SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Saturday, January 9, 2021

కంద పద్యాలు - 50

                        కంద పద్యాలు 



 *కంద పద్యం-01*

🪴🪴🔥🪴🪴


పుడమిన తెలివిప రులుగను
మేడలొ యన్నను యెపుడునుమేలును కల్గున్.

జడులను జేయగ కొందరు
వడివడి గాయడు గిడుచును వదురుదురింకన్!.

 *కంద పద్యం-02*

🪴🪴🔥🪴🪴

మాలలు వేసుకునినరో 
జుల్లొకనబడిన సాముల సుగుణము లన్నిన్! 

ఫలము నుండును సాములు
మాలలు విడిచిన తదుపరి మారితెనటులన్!


*కంద పద్యం-03*

🪴🪴🔥🪴🪴


దానపు నడవడి తోడను 
మనుగడ యెంతో మనిషికి మంచిగ యుండున్ 

దానము  మనసున  నిండిన 
మనుషులు మనకూ జాతికి మంచిగ యుండున్ 


*కందం -04*

మనుషులు మోసము తోడనె  
జనులను మార్చి  మణులతొ జయమును పొందెన్

మనుషులు పిరికి తనముతొ  
పనులును  లేకను భయముగ బతుకుచు  నుండెన్     

*కంద పద్యం-05*
🪴🪴🔥🪴🪴

కులమును  కాని వనితతో  
కలిసుండియు బతుకవచ్చు  కలహము లేకన్ 

కులమని సంఘము యెదుటనె    
కలహించెటి వారినింట ఖలులని తోయన్ 


*కంద పద్యం-06*
🪴🪴🔥🪴🪴

మధమున  ఖలులు కొందరు 
పదునైనది నాలుకనిన బాధను కుందుర్ 

పదునుగలదైన నాలుక 
నదుపు లోపెట్టకున్న నాడులు చిట్లున్ 


*కంద పద్యం-07*
🪴🪴🔥🪴🪴

ధనములు నీయెడ యున్నను
జనులకు సాయము తలచుట జాలిగ నుండున్ 

ధనములు  లేకున్నయెడల
మనమున  తలచియు గడపుట మంచిగ నుండున్


*కంద పద్యం-08*
🪴🪴🔥🪴🪴

ప్రతి మనిషికైన నుండును
మిత్రులు శత్రువులు నిలన మితముగ నైనన్ 

శత్రువులు లేని మనుషులు 
మిత్రులు గలవారు జగతి మిక్కిలి లేరున్


*కంద పద్యం-09*
🪴🪴🔥🪴🪴

స్నేహితుడు కుబేరుడయిన
సహించునని చెడు తలచక సహనము నుండున్

స్నేహితుడు కుచేలుడయిన
మహామహుడనియు తలంచి మర్యాద చేయున్


*కంద పద్యం-10*
🪴🪴🔥🪴🪴

నిప్పుల పొయ్యితొ వంటలు 
మెప్పును కలిగించు చుండు మేలును చేయున్ 

నిప్పుల వలనే జనులకు
ముప్పులు కూడనిల యుండు మురువ కుండున్


*కంద పద్యం -11*
🪴🪴🔥🪴🪴

అందము చందము విద్యయు ,
బంధములో వెతక  నేది బాసట నుండున్

అందము చందము విద్యయు ,
బంధమునను బంధమేను బాసట నుండున్


*కంద పద్యం -12*
🪴🪴🔥🪴🪴

గలగల సెలయేరుండగ
మలమల వస్తువుల ధరలు మండుతు నుండెన్

జలజల వర్షము కురువగ  
బల బల నీరును గుడిసెల పారుతు నుండెన్


*కంద పద్యం- 13*
🪴🪴🔥🪴🪴

రాజులు పేదల మేలును
నిజముగ కోరుతు తపించ నిలకడ గుందుర్

రాజుల యెడలన జనులును
భజనపరులసలవకుండ భాసట నుందుర్


*కంద పద్యం-14*
🪴🪴🔥🪴🪴

గొప్పలకెళ్లియు  మనుషులు 
అప్పుల బారిన  పడినచొ  అలుసగు చుందుర్  

అప్పులె  యేదొక రోజున
ముప్పులు  తెచ్చును  నిజముగ  మునుగుచు  నుందుర్ 


*కంద పద్యం-15*
🪴🪴🔥🪴🪴


కన్న కొడుకులకు వృద్ధుల్
మన్నన  తలిదండ్రియెడల  కనికర మున్నన్

కన్న తలిదండ్రి  దీవెన   
కన్న కొడుకులను నెపుడును  కనిపెడుతుండున్


*కంద పద్యం-16*
🪴🪴🔥🪴🪴

మనవారనిచెబు  కుంటునె
ధన బలముతొనిల  జనులను  దగలను  చేసెన్

ఘన కీర్తిని పొందాలని
ధనమును నచ్చిన విధముగ తడుపుతునుండెన్


*కంద పద్యం-17*
🪴🪴🔥🪴🪴

కులములు గోత్రములనియును
బలములు చూపుతు ఘనులునె  బంధము  వేసేన్ 

కులములొ  బంధువు గతిస్తె
గళములు మూసుకునెకనులు కానక  నుండెన్ 

*కంద పద్యం-18*
🪴🪴🔥🪴🪴

మిద్దెల కొరకును బంధువు
పెద్దల మాటల వినుటను పెడచెవి పెట్టెన్

ముద్దను చూసియు మింగను
వృద్దులయిననూ మనసులొ వుడుకుచు నుండెన్


*కంద పద్యం-19*
🪴🪴🔥🪴🪴

మనసును గాయము చేయుట
మనకునొక గడియను చాలు మదిలొమెదిలినన్

మనసును గెలువను వచ్చును
గుణమును ఫణముగను పెట్టి కుదురుగ నుంటెన్

*కంద పద్యం-20*
🪴🪴🔥🪴🪴

మనసులొ యిష్టపడిపనిని
మనమే చేసిన కఠినము
మనిపివ్వదుగా

మనసున  పట్టుదలుంటెను
మనమే గెలువాలనుకసి మసులుతు నుండూ

*కంద పద్యం-21*
🪴🪴🔥🪴🪴

రైతులు లేనటులైనను 
మెతుకులు నుండవు జనులకు మెదిలియు చూడున్

మెతుకులు లేనటులైనను
బతుకులు నుండవు నెవరును బతుకను లేరున్  

*కంద పద్యం-22*
🪴🪴🔥🪴🪴

దొంగగ పూజలు చేయుచు
లంగగ నుండియు తిరుగుట లాభము లేదోయ్!

కొంగ జపముతో కార్యము
భంగము చేయక జగమున బలుపులు మానోయ్!

*కంద పద్యం-23*
🪴🪴🔥🪴🪴

పంతము గెలువను మూర్ఖుడి
పొంతన చేరిన అహమును , పొగరును వీడున్!

