
స్త్రీ ఒక వదిన
స్త్రీ ఒక మరదలు
స్త్రీ ఒక అత్త
స్త్రీ ఒక అమ్మమ్మ
స్త్రీ ఒక నానమ్మ
స్త్రీ ఒక పెద్దమ్మ
స్త్రీ ఒక చిన్నమ్మ
స్త్రీ ఒక మనుమరాలు
స్త్రీ ఒక స్నేహితురాలు
స్త్రీ ఒక ప్రేమికురాలు
స్త్రీ ఒక సలహాదారు
స్త్రీ ఒక డాక్టర్
స్త్రీ ఒక కలెక్టర్
స్త్రీ ఒక కండక్టర్
స్త్రీ ఒక లాయర్
స్త్రీ ఒక ఇంజినీర్
స్త్రీ ఒక నాట్య కర్త
స్త్రీ ఒక సృష్టి కర్త
స్త్రీ ఒక రైతు
స్త్రీ ఒక ఆర్మీ
స్త్రీ ఒక నావికురాలు
స్త్రి ఒక కార్మికురాలు
స్త్రీ ఒక పాయిలేట్
స్త్రీ ఒక రాజకీయ వేత్త
స్త్రీ ఒక శాస్త్రవేత్త
స్త్రీ ఒక టీచర్
స్త్రీ ఒక సహన శీలి
స్త్రీ ప్రవహించే కృష్ణా నది
స్త్రీ ప్రవహించే కావేరి నది
స్త్రీ ప్రవహించే పెన్నా నది
స్త్రీ ప్రవహించే గంగా నది
స్త్రీ ప్రవహించే తుంగ భద్రా నది
స్త్రీ ప్రవహించే గోదావరి నది
స్త్రీ సమస్త జీవ కోటిని మోసే భూదేవి
స్త్రీ సర్వ నక్షత్రాల నామధేయురాలు
స్త్రీ అల్ప సంతోషి
స్త్రీ అంటే ఒక దేవత
స్త్రీ అంటే ఒక ధన లక్ష్మి
స్త్రీ అంటే ఒక ధాన్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక గజ లక్ష్మి
స్త్రీ అంటే ఒక భాగ్య లక్ష్మి
స్త్రీ అంటే ఒక సంతాన లక్ష్మి
స్త్రీ అంటే ఒక విద్యా లక్ష్మి
స్త్రీ అంటే ఒక మహా లక్ష్మి
స్త్రీ అంటే ఒక సరస్వతి
స్త్రీ అంటే ఒక కాళికా మాత
స్త్రీ అంటే ఒక కనకదుర్గ
స్త్రీ అంటే ఒక భద్రకాళీ
స్త్రీ అంటే ఒక స్వచ్ఛత
స్త్రీ అంటే ఒక ఆత్మీయత
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ అంటే ఒక అపురూపం
స్త్రీ పలకరిస్తే యెంతో ఆనందం
స్త్రీ మాట్లాడితే యెంతో సంతోషం
స్త్రీ ఇంట ఉంటే అది ఒక సంపద
స్త్రీ తోడు ఉంటే అది ఒక బలం
స్త్రీ సలహా యిస్తే అది ఒక వేదం
స్త్రీ అంటే ఒక గౌరవం
స్త్రీ ప్రక్కన ఉంటే ధైర్యం
స్త్రీ ముందర ఉంటే వెలుగు
స్త్రీ వెనుక ఉంటే చీకటి
స్త్రీ తోడుగా ఉంటే జయం
స్త్రీ ఇంట్లో ఉంటే సంతోషం
స్త్రీ కోపంగా ఉంటే భద్రకాళి
స్త్రీ సంతోషంగా ఉంటే భూదేవి
స్త్రీ ముగ్గులు వేస్తే ఇంటికి శోభ
స్త్రీ పూజలు చేస్తే ఇంట్లోకి లక్ష్మి
స్త్రీ కి అనుకూలంగా ఉంటే దాసోహం
స్త్రీ కి వ్యతిరేకంగా ఉంటే చంద్రముఖి
స్త్రీ ఇంట్లో ఉంటే ఇల్లంతా వెలుతురే
స్త్రీ ఇంట్లో లేకుంటే ఇల్లంతా చీకటే
స్త్రీ గౌరవిస్తేనే సమాజంలో విలువ
