*మధురిమలు*
 సాహిత్యంలో *మధురిమలు* అనేది ఒక ప్రక్రియ.
*మధురిమల లక్షణాలు:*
01. *మధురిమ* నాలుగు పాదాలలో  (4 లైన్లు) ఉండాలి.
02. ప్రతి పాదంలో  ఒకే రకమైన మాత్రలు ఉండాలి.
అనగా  7 గాని ,8 గాని , 9 గాని , 10 గాని , 11 గాని , 12 గాని మాత్రలు ఉండాలి.
03. ఒక పాదంలో కనిష్టంగా 7 , గరిష్టంగా 12 మాత్రలు మాత్రమే ఉండాలి.
04. 1, 3 & 2,4 పాదాల అంత్యప్రాసలు కలువాలి.
లేదా అన్ని పాదాలకు ఒకే రకమైన ప్రాస వాడవచ్చు.
05. లఘువు అంటే ఒక మాత్ర. గురువు అంటే రెండు మాత్రలు
06. లఘువు ఏదో గురువు ఏదో ఖచ్చితంగా నిర్ధారించు కోవాలి.
07. ప్రతి *మధురిమ* లో మెరుపు ఉంటే బాగుంటుంది. విలువ 
పెరుగుతుంది,  గుర్తింపు వస్తుంది.
ఇన్ని లక్షణాలు కుదురుతేనే అది *మధురిమ* అవుతుంది.
మధురిమలు : 02
తేదీ : 07. 04. 21
సంఖ్య :01
వచ్చెను నూతన ఉగాది 
పులుపు వగరు తీపులతో 
వేసెను జాతికి పునాది 
ఆత్మీయ బంధాలతో 
***
సంఖ్య : 02
ఎవరికి  ఓటు వేయాలి? 
అందరు అవినీతి పరులె  
ఎందుకు ఓటు వేయాలి ?
గెలిస్తె  ఏమి చేయరులె 
***
సంఖ్య : 03
నాగరికతకు నాందిగా 
భావిభారత వారధిగ 
మానవతకు పునాదిగా 
వచ్చెను ప్లవ ఉగాదిగ
సంఖ్య : 04
మనసు వికసించాలి 
ఎదుగుతూ ఉండాలి 
నడవడిక మార్చాలి 
ఒదిగి జీవించాలి 
సంఖ్య : 05
అదుపు లేనివారు 
విజయ మొంద లేరు 
పొదుపు లేని వారు 
మదుపు చేయలేరు 
సంఖ్య : 06
చిన్న పిల్లలు మురిపిస్తె 
బ్రతకాలనే అనిపించు 
వృద్ధాప్యమే విసిగిస్తే 
సచ్చిపోవాలనిపించు 
సంఖ్య : 07
కిలకిలా రావాలతో
అదిగదిగో మన ఉగాది
మధుర పూర్ణకుండముతో
ఘన *ప్లవ* నామ ఉగాది
సంఖ్య : 08
కోకిలలే కూస్తుంటే
వయ్యారంగా ఉగాది
తోరణాలు కడుతుంటే
ఓర చూపులతొ ఉగాది
సంఖ్య : 09
తీపి, చేదు, వగరులతో
కరోనాను నిలువరించ
పాలు ,గుడ్డు , రసాలతో
జనుల బలశక్తిని పెంచ
సంఖ్య : 10
పులకరించేటి ఉగాది
పంచ భక్షాల ఉగాది
చెరుకు గడలతో ఉగాది
వస్తున్నది నవ ఉగాది
 
No comments:
Post a Comment