నంతట నేనే  నేతని
సంతస ముగనిల జనులతొ సమరము వీడున్


*కంద పద్యం-24*
🪴🪴🔥🪴🪴

బంధము కొరకని చెప్పిన
అందము నుండుననినెవరు అనినను కుదురున్

నందమునఖలులకుఒల్లు
మందము నయినను మరలను మాడలు పగులున్

*కంద పద్యం-25*
🪴🪴🔥🪴🪴

బతుకులు నావని ననియును
మెతుకులు నావని తలచియు మెరిసిన చూడున్

అతుకుల బతుకులు తప్పవు
గతుకుల రోడ్డున నడుచుతు గడుపుతు నీవున్


*కంద పద్యం-26*
🪴🪴🔥🪴🪴

వచ్చును ఎన్నికలు మరల
గుచ్చును పన్నులు జనులకు గునపము లాగున్

నచ్చిన నాయకులు జనులు
మెచ్చిన రీతిన గెలిచిన మెరుగుగ నుండున్

 
*కంద పద్యం-27*
🪴🪴🔥🪴🪴

ప్రేమలు పంచిన పెరుగును
ప్రేమలు తుంచిన విరుగును పెలపెల నిలనన్

ప్రేమలె నన్నిట మూలము
ప్రేమలు వీడిన మనసులు పెంచును పగలున్

*కంద పద్యం - 28*
🪴🪴🔥🪴🪴

కట్నము ఎక్కువ వచ్చని
పట్నము కొడుకుల చదువను పంపెను గదరన్

రత్నము లాంటీ కొడుకులు
పట్నము వచ్చియు  తిరుగుతు భారము నయ్యెన్

*కంద పద్యం-29*
🪴🪴🔥🪴🪴

ఎంతగ యెత్తుకు ఎదిగిన
అంతగ వొదిగి జగమున అనుకువ నున్నన్

చింతలు లేకను నిలలో
అంతము వరకును మనుజులు హాయిగ నుందుర్

*కంద పద్యం-30*

తల్లియె గదనొక తరువౌ
మల్లియు పుట్టదు జగమున మనసున తలచిన్

చల్లని  మనసుతొ  నిండిన
తల్లియె పెంచును మనలను తడబడ కుండన్

*కంద పద్యం-31*

చస్తె వెలుతవు స్వర్గము
మస్తను వద్దకు పదండి మరిచియు పోకున్

యిస్తడు పత్రము, లక్షలు
యిస్తెను నేరుగ గబగబ యిస్తడు చూడున్

*కంద పద్యం-32*

గొప్పగ  విద్యను నేర్చియు
తప్పుడు నడకలు నడిచిన తక్కువ నవుదుర్

చెప్పుడు మాటల వినియును
చప్పుడు చేసిన విలువలు సాకిల పడెరన్


*కంద పద్యం-33*

మహిళలు కారెపుడు అబల
మహిలోనగనుము నిజముగ  మరువక నుండున్

మహిళలెపుడునూ సబలలె
సహిష్ణువు నీవే మరింత సహనము నుంటెన్


*కంద పద్యం-34*

దుప్పటి నుండును వరకే
కప్పుకునుమనుజులునిలన కలిమిగ నుందుర్

తిప్పలు జనులకు పెడితే
చిప్పలు పట్టుక తిరుగుతు చితికిల పడుదుర్

*కంద పద్యం-35*

పుట్టునపుడెవరు నేమియు
పట్టుకునియురారు యిదియును పచ్చినిజంబున్

గిట్టునపుడిలననేమియు
పట్టుకునిపోరు ధనములు పదిలముగ  నుండున్

*కంద పద్యం-36*

భర్తకు తోడుగ భార్యయె
కర్తగ ఇంటిలొ పనులను కలిసియు చేయున్

ధూర్తుల మాటలు బయటకు
వార్తలుగవినపడకుండ భర్తతొ మెదులున్

*కంద పద్యం-37*

