రాజకీయ శతకం
ప్రతిన నెరవేర్చ పన్నులు పెంచేరు
రాజకీయులిపుడు రాటుదేలె!
రాజకీయులిపుడు రాటుదేలె!
తేలు నేమొ రేపు తేటతెల్లముగను
రాజ కీయులిపుడు రాటుదేలె!
నడ్డ మున్న వారి ననుగ దొక్క
ఎత్తు వేసి జనులు చిత్తయి పోయెనే
ఉడుత వలెనెగాదు నూసరవలె
రాజ కీయులిపుడు రాటుదేలె!
నీతియున్న నేతె నీకుసాయముజేయు
రాజ కీయలిపుడు రాటుదేలె!
జనులు తలుచు కుంటె జయముఘనముకాద
రాజ కీయులిపుడు రాటుదేలె!
ఎన్నికలలొ నిలిచి యేలికవై పోరు
రాజ కీయులిపుడు రాటుదేలె!
హామి యిచ్చె జనులు నడిగినంత
యువత దేశమునకు భవితయే యెపుడును
జనత తలుచుకుంటె జగతి మారు
వేచి చూస్తునుండె వేయనికను వేటు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
56.
నోట్ల కెపుడు జనులం వోట్లను వేయొద్దు
ఓట్ల కిచ్చు నోట్లు చేటుగనుక
ఐదు వేలు జేయు నైదేండ్లు బానిస
రాజ కీయు లిపుడు రాటుదేలె!
57.
సార పోసి మిమ్ము సాగదీయును నేత
చుక్క కెపుడు మీరు చిక్క వద్దు
పిట్ట కథల కెపుడు బెనక రాదు జనము
రాజ కీయు లిపుడు రాటుదేలె!
58.
కోడినిస్త మనియు కొలువు లిస్తామని
భూమి నిస్త మనుచు ధీమ నిచ్చు
బుజ్జ గించ వచ్చు మజ్జిగ పోసియు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
59.
ఓటు విలువ తెలిసి నోటమి చూడకు
భావి తరము వారి భవిత నెరిగి
మంచి నాయకుడిని యెంచియు గెలిపించు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
60.
చట్టములను వారి చుట్టములుగ మార్చి
ఎంగిలిమెతుకులను యెగనుజల్లి
భూములన్ని దోచి బొర్రలు పెంచిరి
రాజకీయు లిపుడు రాటు దేలె!
61.
పన్నులు పడకుండ పన్నాగమును పన్ని
పన్ను కట్ట కుండ వెన్ను జూపె
పేద మధ్య జనుల పెడదోవ పట్టించె
రాజకీయు లిపుడు రాటుదేలె!
62.
ఖదరు బట్ట లేసి కండువల్ గప్పుతూ
కథలు చెబుతు నసలు గప్పి పుచ్చి
గొప్ప హామిలిచ్చి గోప్యమగా నుండు
రాజకీయు లిపుడు రాటుదేలె!
63.
ఎన్నికొచ్చి నపుడు యెగబోసుకొనివచ్చి
గొప్ప లెన్నొ చెప్పి గోము జేసి
డబ్బు పంచి జనుల జబ్బుల పాల్జేయు
రాజకీయు లిపుడు రాటుదేలె!
64.
నేత మార కుండ మేతను నాపక
వృద్ధి చెందు ననుట నుత్త మాట
జగతి పైన పేద రగులుతునే యుండు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
ఎన్నికొచ్చినపుడె యెరుక వచ్చుజనులు
ప్రేమ పుట్టు కొచ్చు పేద పైన
కాసులు యెగ జల్లు కార్యము సాధించ
రాజకీయు లిపుడు రాటుదేలె!
66.
సాను భూతి చూపు చల్లగ నేతలు
ఉచిత హామి లిచ్చు నుచితముగను
ఓట్ల కొరకు నేత కోట్లను పంచేరు
రాజకీయు లిపుడు రాటుదేలె!
67.
పగలు రాత్రి యనక పరుగులు పెడుతుండు
గల్లి సభలు పెట్టి గోల చేయు
పేద వాన్ని లాగి మధ్యము త్రాగించు
రాజకీయు లిపుడు రాటుదేలె!
68.
పోరి పోర గాన్ని పోనివ్వకుండను
చాక్లెటులను పంచి సాగి పోవు
ఎండ లోన నిలిపి జెండాల మోయీంచు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
69.
