తొణుకులు -104
(16.08. 2021)
Please watch my YOUTUBE Channel :
https://www.youtube.com/@margamsahitya
తొణుకుల లక్షణాలు :
01. వీటిలో 4 పాదాలు ఉంటాయి
02. ప్రతి పాదములో 9 నుండి 11 అక్షరాలు మాత్రమే ఉండాలి
03. మొదటి పాదం లోని మొదటి అక్షరానికి , మూడవ పాదం లోని
మొదటి అక్షరానికి యతి కలువాలి .
04. రెండవ పాదం లోని చివరి అక్షరానికి , నాల్గవ పాదం లోని
చివరి అక్షరానికి అంతిమ ప్రాస ఉండాలి .
05. ప్రతి తొణుకు అర్ధ వంతముగా , సందేశాత్మకంగా ఉండాలి
For more videos , please watch my youtube channel :
https://www.youtube.com/@margamsahitya
"ఎన్నికల సంస్కరణలు జరుగాలి"
(ప్రక్రియ: తొణుకులు )
01.
ఓటు హక్కు అనేది నేడు
ప్రజలకు వజ్రాయుధము!
ఓటు హక్కుతో సమాజమును
వ్యవస్థలను శాశించగలము!!
02.
ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ
తప్పక జారీ చేయవలెను!
ఆధార్ కార్డు ఉన్న వారే
ఎన్నికల్లో నిలబడవలెను!!
తప్పక జారీ చేయవలెను!
ఆధార్ కార్డు ఉన్న వారే
ఎన్నికల్లో నిలబడవలెను!!
03.
కులాలనుమరియు మతాలను
నేతలు విడగొట్ట కూడదు!
కులాల మతాలపేరున
ఓట్లను దండుకో కూడదు!!
04.
ఉచిత పథకాలనన్నింటిని
రద్దు పరుచవలయును!
ఉపాధి అర్హులైనందరికి
కల్పించు చుండవలయును!!
05.
జనాలు పిట్ట కథలతో
పరవశించి పోతుండిరి!
జయ జయహో అనుచుండే
ఆనందముతోడ నుండిరి!!
06.
అమాయకమైన జనులు
పుడమినున్నంత కాలము!
అధికారాలు చేపట్టేరు
సాగి పోతుంటుంది కాలము!!
07.
అవినీతి నేతల వలననే
దేశము దిగజారిపోతుంది!
అభివృద్ది చెందకుండాను
పేదరికం పెరిగిపోతుంది!!
08.
లోకసభలో రాజ్యసభలో
అవినీతి పరులేనటండోయ్ !
లోకంలో ఓటర్లందరునూ
బిత్తర పోవాల్సిందేనోయ్!!
09.
నోటుకు పది బిలియన్లని
అంటారు ఓటర్లకు జాలితో!
ఖాతా తెరుస్తారు కోకా పేటలో
యాబది ట్రిలియన్ల భూములతో!!
10.
నోటుకు అమ్ముడు పోకండి
ఓటరు మహాశయులారా!
నోటుకు బానిసలు కావద్దు
రుధిరం చిందించే ఓటరులారా!!
11.
గెలిచే నమ్మకం ఒక చోట
లేనటువంటి నాయకుడు!
గెలిచి ఏమి చేయగలడో
రెండవ చోట ఆ నాయకుడు!!
12.
ప్రజల బిక్షగాళ్ళ చేసేకంటే
పరిశ్రమల స్థాపించుట మేలు!
ప్రజలందరికి సరైన
ఉపాధి కల్పించుట చాలు!!
13.
బినామి చట్టాలు ఎన్నియో
అందుబాటులోనే ఉన్నాయి!
బినామి పేర్లపైన భూములు
యెన్నోకబ్జానే అవుతున్నాయి!!
14.
ఓటు భారతీయులందరి
జన్మహక్కని మరువకండి!
ఓటుతో రాజ్యాధికారము
సాధించడము సులువండి!!
15.
దొంగ ఓట్లను వేయకండి
దేశధ్రోహుల పెంచవద్దు!
