*అన్వేషణ శతకం*
01. కొత్త కొత్త పధకములు కొత్త పాట
జనులకువలలు వేయను జాడ పట్టె
పధకములసొమ్ము లొచ్చెను ప్రజల నుండె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* కొత్త కొత్త పేర్లు పెట్టి ఎన్నో నూతన పధకాలను
తెచ్చి ప్రజలకు వలలు వేస్తారు.ఆ పధకాల డబ్బుపన్నుల
ద్వారా ప్రజల నుండి సేకరించినదే. ఈ యదార్ధాన్ని
జగతిలోని ప్రజలకు తెలియజేయు , అన్వేషణా!.
02. ఓటు వేయండి ఓటర్లు ఓటు వేయి
అయిదు యేండ్ల కొకపరినే అడుగ మరల
మళ్ళి కనబడుతె అడుగు మరిచి పోకు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* ఓట్లు వేయండి ఓటరులారా! ఐదేండ్ల కొకసారి
ఎన్నికలు వస్తాయి . మరోసారి అడుగను. మళ్ళీ కనబడితే
అడగండి , ఓటు వేయడం మరిచి పోకండి .
03. రాజ్యమునుపొందుటకొరకు రణము చేసె
ఏడు పదులును దాటిన ఏదొ ఆశ
నేత దోచిన సొమ్ముకు నెపమె లేదు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* స్వాతంత్య్రం సాధించడానికి , ఎంతో రణంచేశారు.
ఎంతో మంది వీరమరణం పొందారు . స్వాతంత్య్రం వచ్చి
ఇప్పటికి డెబ్బది ఏడు యేండ్లు దాటినా ఏదో ఆశ . నేతలు
దోచి, దాచిన సొమ్ముకు తప్పు లేదు. (అవినీతి సంపదను వెను
వెంటనే కనిపెట్టి ప్రజలకు తెలిపే టెక్నాలజీ గాని, యంత్రాంగం
గాని , మన దేశంలో ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు . చెందినా
కనిపెట్టరు.)
04. నేత కూడబెట్టాడని నెపము వలదు
మాట నిలుపని నేతను మరల పిలువు
జనులు నైఖ్యముగానుంటె జయము కద్దు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* నాయకులు అవినీతితో దోచి దాచారని అపోహలు వద్దు.
ఖచ్చితమైన ఆధారాలు గుర్తించ లేనపుడు నెపం వేయవద్దు.
ఎజెండాలో పెట్టిన అన్ని హామీలను నిలబెట్టుకోనప్పుడు, ఎంతటి
నేతలైనా సరే, ప్రజలు వారిపై వత్తిడి తెచ్చి వారు రాజీనామా చేసే
వరకు పోరాడాలి. ప్రజలు ఐక్యంగా ఉంటే విజయం తప్పకుండా
ప్రజలచే అవుతుంది.(అప్పుడే వారు తరువాతి కాలంలో గాలి
హామీలను ఎజెండాలో పెట్టరు. అబద్ధాలు చెప్పరు.)
05. పన్ను కట్టేది నొకరైతె పండుగలను
చేసుకునుమరొకరనుట చేదు నిజం
ఎవరు నుచితమునిచ్చిన అవరు వృద్ధి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* పన్నులు కట్టేది ఒకరైతే , ఫలాలను అనుభవించేది
మరొకరనేది పచ్చి నిజం. ఏది ఏమైనా ఉచితాలు అనేవి ప్రజలను
కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఉపయోగించుకుని ,వారిని
సోమరులుగా మార్చడానికే ఉపయోగపడుతాయి తప్పా, ప్రజలు
అభివృద్ధి చెందరు, దేశం అభివృద్ధి చెందదు.
