సీస పద్యాలు
*వ్యవసాయ చట్టాలపై రాజకీయాలు-01*
సీ.ప :
నేతల పాలన నెరుగక నుంటిమి
పాలించునప్పుడు పాడు నొకటి
ప్రతిపక్షములొనున్న పాలక పంచనే
రాల్చిరి కన్నీరు రాసె లేఖ
వ్యవసాయచట్టాలు వర్ధిల్లవలెనని
నేడుచాటుననుండి నీరు గార్చె
జనుల వోట్ల కొరకు జాలిని చూపిరి
స్వార్ధనేతలవల్ల సాగిలబడెవృద్ధి
తే.గీ:
నేత దుర్భుద్ధిని జనులు నిగ్గు తేల్చి
కుటిల నైజపు వారల కుత్సితములు
కట్టడినిజేయ నైదేండ్ల కాలమంత
మేధనెన్నుకొనవలెను మేలుజేయ
*రాజ్యాంగ రచన-2*
సీ.ప :
భారత రాజ్యాంగ భాద్యత గుర్తించి
ఘనబాబ సాహెబు గర్వముగను
దేశదేశములందు దేశాధి నేతల
సంప్రదించెనుతాను సాధరముగ
రాజ్యాంగ డ్రాఫ్టుల రాజ్యాధి నేతలు
యివ్వగా కమిటీని యెర్పరిచియు
అధ్యక్షుడాయెను నంబేద్కరుడొకడే
రచియించె రాజ్యాంగ రచన నంత
ఆ.వె :
నాటి చట్టములకు నాయకులెల్లరు
సవరణలుజరిపిరి చట్టసభలొ
ప్రజల సంపదలను పంచుకు తినుచుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
*ధరణి పోర్టలు-3*
సీ. ధరణి పోర్టలనొచ్చె దద్దరిల్లె జనులు
ఆగమవుతునుండ్రి యాడ చేరి
స్లాటులు దొరకక సహనమ్ము కోల్పోయె
సరిచేసినను నవి సాగ కుండె
ఎవరికర్ధమగునో ఎప్పుడు తేలునో
నిపుణులు కూడను నిమ్మకుండె
అన్నిరిజిస్ట్రేష లవకతవకలాయె
మేధలెల్లరుకోర్టు మెట్ల నెక్కె
ఆ .వె. అడుగొద్దనియును హైకోర్టు చెప్పిన
అదర కుండ కులము నడగ బట్టె
యెల్లరెసుల వలన యెల్లరు భీతిల్లె
రాజకీయులిపుడు రాటు దేలె!
*వ్యవసాయ చట్టాలు-4*
ఐదారు నెలలును ఆర దీసె
సీ. ఎన్నియో మార్పులు యేమివిచిత్రాలు
యిదికలా నిజమేన మదిన నమ్మ
గతములో చూడలే కలియుగ మాయలు
నేత లందరు కూడియు నేడు చేయు
నిర్ణయమునుచూసి నిలిచెను జనులెల్ల
బారులు గనుచేరె బాట నిండ
నిందలు తొలగించు నిర్ణయములతోడ
సాయిబాబగుడికి సాగి వచ్చె
తే. గీ. యెంత చిత్రము నిదియు యేమి వింత
నమ్మ లేకను జనులు నలిగి పోయె
దేశ మంతయు నిటులైన తేలి కవ్వు
జనుల గొడవలు యన్నియు చల్ల బడునె
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
సీ. పిచ్చి తలకుయెక్క పిచ్చివారయిపోయె
అహంబు మూర్ఖుల ఆవ హించె
మనిషిగా పుట్టినా మరిచెమానవతను
యెవరిఅండతొ నేమొ యెమతెగబడె
గుడులను కూల్చుతూ గుట్టుగా నుండిరి
రథమును కాల్చుతూ రంకె లేస్తు
పాపపు సొమ్ముల పంచుకునదలిచె
దుష్టమూకరులను దుమ్ము దులుప
తే. గీ. హిందువులుకల్సి కఠినంగ హెచ్చరించ
కూటమైపోవలెనికను కూల్చ కుండ
గుట్టు తేల్చాలి దుష్టుల, గురువు జాడ
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*సంక్రాంతి సంబురాలు-15*
సీ . సంక్రాంతి పండుగ సంబురంగజరుగు
రంగురంగులముగ్గు రాత్రి నంత
వాడవాడలవేసె వాకిళ్ళ నిండను
గాలిపతంగులు గగన మంత
పక్షుల వోలెను పరుగులు తీస్తుండ
గంగిరెద్దులవారు గాన మూదు
హరిదాసులవారు హరికీర్తనలపాడ
పిట్టలదొరవచ్చి పిలిచి చెప్పు
తే. గీ. భోగి పండుగ రోజున భోగి మంట
కనుల పండుగ సంక్రాంతి గడుచు చుండు
మూడు రోజుల పండుగ ముచ్చటంగ
జరుపుకొనెదరంత జగతి లోన
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
రైతుల నేతల రాతల చర్చించి
కర్షక సొమ్ములు కర్షకులకు
దక్కవ లెననియు తలచి దళార్లను
కట్టడి చేయగ కనికరముతొ
చట్టము చేసిరి చట్ఠసభలలోన
బిల్లులు నయ్యాక గొల్లు మనిరి
ఆ.వె. చట్టములను కుదుప చర్చకు వచ్చిరి
అన్య నేత లెల్ల అభయ మిచ్చె
నాడు నెక్క డుండె నాయక రైతులు
రాజకీయు లెల్ల రాటు దేలె!