పండు ముసలి వాండ్లు యెండిపోయారని
కాళ్ళ వరకు వచ్చి వేళ్ళు పట్టు
నోట్లు చేతి కిచ్చి వోట్లు వేయమనేరు
రాజకీయు లిపుడు రాటుదేలె!
70.
లంచ మిచ్చి నంక కంచము లాగేరు
బానిసగను జేసి బాధ పెట్టు
దోచు కునును నెంత దొరుకుతె నంతయు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
71.
ఓటు వేయు నపుడు నోటునడగకుంటె
ప్రశ్న వేయ వచ్చు బయము లేక
పనులనడుగ వచ్చు పలుమార్లు నైనను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
ప్రజల ఓటుతోని పదవులు సాధించి
జనుల పైన నధిక పన్ను లేసె
నేత సంపదలకు నేయరు పన్నులు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
73.
చస్తె చూపె నేత సానుభూతి యికను
టికటు నిచ్చి
వేలు ముద్ర నేత వేగిరముగ నేడు
మెంబరాయె రేపు మేటి మినిష్టరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
74.
బారు షాపు తెరిచి బాగ సంపాదించ
వీది కొకటి పెట్టె వింత గాను
త్రాగి జనులు దొరుక తరిమి పన్నులు వేసె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
75.
పేద మధ్య ధనిక భేదమేలను వచ్చె
కుటిల రాజ కీయ కుత్సితంబు
నడగ లేక పుడమి నరులు పేదలయిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
76.
ఉచిత ముచిత మనుచు నూడిగములు చేయ
ప్రజల సొమ్ము నేత పంచు చుండె
చేరు తుండె నదియు కార్యకర్త లకేను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
77.
ఓటు వేయు నపుడు నొకమారు గాకుండ
పలువిదములు గాను తెలుసు కొనిన
వోటు వేయ వచ్చు మేటి నాయకులకు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
78.
సేవ నొక్క యేడు చేసినా నేతలు
పెన్షనులను పొందు మాన కుండ
కష్ట పడ్డ రైతు కన్నీరు విడిచేను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
79.
నిండు కుండ వోలె నేత నిమ్మలముండె
ఎన్నికల కొరకును నెదిరి చూసె
మోసముగను గెలువ మోకరిల్లుతు నుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
80.
కట్టినిండ్లు రేపు కార్య కర్తలకేను
పేద వాండ్ల బతుకు పెంక లోను
నేత కుండు వాట నిక్కము వాటిలో
రాజ కీయు లిపుడు రాటుదేలె!
81.
ఎన్నికపుడు జనులు యేడుకొండలవారు
ఎన్నికలయి నాక యేమి కారు
ఊసరెల్లి వలెను నునికిని మార్చేరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
82.
ప్రజలు మార కుంటె, ప్రగతేమి నుండదు
మందు పుచ్చు కుంటె మాట రాదు
నోటు పుచ్చు కుంటె పాట్లు తప్పవు రేపు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
83.
నేత నెవరు నైన నేముంది గర్వము
కొత్త సీస లోన పాత సారె
మంచి గుణములు గల మహనేత నెన్నుకో
రాజ కీయు లిపుడు రాటుదేలె!
84.
కోటి విద్య కూటి కొరకేను జీవించ
నీతి చెప్పి జనుల నిండ ముంచు
గొప్ప పనులు ననుచు గప్పాలు కొట్టేరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
85.
ప్రజల మతిమరుపులు బలమాయె నేతకు
చట్టమందు లొసుగు చుట్ట మాయె
సాను భూతి పరులు సహకారమందించె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
86.
పేద తనము జనుల పెనుభూత మాయెను
నేతకు నదియేను నెయ్య మాయె
బరితెగించి పోయె బహిరంగముగ దోచ
రాజ కీయు లిపుడు రాటుదేలె!
87.
ఓటు గెలుపు కొరకు నోటును యెరవేసి
వేట గాళ్ళ లాగ వెంట బడిరి
గద్దె నెక్క గానే గాదెలు నింపిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
88.