స్త్రీ విలువనిస్తేనే సమాజంలో గౌరవం
స్త్రీ తన భర్త పేరు మోస్తుంది
స్త్రీ తన భర్త వంశం మోస్తుంది
స్త్రీ తాళి మెట్టెలకు ప్రాణమిస్తుంది
స్త్రీ తన ముత్తైదువ తనం నిలుపు కుంటుంది
స్త్రీ తన భర్తకు సుఖాన్నిస్తుంది
స్త్రీ తన బిడ్డలకు జన్మ నిస్తుంది
స్త్రీ తన బిడ్డలను పెంచి పోషిస్తుంది
స్త్రీ తన భర్త
వంశీకుల
చుట్టు పడుతుంది
స్త్రీ తన భర్త వంశీకుల కర్మలు చేస్తుంది
స్త్రీ యీ జగత్ సృష్టికి మూలం
స్త్రీ కి అందుకే గౌరవం జాస్తి
స్త్రీ కి అందుకే ఆయుస్సు అధికం
*కవితా శ్రీ గారి ప్రస్థానం-29*
అతనొక రచయత, ప్రజా కవి , స్వేచ్ఛా కవి
అభ్యుదయ కవిత్వ రచనలో సిద్ధ హస్తుడు
ఎన్నో సన్మానాలు , కాళోజి పురస్కార గ్రహీత
కవితా శ్రీ , కవితా వైభవ బిరుదాంకితుడు
నిత్య శోధకుడు, అతి నిరాడంబరుడు "అతనొక "
అది ఒక చిన్న పల్లె టూరు
పురాతన కోటలకు ఆనవాలు
అదే నందగిరి నర్సింహులపల్లె
"గంగాధర" మండలం ,కరీం నగర్ జిల్లా "అతనొక"
చిన్న నాడే అమ్మా నాన్న
విడి పోయే
బాపమ్మ తాతయ్య,మేనత్త పెంచే అల్లారు ముద్దుగా
ఒకే అక్క , అక్కకు నొక్కడే తమ్ముడు అన్నట్లుగా
ఆనందముగా కాలము గడుప సాగె "అతనొక"
కొంత కాలానికే జీవితములో మరో పిడుగు
దేవుడికి కళ్ళు కుట్టి నట్లయ్యిందో యేమో
ప్రాణమంటి అక్కయ్య దూరమాయె
మనసు వారి నెంతో కలిచి వేసే "అతనొక"
నాన్నహనుమాండ్లు బ్రతక లేక బడి పంతులు
కొద్ది జీతం, ఇక ఆర్ధిక పరిస్థితి అంతంతే
ఒక చోట స్థిరమైన ఉద్యోగమూ కాదు
కాలం మారి నట్లే తరుచూ ట్రాన్స్ఫర్లు "అతనొక "
ఒక్కో ఊరిలో ఒక్కో తరగతి నాన్నతో
ఎవరితో ఎక్కువ కాలం గడపలేక లేక పాయే
కొన్నాళ్ళకు నాన్న మరో అమ్మను వివాహమాడె
ప్రేమలు మెల్ల మెల్లగా సన్నగిల్లే నాన్నకు " అతనొక "
తాత వెంకట నర్సయ్యకు పెరిగె వాత్సల్యం
అలా అలా కష్టాల కడలిలో ఈదుకుంటూ
పై చదువులు ,బి ఓ ఎల్ . తెలుగు పండిట్
వారాలబ్బాయిగా ఎలాగో వరంగల్ లో పూర్తి చేసే "అతనొక "
ఇక ఉద్యోగ వేటలో నుండగానే
దొర వారి (రెడ్లు) ఇంటి నుండి పిలుపు వచ్చే
పిల్లలకు క్రమ శిక్షణ నేర్పవలెనని వారు తలచె
అది ఎంతో మహా భాగ్యముగా భావించి
పిల్లలకు క్రమ శిక్షణ నేర్ప నారంభించే " అతనొక "
తెలుగు టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగమూ వచ్చే
కొంత కాలానికి తన గుణ గణాలను