*ప్లాస్టిక్ కవర్ల , గ్లాసుల నిషేధం-05*
సీ. ప్లాస్టికు కవరులు ప్లాస్టికు గ్లాసులు
ఆరోగ్యమునకును హాని చేసె
ఆరోగ్యమునకును హాని చేసె
విషపుకవరులను వీడవలెననియు
పలుమార్లు చెప్పిన వాడు తుండె
ననుచు ప్రభుత్వము నాన్చుచు నుండెను
షాపుల వారాలకు శిక్ష వేసె
పుండొక చోటుంటె పూతొక చోటన్న
చందము ప్రభుత్వ చర్చలు సాగబట్టె
ఆ .వె. ముడిసరుకుదిగుమతి ముట్టడి జేసియు
కంపనీలమూసి కాపలుంచ
ప్లాస్టికుకవరులను వాడుట మాగునే
రాజకీయు లెల్ల రాటు దేలె!
పలుమార్లు చెప్పిన వాడు తుండె
ననుచు ప్రభుత్వము నాన్చుచు నుండెను
షాపుల వారాలకు శిక్ష వేసె
పుండొక చోటుంటె పూతొక చోటన్న
చందము ప్రభుత్వ చర్చలు సాగబట్టె
ఆ .వె. ముడిసరుకుదిగుమతి ముట్టడి జేసియు
కంపనీలమూసి కాపలుంచ
ప్లాస్టికుకవరులను వాడుట మాగునే
రాజకీయు లెల్ల రాటు దేలె!
*కరోనా వలన ఉపయోగాలు -06*
సీ. హామీలు మాటలు అటకలు ఎక్కించె
అంధకారమయెనే ఆశ లన్ని
ప్రయివేటు టీచర్లు ప్రయివేటు ఉద్యోగి
కాంట్రాక్టు ఉద్యోగి కలత చెందె
పనులేమి లేకను పస్తులు యుండిరి
కోవిడు వలనను కొంత నయిన
జీతాలు అందక జీవులు విడిచిరి
అధ్యాపకులెల్లరు అలక యుండె
ఆ .వె . హామి అమలు చేసి ఆదుకుంటె బాగుండె
బాల బాలికలకు బాట వేసె
టీచరుల గురించి యోచన చేయాలి
రాజకీయు లెల్ల రాటు దేలె!
సీ.
