SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Wednesday, April 14, 2021

వ్యంజకాలు - 40

                                *వ్యంజకాలు* 


సాహితీ ప్రక్రియలలో  *వ్యంజకాలు* కూడా ఒక ప్రక్రియనే:


*వ్యంజకాల* కు  ముఖ్యంగా ఉండ వలసిన లక్షణాలు:

 01. వ్యంజకాలు 4 పాదాలలో(లైన్లు) ఉండాలి.

02. మొదటి రెండు పాదాలలో  ఏమి ఉండాలో , ఏమి జరుగాలో , 
(పాజిటివ్) వ్రాయాలి.

03. 3,4 పాదాలలో అసలు ఏమి జరుగుతుందో వెటకారంగా వ్రాయాలి.

04. సందేశాత్మకంగా , విమర్శనాత్మకంగా, వ్యంగాస్త్రంగా ఉండాలి.

05. ద్వంధ నీతిజ్ఞులు అర్ధం చేసుకునే వాడుక భాషలో వ్రాయాలి.

నానీల వలే , మధురిమల వలే , అక్షర నిబంధనలు , మాత్రల 
నిబంధనలు ఏమీ లేవు . 



02. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలంటారు 
వేదికలెక్కి ఉప న్యాసాలిస్తారు 
తన భార్య నోటికి తాళం వేస్తారు
ఇంట్లో నోరు మూసుక కూర్చో మంటారు

03. ఎన్నికల్లో పోటి చేసే టపుడు 
నేతలు బిక్షాటన చేస్తారు
ఎన్నికలయి పోయాక
ప్రజలను బిక్షాటన చేయిస్తారు!

04.భర్త బాధితు రాళ్ళకు బాసటంటారు
టి.వి చానళ్ళల్లో  హోరెత్తిస్తారు
త్రాగు బోతు భర్త అవసరాలకు
సతి భక్తి ఏమిటో చాటుతారు!

05. ప్రతి నాయకుడు పోటీ చేసేటపుడు
మార్పు కోసమే అని అంటారు
గెలిచి పదవిని చేపట్టగానే
పూటకో మాట మారుస్తూ  ఉంటారు

06. ఎన్నికల్లో పోటి చేసే టపుడు 
నేతలు బిక్షాటన చేస్తారు
ఎన్నికలయి పోయాక
ప్రజలను బిక్షాటన చేయిస్తారు!

07. భర్త బాధితు రాళ్ళకు బాసటంటారు
టి.వి చానళ్ళల్లో హోరెత్తిస్తారు
త్రాగు బోతు భర్త అవసరాలకు
సతి భక్తి ఏమిటో చాటుతారు!

08. మీరు బీరు , బ్రాండి త్రాగొద్దు
ఆరోగ్యం చెడి పోతుందంటారు
మూల మూలన , గ్రామ గ్రామాన
బెల్టు షాపులు తెరుస్తారు

09. భార్యతో అత్తగారింటి నుండి 
అస్తమానం తేవాలంటాడు అల్లుడు
అత్తా మామ ఒక్క రోజు ఇంటికి వస్తే
ఎప్పుడు వెలుతారని అడుగుతాడు

10. రామానుజా చార్యుల వారు
గొప్ప వ్యక్తని కీర్తిస్తారు , పూజిస్తారు
వారి సిద్ధాంతాలు ,కలుపుగోలు తనం
 ఐఖ్యతా భావం మాకు గిట్టవంటారు

11. జ్యోతిష్యం వట్టి భూటకమంటారు
వాటిని నమ్మను అంటారు
కొడుకు/కూతురు పెళ్ళికి
జాతకాల కొరకు పంతులు వద్దకెల్తారు

12. నేను వెజిటేరియన్ ను
చికెన్/మటన్ తిన నంటాడు
విందులు వినోదాల కెల్లినపుడు 
ఒంటరిగా నిలబడి మెక్కేస్తాడు

13. మాస్కులు పెట్టుకోలేదంటారు
వేయి రూపాయలు ఫైన్ వేస్తారు
మీరెందుకు పెట్టుకో లేదంటే
కేసులు బుక్ చేస్తారు

14. నెత్తి మీద అన్నీ నల్ల వెంట్రుకలే
ఒకటి రెండు తెల్లవి మొలుస్తే పీకేస్తాం
నెత్తి నిండా తెల్ల వెంట్రుకలు మొలుస్తే
విసుగొచ్చి  వదిలేస్తాం

15. అబ్బాయి సాఫ్ట్ వేర్ అయితే
అనేక కండీషన్లతో యేండ్లు గడుపుతారు
కుదిరిన సంబంధాలన్నీ క్యాన్సలవుతుంటే
ఎటువంటి వారినైనా పర్వాలేదంటారు 

16. అనాధకు చేతిలో పెడుతారు 
గొప్పగా  రెండు అరటి పండ్లు
ఫోటోలు దిగుతారు నలుగురు
గౄపులో పోష్ట్ చేయడానికి

17. సంఘంలో ఉంది అన్యకులస్థులట
అన్య కుల కోడలును చేసుకుంటారట
కొడుకు మనవాడుకాబట్టి తప్పులేదట
ఇది భారత రాజ్యాంగంలో వ్రాసి ఉందట

18. బ్యాంకులకు నష్టాలెందుకొస్తాయని
నేతలు తెగ మధన పడుతుంటారు
బ్యాంకు అధికారుల అప్పుల వితరణలో
నేతలు కర్ర పట్టుకుని నిలబడుతారు