దొంగలెవరికీ దేశమును
పాలించే అవకాశమీయవద్దు!!
16.
డెబ్బదైదేండ్ల వృద్ధులకు
రాజకీయాలవసరమేమి?
డెబ్బదైదేండ్ల లోపు ప్రజలు
కోట్ల మంది ఉన్నాకానరేమి?
17.
ఎన్నికయిన నాయకులు
గెలిచిన పార్టీల లోనే!
ఎన్నిక కాలం ఉండవలెను
ప్రజలిచ్చిన తీర్పు వలెనే!!
18.
సానుభూతి ఓట్లతో గెలుపు
అది గెలుపేనా నాయకుడా!
సారం లేనట్టి నీ బ్రతుకు
బ్రతుకేనా జనులమాయకుడా!
19.
ప్రజలకే ఆదాయ పన్నులట
నేతలకు ఆదాయపన్నులేవి?
ప్రజలకే అన్ని నిర్భందాలు
నేతల ఆదాయమదింపులేవి?
20.
ఉద్యోగులకు పెన్సన్లు ఉండవు
నేతలకుజీవితాంతం పెన్సన్లా?
ఉపాధి లేదు ఎందరికో
ఐదేండ్ల సేవలకే పెన్సన్లా?
21.
ఎలాంటి ఉద్యోగాలకైననూ
డిగ్రీలు,ఇంటర్వూలు జరుగాలి!
ఎలాంటి ఎన్నికలైతేనేమి
కేవలం డబ్బు దండిగాఉండాలి!!
22.
భూకబ్జాలు చేయాలనుకుంటే
నాయకులకైతేనే సాధ్యం!
భూమి నివాసము కొరకైనా
సామాన్యులకు అసాధ్యం!!
23.
అక్రమాల అరికట్టాలంటే
ఒకే ఒక్క చక్కటి ఉపాయం!
అయిదేండ్ల కొకసారైనా
రాష్ట్రపతి పాలనతో ఖాయం!!
24.
ప్రజాస్వామ్య దేశములోన
సదుపాయాలెన్నో నేతలకు!
ప్రజలకన్ని సదుపాయాలు
అందుబాటునుండాలి జనులకు!!
25.
నేతల ఆస్తుల అఫిడవిట్ల
రిజిష్టరు చేయ వలెను!
నేతల ఆస్తుల అప్పుల
మార్కెట్ ధరే లెక్కించవలెను!!
26.
ఐదేళ్ళ కొకసారి ఆస్తులను
మార్కెట్టు ధరతో మధించ వలే!
ఐదేళ్ళలో ఆస్తుల్లో తేడాలుంటే
పెరిగినాస్తి జప్తు చేయవలే!!
27.
రాజ్యాంగం సవరించే అధికారం
అవినీతి నేతలకుండరాదు!
రాజ్యాంగం నేతలు సవరిస్తే
వెయ్యేండ్లైనా అవినీతి తగ్గదు!!
28.
రాజ్యాంగం సవరించే అధికారం
మెంబర్లకు యాబైశాతముండాలి!
రాజకీయనేతలనెన్నుకునే
ఓటర్లకు యాబైశాతముండాలి!!
29.
స్త్రీలు పోటీ చేసినటువంటి
నియోజకవర్గాల లోన!
స్త్రీలు మాత్రమే పాలించాలి
వారి పరిపాలనా కాలంలోన!!
30.
అక్రమాలకు దొంగతనాలకు
పాల్పడ్డ సామాన్యఖైదీలవలే!
అవినీతికి , భూకబ్జాలు
చేసిన నాయకుల్నీ చూడవలే!!
31.
వ్యవస్థలలో రాజకీయాల
జోక్యములు ఉండకూడదు!
వ్యవస్థలపై నాయకుల యొక్క
పెత్తనము ఉండకూడదు!!
32.
పోటీ చేసే నాయకుల అన్ని
ఆస్తి అప్పులను ప్రకటించాలి!
పోటి చేసే వారి కుటుంబీకుల
ఆస్తి అప్పులను ప్రకటించాలి!!