చైనాలొనకరొన చెడుగుడు లాడుతూ
విస్తరించెనునంత విస్తు నొందె
ఖండ ఖండాలలో కభళించె జనులను
అమెరికా నంతయు నట్టుడికెను
లాకుడౌను డిస్టెన్సు లాఠిశానీటైజు
జాగ్రత్త వల్లనే చాల తగ్గె
యి కరోన జనులకు యిబ్బంది కలిగించె
అయినను యెన్నెన్నొ అర్ధ మయ్యె
తే .గీ . బంధు మిత్రువులుఎవరో బాగ తెలిసె
పొదుపు పెరిగెను కాలుష్యం పోయె నెటులొ
కలహములుతగ్గె ఇంటిలో ఖర్చు తగ్గె
కూడి యుండె కుటుంబాలు కూర్మితోడ
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
జాగ్రత్త వల్లనే చాల తగ్గె
యి కరోన జనులకు యిబ్బంది కలిగించె
అయినను యెన్నెన్నొ అర్ధ మయ్యె
తే .గీ . బంధు మిత్రువులుఎవరో బాగ తెలిసె
పొదుపు పెరిగెను కాలుష్యం పోయె నెటులొ
కలహములుతగ్గె ఇంటిలో ఖర్చు తగ్గె
కూడి యుండె కుటుంబాలు కూర్మితోడ
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*ప్రయివేటు టీచర్ల వెతలు-07*
సీ. హామీలు మాటలు అటకలు ఎక్కించె
అంధకారమయెనే ఆశ లన్ని
ప్రయివేటు టీచర్లు ప్రయివేటు ఉద్యోగి
కాంట్రాక్టు ఉద్యోగి కలత చెందె
పనులేమి లేకను పస్తులు యుండిరి
కోవిడు వలనను కొంత నయిన
జీతాలు అందక జీవులు విడిచిరి
అధ్యాపకులెల్లరు అలక యుండె
ఆ .వె . హామి అమలు చేసి ఆదుకుంటె బాగుండె
బాల బాలికలకు బాట వేసె
టీచరుల గురించి యోచన చేయాలి
రాజకీయు లెల్ల రాటు దేలె!
****
*శ్రీ మధు సూదన్ గారు అభినంద నీయులు-08*
సీ. ఇంటికి పెద్దవై ఇంటిల్లి పాదివై
పెద్దతనముతోడ పెరిగి నావు
చిన్న నాడేకన్న నాన దూరమవగా
సకల కష్టాలతో చదివి నావు
యెమ్మేను చదివియు ఎన్నియో సాధించి
తొలినుండియేనీవు తోడబుట్ల
కన్న బిడ్డలలాగ కాపాడి నావయ్య
అమ్మనలరిస్తివి ఆలితోడ
తే. గీ. కలిసి ఆదర్శ వంతమై నిలిచి నావు
అన్న దమ్ములు నిత్యము అనుస రించె
చెల్లి పెళ్ళియు జేసియు చేర దీయ
నింగి నీకీర్తి కెరటాలు నెగిసి పోయే
నీవె మధుసూదనా!నీకు నీవె సాటి
సీ. ఇంటికి పెద్దవై ఇంటిల్లి పాదివై
పెద్దతనముతోడ పెరిగి నావు
చిన్న నాడేకన్న నాన దూరమవగా
సకల కష్టాలతో చదివి నావు
యెమ్మేను చదివియు ఎన్నియో సాధించి
తొలినుండియేనీవు తోడబుట్ల
కన్న బిడ్డలలాగ కాపాడి నావయ్య
అమ్మనలరిస్తివి ఆలితోడ
తే. గీ. కలిసి ఆదర్శ వంతమై నిలిచి నావు
అన్న దమ్ములు నిత్యము అనుస రించె
చెల్లి పెళ్ళియు జేసియు చేర దీయ
నింగి నీకీర్తి కెరటాలు నెగిసి పోయే
నీవె మధుసూదనా!నీకు నీవె సాటి
*వివాహాల ఎంపిక-10*
సీ. మనవివాహములన్ని మనజీవితములోన
అరుదైన ఘట్టాలు ననుట నిజము
అరుదైన ఘట్టాలు ననుట నిజము
మరెపుడూ దొరకని మధురాను భూతిది
ఆలస్యమయినను అలక వద్దు
అదిరించ బెదిరించ ఆలకించ వలదోయి
నీకాళ్ళ మీదను నీవు నిలువు
వివరాలు తెలుసుకో వినయము తోడన
తల్లిదండ్రులె మీకు దారి చూపు
తే. గీ. అంద ముందని నస్సలు ఆశ వద్దు
కలిగినకుటుంబమనునట్టి కాంక్ష విడువు
డబ్బు కాశపడినమిమ్ము గబ్బు చేయు
జాతకములును కలిసిన జగడ ముండు
ఆలస్యమయినను అలక వద్దు
అదిరించ బెదిరించ ఆలకించ వలదోయి
నీకాళ్ళ మీదను నీవు నిలువు
వివరాలు తెలుసుకో వినయము తోడన
తల్లిదండ్రులె మీకు దారి చూపు
తే. గీ. అంద ముందని నస్సలు ఆశ వద్దు
కలిగినకుటుంబమనునట్టి కాంక్ష విడువు
డబ్బు కాశపడినమిమ్ము గబ్బు చేయు
జాతకములును కలిసిన జగడ ముండు
