"ప్రముఖ కవుల ప్రశంసలు"
*డా. తిరునగరి గారి* *ఆశిస్సులు వెలకట్టలేని* *మధురస్మృతులు*
*తిరునగరీయం !*
******************
*-డా. తిరునగరి*
 *9392465475*
              ***
మంచి కవిత వ్రాయు
మార్గము కృష్ణయ్య
నవ్య మార్గమందు నడచు చుండు
నవత ఉన్న సుకవి
భవిత కృష్ణయ్యదే
తిరునగరిది మాట తిరుగులేదు 
        *****
కవిత అన్న అదియె-
గజవెల్లి శ్రీనన్న
పదము లందు పూల
పరిమళాలు
రాణకెక్కునతడు
రసరమ్య కవిగాను
తిరునగరిది మాట
తిరుగలేదు !
      ****
ఒక్క శబ్ద బ్రహ్మ
ఉభయ భాషలలోన
గరిమ ఉన్న సూరి 
వరుడు -  నేను
గౌరవించు నట్టి
'నారా' మనీషిరా !
తిరునగరిది  మాట
తిరుగులేదు
        ****
నిత్య నవ్య ద్రష్ట -
నిత్య గంగాఝరి
కవిత కొరకు పుట్టె
కందుకూరి
పేరుగన్నవాసి
శ్రీరాములు మనీషి
తిరునగరిది మాట
తిరుగులేదు
         ****
అతని కవిత లోన
అమృతమ్ము ఉన్నది
అతని గీతమందు అగ్ని కలదు
వేణుశ్రీ కవిత్వ వేదిరా విజయోస్తు !
తిరునగరిదిమాట
తిరుగులేదు
       ****
పొంకమైన శైలి
పూదత్తు కృష్ణమో
హనుని దొక్క 
అందమైన ముద్ర
అతని కవిత జగతి
కానందలహరిరా
తిరునగరిది మాట 
తిరుగు లేదు
      *****   
నాగరాజు, వంశ
నవ కవిత్రయమును
ఎరుగనట్టి వారు
ధరణిలేరు
జలధులన్ని దాటె
ఎలనాగ కవితలు
తిరునగరిది మాట
తిరుగులేదు 
        *****
రాగ మధువు లొల్కు
నాగరాజు సురేంద్ర
కవితలన్న మురిసి
గంతు లేతు
అతని వాచి కమ్ము
నందు ఔచిత్యమ్ము
తిరునగరిది మాట
తిరుగులేదు !
      ****
నాగరాజు రవీంద్ర 
నాకు నచ్చినకవి
హృద్యమైన దతని
పద్యవిద్య
కావ్యశిల్పి అతడు
కమనీయ హృదయుండు
తిరునగరిది  మాట
తిరుగులేదు
        ****
ఆధునికుల యందు
అమ్మంగి ' శిఖరమ్ము '
ప్రముఖ కవివరుండు
-ప్రథిత కీర్తి
సృజన శీలి అతడు
భజన గిట్టని వాడు
తిరునగరిది మాట
తిరుగులేదు
         ****
సాహితీవ్రతుండు -
చక్కని కావ్య స
మీక్షకుండు నేటి 
మేటి సుకవి
స్నేహశీలి అతడు -
సేనాధి పతి - సుధి
తిరునగరిదిమాట
తిరుగులేదు
       ****
 *************
డా.తిరునగరి
6-17/5
డి.నగర్
చింతల్  (HO)
హైదరాబాద్
       ****
మార్గం గారూ!
వచనకవిత మార్గం
అద్భుతంగా
పట్టుకున్నారు. ఇక
మీకు దోఖా లేదు.
బాగా రాశారు కవిత
- కందు కూరి
 
No comments:
Post a Comment