33.
వేదికలపై నేతల హామీల
ఎజెండాలో పొందుపరుచాలి!
వేరు వేరు హామీలన్నిటినీ
అధికారులు సేకరించాలి!!
34.
ఎజెండాలోని హామీలన్నీ
నేతలు నెరవేర్చకున్నను!
ఎన్నికల్లో గెలిచినా,మంత్రుల
పదవులు తొలిగించవలెను!!
35.
డమ్మి నామినేషన్లనన్నిటిని
నిలువరించవలయును!
డమ్మి రాజకీయమోసాలను
మీడియా పసిగట్టవలయును!
36.
నోటా ఉపయోగము శూన్యం
వృధా వాటిని లెక్కలు పెట్టుట!
నోటాను ఓటర్లు గుర్తించకుంటే
పనేముంది దానినింకానుంచుట!!
37.
ఒకే మంత్రి ఒకే రాష్ట్రపతి
ఆనవాయితీగా ఉన్నపుడు!
ఒకే ఎన్నికల అధికారనే
విధానం ఉండాలి ఇప్పుడు!!
38.
నేత ఒకే చోట పోటీ చేయాలి
అది ఎక్కడైననూ కావచ్చు!
నేడు ఓటు హక్కు అందరికీ
పద్దెనిమిది నిండినా వచ్చు!1
39.
ఒకే మంత్రి ఒకే రాష్ట్రపతి
ఆనవాయితీగా ఉన్నపుడు!
ఒకే ఎన్నికలధికారి ఆనే
విధానం ఉండాలి అప్పుడు!!
40.
ఎవరు చేసిన అప్పులకు
వారినే భాద్యులను చేయాలి!
ఎవరు తెచ్చే అప్పులకైనా
కేంధ్రప్రభుత్వనియంత్రనుండాలి !!
41
రాష్ట్రాలు చేసే అప్పులను
ఉచితాలకు వాడకూడదు!
రాష్ట్రాలు ఎన్నికల రూపేణ
ప్రక్కదారి పట్టించకూడదు!!
41.
ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ
తప్పక జారీ చేయవలెను!
ఆధార్ కార్డు ఉన్న వారే
ఎన్నికల్లో నిలబడవలెను!!
42.
జైలు జీవితం మూడేండ్లకుమించి
నట్లైతే పోటి చేయకూడదు!
జైలునుండి క్రిమినలెవరైనా
ఎన్నికల్లో పోటి చేయకూడదు!!
43.
ఒక నేతను ఒక పదవికే
అర్హుడిని చేయవలయును!
ఒకటి కంటే ఎక్కువగా నున్న
పదవిని తొలగించవలెను!!
44.
ప్రతి ఒక్కరికీ ఒకే ఒక
ఆధారు కార్డు ఉన్నట్లుగా!
ప్రతి ఒక్కరికీ ఒకే ఒక
బ్యాంకు అకౌంటు ఉండాలిగా!
45.
సామాన్యులు డిపార్ట్ మెంట్లకు
వెంటనే దొరికి పోతున్నారు!
సామాన్యులు చిక్కినట్లుగా
నేతలు దొరుకకుంటున్నారు!!
46.
ఓటు వేసిన ప్రజలకు
ఒక రకమైన న్యాయమా?
ఓటు వేయించు కున్న నేతలకు
మరొకమైనట్టి న్యాయమా?
47.
వందకోట్ల సంపద మించినచో
పోటీకి అనర్హులను చేయాలి!
వంద కోట్ల సంపద లేనిచో
ఎన్నికకు అర్హులను చేయాలి!!
48.
యాబది ఎకరాల భూముంటే
పోటికి అనర్హులను చేయాలి!
యాబదెకరాల భూమిలేనిచో
ఎన్నికకు అర్హులను చేయాలి!!
49.
రాష్ట్రపతి ఎన్నికలను
ప్రత్యేకంగా జరిపించాలి!
రాష్ట్ర ప్రతి దేశాధ్యక్షుడు
ప్రజలద్వారా ఎన్నుకోబడాలి!!