19. వయసులో ఉన్నపుడు అత్త మామలు
కోడండ్లను సాధిస్తూ ఉంటారు
ముసలి తనం వచ్చి ,చేతులుడిగాక
కోడళ్ళు మమ్ముల సాదుతలేరని చెబుతారు

20. ప్రతి పురుషుడు విజయం వెనుకాల
ఒక స్త్రీ ఉంటుందనేవారు నాడు
ప్రతి స్త్రీ  విజయం వెనుకాల
ఒక పురుషుడుంటారనేరు నేడు

21. ఎన్ని సార్లు ఇలాంటి వద్దని చెప్పినా 
పోష్ట్ చేస్తునే ఉంటారు
గట్టిగా చెబుతే మేము అది ఇది ఎంతో
చేసామని నొచ్చు కుంటారు

22. మన బంధువులే ,మన మిత్రులే నని
రాసుక పూసుక తిరుగుతారు
కరోనా నాలికను వడి పెట్టగానే
అరే మేము ఇట్లవుతదని అనుకోలేదంటారు

23. ఆన్య కులస్థులను సంఘం నుండి
శాశ్వతంగా పారదోలాలి అంటారు
చేరిన బంధువులందరూ 
వారి హయాంలోనేనన్నది మరిచి పోతారు

24. నాడు జంద్యం  జుట్టు విడిచి పెట్టి
మేము త్యాగం చేసామని చెప్పుకుంటారు
నేడు ఉండ్రము పెట్టుకోక పోతే
సాంప్రదాయం తెలియదని నొచ్చుకుంటారు

25. రామానుజులకు పూజలంటరు
కరోనా ఉన్నా కలువాలంటరు
రామానుజుని ఆశయాలు వలదంటరు
కులములో చిచ్చులు పెడుతుంటరు

26. పుష్కరాలకు నదులలో స్నానం చేసిన 
పాపాలు మోసాలు పోతాయంటారు
అందుకే కాబోలు మల్లీ పుష్కరాల వరకు
పాపాలు మోసాలు పెరుగుతునే ఉంటాయి

27.  పెళ్ళిళ్ళలో అబ్బాయి అమ్మాయికి 
జాతకాలు చూడాలి అంటారు
కానీ అత్తా కోడలుకు జాతకాలు 
చూడటం  మరిచి పోతారు

28. నా ఒక్కరికే దేవుడు
ఇన్ని కష్టాలు పెడుతున్నాడనుకుంటారు
బంగారాన్ని కొలిమిలో కరిగిస్తేనే
నగలు తయారవుతాయని తెలుసుకోరు

29. జీతాలు పెంచాలి పెంచాలి అని
ప్రభుత్వాలపై వత్తిడి పెంచుతారు
గంజి మెతుకులు లేక పస్తులుండే
పేదలు కోట్లల్లో ఉన్నారన్నది మరుస్తారు

30. పది లక్షల  లోపు ఆదాయమున్నా
ఉద్యోగులకు పన్నులు వేయాలంటారు
పది లక్షల ఆదాయం పైన ఉన్నా
మాకు పన్నులు వర్తించవంటారు నేతలు 

31. జ్యోతిష్యం , వాస్తులాంటివి చెప్పే వారు
కొంతమందే లక్షల్లో సంపాదిస్తున్నారు
చెప్పించు కునే కోట్లాది జనం ఆర్ధికంగా
లక్షల్లో నష్ట పోతూనే ఉన్నారు

32. దేవుళ్ళ గుడులన్నీ
లాభాల కొరకు వ్యాపార సంస్థలైనాయి
భక్తులు అందులో
బంధీలై పోయారు

33. కరోనా కట్టడికి లాక్ డౌన్ అంటారు
ఉత్పత్తిని స్థంబింపచేస్తారు
బెల్టు షాపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతారు
మధ్య పానీయులు నిండుగనే ఉంటారు

35. రామానుజులు , అందరిని నావారే అన్నారు
మాలను గుడిలోకి బుజంపై ఎత్తుక పోయారు
అజ్ఞానులు కులం వారినే అడ్డగిస్తారు
రామానుజులకైతే నీరాజనాలు పడుతారు

36 . అధిక ఆదాయమొస్తదని చిట్టీలు కడుతారు
డబ్బు ముంచాడని మొత్తుకుంటారు
ఇలాంటివి వందల సార్లు జరిగినా కడుతారు
తప్పు తమదేనని తెలుసుకోరు

37 . ఓటర్ల కంటి తుడుపుకు పెట్టిరి
*నోటా* అను ఒక కాలం
*నోటా* వలన ఫలితం
ఎంత వరకు అయ్యింది సఫలం

38 . కొడుకులు బిడ్డల తప్పులకు
శిక్షలు తల్లి దండ్రులకా అంటారు
తల్లి దండ్రులు మనసుతో పెంచుతే
పిల్లలు చెడుగా ఎందుకు ప్రవర్తిస్తారు?

39 . పేదలు ఎన్నో కారణాల వలన
రేషన్ తీసుకోక పోతే రద్దు చేస్తామంటారు
సభలకు హాజరు కాకపోతే
ప్రయోజనాలు పొందడం మానేస్తారా?

40 . ప్రతి కులానికి
ఒక కుల సంఘముంది
ఒక కులము వారు,మరో కుల
సంఘం లోకి ఎందుకు వెళుతారు?  
 


No comments:

Post a Comment