నడత కలవక జీవితం నరక మవ్వు
*మనసు* కలసిన పెళ్లిళ్లు మంచిగుండు
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*మనసు* కలసిన పెళ్లిళ్లు మంచిగుండు
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*నేతల ప్రమాణాలు గుడిలోన-11*
యిదికలా నిజమేన మదిన నమ్మ
గతములో చూడలే కలియుగ మాయలు
నేత లందరు కూడియు నేడు చేయు
నిర్ణయమునుచూసి నిలిచెను జనులెల్ల
బారులు గనుచేరె బాట నిండ
నిందలు తొలగించు నిర్ణయములతోడ
సాయిబాబగుడికి సాగి వచ్చె
తే. గీ. యెంత చిత్రము నిదియు యేమి వింత
నమ్మ లేకను జనులు నలిగి పోయె
దేశ మంతయు నిటులైన తేలి కవ్వు
జనుల గొడవలు యన్నియు చల్ల బడునె
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*****
*అన్నా చెల్లెOడ్లు కొంటే దొరకరు-12*
సీ. యెన్నోమతస్థులు యెన్నోకులస్థులు
నివసించె జగతిన నిశ్చలముగ
బంధుమిత్రువులెల్ల బారీగ నెట్లన
వధువొక దేశము వరుడు నొక్క
మతమైననువివాహ మాడిన చెల్లియు
మరదలు, తండ్రియు మామ, వారి
తల్లి అత్తయ్యేను తనయుడు బంధువే
కాని, అమ్మన్నాన అక్క చెల్లె
తే. గీ. అన్న చెల్లెలెక్కడెతుక అరిచి పిలువ
జాడ వెదికినా దొరుకరు జగతి లోన
అన్న దమ్ముల తోపాటు అక్క చెల్లె
ప్రేమలనురాగములనిల పెంచ వలెను
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*****
*విగ్రహాల కూల్చడం మూర్ఖత్వం -13*
అహంబు మూర్ఖుల ఆవ హించె
మనిషిగా పుట్టినా మరిచెమానవతను
యెవరిఅండతొ నేమొ యెమతెగబడె
గుడులను కూల్చుతూ గుట్టుగా నుండిరి
రథమును కాల్చుతూ రంకె లేస్తు
పాపపు సొమ్ముల పంచుకునదలిచె
దుష్టమూకరులను దుమ్ము దులుప
తే. గీ. హిందువులుకల్సి కఠినంగ హెచ్చరించ
కూటమైపోవలెనికను కూల్చ కుండ
గుట్టు తేల్చాలి దుష్టుల, గురువు జాడ
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*****
*మారు నెపునుడో నేతలు-14*
సీ. లక్షల పద్యాలు లక్ష్యము తోడను
మార్చను రాసినా మార కుండె
నిలిచుండి చదివియు మలిచియు పారవేసె
పాలించు శాశించు పాలకుOడ్లు
ఆశకోరికలన్ని ఆవరించె నిండుగా
ప్రజలకు తాగించి పాడు చేసె
నేతలు మార్తెనే నేమైన జరుగును
హామీలు యివ్వగా ఆశ పుట్టె
తే. గీ. మారు నెపుడునో నేతలు మంచి జేయ
జనులె మారవలె మనసులో జంక కుండ
ననిచి వేయాలి అవినీతి నాయకులను
మార్చను రాసినా మార కుండె
నిలిచుండి చదివియు మలిచియు పారవేసె
పాలించు శాశించు పాలకుOడ్లు
ఆశకోరికలన్ని ఆవరించె నిండుగా
ప్రజలకు తాగించి పాడు చేసె
నేతలు మార్తెనే నేమైన జరుగును
హామీలు యివ్వగా ఆశ పుట్టె
తే. గీ. మారు నెపుడునో నేతలు మంచి జేయ
జనులె మారవలె మనసులో జంక కుండ
ననిచి వేయాలి అవినీతి నాయకులను
నిజము చెబుతున్న నిక్కముగను
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
సీ . సంక్రాంతి పండుగ సంబురంగజరుగు
రంగురంగులముగ్గు రాత్రి నంత
వాడవాడలవేసె వాకిళ్ళ నిండను
గాలిపతంగులు గగన మంత
పక్షుల వోలెను పరుగులు తీస్తుండ
గంగిరెద్దులవారు గాన మూదు
హరిదాసులవారు హరికీర్తనలపాడ
పిట్టలదొరవచ్చి పిలిచి చెప్పు
తే. గీ. భోగి పండుగ రోజున భోగి మంట
కనుల పండుగ సంక్రాంతి గడుచు చుండు
మూడు రోజుల పండుగ ముచ్చటంగ
జరుపుకొనెదరంత జగతి లోన
కనుము అన్వేషణా! యిది కలియుగంబు
*ఎవరిది అన్యకులమో -16*
సీ.ప.