50.
నోటిఫికేషన్ రాకముందే
పెట్టే ఎన్నిక ఖర్చు గణించాలి!
నోటిఫికేషన్ తరువాత
చేసే ఎన్నిక ఖర్చు గణించాలి!1
51.
పోటీ చేసే నేతల బంధుమిత్ర
పనివారల వివరాలివ్వాలి!
పోటీ చేసే నేతల బ్యాంకుల
అన్నిటి వివరాలివ్వాలి!!
52.
నేత జరిగి పోతే వారి
సభ్యులకు టికటివ్వడమేంటి?
నేతల సభ్యులకిచ్చే జీతాల
ప్రజలు భరించడమేంటి?
53.
ఎన్నికల నిబంధనలనే
అతిక్రమించినట్లయినను!
ఎన్నికలలో పోటీ చేయుట
ఐదేళ్ళరికట్టవలయును!!
54.
గెలిచిన నేతలు వరుసగా
మూడు సార్లు సభకు రాకున్నను!
గెలిచిన సభ్యత్వాం , జీతాలు
రద్దు చేస్తుండ వలయును!
55.
ఆడుకునే వయసున్నపాపపై
కామాంధుడి కసాయితనము
ఆరేళ్ళ పాపపై అత్యాచారం
పసి గుడ్డును చంపడము
56.
ప్రతి పక్షాలు మీడియాలు
వత్తిడి తెస్తే గాని కదలరా
ప్రజలు ధర్నాలు చేస్తేగాని
పాలకులు పరామిర్శించరా
57.
గెలిపించిన ఓటుతోటే
ఓడించుదాము నేతలను!
గెలవకుండాను ఎక్కడ
నిలువరించుదాము నేతలను!!
58.
నల్ల ధనమును కక్కించి
ఉపాధిని ప్రోత్సహించాలి!
నవతరము ఉత్తేజంతో
మునుముందుకు సాగిపోవాలి!!
59.
దేశ సంపదంతా నేతల
వ్యాపారులయొక్క చేతిలోనే!
దేశ అప్పులన్నీ పేదల
మధ్యతరగతి ప్రజలపైనే!!
60.
ఎప్పటికీ అధికారంలోనే
ఉండాలనే నేతల ఆలోచన!
ఎప్పటికీ ప్రజల బానీసల
చేయాలనే సుదీర్ఘాలోచన!!
61.
భారత దేశంలో వనితల
జీవిత కాలము ఎక్కువ!
భారత దేశంలో పురుషుల
ఆయుషు కాలము తక్కువ!!
62
విధి విచిత్రంగా ఉండును
ఎప్పుడు ఏమి జరుగునో!
వితంతువులను చేయవచ్చు
తల రాతలు ఎలా మారునో!!
63.
పతి మరణించినట్లయితే
సతి పాటించాలి కట్టుబాట్లను!
పతి లేని అందమెందుకని
తాలి,మెట్టెలు,బొట్టుతీయును!!
64.
ముత్తైదువ తనం కోల్పోవు
ఈసడింపులు చీదరింపులు!
ముసురుతుండు బాధలెన్నో
ఆర్ధిక , మానసిక క్షోభలు!!
65.
వయసు చిన్నదైన మరల
పెళ్ళి చేసుకోవడం ఆరోగ్యం
వయసు మీరినా స్వతంత్రముగా
ధైర్యంగా బ్రతకడం మహాభాగ్యం
66.
గురజాడ కల్పించే స్వేచ్ఛను
హాయిగా జీవించ వితంతువులు!
గురజాడ దూర ధృష్టి వలన
మనో ధైర్యంతో నుండే నేడు స్త్రీలు!!
67.
వితంతువుల అదుపులో
పెట్ట డానికే నీతులుంటాయి!
విధి రాతల హేళనకే
ఆచారసాంప్రదాయాలుంటాయి!!
68.
నలుగురు ఏకంగా నడుస్తేనే
కొత్త బాట ఏర్పడుతుంది!
