తేది: 09.06.2023
అంశం: సమస్య పరిష్కార వేదిక:వివాహమా, విడాకులా?
శీర్షిక: *పెళ్లి అనేది మూడుముళ్ల బంధం*
పెళ్లి అనేది మూడు ముళ్ల బంధం
జీవిత కాలం ఒద్దికగా ఉండాల్సిన
అనుబంధం
తల్లిదండ్రులు సాంప్రదాయంగా, పద్ధతిగా,
క్రమశిక్షణతో జీవితం సాగిస్తే
పిల్లలు వారిని అనుకరించి ,
సంస్కారవంతంగా పెరుగుతారు.
పిల్లలకు పనులు నేర్పరు, భాద్యతలు నేర్పరు
ఇంటి సమస్యలు తెలియనివ్వరు
డబ్బు సంపాదన , ఖర్చులను తెలియజేయరు
కష్టాలు పడనీయరు, కర్తవ్యాలను భోదించరు
ఇక పిల్లలకు అనుభవాలు ఎలా వస్తాయి?
సమస్యలను తట్టుకునే ధైర్యం ఎలా లభిస్తుంది?
పిల్లలు సంస్కారవంతంగా పెరుగుతే
వివాహానంతర సమస్యలు రావు
ఒక వేళ సమస్యలు వచ్చినా,
వారే సరి చేసుకుంటారు
అప్పటికీ సమసి పోక పోతే
ఇరు కుటుంబాల తల్లి దండ్రులు
సర్దుబాటు చేస్తారు
అంతేకాని విడాకుల వరకు పోవు.
కానీ ఇప్పుడు అధికంగా వివాహాలు,
విడాకులకు దారి తీయడానికి కారణాలు;
తల్లిదండ్రులు క్రమశిక్షణతో జీవించకపోవడం,
తల్లిదండ్రులు పోట్లాడు కోవడం
పిల్లలకు తెలిసేవిధంగా చెడుగా నడుచుకోవడం
పిల్లలను పద్ధతిగా పెంచక పోవడం,
పిల్లలకు స్వేచ్ఛ అధికంగా ఇవ్వడం
ఆడ పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ రావడం
తల్లి దండ్రులు ఇగోలతో ఉండటం
వివాహాల గురించి, ఆ తర్వాత
ఎలా ఉండాలో తెలియజేయక పోవడం
పిల్లల మనసులను , భావాలను
వారి అభిరుచులను తెలుసుకోక పోవడం
వారికి , ఒకరినొకరు అర్ధం చేసుకునే
అవకాశం ఇవ్వక పోవడం
తల్లిదండ్రుల ఇష్టాలతోనే , ఇగోలతోనే
వివాహాలు జరపడం,
ఇలా అనేక కారణాలు చెప్పుకోవచ్చు
ఇప్పుడు పిల్లలు వినే పరిస్థితిలో కూడా లేరు
మీకేమి తెలుసని, పెద్దలకే
ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు
ఎందుకంటే ఇప్పుడు వారికి
ఆర్ధిక స్వేచ్ఛ వచ్చింది
సోషల్ మీడియా నచ్చుతుంది
ఇక ఉడుకు రక్తం తో ఉన్నపుడు
అనగా యుక్త వయసులో ఉన్నపుడు
పిల్లల మరియు ఉభయ కుటుంబాల పెద్దల
కోరికల గ్రాఫ్ హై పిచ్ లో ఉంటుంది
ఉన్నత కుటుబాలని, పెద్ద జీతాలని,
వయసులని, అందాలని, గోత్రాలని,
జాతకాలనీ, కట్న కానుకలనీ, ఆస్తులనీ,
అంతస్తులనీ , పెట్టుబోతలనీ, సాంప్రదాయాలనీ,
గౌరవ మర్యాదలనీ యేండ్లు గడుపుతారు
కాలం గడుస్తున్న కొద్దీ కోరికల గ్రాఫ్
నలుబది ఐదు డిగ్రీలకు పడి పోతుంది
ముప్పై దాటాక సరే ఎవరికో ఒకరికి
అని చెప్పి ముక్కు మొఖం తెలియకుండానే
పెళ్ళిళ్ళు చేస్తారు
విదేశాలలోని వారికి మరికొందరు
ప్రాధాన్యత ఇస్తారు
కొందరు,
తల్లిదండ్రులు పట్టించుకోక పోవడం
వలన కావచ్చు,
తల్లిదండ్రులు లేని వారు కావచ్చు
ఆర్ధిక స్వేచ్చ ఉండటం కావచ్చు,
ఆర్ధిక స్వేచ్చ లేక పోవడం వలన కావచ్చు
సోషల్ మీడియా ప్రభావం కావచ్చు
ప్రేమ దోమ అంటూ తిరుగుతూ
అతి చిన్న వయసులోనే , ప్రేమ వివాహాలని
సమస్యలను ఎదుర్కోలేక విడాకులు
తీసుకుంటున్నారు, తనువులు చాలిస్తున్నారు
అది కుదిర్చిన వివాహం కావచ్చు,
ప్రేమ వివాహం కావచ్చు
భర్త వలన భార్య లేదా భార్య వలన భర్త
ఒకరిపై ఒకరికి అనుమానం తోనో
ఇగో తోనో లేదా ఆర్ధిక పరిస్థితుల వలననో
మనస్పర్ధలు ఏర్పడి లేదా విసిగి వేసారి
విడాకులు తీసుకుందామనుకుంటారు
విడాకులు సులువుగా వస్తాయా ?