కులము మతములని కుటిలమైనజనులు
అట్టుడుకుతుండిరి అహము తోడ
వారికులములు వారికే తెలియవు
యితరుల గురించి యీడ్చ వచ్చె
కులం కులములంటు కుంటి సాకులుచెప్పి
భార్యదోకులమని గర్వ పడుతు
కోడలు నెవరినో కొడుక్కు చేసిరి
మీసాలు మెలివేసి మీట నొక్కె
తే.గీ.
భార్య తలిదండ్రి కులమేమొ భార్య కెరుక
కోడలు కులమో ముద్దుగా కొడుకు నెఱుగు
అల్లుడి కులమేమోబిడ్డ అత్త నడుగు
అప్పుడడుగునెవరొతేలు అన్య కులము
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
*చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం-17*
సీ.ప.
బంధువులకు సేవ పంచను మాన్యులు
దాతల నుండియు ధనము కూర్చి
చాత్తాద వైష్ణవ సంఘము స్థాపించె
నిర్మిచె భవనం నర్మ దక్క
బైలాను రాయించి కులాస నిచ్చిరి
పత్రిక మొదలెట్టి పరవ శించె
రామానుజట్రస్టు రానించె సేవలో
సంఘము నడిచెను చక్క గాను
తే .గీ.
మధ్య వచ్చిన నేతలు మాట గెలుపు
ఉనికి నిలుపుకొనుటకును ఉడుము పట్టు
పట్టి ధనమును వెచ్చించ పట్టు బట్టె
సంఘమునుచీల్చె బంధువు సడ్డ మాలె
అవని యందున పావని! ఆలకించు
*దేశంలో ధరలు బగ బగ-18*
సీ. ప.
ధరణిలోనధరలు దడనుపుట్టిస్తుండె
పెట్రోలు ధరలు పెరిగె మట్రoగ
గ్యాసు మొద్దుల ధరలు గగనకుసుమమాయె
రైతులు రణముతో సేద్య మిడిచె
పంతుళ్లు పనిలేక పస్తులే నుంటుండె
జీతాలు రాకను జీవు లిడిచె
యిండ్లవి అద్దెలు ఇరుకున బెట్టగా
భార్య కంటనీరునుకార్చె బాధ తోటి
తే. గీ.
యేడ్చి యేడ్చి జనులగొంతు యెండిపోయె
ఆదుకునునాధుడే లేక అలమటించె
నాయకులె దోచిరి నరుల నాడి పట్టి
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
*శ్రీ వైష్ణవ బంధువు లారా-19*
********************
సీ. ప .
బంధువు జనులార భవబంధువులార
ఆలకించుడుసంఘ నల్లరినిల
పచ్చని సంఘాన్ని బంజరు చేసియు
స్వచ్చమైనకులాన్ని సాగ దీసి
పబ్బము గడుపుట పాడియగునెమీకు
మనబలమునుచూప మంచి మరిచి
ప్రభుతముందరరెండు వక్కలై వెళ్లిన
మేలుయేలకలుగు మేధ కనుము
తే .గీ.
రుసుము తగ్గించి నిధినినే రుజువు చూప
మెంబరులపెంచ నష్టము మెవరి కొచ్చె
సంఘము నిధులు వృద్ధియై సాగు చుండు
బంధువుల పరువు పెరుగుతూ పచ్చ గుండు
అవని యందున పావని! ఆలకించు
*మహా మనీషి డా. మక్కపాటి మంగళ గారు-20*
సీ.ప.