నలుగురు మూఢనమ్మకాల
వదులుతేనే ధైర్యమొస్తుంది!!
69.
వేదికలను ఎక్కడము
హామీలను యివ్వడం కాదు!
వేడుకునే ప్రజల కోరికలను
ఎప్పటికి వమ్ము చేయకూడదు!!
70.
కార్యకర్తలపై నొకవిధంగా
ఓటర్లపై మరొకవిధము!
కారుణ్యమును చూపవద్దు
అవ్యాజ ప్రేమను చూపుము!!
71.
ప్రజల చెల్లించే పన్నులతోటి
జీతాలు సంక్షేమ పధకాలు!
ప్రజల పధకాలన్నిటికి
గొప్పగా నాయకుల నామాలు!!
72.
అప్పులతో ప్రజల యొక్క
భారము పెంచడము ఏమిటీ?
అధిక ధనవంతులందరికి
బంధు పధకాలనడమేమిటి?
73.
ఏ పార్టీ నేతలను చూసినా
యేముంది గర్వ కారణమోయ్!
ఏ పార్టీవారైనా కొత్త సీసాలో
పాత బ్రాండియే కదా నోయ్!!
74.
మార్చేటువంటి వ్యవస్థలు
వస్తే గానీ రాజకీయ నేతలు!
మారడానికి అవకాశమే
లేని అదృష్ట జాతకులు!!
75.
అధికార దుర్వినియోగము
తప్పక అరికట్టవలయును!
అది ఎన్నికల అధికారులు
చట్టాలకే సాధ్యమగును!!
76.
ఎన్నికల సమయమున
ఓటర్లు గుర్తుంచు కోవలే!
ఎన్నికల్లో అవినీతి పరుల
నిశ్చయముగా ఓడించవలే!!
77.
ప్రభుత్వాలకనుకూలంగా
మంత్రులు నడుచుకుంటారు!
ప్రభుత్వాలు చెప్పినట్లుగనే
అధికారులు కూడా వింటారు!!
78.
వ్యవస్థల విధి విధానాలు
ఇప్పటికీ మారకుంటేను!
వ్యక్తుల,ప్రజల భవిష్యత్తు
నికను మారునెపుడును!!
79.
ఎన్నికలను ప్రజాస్వామ్య
దేశంలో, ఏ రాష్ట్రంలో నైనను!
ఎన్నికల అధికారులే
జరిపిస్తూ ఉండవలెను !!
80.
ఎన్నికల నిర్వహణ లో
ప్రభుత్వాలపాత్ర ఉండకూడదు!
ఎన్నికల లెక్కింపులోనూ
ఇతరుల జోక్యముండకూడదు!!
81.
రాజకీయాలలో లభించే
ఆదాయాలు లెక్కల్లోకి రావు!
రాజకీయ నాయకులు పొందే
జీతబత్తాలకు పన్నులే లేవు!!
82.
రాజకీయ నాయకులువెచ్చించే
ఖర్చులనుబట్టి పన్ను వేయాలి!
రాజకీయ నేతల ఎన్నికల
ఖర్చుకు పన్నులు వేయాలి!!
83.
మన ఓట్లతో ఎన్నికైన వారు
దోచుకో కుండాను చూడాలి!
మన మధ్యతిరిగే నేతలు
దాచు కోకుండాను చూడాలి!!
84.
మేధావుల మౌనమెప్పటికైనా
ప్రమాదకరమనే గుర్తించాలి!
మేధావులు , సామాజిక వేత్తలు
ప్రజలను చైతన్య పరుచాలి!!
85.
దేశంలో ప్రజలు ఎవరి
పనులను వారు చేస్తున్నారు!
దేశ సంపద కొందరు మాత్రమే
పూర్తిగా అనుభవిస్తున్నారు!!
86.
అవినీతికి మూల కారణము
సంస్కరణలు జరుగకుండడం!
అనేక కారణాలతో చట్టాలు
అమలు ఆలస్యం కావడం!!
87.
ఎన్నికల సంస్కరణలు
జరుగవలసి ఉండినను !