వేయి కట్టి ఖరము వెలగట్టనీ నేత
వేయి పెట్టి మనిషి వెలను గట్టి
అందలమును యెక్క నడుగులు వేస్తుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
పగలు రాత్రి రైతు పనులను జేసిన
కూడు నీడ కరువు గోడు తప్ప
నేత నెలలు ధరణి యేల కోట్లను దండు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
90
ప్రజల పన్ను సొమ్ము బడుగులకును పంచి
నేను యిస్తి ననుచు నేత జెప్ప
చదువు కున్న నరులు గతమును మరిచిరా
రాజ కీయు లిపుడు రాటుదేలె!
91.
విద్య లేక యున్న విజ్ఞానం లేకున్న
రాజ కీయ ముంటె దోచ వచ్చు
దోచి నట్టి డబ్బుతో దొరల్ గావచ్చు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
92.
ప్రభుత బలము యుంటె పార్టీల నేతలు
దుయ్య బట్టు జనుల రయ్యు మంటు
లబ్ధి పొందు తుండు లగడములను జేస్తు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
93.
స్వార్ధ చింత లేక సహకార మందించు
సేవ చేయు నేత యెవ్వరైన
యెన్ను కునవలయును నేమి యాశించక
రాజ కీయు లిపుడు రాటుదేలె!
94.
చదువు సంధ్య లేని సంస్కారములు లేని
నేత యెన్ని కైన నేమి ఫలము
ప్రతిన చేయ రాదు పరువుపోవు జనుల
రాజ కీయు లిపుడు రాటుదేలె!
95.
తలలు బోడు లైన తలుపులు బోడేల
పోరు సలిపి నేత పోటి పడెను
కోట్ల యువత యున్న తూట్లు పొడుస్తుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
96.
జమిలి ఎన్నికలను జరిపి నట్లైనను
ఖర్చు తగ్గు దేశ ఘనత పెరుగు
సమయమెంతొమిగులు సంతషించు జనులు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
97.
కష్ట పడిన కూలి కాలినడక నడ్చె
కష్ట పడని నేత కార్ల తిరిగె
వింత జూసి జనులు విసుగును చెందిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
98.
ఎన్నికలకు ముందు సన్నిహితముగను
పంచు తుండు మిగులు పధకములను
మనసు మార్చు నరులు మాట్లాడ కుండను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
99.
నీతి తప్పి నేత నీతులు వల్లిస్తు
ధర్మ మిడిచి వారు దాత నైన
పుణ్యమేల వచ్చు పుణ్యాత్ములకు వలె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
100.
ఓటు బాంకు కొరకు వోటర్ల కూర్చియు
ఆశ పెంచె జనులు నడిగి నంత
ప్రతి ఫలంబు కోరి పధకాలు వేసిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
101.
మాట మార్చు నట్టి మాటకారేలిన
బీద జనుల గతియు బీట వారు
పసిడి పలుకులైన ఫలమేమి నుండును
రాజ కీయు లిపుడు రాటుదేలె!
102.
తోలు తిత్తి మేను తొమ్మిది తూటులు
తుస్సు మనును దీని తస్స దియ్య
దొరలు తెలుసు కోరు దోచను నాపరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
103.
నరుల సమము చూసె నాయకుల్ యేలిన
జగతి వెలుగు చుండు జయము తోడ
సత్త జూపు ఘనులు చంద్ర మండలమున
రాజ కీయు లిపుడు రాటుదేలె!
104.
రాజ కీయమెంతొ రమణీయ మాయెను
వారసులను తెచ్చి ముర్సిపోయె
దొరికి నంత ధరణి దోచిరి గుట్టుగా
రాజ కీయు లిపుడు రాటు దేలె!
105.
నరుల సేవ జేయు నాయకుడైన చాలు
పదుల కొలది యుండి ఫలము యేమి
ప్రజల భూమి దోచ పరుగులిడుతు నుండు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
106.
నిద్ర లేవ గానే నేత్రము తెరిచేరు
కబ్జ జేయ భూమి కలయ తిరుగు
డేగ పక్షి వోలె మేఘములను దాటి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
107.
వెనుక నుండు దొరలు వెలిగి పోతుండిరి
ముందు నున్న సార్లు మొక్కు దొరల
మధ్య నిలుచు జనులు మరిగి పోతుండిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
108.
ఆశ లేని సేవ నల్పమైనను చాలు
కొండ యంత నున్న దండగేను
ఓటు కొరకు ఫలము నోటర్ల వనికించు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
109.