06. గ్రేటరుఎన్నికలెల్లను గెలువ యెంచి
డబ్బు దండిగా పంచిరి డాబు సరిగ
చట్ట మెపుడు కొందరి చుట్ట మేను
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం:* జి.హెచ్.ఎమ్.సి ఎన్నికలలో గెలవడానికి , విచ్చల విడిగా
డబ్బు పంచిరి. ఎదుటి పార్టి, డబ్బుపంచు తుండగా దొరకబట్టినా
కేసులు బుక్ చేయలేరు, ఆ నేత నామినేషన్ రద్దు చేయలేరు.
07. ఓటు వేయండి దండము ఓటు వేయి
ఓటు కావాలి బాబులు కాటు వేయ
అయిదు యేండ్లకొకపరినే అడుగ మరల
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
08. అనువు గానిచోటనెవరు అడుగిడొద్దు
దుష్టులన్నవారలకును దూర ముండు
మర్రి చెట్టుకింద మొక్కలు మాడి పోవు .
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
*భావం*: మనకు అనుకూలంగా లేని చోటికి వెళ్ళకూడదు.
అలానే మనకు నచ్చని వారికి దూరంగా ఉండాలి. మర్రి చెట్టు
కింద ఎలాంటి మొక్కలైనా యెదగవు. చూడు అన్వేషణా!
యిది కలియుగము
09. ఎన్నికలుఎన్ని జరిగినా ఏమి ఫలము
మంత్రులెందరు మారినా మార్పులేదు
జమిలి ఎన్నికలైనను మార్చునేమొ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
10. కులభవనములనంగానె కూడి పోయె
మరల ఎన్నికలవరకు మరిచి పోవు
కులము పెద్దలకు తెలిసె కూర్మి యెంతొ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
11. బంధువులునందరొకటైన బలము పెరుగు
చాత్తద శ్రీ వైష్ణవులంత కలిసి పోయి
అహము వీడిన నభివృద్ది అదిరి పోవు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
12. అడుగడుగునవైష్ణవులేను అర్చకుండ్రు
బంధు వర్గాల్లొ ఈర్ష్యలు పాయకుండె
అహము వీడిన నగుపడు యసలు శక్తి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
13. వృద్ధ తలిదండ్రినిమరిచె బుద్ది లేక
ఆస్తి పంపకం నాడొచ్చి ఆరవ బట్టె
కాకులకునేమి పెట్టినా కర్మ పోదు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
కాకులకునేమి పెట్టినా కర్మ పోదు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
*భావం*: తల్లి దండ్రులు వృద్ధాప్య దశలో కష్టంగా
జీవిస్తున్నపుడు మరిచిన కొడుకులు , వారు చని పోయాక ,
కాకులకు పరమాన్న భోజనం పెట్టినా, ఆర్భాటంగా బంధు
మిత్రులకు విందు భోజనాలు పెట్టినా చేసిన
పాప పుణ్య కర్మలు మారవు కదా .
14. మనిషి బతికున్ననాడేమొ మాట రాదు
అర్ధ రాత్రియు వరకును అరుచు కొనిరి
మనిషి మరణించి నంతనే మరచి పొగడె
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
15. యెల్లరెసులను తొలగించ యెల్లవేల
నడ్డు పడిరి జనులు నాన్చ కుండ
సర్కరుదిగొచ్చి పన్నుల చక్క బెట్టె
జనులు నందరు కూడియు జయహొ ననిరి
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
సర్కరుదిగొచ్చి పన్నుల చక్క బెట్టె
జనులు నందరు కూడియు జయహొ ననిరి
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
16. యేడ పుట్టాననియుగాని యేడ పెరిగె
ననియు గర్వించ, నరులును నష్ట పోవు
బురుద లోపుట్టి తామర బురుద లోన
పెరిగి చేరును విష్ణువు వేకు జాము
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
17. అవసరమునకును ఆప్తులు అప్పుఇచ్చె
వడ్డి ఎంతైన యేమని వాడు కునిరి
వాయిదాలు కట్టమనియు వాత పెట్టె
అప్పు కట్టలేక జనులు అసువు బాసె
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
18. కీచక కరోన బయటుండ కిటికి పెట్టె