ఎన్నికల,న్యాయాధికారులకు
ప్రజలే సూచిస్తూ నుండవలెను!!
88.
నియంతృత్వ దమననీతిని
కొనసాగనీయకుండను!
నిత్యము ప్రజలందరు ఏకమై
ప్రశ్నిస్తూ నుండవలయును!!
89.
ఎన్నికల కోడు వలననే
నిలిచిపోయిన హామీలను!
ఎన్నికల ఫలితాలకు ముందే
అమలు చేయవలయును!!
90
హామీల అమలుపరుచుటకు
ఓటర్లు వత్తిడి చేయవలెను!
హామీలను నెరవేర్చనిచో
ఫలితాల ఆపిపేయవలెను!!
91.
అడుగనిదే ఎవరు కూడా
ఏమి పనులు చేసిపెట్టరు!
అడుగనిదే అధికారులూ
మార్పులు చేర్పులు చేయరు!!
92
ప్రజలందరూ అక్రమాలను
అనుచుటకు ఏకమవ్వాలి!
ప్రశ్నించడానికి యువకులు
చైతన్య పరులు కావాలి!!
93.
నేతలు కోట్ల సమాజానికి
ఆదర్శమని భావిస్తారు!
నేతలే అసభ్యంగామాట్లాడుతే
ప్రజలు ఏమి చేయగలరు!!
94.
అసభ్యంగా మాట్లాడే నేతల
ఎన్నికలలో నిలువరించాలి!
అసభ్యంగా మెదిలే నేతలను
ఓటర్లు తిరస్కరించాలి!!
95.
ఎన్నికల కోడ్ ఉన్నపుడిచ్చే
హామీలన్నింటిని ప్రశ్నించాలి!
ఎన్నికల్లో అలాంటి అభ్యర్ధుల
ఐదు యేళ్ళు బహిష్కరించాలి!!
96.
ఓటర్లు ఎక్కడ ఉన్నప్పటికి
యే హోదాలున్నా ఏకమవ్వాలి!
ఓటర్లకిచ్చే అసాధ్య హామీల
డబ్బు, మందును తిరస్కరించాలి!!
97.
అవినీతి పరంగా సొమ్మును
నేతలు ఆర్జించ కూడదు!
అవి నీతి ఖర్చుకు నేతలట్టి
సొమ్ములను వాడకూడదు!!
98.
టి.ఎన్ శేషన్ లా కఠినాతి
నిబంధనలమలుపరుచాలి!
టి.ఎన్ శేషన్ లా చరిత్రలో
శాశ్వితంగా నిలిచి పోవాలి!!
99.
ఎన్నికల నియోజక వర్గాల్లో
నేతల నిలువెత్తు ఫోటోలను
ఎన్నికలు జరిగే వరకు
పూర్తిగా బ్యాన్ చేయవలెను!!
100.
ఎన్నికల కోడ్ పెట్టిన రోజు
నుండి లిక్కర్ బ్యాన్ చేయాలి!
ఎన్నికల ఫలితాల వరకు
ఉచితాలన్ని బ్యాన్ చేయాలి!!
100.
అసాధ్య హామీలిస్తున్నపుడు
ఓటర్లు కూడా ఆలోచించాలి!
అద్భుతంగా మాట్లాడు చున్నను
గత హామీల బేరీజు వేయాలి!!
102.
ఏ ఉచితాలైనా, పధకాలైనా
ప్రజల డబ్బేనని గుర్తించాలి!
ఏ అసాధ్య హామీలైననూ
తమపైనే భారమనుకోవాలి!!
103.
ఎన్నికల విధానాలపై
ఆవగాహన కల్పించాలి!
ఎన్నికల ప్రయోజనాలను
క్షుణ్ణంగా తెలియజేయాలి!!
104.
బుక్ లెట్ లను ప్రింటు చేయాలి
రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపై!
బుజ్జగించైనా నేర్పవలెను
హక్కులు మరియు భాద్యతలపై!!
No comments:
Post a Comment