దేశ సంపదంత దేశప్రజలదని
తెలియక జనులంత నలసి పోయె
ఉచిత ముచ్చులొ పడి నూడిగం చేస్తుండె
రాజ కీయు లిపుడు రాటు దెలె!
110.
ఎన్ను కున్న నరుల యెనుగులో పడదోసె
ఎన్ని కైన నేత యెదిగ పోయె
రాజ కీయు లిపుడు రాటు దేలె!
111.
స్వార్ధ చింత నేత సమరము చేయను
పచ్చ నోట్ల పంచి పాగ వేయ
వచ్చు చుందు రికను వారించినను గానీ
రాజ కీయు లిపుడు రాటు దేలె!
112.
బీద జనుల వంచ బిచ్చ గాండ్లుగ మార్చ
కేటు గాళ్ళు యుండె కాటు వేయ
ముట్టు కోరు యెవరు మోస నాయకులను
రాజ కీయు లిపుడు రాటు దేలె!
113.
చేయు మోస మాపి మాయ జేయుట మాని
ఉన్న దంత పంచి నూర కున్న
మోక్ష మొందు నేత మోదము పొందును
రాజ కీయు లిపుడు రాటు దేలె!
114.
ఓడ లేదు మీరు వోటరయ్యలు రండి
ముదము తోడ వోటు ముద్ర వేసి
ఎన్ను కుంద మయ్య దన్నుగ నేతలన్
రాజ కీయు లిపుడు రాటు దేలె!
115.
చీము నెత్తురుంటె చీవాట్లు పడకుండ
వేగిరముగ రండి వేయ వోటు
మంచి నేత నెంచి మనుగడ సాగించ
రాజ కీయు లిపుడు రాటు దేలె!
116.
లెండి లెండి నిదుర లెండి వోటరులార
బద్దకమును వదిలి భాద్యతెరిగి
నీతి యున్న నేత నెన్నుకుందము రండి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
117.
కంచె చేను మేయ కావలేమియు చేయు
సర్కరండ నుంటె సాగు నంత
ఉచిత మనుచు నేత నూరడించు జనుల
రాజ కీయు లిపుడు రాటు దేలె!
118.
స్వార్ధ చింత తోటి సమరము సాగించె
స్వంత లాభ మెంచి పంధ మార్చి
నేత నికను పొగుడు నిత్యము ప్రీతితో
రాజ కీయు లిపుడు రాటుదేలె!
అదియు చేస్త ననుచు నిదియు చేస్తననుచు
కాల మెల్ల దీయు చల్ల గాను
ఎన్నికలపుడొచ్చు చిన్నగ నేతలు
రాజకీయు లిపుడు రాటుదేలె!
120.
కష్ట కాల మందు కరుణ చూపనువచ్చు
నటన నదియనియును నరులెరుగరు
ఉచిత మనగ జనులు నురుకులు పెట్టేరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
121.
కాల మంత గడిచె కష్టమే మిగిలుండె
కల్ల బొల్లి కథలు కలత పెంచె
ఓటు వేయ రండి నోడించ దొరలను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
122.
కండువేసుకునిరి కబ్జచేయను భూమి
కుఠిల రాజ కీయ కుళ్ళు నేర్వ
నేత పక్క చేరె నిత్యము పొగడను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
123.
ధరణి నేలు వారు ధర్మాత్ములైనను
మేలు జరుగు కొంత మెరుగు గాను
మోస గాళ్ళ వల్ల గోసలు తప్పవు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
124.
వచ్చే వచ్చె నదిగొ వచ్చె ఖద్ధరు నేత
తెచ్చె తెచ్చె నోట్లు తెచ్చె కార్ల
పంచు నైదు వేలు పారదర్శకముగ
రాజ కీయు లిపుడు రాటుదేలె!
125.
నీది నీకు పంచి నేత నాది యనిన
మురిసి పోతు నుండె నరుడు నేడు
రాజ్య హక్కు ననిచి రాజ్య మేలుతునుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
126.
ప్రజలు పేద లనియు రిజరువేషన్లకు
బాబ సాహెబయ్య పట్టు బట్టె
పదుల యేండ్లు గడిచె వదలకుండెను నేత
రాజ కీయు లిపుడు రాటుదేలె!
127.