మనసున్న మహిళగ మహరాణి మంగళ
మక్కపాటి యనుట మరువ రాదు
ప్రజలకు సేవలు పంచను స్థాపించె
హృదయ భారతి అవని యందు
సేవల నందిస్తు సీమను దాటిరి
మధరుతెరిస్సాల మాన వీయ
సత్కారములనందె సాహిత్య మందున
ప్రోత్సాహముతొమది పొంగి పోయె
తే.గీ.
జరుపు కార్యములన్నియు జనులతెలుప
స్వర్ణ పుష్పము పత్రిక సరని యెంచి
మాస పత్రిక మొదలెట్టె మంచి రోజు
రాణి కమలతోడునిలువ రాటు దేలె
దేశమునమార్పులవసరం తెలుసుకునియు
కవుల ఉత్సాహ పరిచిరి కలము తీయ
చుక్క రామయ్య సలహాలు చక్కగుండె
అవని యందున పావని! ఆలకించు
*కరోనా కరాళ నృత్యం-21*
సీ.
ఏమిటీ జగమున ఏమివైపరీత్యం
మరణించు నాడన్న మారు చూపు
చూడనోచుకొనక సురుకుపెట్టెకరోన
బయటకు పోకుండ భయము పెంచె
ఒకరినొకరులను ఓదార్చకుండను
అయినవారయినను ఆప్తులయిన
బంధువు మిత్రుల బాధల పెంచియు
ఒంటరులనుచేసి మంటగలిపె
తే.గీ.
ఆప్తులుకనుల ముందురే ఆహుతైన
కదల కుండను చేసెను కఠిన పురుగు
అంతయునువిధి రాతనే అవని లోన
కనుము అన్వేషణా!యిది కలియుగంబు
*తిరునగరి,ఎవరెస్టు శిఖరగిరి-22*
సీ.
తిరునగరిగారు మెరుగురచనలతో
సాహిత్య జగతిలో సాగి పోయె
నవసమాజమునకు నడతను నేర్పగ
ఫలములు విశ్వాన ఫరిడవిల్లె
బహుబాష కౌముది భావరచనలను
విద్యార్థులుచదివి విజయ మొందె
దాశరథి బిరుదు ధారణ చేసియు
అవని వీడియునేగి అమరుడయ్యె
తే. గీ.
ప్రముఖులెల్లరు కీర్తించ పరవశించె
తీరొకకవుల కవితల తీర్చి దిద్దె
రచనలెన్నొరాయడములో రాటుదేలె
అవని యందున పావని!ఆలకించు
సీ.ప : 23
అబ్బబ్బ పాలన నబ్బురముగనుండె
బగబగ ధరలన్ని బగ్గుమనెను
గబగబ నాయకుల్ గడబిడ రాజేస్తూ
బుస్సుబుస్సుమనుచు బుసలుకొట్టె
దడదడ గూండాలు బడితపూజలుజేసి
దబదబ పేదల ధరణి దోచె
లడలడ లిక్కరు గడగడ త్రాగించి
డబడబ తరుముతూ డబ్బు లాగె
ఆ.వె :
విస్కివిస్కీయంటు బిస్కీలు తీయించి
గుట్టుచప్పుడుగను గూడుకూల్చి
ఒట్టుపెట్టితట్టి వోట్లను లాగిరి
బిక్కుబిక్కుమనుచు బిగిసె జనులు
సీ. ప : 24
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప : 25
పండిన ఫలములు పడినట్లు నేలన
ఎండిన ఆకులు వీడు నటుల
పాపాలు మోసాలు పండిన రోజున
దోచినదంతయు పంచు వరకు
తీపిమాటలుచెప్పి తప్పించుకోలేరు
ధనముయున్ననునేమి దానవులకు
విద్యయున్ననువృధా విజ్ఞత లేకుండ
బ్రతికున్న జనులకు భారమేను
ఆ.వె : 26
పుట్టువారునెపుడొ గిట్టక మానరు
దోచిదాయుధనము దొంగపాలె
హంసలాగ బతుకునయిదేండ్లయినగాని
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప : 27
అధికార పార్టితో యవినీత్కి పాల్పడ్డ
ప్రతిపక్ష పార్టిలో పలుకు లేవి
ప్రజలముందర వీరు పబ్బము గడిపేరు
కాలయాపనచేస్తు కసురు కునిరి
పాలకులనెపుడు, ప్రశ్నించకుండను
చేరిపోయిరివారు చెప్పకుండ
దోచుతూ నాయకుల్ దోబూచు లాడిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