వస్తాయే అని అనుకుందాం
దీని వలన ఇరు కుటుంబాల పరువులు
గంగ పాలవుతాయి. అంతేనా
ఇరు కుటుంబాలు ఆర్ధికంగా నష్టపోతారు
ఇంకనూ, రేపు వారిండ్లల్లో జరగబోయే
పిల్లల వివాహాలు ప్రశ్నార్ధకంగా మారవచ్చు
ఇలాంటి వారే చాలా మంది, చివరికి
విదేశాల పెళ్ళిళ్ళకు మొగ్గు చూపుతుంటారు.
ఇక విడి పోయాక ఎక్కడికి పోయి జీవిస్తారు?
ఎలా జీవిస్తారు?
స్త్రీ అయితే మరో పురుషుడిని వివాహం
చేసుకోవాలి
పురుషుడయితే మరో స్త్రీ ని వివాహం
చేసుకోవాలి
రేపు వారు ఇలాంటి వారే కాదని చెప్పగలరా?
అలాంటి వారే అయితే, మల్లీ విడాకులు,
మళ్ళీ మరొకరిని వివాహం చేసుకుంటారు
ఆ తర్వాత వచ్చే వారు నీవు చెప్పినట్లే
వింటారనే నమ్మకం ఉందా?
అందరూ ఉప్పూ కారం తినే వారే కదా!
పోనీ వివాహం లేకుండా ఒంటరిగా
ఈ సమాజంలో నివసించ గలరా?
ఇది అనుకున్నంత సులువు కాదు
జీవితాంతం ఒకే తోడు ఉండాలి
అది మొదటి తోడే ఆనందంగా ఉంటుంది
(తప్పని పరిస్థితుల్లో,అనేది వేరే విషయం )
సమస్యలు వస్తాయి పోతాయి
సర్దుబాటు చేసుకునే తత్వం పెరగాలి
ఆనందంగా జీవితం గడపాలి
వివాహానికి ముందే, ఒకరి మనసును
మరొకరు అర్ధం చేసుకోవాలి
జాతకాలే కాకుండా, అభిప్రాయాలు,
అభిరుచులు, స్వభావాలు, మనస్తత్వాలు
కలుస్తాయా లేదా చూసుకోవాలి
ఒకరు ఆస్తికులై, మరొకరు నాస్తికులైతే
జీవితాంతం నరకంగా సాగవచ్చు
ఒకరికి ఆభరణాల కోరికలుంటే, మరొకరికి
పొదుపు కోరికలుంటే జీవిత పర్యంతం
నరకం కావచ్చు
ఒకరికి చెడు కోరికలు అధికంగా ఉండి,
మరొకరు సౌమ్యులైతే జీవితం సమస్యల
మయం కావచ్చు.
ఇలా ఎన్నో చెప్ప వచ్చు. కొన్నింటిని
సర్దుబాటు చేసుకోవచ్చు.
ఒకటి కావాలంటే మరొకటి వదులు కోవాలి
అనే సూత్రం అంతటా వర్తిస్తుంది.
వివాహమయ్యాక ఒక సంవత్సరం
వరకు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికే
ప్రయత్నం చేయాలి గానీ,
ఒకరి బలహీనతలు, మరొకరికి
తెలియనీయ కూడదు.
ఒక సంవత్సరం తరువాత, ఏమి చెప్పాలో
ఏమి చెప్పకూడదో నిర్ణయం తీసుకోవాలి.
మీసం ఉన్న మగాడు డబ్బు సంపాదించాలి
ఇంటి బాధ్యతలు చూసుకోవాలి
చెడు వ్యసనాలు మానుకోవాలి
అలానే స్త్రీలు వారి కర్తవ్యాలను నిర్వహిస్తూ
కుటుంబ పరువును కాపాడాలి
భర్తలు, భార్యను, భార్య పుట్టింటి వారిని
ప్రేమగా చూసుకుంటే
భార్యలు, భర్తను, భర్త తల్లి దండ్రులను ప్రేమగా
చూసుకుంటారు
భార్య, భర్తను, తన పుట్టింటి వారిని ప్రేమగా
చూసుకుంటూ భర్త గౌరవాన్ని కాపాడుతే,
భర్త కూడా అలానే చూసుకుంటాడు
భార్య, భర్తను రాజును చేసి , తాను రాణిగా
మారాలనుకోవాలి గానీ,
భర్తను యజమానిని చేసి , తాను కూలీగా
మారాలనుకోకూడదు
ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి
వివాహాలు చేసుకోవాలి, విడాకుల వరకు
రాకుండా చూసుకోవాలి
కోర్టులు, చట్టాలు, పంచాయితీలు,
పెద్దమనుషులు ఇద్దరు వ్యక్తులను
దగ్గరికి చేర్చుతారు
కానీ ఇద్దరి మనసులను కలుపలేరు
కాస్త ఇగోలను, ఇరువురూ తగ్గించుకుంటే
వివాహ జీవితం మూడు పువ్వులు
ఆరుకాయలు కాస్తుంది
అది భార్యాభర్తల చొరవతోనే సాధ్యమవుతుంది
సర్వేజనా సుఖినోభవంతు
No comments:
Post a Comment