పేద శ్రమ నేడు పెద్దనేతలు దోచె
పంచ కొంత నైన పాటు పడరు
చంద్ర మండలములొ జాగలూ వదలరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
128.
నేడు చట్ట ముండి నేమిటి లాబంబు
ప్రజల కేమి మిగిలె పాచి తప్ప
ఎక్క డేసి నట్టి గొంగళక్కడెనుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
నేత సచ్చి పోతె నిలబెట్టె నెవరినో
కోడ లైన యాలి కొడుకు నైన
పోటి నందు గెలిచి వోట్లను దండను
రాజ కీయు లిపుడు రాటుదేలె!
130.
రాజు సొమ్ము యంత రాళ్ళ పాలన్నట్లు
ప్రజల డబ్బు కొంత పంచి పెట్టి
ప్రభుత బలము కొరకు పాతిపెట్టిరి వృధ్ధి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
131.
పార్టి ఫండు కొరకు పదిలముగ జనులు
ఎంత నైన యివ్వ నెవరు యేమి
చేయ కుండ కొత్త సెక్షనులనుతెచ్చె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
132.
నేత యెత్తు గడలు కొత్త పుంతలు తొక్కె
పన్ను నెగను వేయ పలువురెంచె
నేడు తల్ల డిల్లె ఫండు వల్ల జనులు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
133.
మాట తప్పు నేత మరల గెలువ కుండ
నిలువ రించ వలెను నిక్కముగను
కొత్త నేత రేపు కొంతైన భయపడు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
డబ్బు పంచుటమనె జబ్బును వీడక
ఎన్నికలను పెట్టి యేమి ఫలము
జమిలి యెన్ని కైన చాకిరి తప్పదు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
135.
వందల యెకరాలు బొందలకాడమ్మి
చేస్తి పోటి ననుచు చెప్పుకొచ్చె
నేరమని తెలిసియు నిప్పులు చిమ్మిరి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
136.
నేత మార కుండ నేమి మార్చు జనుల
బానిసలను జేసి బాదు తుండు
పన్ను పెంచి తేట జున్ను జుర్రుతునుండు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
137.
పండుగలపుడొచ్చి పలకరించు జనుల
ఓట్ల కొరకు యెన్నొ పాట్లు పడుతు
కలిసి పోవు నచట కులమును యెంచక
రాజ కీయు లిపుడు రాటుదేలె!
138.
ప్రభుత పథకములకు పట్టువిడుపులేక
కులము పత్రమనుచు మెలిక బెట్టు
ఓటు మూట కొరకు మాటు వేయుచునుండు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
139.
దేశ మేలు వారు దైవ స్వరూపులు
ననుచు జనులు కొలుచు ఘనము గాను
స్వార్ధ మెంచి నేత సాగించె పాలన
రాజ కీయు లిపుడు రాటుదేలె!
140.
ఎన్ని కపుడు యికను ఎన్నికలధికారి
పట్టు కునిరి డబ్బు గుట్టు గాను
ప్రజలు నెరుగ కుండె పట్టుబడిన డబ్బు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
141.
ఖర్చు పెడితి ననియు కఠినముగ చెబుతు
దొరల లాగ నేత దోచుకున్న
చట్ట సభలు చూస్తు పట్ట నట్లే నుండె
రాజ కీయు లిపుడు రాటుదేలె!
142.
దోచి నట్టి డబ్బు దాచిన సంపద
ఖర్చు బెట్ట నేత కదులు తుండు
ఓట్ల నన్ని కొనుచు వోటర్ల నేడ్పించ
రాజ కీయు లిపుడు రాటుదేలె!
143.
కాటి కెల్లు నేత కడసారి ననిచెప్పి
పోటి చేయు తోటి వాడి లాగ
మాట మార్చు తుండు మరల యెన్నికలపుడు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
జనత తలుచుకుంటె జగతి మారు
వేచి చూస్తు నుండె వేయనికను వేటు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
145.
నోట్ల కెపుడు నీవు వోట్లను వేయొద్దు
ఓట్ల కిచ్చు నోట్లు చేటు గనుక
ఐదు వేలు చేయు నైదేండ్లు బానిస
రాజ కీయు లిపుడు రాటుదేలె!
146.
సార పోసి మిమ్ము సాగదీయును నేత
చుక్క కెపుడు మీరు చిక్క వద్దు
పిట్ట కథల కెపుడు బెనక రాదు జనము
రాజ కీయు లిపుడు రాటుదేలె!