నచ్చిన వారి అమ్మాయిలో ప్రేమ చిగురించ
మనసులు కలిసే , కొంత కాలానికి పెద్దల అండతో
యిష్టంతో పరిణయమాడి ఆదర్శంగా నిలిచె " అతనొక "
నాడు కులాంతర వివాహం జఠిలమాయే
జీవితం అత్యంత దుర్భరంగా మారే
మలయశ్రీ , భాష్యం విజయ సారధి , వెంకటేశ్వర్లు
గార్ల అండదండలతో , భార్య రాజమణితో జీవితం సాగె " అతనొక "
చిన్న నాటి నుండే కవిత్వమంటే మహా ప్రీతి
అభ్యుదయ కవిత్వ రచనలో సిద్ధ హస్తుడు
ప్రజా భారతం , తెలంగాణా ఆత్మ ఘోష వంటి
పద్యాల , శతక గ్రంధాల ముద్రించిన ప్రజా కవి
అతడే స్వేచ్ఛా కవి శ్రీ సుదర్శనం వేణుశ్రీ గారు. " అతనొక "
*వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా!*
(1977-78 కాలంలో (42 సం.రాల క్రితం) మా గ్రామ
పరిస్థితులపై నేను వ్రాసిన కవిత యదా తధంగా )
వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా!
ఆంగ్లేయుల పాలనలో ఆహుతైన మన దేశం
దుష్టగాండ్ల మోసగాండ్ల కొందరిని నింపుకుని
వచ్చిందయ్యా! స్వాతంత్య్రం వచ్చిందయ్యా! "వచ్చిందయ్యా!"
అగు పడిన పిల్ల వాడికి , అగు పడిన ముసలి వాడికి
గొప్ప గప్ప నీతులెన్నో , కుచ్చి కుచ్చి చెప్పుతారు
చీకటి వేళ కాగానే , బింకెడంత చేత బట్టి
అందులోకి గుడ్డు మార్చి, బేవ్ మంటూ తాగుతారు "వచ్చిందయ్యా!"
అర్ధ రాత్రి దాక నైనా , వాడ వాడ తిరుగుతారు
సి .ఐ .డి ల మంటూ , షికారులు కొడుతారు
అందమైన పడుచు ఇంట్లో , ఆ రాత్రి తిష్ట వేసి
తెల్ల వారి పోగానే , దొరల మంటూ తిరుగుతారు "వచ్చిందయ్యా!"
ఎవరైనా అడ్డువస్తే పూసలిరుగ తన్నుతారు
కాకి బట్టల బలగాన్ని కమాయించు కుంటారు
అంతింతో అందించి ఆసరగా ఉంచుతారు
ఊసరవెల్లి నల్ల దొరలు ఊరూరున ఉన్నారు "వచ్చిందయ్యా!"
ఉండీలను చేతబట్టి ఊరునంతా మూటగట్టి
అయ్యా అయ్యా అనేసరికి అరుగు క్రింద నిలబెట్టి
పో పొమ్మని అనకుండా వీధులూడ్వా బెడుతారు
తంగేడు బరిగెలతో దయ్యాన్ని వెళ్లగొట్టేరు "వచ్చిందయ్యా!"
అమితమైన ప్రేమతో తదేకంగా చూస్తారు
దగ్గరికి పిలుస్తారు కాళ్ళు పిసక బెడుతారు
సన్న కారు రైతులకు చక్ర వడ్డీతో అప్పులిచ్చి
కౌలు దారులకు భూములిచ్చి కట్టడి చేసిరి "వచ్చిందయ్యా!"
దక్షిణం లేనిదే ఉద్యోగాలిచ్చే ధర్మ దాతలు
ఉత్తరం లేనిదే ఉదోగాలిచ్చే ఉత్తములు
దండ లేనిదే దయ చూడని కరుణా మయులు
కాన రారు , కాన రారు కలియుగాన "వచ్చిందయ్యా!"