ఎవరికి వారలె ధీరులు
ఎవరును నొకరికి గులాము ఎన్నడు కారున్

ఎవరును ఏమియు చెప్పిన
ఎవరును కాదనినకూడ ఇదియే నిజమున్

*కంద పద్యం-38*

పొలములొ గిట్టని మొక్కల
కలుపును తీయుము వడిగను ఖఠినమునైనన్

కలతలు ఎన్నియు నున్నను
తలుపులు మూయకు నెపుడును తలిదండ్రులకున్

*కంద పద్యం-39*

కరొనా  విషమును జిమ్ముతు
పరుగులు తీయగ  జనులును పాణము లొదిలెన్

మరలను తాకక మునుపే
కరొనాకతిదూరముండి గడుపుట మేలున్

*కంద పద్యం-40*

కరోన పోయెనని జనులు
మురిసియు పోయిరి నిజముగ ముదముతొ నిలనన్

మరలను  వచ్చెను మాయది
కరోన మనలను కలిసియు కబలించగనన్


*కంద పద్యం-41*

కోపము వలనే నష్టము
కోపము వలన ఇతరులకు కోపము పెరుగున్

కోపము మర్మము నెరుగుము
కోపము విడిచిన సుఖములు కొల్లలు నుండున్

*కంద పద్యం-42*

నమ్మకము కత్తి లాంటిది
నమ్మకమనుచాకు ఫలము నరమును కోయున్

నమ్మకముతోడ నడువుము
నమ్మకముపోయె జగతిన నరుడు నెగలడున్

*కంద పద్యం-43*

అన్నియు నుండెను లింకులు
ఎన్నియు నున్నను అవినీతి ఎవరును నాపెన్

చిన్నగ నేతలు దోయుచు
అన్నము మెతుకుల జనులకు ఆకుల విడిచెన్

*కంద పద్యం-44*

కూతలు ఎన్నియొ కూసిరి
నేతలు ఎన్నిక సమయము నెనరుల చూపెన్

వాతలు పెడుతూ పన్నుల
మోతలు మోపియు జనులను మోసము చేసెన్


*కంద పద్యం-45*

ఆధార్ పానుల జతలకు
కదిలిరి ప్రజలు పరుగుతొ కలిపిరి వాటిన్

అదరరు బెదరరు నేతలు 
ఆధార్ పానులు కలిపిన ఆపరు తినుటన్


*కంద పద్యం-46*

నేతలు దోచిరి సంపద 
పీతల వోలెన్ జనులను పీల్చుకు తినెరన్

దాతల నిధులని నరులకు
కథలను చెప్పిరి , బినామి దాయగ ధనముల్

*కంద పద్యం-47*

వలపుతొ నున్నపుడేకథ
చిలుక వినుటకు మురిపముతొ చెవులను విచ్చున్

కలతలు రేగిన రోజున
మెలికలు పెట్టియు నిలువుగ మేనును వంచున్

*కంద పద్యం-48*

గతములొ ఉగాది శార్వరి
చిత్తుగ చేసెను జనులను చివరివరకునన్

నూతన ఉగాది వచ్చెను
ఉత్తముగప్లవ జయించ ఊపిరి పీల్చన్


*కంద పద్యం-49*

మనసున్నవాడు తెలివిగ
మనుషుల సులువుగ నెరిగియు మనసులొ కొలుచున్  

మనసే తెలియని మనుజులు
మనసున మంచిని  నిలుపక  మహిలో  మండున్  


*కంద పద్యం-50*

గలగల కురిసే వర్షము
జలజల జారు చెరువులకు జలములు నిలనన్

సలసల కాగిన నీటితొ
మలమల మాడియు కరోన మాయమగునిలన్









No comments:

Post a Comment