147.
కోడినిస్త మనియు కొలువు లిస్తామని
భూమి నిస్త మనుచు ధీమ నిచ్చు
బుజ్జ గించ వచ్చు మజ్జిగ పోసియు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
148.
ఓటు విలువ తెలిసి నోటమి చూడకు
భావి తరము వారి భవిత నెరిగి
మంచి నాయకుడిని యెంచియు గెలిపించు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
149.
ఓటు జన్మ హక్కు నోటుకు మురువకు
ఖద్ధరు మనుషులతొ యుద్ద మొద్దు
నీతి, విద్య యున్న నేతకే వోటేయి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
150.
ఎన్నికపుడు వచ్చు యెర్రోళ్ళు జనులని
కులము మతము లనుచు కుల్ల బొడుచు
పచ్చ నోట్ల పంచి పచార్లు జేసేరు
రాజ కీయు లిపుడు రాటుదేలె!
151.
రాజ కీయ మందు రారాజులున్నారు
తలలు పండి నట్టి కులము వీరు
ఓటు నొదులు కుంటె నోట గొట్టును మట్టి
రాజ కీయు లిపుడు రాటుదేలె!
152.
ప్రజల పన్ను తోటి పధకములను బెట్టి
పధకములకు పెట్టె పరుల పేర్లు
న్యాయ మెచట నుండె మాయమై పోయెనే
రాజ కీయు లిపుడు రాటుదేలె!
153.
డెబ్బదైదు యేండ్డ్లు దబ్బున గడిసెను
నూరకుంటె గడుచు మర్లొకైదు
గట్ల నుంటె యిగను యెట్లగ బ్రతుకులు
కదిలి రండి జనులు కసితీర నోడించ
రాజ కీయులిపుడు రాటుదేలె!
154.
సిగ్గు యెగ్గు వదిలి నక్కి నక్కియు వచ్చు
మోస పుచ్చ జనుల గోస పెట్ట
ఇల్లుయిల్లు తిరుగి వల్లకాడును చేయ
రాజ కీయులిపుడు రాటుదేలె!
155.
అయ్య అవ్వ నంటు భయ్య యనుకుంటు
ఓటు నడుగు నేత నోటు నిచ్చి
గోము గాను పలుకు గోముఖవ్యాఘ్రము
రాజ కీయులిపుడు రాటుదేలె!
156.
దోచి నట్టి సొమ్ము పంచియు కొంతను
కార్యకర్తలకిక సార పోసి
కండ బలము జూపి కాకబట్టు జనుల
రాజ కీయులిపుడు రాటుదేలె!
157.
ఎవరి డబ్బు నేత యెవరికి నిస్తుండు
ప్రజల సొమ్ము తాను పంచు తుండు
జనుల వోట్ల తోటి జగతి నేలుతునుండె
రాజ కీయులిపుడు రాటుదేలె!
158.
ఉచిత ముంటె మేలు నూతమివ్వను పేద
బ్రతక నేర్పు తుంటె బాగుపడును
వృత్తి విద్య పెంచ నుధ్యమించ వలెను
రాజ కీయులిపుడు రాటుదేలె!
ఎన్నికలలొ ఖర్చు యెంతైన పెడుతారు
గద్దెనెక్కిదోచి గాదెనింప
పీకి వేయు గుడిసె పేదవాడైన తెగించి
రాజకీయంలిపుడు రాటుదేలె!"2"
ప్రకృతి యిచ్చె వరము పడతికి యందము
అంద మాయె నేడు బంధిఖాన
పీక్కు తినను జనులు నక్కలవలె చుట్టు
విజ్ఞులెదురు తిరుగ వీడు చీడ
ఆ.వె:
జాతకముల జూసి వేద మంత్రాలతో
జరిగె పెళ్లి ఘనము జనుల ముందు
యేడు గడువ లేదు యేకాకి యాయిరి
మనసు నెరుగ కుండ మనువు యేల!
ఆ.వె:
ఎంత వుంది నీకు యేమి తిన్నదికాదు
బ్రతికి నన్ని యేండ్లు చెదిరి పోక
త్రుప్తి నుండ గోరు తృష్ణను దీర్చను
అదియె జీవితంబు మదిన నిలుపు!
No comments:
Post a Comment