గడిచెనైదుయేండ్లు కనబడలె జనులు
మరల నరుల మొక్క మాట మార్చ
ఓటునడుగ వచ్చె నోటుపట్టుకొనొచ్చె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ.ప: 28
నివసించ నీడేది నిరుపేద బిడ్డకు
విల్లాలు నేతకు విస్తు గొలుపె
జిల్లజిల్లాకబ్జ జిగజిగేల్ మనుచుండె
చట్టాలెన్నున్ననూ చుట్టమాయె
మతము చిచ్చునులేపె మరుగునపడకుండె
నిత్యమూ గొడవలు నిగ్గు తేల్చ
మేధజనులెవరు మెదలక నుండిరి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
రాజకీయముంటె రాజభోగమునుండు
పోటితత్వమేది పోరునుండ
రాజ్యమెల్లరైతు రగులుతు నుండిరి
ధరణిపోయెననియు తల్లడిల్లె
సీ.ప : 29
విధిరాత నెవరును నధిగమించనులేరు
చేయుమోసములను దాయలేరు
నన్నిరోజులెపుడు పున్నములుండవు
అమవాస్యలు కూడ యందు నుండు
చదువులనెన్నియో చదివామనుకున్న
ఫలితము యేమిటి కలతతప్ప
దోచుకుననువచ్చి దొరలులాబ్రతకను
నేర్చిరి నాయకుల్ నేర్పుగాను
ఆ.వె :
మంచి చేయ నెంచు మహిలోన జనులకు
చేతలల్ల చూపు కొంతనైన
పనులు జరుగ కుండె పరువేమొ పోతుండె
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీస.మాళిక : 30
రాజ్యంలొ పేదలు రగులుతూ నుండిరి
పనులు లేక జనులు పస్తులుండె
భూములు దోచుతూ బుగులుపుట్టించిరి
పెట్రోలు పన్నులు పిప్పిజేసె
వంద చలానులు వణికించె వేలయ్యి
ఇంటిపన్నులుయేమొ మింటినంటె
బస్సుల్లొ చార్జీలు బాదుతూ నుండిరి
టోలుటాక్సులనుచు తోలువలిచె
విద్యుత్తు బిల్లులు వేలకు వేలయ్యె
విద్యయు వైద్యము మిథ్యయాయె
లిక్కర్ షాపులపెంచి కక్కించె ఫైనులు
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
అప్పుపెంచపేద తిప్పల పాలాయె
బాకి తీర్చజనుల బాధ పెరిగె
ఉనికి చాటుకునను నురుకుచు నుండిరి
కృష్ణమాట వినుము తృష్ణదీరు
సీ. ప : 31
ఎంతకాలమికను పంతము నుండేరు
డ్రామలాడుటమాను డాబువీడు
అధికారముందని నవకాశముందని
ఏమియు చేసినా వమ్ముకాదు
చట్టాలు యున్నాయి యీడీలు యున్నాయి
వెల్కితీయనుతిన్న పాలజున్ను
తెలియజేయు ఘనుల తీరునుమార్చును
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద పొట్టకూడు గద్దలా దోచిన
నరగకుండు నట్టి మురుగులద్ది
బయటి కొచ్చు పొట్ట పగిలి తిన్నదియంత
కృష్ణ మాట వినుము తృష్ణదీరు
సీ.ప : 32
నేతల కొనుగోళ్ళు నిలన కొత్తనయేమి
కాంగ్రేసు కమ్యునిష్ట్ కాలమందు
నుండియునున్నదే నొచ్చుకునతగునా
నేడున్న మంత్రులు నేతలంత
వలసలు వచ్చిన వారేను జనులార
కోర్టుల్లొ కేసులు కొట్టుకునుడు
న్యాయవ్యవస్థల నాడుకోవడమేమి
రాజకీయులిపుడు రాటుదేలె
ఆ.వె :
పేద నరుల ముంచి పెంచిరి సంపద
పైసలుచితమిచ్చి పైవిదాచి
కొనిరి విదేశాల్లొ కొత్తగా భూముల
కృష్ణమాట వినుము తృష్ణదీరు
No comments:
Post a Comment