మరల కాటేయు ననుకుని మార కుండె
వాగ్జినొచ్చిన వార్తలే పాక కుండె
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
19. అప్పు యెగకొట్టవచ్చని ఆట ఆడె
ఊరికనెఅప్పు ననుకుంటె వుచ్చు బడెనె
డబ్బు నంతకుటుంబాల మబ్బు చేసె
అప్పులన్నిపురికొలిపె ఆత్మ హత్య
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
20. రాక్షసుడికైన నేర్పొచ్చు రాగములను
పెద్ద పులినైన యింటిలో పెంచ వచ్చు
అహము నున్నవారినెవరు అలుము కోరు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
పెద్ద పులినైన యింటిలో పెంచ వచ్చు
అహము నున్నవారినెవరు అలుము కోరు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
21. ముసలి ముసలని హేళన మూర్ఖు కేల
ముసలి కానివారెవరయ్య ముందు చెప్పు
జనని జనకులే ముసలయ్యె జన్మ నిచ్చి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
22. పర మతస్థుల విగ్రాలు పగుల గొట్ట
నీచ పనియేనెవరికైనా నిజము యిదియు
కోటికొకరుండవచ్చునె కోతి పనికి
వెతికి శిక్షించ నినదించు వేరు పడక
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
నీచ పనియేనెవరికైనా నిజము యిదియు
కోటికొకరుండవచ్చునె కోతి పనికి
వెతికి శిక్షించ నినదించు వేరు పడక
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
సబ్బు శానిటైజరులేమొ చాల కుండె
కడుగ వీలును గాకనే కడుపు నింప
రోగపుకరోన తగిలియు రొప్పు చుంటి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
24. పండితులనిపామరులని , పలుచ బడక
పాప పుణ్యమెంచకరోన, పడగ విప్పె
దాన గుణులను నెరుగక దాడి చేసె
కాంచు మన్వేషణా! యిది కలియుగము
25. మంత్రు లెందరుమారినా మనిషి నతఁడె
యికను మారేదెటులనయ్య యిట్టి తీరు
కార్మికుల నేత వృత్తుల కాల గతియు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
26. నాదె గొప్పకులమునని నాదె గొప్ప
ననియు తగవులాడిరినిల నాన్న కులం
యేది నయితేను నదియేను యెల్లరకని
అమ్మ నవమాన చేయుటేల అవని లోన
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
27. రాక్షసుడికైన రాగాలు నేర్పవచ్చు
పెద్ద పులికైన పాఠాలు చెప్పవచ్చు
అహము నున్నవారినెవరు అలుము కోరు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
28. ఆవు లావులు పోట్లాడి అలసి పోయె
దూడ కాళ్ళువిరుగుతేను పేడ బెట్టె
జ్ఞాని జ్ఞానులు పోట్లాడి బాణి మార్చె
నరులు ఏమిచేయనులేక నలుగు తుండె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
29. అన్న దమ్ములనుగలుప అక్క తలచి
పనులు విడిచియు తిరుగుతూ పాగ వేసె
కడుపు నొకటేను అయినను నడిచె వేరు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
30. పసిడి దిమ్మెలతోటియు భవనముండె
ధన ధాన్యము లెన్నియో దండి గొచ్చె
పాప మోసాలు పెరిగియు పక్వ మయ్యి
పాలు పోలేక ముక్కులో పయిపు లేసె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
ధన ధాన్యము లెన్నియో దండి గొచ్చె
పాప మోసాలు పెరిగియు పక్వ మయ్యి
పాలు పోలేక ముక్కులో పయిపు లేసె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
31. ప్రాణ మెల్లునపుడుయేమి పట్టు కెల్ల
వీలు కాదునెవరికిని వినుడు నరుడ
వున్న దానిలో కొంతైన దాన మివ్వ
మేలు జరుగును జగతిన యెల్ల వేళ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
వీలు కాదునెవరికిని వినుడు నరుడ
వున్న దానిలో కొంతైన దాన మివ్వ
మేలు జరుగును జగతిన యెల్ల వేళ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
32. అమెరికాకుజోబైడను నయ్యె పెద్ద
బాగుపడగలమనిఆశ పడిరి జనులు
మంచి నిర్ణయములతోడ మనుగడుండ
ప్రజలు మెచ్చుబరోసాలు పలికె మొదట
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
33. పురుషు లందున పుణ్యాత్మ పురుషులుండు
పడతు లందున సుగుణాల పడతులుండు
తప్పు లుండునందరిలోన తప్పకుండ
కలుపుకునిపోవలె యిలన కలసి యుండ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
34. మనుషులప్రేమలన్నొక మట్టి ముద్ద
నీటిలో వేసినకరగు నిక్కముగను
అవసరాలకు వాడేటి ఆయుధములు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
35. వ్యాక్జి నొచ్చెను ననగానె వారియర్సు
ముందు యుండితీసుకునిరి మురిపెముగను
జనులలోగొడవలుయెన్నొ జాస్తి యాయె
మరొక యేడాది కరొనున్న మంచిగుండు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
36. కష్టములనుండె యెదిగేరు యిష్టముంటె
దారి చూపును బాధలు ధరణి చేర
నిగ్రహముతోడ బైడను నిలిచి గెలిచె
అమెరిక మెజారిటి జనుల అండ తోటి
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
37. కులము కులమని నేతలు కుట్ర చేసి
సొంత లాభము కొరకును పంతమెంచి
బంధు జనులను భయపెట్టి బాసటించె
అన్య కులస్థుల పెళ్ళాడి ఆడు కుంటు
సంఘమొకటియు సంసార సార మొకట?
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
38. ఇంట్లొ ఇతర కులస్థులు కంట్లొ నలుసు
బయట సూటు బూటులతోను వాదు లాడు
ద్వంద నీతిగల జనులు ధరణి చేరె
కులపు బంధువు నెడబాపు కుటిలు రొచ్చె
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
39. మనిషి నెప్పుడో నొకనాఁడు మట్టి కలియు
మహిలొ నున్నంత కాలము మంచి గుండు
మోస పనులను చేయక మోక్ష మొందు
నిత్య మెల్లను నీకీర్తి నిలిచి పోవు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
40. మోసముంజేయు గుణమునీ వ్యసన మైన
తప్పు చేస్తూనె నుందువు తప్ప కుండ
దొరికెదవు నీవు నెప్పుడో తోలు తీయు
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
41. యేండ్ల కొద్ది యున్నామని యెన్నొ చెప్పి
మొన్న వచ్చిన వారని మోకు వేసె
ఎన్నియొ కలహాలేతప్ప ఏమి చేసె
కాంచు మన్వేషణా! యిది కలియుగంబు
42. విద్య అందము నుందని విర్ర వీగు
ధనము నధికారముందని దాడి చేయు
కులము గొప్పల చెప్పుచు కుట్ర పన్ను
కాటి కడనందరుజనులు కలిసి పోవు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
43. కన్న బిడ్డల బాధ్యత కాన కుండ
కన్య దానము విషయము కడకు పెట్టి
దేశ ముద్ధరించ బయలు దేరె నేత
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
44. పూట పూటకు బొచ్చెతో లోట తెచ్చి
బొచ్చెలోనొక చోటను బొజ్జ నింపె
లోటతోమరో చోటున మాటు వేసె
కలుశితముచేసెసంఘాన్ని కలువ కుండ
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
45. కంప్యుటరుయుగమందున కల్లునమ్మ
ఆర్డరులులాపుటాపులో ఆగకుండ
తాటి చెట్టుపైనే చూడ దలిచె తాత
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
46. నీతులెందరో చెప్పేరు నిత్యమెల్ల
వినయమువిధేయతలనెన్నొ విశద పరుచు
తాను పాటించ నవియే తరము కాదు
కాంచు మన్వేషణా!యిది కలియుగంబు
No comments:
Post a Comment